Sunday, October 22, 2017

నాగుల చవితి (సోమవారం, 23.10.2017)

22/10/17, 1:51:03 PM: Sivananda Nirmala: నాగుల చవితి (సోమవారం, 23.10.2017)

దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం.ఈ మానవ శరీరమనే పుట్టకు తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.

పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ
సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
అనంతాది మహానాగ రూపాయ వరదాయచ
తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా !

ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి, అరటిపళ్ళు మున్నగునవి నివేదన చేస్తారు.

ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి.

"కర్కోటకస్య నాగస్య దయయంత్యా నలస్య చ |
ఋతుపర్ణస్య రాజర్షే : కీర్తనం కలినాశనమ్‌ ||22/10/17, 10:26:21 AM: ‪+91 94408 97850‬: నాగులచవితిని మన హిందువులు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకొందురు. కార్తీక భహుళ చవితినాడు శ్రీ సుబ్ర హ్మా న్యేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు.ఈనాటి దినమున శ్రీ సుబ్ర హ్మా న్యేశ్వరస్వామి ఆలయములకు వెళ్లి ప్రజలు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు , అభిషేకములు, అష్టో త్తరములు చేయించెదరు.


నాగులచవితిని ఒక పండుగగా ప్రజలు జరుపుకొందురు.ఈ చవితి రోజున ప్రాతః కాలముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని , ' పుట్ట' ఉన్నచోట అనగా ఆ స్వామి పాముల రూపములో వెలసిన పుట్టలో ఆవు పాలు పోయుదురు.బెల్లం-బియ్యపు పిండితో కలిపి చేసిన చలిమిడి , ఒడపప్పు (అనగా నాన బెట్టిన పెసరపప్పు )ఇవన్ని కలిపి ఆరోజున నివేదన చేస్తారు.ఆ పుట్ట పైని మట్టిని పవిత్రముగా భావించి కొంత తీసుకుని భక్తి,నమ్మకము కలవారు తమ చెవులకు అతికించుకుంటారు. ఇలా చేసినచో చెవిపోటు, నెప్పి అలాంటి అనారోగ్యము కలుగదని వారి నమ్మకము.


నమ్మినవారికి కోరిన వరములను ప్రసాదిస్తూ ఈ లోకమున అనేక ఆలయములందు వెలసిన దైవము శ్రీ సుబ్రహ్మన్యేస్వరస్వామి. కావున కార్తీకమాసమందు వచ్చు పుణ్య దినములలో ముఖ్యమైనది ఈ నాగులచవితి.


ఈ పండుగనే కార్తీక బహుళ పంచమినాడు 'నాగుల పంచమి ' గా కూడా జరుపుకొందురు.


నాగుల చవితి రోజున నాగదేవతలను పూజించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వాసం. అందుచేత నాగుల చవితి రోజున "నాగేంద్రా! మేము మా వంశములో వారము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో.. నడుం తొక్కితే నా వాడనుకో.. పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్ములను భయపెట్టకు తండ్రీ అంటూ పుట్టకు ప్రదక్షిణ, నమస్కారాలు చేయాలని పురోహితులు అంటున్నారు.


ఇంకా ఆ రోజు ఉదయం ఐదింటికే లేచి, శుచిగా స్నానమాచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తర్వాత పూజామందిరము, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు, కుంకుమ, గుమ్మానికి తోరణాలు,పూజామందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజామందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్రస్వామి (పాముపడగ) ప్రతిమను గానీ, లేదా ఫోటోనుగానీ పూజకు ఉపయోగించాలి.


పూజకు మందారపూల, ఎర్రటి పువ్వులు,కనకాంబరములు.. నైవేద్యమునకు చిన్నచిన్న ఉండ్రాళ్ళు,వడపప్పు, అరటిపండ్లు, చలిమిడిలను సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజను పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్ర అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము,నాగస్తుతిః, నాగేంద్ర సహస్రనామములను పఠించడంద్వారా సకలసంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలుకాని పక్షములో "ఓం నాగేంద్రస్వామినే నమః" అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.


దీపారాధనకు నువ్వులనూనెను వాడాలి. 7 దూదివత్తులు,ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యమును సమర్పించుకోవాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్యపూజ అనే పుస్తకమును తాంబూలముతో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి.

ఇకపోతే.. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వంసిద్ధిస్తుందని నమ్మకం. అలాగే.. దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామపూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం,నాగేంద్రస్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించేవారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు అంటున్నారు. అందుచేత అందరూ నాగుల చవితి రోజున నాగదేవతలను నిష్టతో పూజిద్దాం..!.

🌹🙏🌹

No comments:

Post a Comment