27/10/17, 6:23:43 AM: MVMRAO: Janardhan Thakur:
"కాశీ (వారణాశి)"
"కాశీ" అంటే ప్రకాశము, వెలుగు, తేజస్సు, కాంతి అని అర్ధాలు.
ద్వాదశ జ్యోతిర్లింగాలలో కాశీలో ఉన్న "విశ్వనాథ లింగము" అత్యుత్తమైనదిగా
భక్తుల అభిప్రాయము. మూడు రాత్రులు, 3 పగళ్ళు నగరం దాటకుండా కాశీలో ఉంటే
"రాజసూయ యాగం + అశ్వమేధ యాగం" చేసిన ఫలితం వస్తుంది. కాశీ నగరం ద్వాదశ
నామాలతో ప్రసిద్ధి చెందినది. అవి: "కాశీ, వారణాశీ, బెనారస్, శివపురి,
క్షేత్రపురి, త్రిపురారి, రాజనగరి, ఆనందకాననం, గౌరీముఖి, అవిముక్తి,
మోక్షపురి, జ్ఞానపురి."
కాశీలోని "మణికర్ణిక
తీర్ధం"లో స్నానం చేస్తే "యజ్ఞం" చేసిన ఫలితం వస్తుంది. పంచమాధవ
క్షేత్రాలలో ఒకటైన "భిందుమాధవుడు" కాశీలోనే ఉన్నాడు. అస్సీఘాట్ దగ్గర ఉన్న
"లోలార్క్ కుండ్"లో సూర్య భగవానుడు ఉన్నాడు. లోలార్క్ కుండ్ లో ఎర్ర చందనం,
ఎర్ర పువ్వులు వేసి నమస్కారం చేయాలి, ఆరోగ్యం బాగుంటుంది.
కాశీలోని "అన్నపూర్ణ" అమ్మవారి చేతిలో అన్నపు భాండము, గరిటె ఉంటాయి.
ఇక్కడ "విశాలాక్షి" అమ్మవారు త్రిశక్తి పీఠాలు (కంచి కామాక్షి, మధుర
మీనాక్షి, కాశీ విశాలాక్షి)లో ఒకటిగా, అష్టాదశ పీఠాలలో ఒకటిగా, అష్టశత
శక్తులు (108 శక్తి పీఠాలు)లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది.
సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ శబ్ధమును నిరూపించుకున్నది ఇక్కడే
(హరిశ్చంద్ర ఘాట్ ఉంది). తులసీదాసు రామాయణాన్ని (శ్రీరామచరిత మానస్)
వ్రాసినది ఇక్కడే.
జగద్గురువులు
ఆదిశంకరరాచార్యులు ఇలా అంటారు "ఆనందమునకు మూలానందమైన ఆనందకాననం (కాశీ)లో
నివశిస్తూ, పాపాలను తుంచివేసే, అనాధలకు నాధుడైన కాశీనాధుడు విశ్వనాధుడిని
శరణు వేడుకుంటున్నాను" అన్నారు. భజగోవిందంలో జగద్గురువులు గంగానది గురించి
"గంగాజల లవ కణికా పీతా" అంటూ గంగమ్మ నీరు ఒక్క చుక్క తాగినా, యముడి వద్దకు
వెళ్ళాల్సిన పని ఉండదంటారు.
కాశీలోని ఘాట్లు
మొత్తం 365, అందులో ముఖ్యమైనవి 64 ఘాట్లు. వాటిలోనూ ముఖ్యంగా స్నానం
చేయవలసినవి 5 ఘాట్లు అని పెద్దలు చెబుతారు, అవి: 1)అస్సీ ఘాట్, 2)కేదార్
ఘాట్, 3)దశాశ్వమేధఘాట్, 4)మణికర్ణిక ఘాట్, 5)పంచగంగ ఘాట్. వీటన్నింటిలో అతి
ముఖ్యమైనది "మణికర్ణిక". ఈ మణికర్ణక ఘాట్లో మధ్యాహ్నం12 గంటలకు దేవతలు
అందరూ వచ్చి స్నానం చేస్తారని ప్రసిద్ధి. ఆ సమయంలో మణికర్ణిక స్థవం చదివి
స్నానం చేయలంటారు.
క్షేత్రపాలకుడైన
"కాలభైరవుడు"ని తప్పకుండా దర్శించుకోవాలి. ఈయన మరో పేరు 'క్రోదభైరవ
దేవుడు'. ఈయన అనుమతి లేకుండా మనం కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము. "సాక్షి
గణపతి'ని దర్శించుకోవాలి. గంగా హారతి ప్రపంచ ప్రసిద్ధి పొందినది.
శ్రీవిశ్వనాధుని హారతి ఉ. 3 గంటలకు సేవకు ₹251, అభిషేకం ₹140 చెల్లించాలి. అన్నపూర్ణమ్మ కుంకుమ పూజకు ₹350 చెల్లించాలి.
"ఎంతో పుణ్యం ఉంటే కానీ కాశీ క్షేత్రంలో అడుగుపెట్టలేము"
"గంగా తరంగ కమనీయ జటాకలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామభాగమ్,
నారాయణప్రియ మనంగ మదాపహారం,
వారణాసీ పుర పతిం భజ విశ్వనాథం
No comments:
Post a Comment