Thursday, October 31, 2019

కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు🙏

కర్ణుడు.. కుంతీదేవికి పుట్టలేదు. కుంతీదేవి కూడా నవమాసాలు మోసి ‘కర్ణుని’ కనలేదు. కర్ణుడు పసిబిడ్డగా సూర్యుని ద్వారా కుంతీదేవికి ఇవ్వబడ్డాడు... అంతే. కన్యగా ఉన్న కుంతికి., దూర్వాసమహర్షి ఇచ్చిన మంత్రం ‘సంతాన సాఫల్య మంత్రం’. ఆ మంత్రంతో ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప మరే వరాలు అనుగ్రహించరు. ఆ మంత్ర ప్రభావం అలాంటిది. ఈ విషయాన్ని పాఠకులు ముందు అర్థంచేసుకుంటే..కర్ణుడు, కుంతికి ఎలా ఇవ్వబడ్డాడో బాగా అర్థం అవుతుంది. ఇక విషయంలోకి వెడితే.... పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి అభేద్యమైన వెయ్యి కవచాలు వరంగా పొందాడు. అప్పటినుంచి వాడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. ఆ వరగర్వంతో వాడు సర్వలోకాలనూ నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు పడలేక సకల ప్రాణికోటి  శ్రీ మహావిష్ణువును శరణు కోరగా ‘భయపడకండి..నేను నర, నారాయణ రూపాలలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత  నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’గానూ., ‘సింహ’ రూపం ‘నారాయణుని’గా ‘ధర్ముని’ కుమారులుగా జన్మించాడు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులు, విరాగులు. అందుకే వారిరువురూ ఆయుధధారులై బదరికావనంలో ఏకాగ్రచిత్తులై  తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ.. నర, నారాయణులను చూసి, వారి ప్రక్కన ఆయుధాలు ఉండుట గమనించి..‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమద్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా ప్రహ్లాదుడు వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ‘ప్రహ్లాదా.. నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుపుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకుని అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

నర,నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకి ఇంద్రుడు భయపడి., వారికి తపోభంగం చేసిరమ్మని అప్సరసలను పంపాడు. వారు తమ రూప, వయో, నృత్య, గానాలతో నర,నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని ఎంతో ప్రయత్నించారు.. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్రపదవి ఆశించి మేము ఈ తపస్సు చేయడంలేదు అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల(తొడల) నుంచి పుట్టిన ఆ సుందరికి ‘ఊర్వసి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు ఇస్తూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని నర,నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర,నారాయణుల తపస్సు కొనసాగతోంది. ఆ సమయంలో వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు  సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర,నారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను., నర,నారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు., ఆ సహస్రకవచునే.., పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నర,నారాయణులిరువురూ.. కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో
కర్ణుని సంహరించారు🙏

 తండ్రి కృష్ణయ్య అందరిని చల్లగా చూడయ్యా 🙏Forwarded by kvg Sarma 
Ananthakumar Thommandru:
Ananthakumar Thommandru:
🐍 *నాగుల చవితి ప్రాముఖ్యత పూర్తిగా చదివి తెలుసుకోండి* 🐍

*పూజించవలసింది నాగులనా? దేవతాసర్పాలనా? పాములనా? ...    తెల్సుకోవలనిఉంటే.  ఈ వ్యాసం చదవండి చదివించండి💐🙏💐

నాగుల చవితి, నాగపంచమి,  వస్తోందంటే చాలు, హిందూ సంప్రదాయాలు మూఢనమ్మకాలు, పాములు పాలు త్రాగుతాయ? వీళ్ళు పాములను హింసిస్తున్నారు, ఆదిమానవుడి కాలపు అలవాట్లను పాటిస్తున్నారు అంటూ మీడియా ఎంతసేపు దాడి చేసి, ధర్మాన్ని కించపరచాలని చూస్తోందే కానీ, నిజానికి ఈ ఆచారం ఎందుకు వచ్చింది, ఆచరణలో ఏమైనా మార్పులు వచ్చాయా? సంప్రదాయాన్ని తప్పుగా అర్దం చేసుకున్నారా? ఒకవేళ పొరబడి ఉంటే, దాన్ని ఎలా సరిజేసుకోవాలని చెప్పే ప్రయత్నం చేయదు.

ఆంగ్లేయులు భారత్ మీదకు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ ప్రభావం బాగా పెరిగింది. అది ఎంతగా పెరిగిందంటే ఎంతో విశాలమైన భాష అయిన సంస్కృతాన్ని, దాని నుండి వచ్చిన భారతీయ భాషలలోని పదాలకు ఇంగ్లీష్‌లో అర్దం వెతుక్కునే స్థితికి చేరుపోయాము. అది ఇంకా దిగజారి ఏకంగా ఇంగ్లీష్ పదాలనే ఉపయోగిస్తూ, దాని అర్దాలనే సంస్కృతపదాలకు అంటగడుతున్నాము. విషయంలోకి వస్తే ఇంగ్లీష్ వాళ్ళకు Snake అనే పదం ఒక్కటే ఉంది. కానీ మన ధర్మంలో నాగులు, సర్పాలని రెండు ఉన్నాయి. నాగులు వేరు, సర్పాలు వేరు. భగవద్గీత 10 వ అధ్యాయంలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పిన మాటలివి.

🍀 ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్|
..........ప్రజనశ్చాస్మి కన్దర్పః సర్పాణామస్మి వాసుకిః|| 10-28 ||

నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. పుట్టించేవాళ్ళల్లో మన్మదుడిని, సర్పాలలో వాసుకిని.

• సర్పాలలో తాను వాసుకి అని చెబుతున్నాడు. వాసుకి శివుని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేసారు దేవదానవులు. వాసుకి కద్రువ తనయుడు.

🍀 అనన్తశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహమ్|
.......పితౄణామర్యమా చాస్మి యమః సంయమతామహమ్|| 10-29 ||

నేను నాగులలో అనంతుడిని, జలచరాలలో వరుణుడిని, పీత్రులలో ఆర్యముడిని, సంయమవంతులలో నిగ్రహాన్ని.

• ఈ శ్లోకంలో #శ్రీకృష్ణుడు తాను నాగులలో అనంతుడనని చెబుతున్నాడు. అనంతుడు అనగా ఆదిశేషుడు. అనంతుడు కద్రువకు పెద్ద కొడుకు, రెండవ వాడు వాసుకి. కద్రువ వినతకు చేసిన అన్యాయానికి చింతించి విష్ణువు గురించి ఘోర తపమాచరించి ఆయనను తనమీద విశ్రాంతి తీసుకునేలా వరం పొందుతాడు అనంతుడు. బ్రహ్మ అతడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు. పురాణాల ప్రకారం అనంతుడు అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు. రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారం లో బలరాముడిగా, వేంకటేశ్వర అవతారంలో గోవిందరాజులుగా, భక్తి మార్గాన్ని తెలపడానికి భగవద్ రామానుజులుగా.

ఇప్పుడు మనకు ఒక సందేహం రాక మానదు. పైన సర్పాలలో వాసుకి తానన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడనంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి తేడా? కొంతమంది పండితులు సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు. కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెంటికీ చాలా వ్యత్యాసం వుంది. నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నైనా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి, భూమి మీద తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్ట లోకం వుంది. నాగులకు వాయువు ఆహరం, అనగా అవి గాలిని స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలకు కప్పలు మొదలైన జీవరాశులు ఆహారం.

నాగుల్లో మళ్ళీ 9 జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతాసర్పాలని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుంది. కానీ ఇవి మానవసంచారం ఉన్న ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. మనిషికి గానీ, పాములు పట్టేవాళ్ళకు గాని చిక్కవు. అలా చిక్కుతాయి అనుకోవడం సినిమాల ప్రభావం మాత్రమే.
పాములు పాలు త్రాగవన్నమాట నిజం. అవి సరిసృపాలు కనుక వాటికి జీర్ణవ్యవస్థ ఉండదు. కానీ నాగులు, దేవతాసర్పాలు అందుకు భిన్నం. భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో దర్శనమిచ్చి పూజలు అందుకుంటారు, ఆరోగ్యాన్ని, సంతనాన్ని అనుగ్రహిస్తారు. దేవతాసర్పాలకు కూడా శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికి ఉన్నాయి. అవి కూడా పాలు త్రాగుతాయి.
ఈ నాగపంచమి మొదలైన నాగదేవతారాధన తిధులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవారు. అప్పటి మానవులకు శౌచం ఉండేది. ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఉండేది. ఆ రోజులు వేరు. కనుక అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపుకుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమక్రమంగా ప్రజల్లో శౌచం తగ్గిపోవడం, ధర్మంపై శ్రద్ధ తగ్గి, ఆచరణ తగ్గిపోయిన కారణంగా నాగులు ఇంతకముందు వలే మర్త్యలోకంలో సశరీరంతో సంచరించడం మానేశారు. విగ్రహాల్లో వారిని ఆవాహన చేసి, పూజించినవారికి సత్ఫలితాలను ఇస్తున్నారు. అలాగే దేవతాసర్పాలు కూడా జనసంచారం ఉన్న ప్రాంతాల్

లో తిరగడం మానేశాయి. ఒక 75

ఏళ్ళ క్రితం వరకు దేవతసర్పాలను చూసి, పూజించి, వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి, ఆ కుటుంబసభ్యులకు ఇప్పటికి ఆ విషయాలు స్మరణలో ఉంటాయి. కానీ ఇప్పుడు సదాచారం, శౌచం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేశారు, ఒకవేళ ఎక్కడైనా అలాంటివి ఉన్నా, సక్రమంగా పాటించడం తక్కువ. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. ఆలయాల్లో వాటికి జరిగిన అపరాధం కారణంగా కొన్ని శరీరం విడిచిపెట్టాయి.

ఇప్పుడు బయట కనిపించే పుట్టల్లో ఉండేవి దేవతాసర్పాలని చెప్పలేము. చాలామటుకు ఏదో మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. #నాగపంచమి, #నాగులచవితి కి నాగదేవతలకు పూజలు చేయాలి. కానీ పైన చెప్పుకున్న విషయాలు అర్దంకాక ప్రజలందరూ మాములు పాములకు పాలు పోస్తున్నారు, పసుపు కుంకుమలు వేస్తున్నారు. మామూలు పాములు పాలు త్రాగవు, వాటికి పసుపుకుంకుమలు పడవు. అందుకే నాగదేవతలను పూజించవలసి వచ్చినప్పుడు నాగప్రతిష్ట, నాగబంధం, నాగశిలలను మాత్రమే పూజించమని ధార్మిక గ్రంధాలు పేర్కొంటున్నాయి.
ఇప్పటి ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. నాగపంచమి, నాగులు చవితి మూఢనమ్మకలు కాదు, నాగదేవతలను పూజించి, సంతానం పొందిన దంపతులు కోకొల్లలు. ఇతర పిల్లలతో పోల్చినప్పుడు నాగదేవాతానుగ్రహంతో కలిగిన సంతానంలో నాగదేవతల యొక్క వరప్రభావం, అంశను తల్లిదండ్రులు పసిగట్టగలుగుతారు. కానీ అలా సంతానం కోసం పూజించవలసింది నాగులనే కానీ మామూలు పాములను కాదు.

ఈశ్వర సృష్టిలో ప్రతి జీవికి ప్రాధాన్యత ఉంది. సాధారణ సర్పాలు జీవవైవిధ్యంలో, ఆహారచక్రంలో తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటి మనుగడతోనే మానవమనుగడ సాధ్యమవుతుంది. మామూలు పాముల జోలికి వెళ్ళకుండా ఉండడం, వాటి మానాన వాటిని వదిలేయడం, వాటిని ఎవరైనా హింసిస్తుంటే రక్షించడం వల్ల కూడా దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చు.
సంప్రదాయం మొదలైనప్పుడు అందులో మూఢనమ్మకమేమీ లేదు. కాలక్రమంలో మారిన అలవాట్ల కారణంగా, వచ్చిన మార్పులను ప్రజలు అర్దం చేసుకోలేకపోయారు. కనీసం ఇప్పటికైనా హిందూసమాజం సంప్రదాయంలోని అసలు విషయాన్ని గమనించాలి. విషయాన్ని సగం సగం చెప్పి, మూఢనమ్మకమంటూ కొట్టిపారేయకుండా, అసలు విషయాన్ని పూర్తిగా ప్రజలకు చెప్పేందుకు మీడియా కూడా ముందురావాలి.  

    సంస్కృతి సంప్రదాయాలను మూఢనమ్మకాలుగా భావించకుండా అవి మన పూర్వులు ఇచ్చిన వరంగా భావించాలనిb ఆశిస్తూ ..ఆకాంక్షిస్తూ...

నమస్సులతో
మీ నరేంద్ర ఆరవల్లి
☸


*మనసు.....*

మనసును ప్రశాంత స్థితిలో ఉంచడానికి మార్గం ఒకటే ఉంది. కోరికల వల నుంచి దాన్ని బయటకు పడవెయ్యాలి. ప్రపంచ మహాసాగరంలో ఊగిసలాడే పడవ వంటిది మానవ శరీరం. కర్మానుభవాలనే గాలులే ఆ నావను నడుపుతుంటాయి.

దేహమనే పడవకు తొమ్మిది రంధ్రాలు ఉన్నాయి. ఆ పడవ నడిపే సరంగు నిమిత్తమాత్రుడు. ఈ చిల్లుల పడవను సాక్షిగా నడిపిస్తుంటాడు. ఈ తొమ్మిది రంధ్రాలను చూసుకొంటూ జీవన ప్రయాణం సాగించకపోతే, పడవలోకి నీళ్లు వచ్చేసి, అది మునిగిపోతుంది. అనుభవశాలి అయిన సరంగు పడవను ఆవలి గట్టుకు భద్రంగా చేరుస్తాడు. ఇంద్రియ నిగ్రహంతోటే ఇది సాధ్యం.

పరస్త్రీలను కోరడం మహాపాపం. తెలిసి కూడా కోరికలను వదలకపోతే మనసు పాప పంకిలమైపోతుంది. ఇతరుల్ని తిట్టడం, లేక వారి తిట్లను వినడం రెండూ నిరర్థకమే.. నిందించడానికి అలవాటుపడిన నాలుక సాధించుకొనేదేదీ ఉండదు... పోగొట్టుకోవడం తప్ప.

వస్తువుల మీద ఉన్న అభిమానం, దురదృష్టానికి దారి తీస్తుంది. వస్తువును పొంది, తరవాత పోగొట్టుకొంటే అది మహాబాధ కలిగిస్తుంది. వివేకవంతమైన మనసు, తనకేది కావాలో తేల్చుకోగలదు. అశాశ్వతమైన వస్తువులకు అది ఎప్పుడూ దూరంగా ఉంటుంది.

పామునోట సగం శరీరంతో ఇరుక్కొన్న కప్ప, తనను మింగబోతున్న మృత్యువును గ్రహించలేదు. పైగా అది తన ముందున్న కీటకాలను తినాలని తాపత్రయ పడుతుంది. అదే చిత్రం. దీనిని దురాశ కాక మరేమిటని అంటారు...

ఇలాంటి మనసును అదుపులో ఉంచుకోవడం ఎలా...

తన ప్రయాణాన్ని ప్రారంభించిన నది, మూలం వదిలి సముద్రం చేరేదాకా, పల్లంవైపుగా సాగుతుంది. వర్షకాలంలో అధికంగా నీరుచేరితే బావిలోని నీరు తీపితనాన్ని కోల్పోతుంది. ఆ బావి నీరే వేసవిలో తియ్యగా మారిపోతుంది.

‘అతిసర్వత్రవర్జయేత్‌’ అన్నారు. అధికం ఎప్పుడూ అనర్థమే.. అధికమైన కోరికలతో తామసగుణం పెరిగిపోతుంది. అవి లేకపోతే తామసం నశించి సత్త్వగుణం పెరుగుతుంది. సత్త్వ రజస్తమో గుణాలు మూడూ ప్రకృతి సహజమైనవే..

పవిత్రత, వివేకం, విజ్ఞానం ఇవన్నీ సత్త్వగుణాలు. ఆందోళన, ఆగ్రహం, అస్తిమతత్వం- ఇవన్నీ రజోగుణాలు. జడత్వం, అజ్ఞానం, భ్రాంతి- ఇవన్నీ తమోగుణాలు.

మనసుకు ఉన్న మొదటి లక్షణం.. అన్నీ పొందాలనుకోవడం. పోగొట్టుకోవడానికి అది ఇష్టపడదు. పైగా అవమానకరంగా భావిస్తుంది. వస్తువును పొందే ప్రయత్నం అంతా నిజానికి ఒక యాతన వంటిది. సత్సంగం, సత్సాంగత్యం, సజ్జనమైత్రి... మనసుకు ఎంతో స్తిమితాన్ని ఇస్తాయి..Forwaded By Surendra pss

*చరమ శ్లోకము ~ అని ఎందుకంటారు?*

        ఈ శ్లోకాన్ని భగవద్గీతలోని 18 వ అధ్యాయములోని 66వ శ్లోకాన్ని గీతాసారంగా పెద్దలు నిర్ణయించినారు:

 *సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ*
*అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః*

కృష్ణ పరమాత్మ ఏమని చెప్పినాడంటే ఆర్జునునికి ~

*మోక్ష‌ సాధనాలుగా  చెప్పబడిన కర్మ జ్ఙాన భక్తి యోగములపై ఫల, సంగ, కర్తృత్వాలను విడిచి ~ ఏ పనినైనా భగవంతుని అనుగ్రహముతో అయన ప్రీతి కొరకే చేస్తున్నాను అనే ధృఢ విశ్వాసముతో చెయ్యి ~ నన్ను ఉపాయముగా (శరణముగా) స్వీకరించు; నన్ను పొందకుండా అడ్డుపడే సకల పాపరాశి నుండే నిన్ను నేను విడిపిస్తాను; విచారించకు అర్జునా!*

        అర్జునినికి ఉపదేశించిన ఈ శ్లోకము ప్రపత్తికి ఆలంబనము; అందుకే దీనిని
*చరమ శ్లోకము* అని అంటారు.

           *భగవంతుడే రక్షకుడు అనే ధృఢవిశ్వాసాన్ని కలిగి, అంతా నేను చేస్తున్నాను ~ నేను చేసే ప్రతి పని యొక్క ఫలితము నాదే అని భావించకుండా, అన్నీ భగవత్పరంగా చేయడమే మన కర్త్యవ్యము. దీనిని‌ ప్రపత్తి అనీ, శరణాగతి అనీ అంటారు. ఈ ఒక్క శ్లోకాన్ని బాగా అర్థము చేసుకుని ఆచరణలో పెట్ట గలిగితే ఇంతకంటే మనము చేయగలిగిందేమీ ఉండదు! ఇహం లోనూ, పరం లోనూ పొందలేనిది ఏమీ ఉండదు.*

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

Wednesday, October 30, 2019

నాగులు - సర్పాలు - వైజ్ఞానిక విశ్లేషణ :

 మనదేశంలో నాగుపాములను నాగదేవతలుగా పూజిస్తారు. అందుకే దానిచుట్టూ కొన్ని సంప్రదాయాలు, ఆచారాలు వచ్చాయి. కాని మన శాస్త్రాల ప్రకారం నాగులు, సర్పాలు ఒకటి కావు. నాగులు వేరు, సర్పాలు వేరు.

▶️ భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ చెప్పినదానిని పరిశీలిస్తే.. ‘నేను ఆయుధాలలో వజ్రాన్ని. గోవులలో కామధేనువుని. సర్పాలలో వాసుకిని, నాగులలో అనంతుడిని అంటాడు.

▶️వాసుకి శివుడిని ఆశ్రయించి ఆయనకు అలంకారంగా వుంటుంది. ఈ వాసుకినే త్రాడు గా చేసుకుని సాగర మధనం చేశారు దేవదానవులు. వాసుకి, అనంతుడు ఇద్దరూ కద్రువ తనయులు. అనంతుడు అనగా ఆదిశేషుడు… కద్రువకు పెద్ద కొడుకు. బ్రహ్మ అనంతుడి బలాన్ని చూసి భూభారాన్ని మోయమని చెబుతాడు.


 ▶️పురాణాల ప్రకారం అనంతుడు
అదృశ్యంగా ఈ భూతలాన్ని మోస్తూ ఉంటాడు. ఈ అనంతుడే వివిధ అవతారాలలో స్వామివారిని అనుసరిస్తాడు.

▶️ఇక్కడే ఓ సందేహం వస్తుంది. విష్ణుమూర్తేమో.. సర్పాలలో వాసుకిని తానేనన్నాడు, ఇక్కడ నాగులలో అనంతుడిని అంటున్నాడు. అసలు సర్పాలు , నాగులు ఒకటి కాదా ? ఏమిటి వీటి మధ్య తేడా అన్న అనుమానం వస్తుంది. కొంతమంది ప్రాజ్ఞుల అవగాహన  ప్రకారం… సర్పాలంటే విషపూరితాలు అని , నాగులు అంటే విషరహిత పాములు అని ప్రతిపాదించారు.

 ▶️కానీ పురాణాల ప్రకారం సర్పాలు, నాగులు సోదర సమానులైనా రెండింటికీ  తేడా ఉంది.

▶️నాగులు కామరూపధారులు. అవి కావాలనుకున్నప్పుడు మానవ రూపంలో కనబడగలవు. మానవరూపాన్నే కాదు, ఏ రూపాన్నయినా ధరించగలవు. సర్పాలు అలా కావు, అవి నేలను అంటిపెట్టుకుని పాకుతాయి. భూమి మీదే తిరుగాడుతాయి. నాగులకు ఒక విశిష్టత వుంది. అవి గాలిని ఆహారంగా స్వీకరించి బ్రతుకుతాయి. సర్పాలు మాత్రం.. కప్పలు మొదలైన జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి.

నాగుల్లో మళ్ళీ  జాతులు ఉంటాయి. అట్లాగే సర్పాల్లో కూడా దేవతా సర్పాలని లేదా నాగులని ప్రత్యేకంగా ఉంటాయి. దేవతాసర్పాలు ఎక్కడ ఉంటే అక్కడ మల్లెపూలవాసన వస్తుందంటారు. కానీ ఇవి మనుషులు తిరిగే ప్రాంతాల్లో సంచరించవు, మానవజాడలకు దూరంగా ఉంటాయి. దేవతా సర్పాలకు కూడా కొన్ని శక్తులు ఉంటాయి, అవి కొన్ని ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఇప్పటికీ ఉన్నాయి. అవి పాలు త్రాగుతాయి. పూర్వకాలంలో ప్రజల భక్తికి మెచ్చిన నాగదేవతలు అనేకరూపాల్లో వారికి దర్శనమిచ్చి పూజలు అందుకునేవారంటారు. భక్తుల కోరిక మేరకు ఆరోగ్యాన్ని, సంతానాన్ని అనుగ్రహించేవి.

కాలచక్రంలో తిథులు ప్రారంభమైన సమయంలో నాగులు కూడా మానవజాతితో కలిసి సంచరించేవి. అప్పటి మనుషులకు ధర్మనిష్ఠ, సత్యనిష్ఠ, దైవభక్తి ఎక్కువగా ఉండేవి. ఆ రోజులు వేరు. అందుకే అప్పట్లో నాగజాతికి పాలు, పండ్లు సమర్పించి, పసుపు కుంకుమలు, సారెలతో పూజించి, వారిని సంతోషపెట్టేవారు. క్రమ క్రమంగా ప్రజల్లో ధర్మంపై శ్రద్ధ తగ్గిపోయింది.  అందుకే నాగులు ఇంతకముందులా సశరీరంతో సంచరించడం మానేశాయి.

దాదాపు 100 ఏళ్ళ క్రితం వరకు దేవతా సర్పాలను చూసి, పూజించి వరాలను పొందిన కుటుంబాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సదాచారం, ధర్మం వంటి మంచి విషయాలను జనం వదిలేస్తున్నారు.


    ఒకవేళ ఇటువంటి ఆచారాలు ఇప్పటికీ పాటిస్తున్నా అత్యంత నిష్టంగా పాటించే వారు అరుదుగా కనిపిస్తున్నారు. దాంతో దేవతాసర్పాలు జనావాసాలకు దూరంగా వెళ్ళిపోయాయి. భూలోకంలోని లోపాల వల్ల కొన్ని.. శరీరాలను విడిచిపెట్టాయి. ఇక పుట్టల్లో ఉండేవి దేవతా సర్పాలని చెప్పలేం. చాలావరకు మాములు పాములే జనావాసాల మధ్య పుట్టల్లో ఉంటున్నాయి. వీటిని ఎట్టిపరిస్థితుల్లోనూ హింసించకూడదు. ఇలా చేస్తే....... దేవతాసర్పాలు, నాగజాతి అనుగ్రహం పొందవచ్చును.

▶️నాగులు, సర్పాలలో ఉండే వైవిధ్యాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం.


  ▶️సకల చరాచర సృష్టిలో సర్పాలకు, నాగులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వీటి గురించి మనలో చాలా మందికి తెలియదు. చాలా దేశాలలో నాగారాధన, సర్పారాధన కూడా కలదు.

▶️ ఇప్పుడు మీకు వాటిలోని రకాలు గురించి పూర్తిగా వివరిస్తాను.

               సర్పజాతులు ఈ ప్రపంచంలో రెండు  రకాలుగా ఉన్నాయి.       అవి

 1 .  దివ్యములు :

 ఇవి దేవతా సర్పములు . వీటినే నాగులు అని కూడా అంటారు.

 2 .  భౌమములు :

  ఇవి భూమి నందు ఉండునవి .

   దివ్య సర్పములు లేదా నాగులలో భూమి యందు తిరిగే
సర్పాలు , మండలీ సర్పములు , ఉపజాతి సర్పములు కూడా ఉండును.

  దివ్య సర్పములలో లేదా నాగులలో రకాలు  -

1 .  అనంతుడు

 2.  వాసుకి.

3 .  తక్షకుడు.

 4.  కర్కోటకుడు .

  5 .  పద్ముడు .

  6 .  మహాపద్ముడు .

  7 .   శంఖపాలుడు .

  8 .   కులికుడు .

  ▶️దేవతా సర్పములకు లేదా నాగులకు ఉండు గుర్తులు  -

      అనంతుడుకి ఫణాగ్రము నందు తెల్లటి పద్మాకారం గల తెల్లని చుక్కలు ఉండును.  కులికునికి శిరము నందు శంఖము వంటి చిహ్నము ఉండును. వాసుకి వీపు భాగంలో నల్ల కలువ వంటి గుర్తు ఉండును. కర్కోటకునికి మూడు నేత్రములు పోలిన చిహ్నం ఉండును. తక్షకుని కి పడగ యందు స్వస్తిక్ వంటి గుర్తు ఉండును. శంఖుపాలునికి వీపు నందు అర్ధచంద్ర త్రిశూలాకారం గల గుర్తు ఉండును. మహాపద్మునికి చిన్నచిన్న మణుల
వంటి చుక్కలు ఉండును.పద్మునికి వీపు నందు ఎర్రని వర్ణం గల పంచ బిందువులు ఉండును.

             పైన చెప్పిన గుర్తులను బట్టి అవి దేవతా సర్పములుగా గ్రహించవలెను.

      అనంత, వాసుకి , తక్షక జాతికి సంబంధించిన దేవతా సర్పాలు ఎనిమిది రకాల సర్పాలు కు జరా మరణాదులు లేవు . వీటి విషం అత్యంత తీవ్రం అయినది. వీటి విషం నుంచి కాపాడే ఔషధం ఏమియూ లేదు . కొన్ని సార్లు ఇవి అదృశ్య రూపంలో కూడా ఉంటాయి.

  భూమి యందు ఉండు సర్పముల భేదములు.


   1 - ఉపజాతి సర్పములు .

   2 -  దర్వీకరములు .

   3 -  మండలీ సర్పములు .

   4 -  రాజీమంతములు .

           అను నాలుగు రకముల సర్పములు కలవు.

  భౌమ సర్పముల యొక్క లక్షణములు -

   
       పడగలు గరిట వలే ఉండునవి దర్వీకరములు అనియు , శరీరం అంతయు రత్నాలతో కూడిన కంబళి వలే గాని చిత్రవిచిత్రమైన పొడలు కలిగి ఉండునవి మండలీ సర్పములు అని , శరీరం నందు సన్న చుక్కలు , రేఖలు ఊర్ధ్వంగా ఉండి తిర్యక్ అగ్రరేఖలు కలిగి చిత్రాకారంగా ఉండునవి రాజీమంతములు అని చెప్పబడును.


  భూమి యందు ఉండు మూడు రకాల సర్పాల సంఖ్య  -

 1 -  దర్వీకములు అనగా త్రాచుపాములు వీటిలో మొత్తం 14 రకాలు కలవు.

 2 -  మండలీ సర్పములు అనగా పింజరలు వీటిలో మొత్తం 21 రకాలు కలవు.

 3  - రాజీమంత సర్పాలు అనగా క్షుద్రజాతి సర్పాలు వీటిలో 36 రకాలు కలవు.

ఇలా విశ్లేషణకు వెళితే ఇంకా ఉంది......

 📚కాళహస్తి. వేంకటేశ్వర రావు
✒భట్టాచార్య

2nd day ganarchana/గణార్చన 2వ రోజు

2nd day ganarchana/గణార్చన 2వ రోజు

🌅🌅యక్ష ప్రశ్నలు..? 🌅
*_ధర్మరాజునుపరీక్షించుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు/ వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు :_*


*_1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు ?_*

*_బ్రహ్మం._*


*_2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు ?_*

*_దేవతలు._*


*_3. సూర్యుని అస్తమింపచేయునvgది ఏది ?_*

*_ధర్మం._*


*_4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు ?_*

*_సత్యం._*


*_5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును ?_*

*_వేదం._*


*_6. దేనివలన మహత్తును పొందును ?_*

*_తపస్సు._*


*_7. మానవునికి సహాయపడునది ఏది ?_*

*_ధైర్యం._*


*_8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును ?_*

*_పెద్దలను సేవించుటవలన._*


*_9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును ?_*

*_అధ్యయనము వలన._*


*_10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి ?_*

*_తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును._*


*_11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు ?_*

*_మృత్యు భయమువలన._*


*_12. జీవన్మృతుడెవరు ?_*

*_దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు._*


*_13. భూమికంటె భారమైనది ఏది ?_*

*_జనని._*


*_14. ఆకాశంకంటే పొడవైనది ఏది ?_*

*_తండ్రి._*


*_15. గాలికంటె వేగమైనది ఏది ?_*

*_మనస్సు._*


*_16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది ?_*


*_ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది._*


*_17. తృణం కంటే దట్టమైనది ఏది ?_*

*_చింత._*


*_18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది ?_*

*_చేప._*


*_19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు ?_*

*_అస్త్రవిద్యచే._*


*_20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది ?_*

*_యజ్ఞం చేయుటవలన._*


*_21. జన్మించియు ప్రాణంలేనిది ?_*

*_గుడ్డు._*


*_22. రూపం ఉన్నా హృదయం లేనిదేది ?_*

*_రాయి._*


*_23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది ?_*

*_శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన._*


*_24. ఎల్లప్పుడూ వేగం గలదేది ?_*

*_నది._*


*_25. రైతుకు ఏది ముఖ్యం ?_*

*_వాన._*


*_26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు ?_*

*_సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు._*


*_27. ధర్మానికి ఆధారమేది ?_*

*_దయ దాక్షిణ్యం._*


*_28. కీర్తికి ఆశ్రయమేది ?_*

*_దానం._*


*_29. దేవలోకానికి దారి ఏది ?_*

*_సత్యం._*


*_30. సుఖానికి ఆధారం ఏది ?_*

*_శీలం._*


*_31. మనిషికి దైవిక బంధువులెవరు ?_*

*_భార్య/భర్త._*


*_32. మనిషికి ఆత్మ ఎవరు ?_*

*_కుమారుడు._*


*_33. మానవునకు జీవనాధారమేది ?_*

*_మేఘం._*


*_34. మనిషికి దేనివల్ల సంతసించును ?_*

*_దానం._*


*_35. లాభాల్లో గొప్పది ఏది ?_*

*_ఆరోగ్యం._*


*_36. సుఖాల్లో గొప్పది ఏది ?_*

*_సంతోషం._*


*_37. ధర్మాల్లో ఉత్తమమైనది ఏది ?_*

*_అహింస._*


*_38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది ?_*

*_మనస్సు._*


*_39. ఎవరితో సంధి శిథిలమవదు ?_*

*_సజ్జనులతో._*


*_40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది ?_*

*_యాగకర్మ._*


*_41. లోకానికి దిక్కు ఎవరు ?_*

*_సత్పురుషులు._*


*_42. అన్నోదకాలు వేనియందు ఉద్భవిస్తాయి ?_*

*_భూమి, ఆకాశములందు._*


*_43. లోకాన్ని కప్పివున్నది ఏది ?_*

*_అజ్ఞానం._*


*_44. శ్రాద్ధవిధికి సమయమేది ?_*

*_బ్రాహ్మణుడు వచ్చినప్పుడు._*


*_45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును ?_*

*_వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో._*


*_46. తపస్సు అంటే ఏమిటి ?_*

*_తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం._*


*_47. క్షమ అంటే ఏమిటి ?_*

*_ద్వంద్వాలు సహించడం._*


*_48. సిగ్గు అంటే ఏమిటి ?_*

*_చేయరాని పనులంటే జడవడం._*


*_49. సర్వధనియనదగు వాడెవడు?_*

*_ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు._*


*_50. జ్ఞానం అంటే ఏమిటి ?_*

*_మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం._*


*_51. దయ అంటే ఏమిటి ?_*

*_ప్రాణులన్నింటి సుఖము కోరడం._*


*_52. అర్జవం అంటే ఏమిటి ?_*

*_సదా సమభావం కలిగి వుండడం._*


*_53. సోమరితనం అంటే ఏమిటి ?_*

*_ధర్మకార్యములు చేయకుండుట._*


*_54. దు:ఖం అంటే ఏమిటి ?_*

*_అజ్ఞానం కలిగి ఉండటం._*


*_55. ధైర్యం అంటే ఏమిటి ?_*

*_ఇంద్రియ నిగ్రహం._*


*_56. స్నానం అంటే ఏమిటి ?_*

*_మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం._*


*_57. దానం అంటే ఏమిటి ?_*

*_సమస్తప్రాణుల్ని రక్షించడం._*


*_58. పండితుడెవరు ?_*

*_ధర్మం తెలిసినవాడు._*


*_59. మూర్ఖుడెవడు ?_*

*_ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు._*


*_60. ఏది కాయం ?_*

*_సంసారానికి కారణమైంది._*


*_61. అహంకారం అంటే ఏమిటి ?_*

*_అజ్ఞానం._*


*_62. డంభం అంటే ఏమిటి ?_*

*_తన గొప్పతానే చెప్పుకోవటం._*


*_63.ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును ?_*

*_తన భార్యలో, తన భర్తలో._*


*_64. నరకం అనుభవించే వారెవరు ?_*

*_ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు._*


*_65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ?_*

*_ప్రవర్తన మాత్రమే._*


*_66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది ?_*

*_మైత్రి._*


*_67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు ?_*

*_అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు._*


*_68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు ?_*

*_సుఖపడతాడు._*


*_69. ఎవడు సంతోషంగా ఉంటాడు ?_*

*_అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు._*


*_70. ఏది ఆశ్చర్యం?_*

*_ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడంచూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం._*


*_71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు ?_*

*_ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు._*


*_72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు ?_*

*_నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు._*🌅🌅💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🌸🌸🌸🌸🌸🌸🌸🌸 🌸🌸


*_అస్త్రవిద్యచే._*


*_20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది ?_*



*_సత్యం._*


*_30. సుఖానికి ఆధారం ఏది ?_*

*_శీలం._*























































*_అజ్ఞానం._*


*_44. శ్రాద్ధవిధికి సమయమేది ?_*

*_బ్రాహ్మణుడు వచ్చినప్పుడు._*


*_45. మనిషి దేనిని విడచి సర్వజనాదరణీయుడు, శోకరహితుడు, ధనవంతుడు, సుఖవంతుడు అగును ?_*

*_వరుసగా గర్వం, క్రోధం, లోభం, తృష్ణ విడచినచో._*


*_46. తపస్సు అంటే ఏమిటి ?_*

*_తన వృత్తి, కుల ధర్మం ఆచరించడం._*


*_47. క్షమ అంటే ఏమిటి ?_*

*_ద్వంద్వాలు సహించడం._*


*_48. సిగ్గు అంటే ఏమిటి ?_*

*_చేయరాని పనులంటే జడవడం._*


*_49. సర్వధనియనదగు వాడెవడు?_*

*_ప్రియాప్రియాలను సుఖ దు:ఖాలను సమంగా ఎంచువాడు._*


*_50. జ్ఞానం అంటే ఏమిటి ?_*

*_మంచి చెడ్డల్ని గుర్తించ గలగడం._*


*_51. దయ అంటే ఏమిటి ?_*

*_ప్రాణులన్నింటి సుఖము కోరడం._*


*_52. అర్జవం అంటే ఏమిటి ?_*

*_సదా సమభావం కలిగి వుండడం._*


*_53. సోమరితనం అంటే ఏమిటి ?_*

*_ధర్మకార్యములు చేయకుండుట._*


*_54. దు:ఖం అంటే ఏమిటి ?_*

*_అజ్ఞానం కలిగి ఉండటం._*


*_55. ధైర్యం అంటే ఏమిటి ?_*

*_ఇంద్రియ నిగ్రహం._*


*_56. స్నానం అంటే ఏమిటి ?_*

*_మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం._*


*_57. దానం అంటే ఏమిటి ?_*

*_సమస్తప్రాణుల్ని రక్షించడం._*


*_58. పండితుడెవరు ?_*

*_ధర్మం తెలిసినవాడు._*


*_59. మూర్ఖుడెవడు ?_*

*_ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు._*


*_60. ఏది కాయం ?_*

*_సంసారానికి కారణమైంది._*


*_61. అహంకారం అంటే ఏమిటి ?_*

*_అజ్ఞానం._*


*_62. డంభం అంటే ఏమిటి ?_*

*_తన గొప్పతానే చెప్పుకోవటం._*


*_63.ధర్మం, అర్ధం, కామం ఎక్కడ కలియును ?_*

*_తన భార్యలో, తన భర్తలో._*


*_64. నరకం అనుభవించే వారెవరు ?_*

*_ఆశపెట్టి దానం ఇవ్వనివాడు, వేదాల్నీ, ధర్మ శాస్త్రాల్నీ, దేవతల్నీ, పితృదేవతల్నీ, ద్వేషించేవాడు, దానం చెయ్యనివాడు._*


*_65. బ్రాహ్మణత్వం ఇచ్చేది ఏది ?_*

*_ప్రవర్తన మాత్రమే._*


*_66. మంచిగా మాట్లాడేవాడికి ఏమి దొరుకుతుంది ?_*

*_మైత్రి._*


*_67. ఆలోచించి పనిచేసేవాడు ఏమవుతాడు ?_*

*_అందరి ప్రశంసలుపొంది గొప్పవాడవుతాడు._*


*_68. ఎక్కువమంది మిత్రులు వున్నవాడు ఏమవుతాడు ?_*

*_సుఖపడతాడు._*


*_69. ఎవడు సంతోషంగా ఉంటాడు ?_*

*_అప్పులేనివాడు, తనకున్న దానిలో తిని తృప్తి చెందేవాడు._*


*_70. ఏది ఆశ్చర్యం?_*

*_ప్రాణులు ప్రతిరోజూ మరణిస్తూ ఉండడంచూస్తూ మనిషి తానే శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోతాననుకోవడం._*


*_71. లోకంలో అందరికన్న ధనవంతుడెవరు ?_*

*_ప్రియయూ అప్రియమూ, సుఖమూ దు:ఖమూ మొదలైన వాటిని సమంగా చూసేవాడు._*


*_72. స్ధితప్రజ్ఞుడు అని ఎవరిని ఆంటారు ?_*

*_నిందాస్తుతులందూ, శీతోష్ణాదులందూ, కలిమి లేములందూ, సుఖదు:ఖాదులందూ సముడై, లభించిన దానితో సంతృప్తుడై అభిమానాన్ని విడచి, అరిషడ్వర్గాలను జయించి స్ధిరబుద్ధికలవాడుగా ఎవరైతే ఉంటాడో వానినే స్థితప్రజ్ఞుడంటారు._*🌅🌅💐💐💐💐💐💐💐


🌸🌸🌸🌸🌸🌸🌸🌸


*🌹. కార్తీక పురాణం - 3 🌹*
*🌻 3వ అధ్యాయం : కార్తీకస్నాన మహిమ,

*బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట.*


*బ్రహ్మర్షియైన శ్రీ వశిష్ఠ మహర్షి రాజర్షియైన జనకునికి ఇంకా యిలా  చెప్పసాగాడు; 'రాజా! స్నానదాన జప తపాలలో దేవినిగానీ, ఈ కార్తీకమాసంలో ఏ కొద్దిపాటిగా ఆచరించినప్పటికీ కూడా - అది అక్షయమైన ఫలాన్నిస్తుంది. ఎవరైతే సుఖలలాసులై శరీర కష్టానికి జడిసి కార్తీక వ్రతాన్ని ఆచరించరో - ఆటువంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.*

*శ్లో" పౌర్ణమ్యాం కార్తీకేమాసి స్నానాందీస్తు నాచరన్ !*
        *కోటిజన్మసు చండాలయోనౌ సంజాయతే నృప !!*

 *శ్లో" క్రమాద్యోనౌ సముత్సన్నో భవతి బ్రహ్మరాక్షసః !*
         *అత్త్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనమ్ !!*

*భావం: కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాలలో ఏ ఒక్కటీ కూడా ఆచరించని వాళ్లు కోటి పర్యాయాలు చండాలపు యోనులలో జన్మించి, తుదకు బ్రహ్మ రాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెబుతాను విను.*

*అతి పూర్వకాలంలో ఆంధ్రదేశంలో తత్త్వనిష్ఠుడనే బ్రహ్మణుడుండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యములను పకులనివాడూ, అన్ని భూతములయందునూ దయాళువూ, తీర్థాటన ప్రియుడూ అయిన ఆ విప్రుడు ఒకానొక తీర్థయాత్రా సందర్భముగా ప్రయాణిస్తూ మార్గమధ్యములో గోదావరీ తీరానగల ఒకానొక యెత్తయిన మర్రిచెట్టు మీద - కారు నలుపు  కాయచ్చాయ గలవాళ్లూ, ఎండిన  డొక్కలు కలవాళ్లూ, ఎర్రని నేత్రములు - గడ్డములూ కలవాళ్లూ, గ్రుచ్చబడిన ఇనుపతీగెలకుమల్లే పైకి నిక్కివున్న తలవెంట్రుకలతో, వికృత వదనార విందాలతో, కత్తులూ, కపాలాలూ ధరించి, సర్వజీవ భయంకరులుగా వున్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు. ఆ రాక్షసుల వలన భయము చేత ఆ మర్రి చెట్టు  నాలుగు  వైపులా  కూడా పన్నెండు మైళ్ల దూరంలో యెక్కడా ప్రాణి సంచారమనేదే వుండేది కాదు. అటు వంటి భయంకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత  దూరము నుంచే చూసిన  తత్వనిష్ఠుడు ఆదిరిపడ్డాడు. దానితో బాటే ఆ రాక్షసులు  కూడా తనను  చూడటంతో మరింత భయపడినవాడై - శోకాకుల చిత్తముతో శ్రీహరిని స్మరించసాగాడు.*

*🌻. తత్వనిష్ఠుడి శరణాగతి*

*శ్లో" త్రాహి దేవేశ లోకేశ! త్రాహి నారాయ ణావ్యయ సమస్త భయవిధ్వంసిన్!* *త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ ! త్వత్తోహం జగదీశ్వర !!*

*అంటే - "దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివయిన వాడా ! నారాయణా ! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతము చేసేవాడూ! నిన్నే శరణుకోరుతున్న నన్ను  రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగనివాడను. నన్ను కాపాడు రక్షించు" అని  యెలుగెత్తి స్మరించుచు రాక్షస భయముతో అక్కడ నుంచి పారిపోసాగాడు. అతనిని పట్టి వదించాలనే తలంపుతో ఆ రాక్షసత్రయము అతని వెనుకనే పరుగెత్తసాగినది. రక్కసులా పారునికి చేరువవుతున్న కొద్దీ, సాత్వికమైన విప్ర తేజస్సు కంటబడడం వలనా - తెరిపి లేకుండా  అతనిచే స్మరించబడుతూన్న హరినామము చెవులబడుట వలనా - వెంటనే వారికి జ్ఞానోదయమయింది. అదే తడవుగా ఆ బాపని కెదురుగా చేరుకొని, దండ ప్రణామా లాచరించి, అతనికి తమ వలన కీడు కలుగబోదని నమ్మబలికి,  'ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనముతో మా పాపాలు  నశించిపోయాయి. అని పునః పునః నమస్కరించారు. వారి నమ్రతకు కుదుట పడిన  హృదయముతో - తత్వనిష్ఠుడు 'మీరెవరు? చేయరాని పనులు  వేనిని చేయడం వలన యిలా అయిపోయారు? మీ మాటలు వింటుంటే బుద్దిమంతుల్లా వున్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరముగా చెప్పండి. మీ భయబాధావళి తొలగే దారి చెబుతాను' అన్నాడు.*

*🌻. ద్రావిడుని కథ*

*పారుని పలుకులపై, ఆ రక్కసులలో ఒకడు తన  కథనిలా వినిపించసాగాడు. 'విప్రోత్తమా! నేను ద్రావిడుడను. ద్రవిడ దేశమందలి మంధరమనే గ్రామాధికారినైన నేను, కులానికి బ్రహ్మణుడనే అయినా - గుణానికి కుటిలుడనీ, వంచనామయ వచః చమత్కారుడినీ అయి వుండేవాడిని. ణా  కుటుంబ శ్రేయస్సుకై, అనేక మంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువలకుగాని, బ్రాహ్మణులకు గాని యేనాడూ పట్టెడన్నమయినా పెట్టి ఎరుగను. నయవంచనలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంచేత - నా కుటుంబము నాతో సహా ఏడు తరాల వాళ్లు అధోగతుల పాలయిపోయారు. మరణానంతరము దుస్సహమైన నరకయాతనల ననుభివించి చివరికిలా బ్రహ్మరాక్షసుడనయ్యాను. కృపాయత్త చిత్తుడవై - నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు' అన్నాడు.*

*🌻. ఆంధ్రదేశీయుని గాథ*

*రెండవ రాక్షసునిలా విన్నవించుకోసాగేడు - 'ఓ పవిత్రుడా! నేను ఆంధ్రుడను. నిత్యమూ నా తల్లిదండ్రులతో కలహించుచు, వారిని దూషించుచు వుండేవాడిని. నేను  నా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ, తల్లిదండ్రులకు మాత్రం చద్దికూటిని పడవేసే వాడిని. బందావ బ్రాహ్మణ కోటికేనాడూ ఒక పూటయినా భోజనము పెట్టక - విపరీతముగా ధనార్జన చేసి ఆ కావరముతో బ్రతికే వాడిని. ఆ శరీరము కాలంచేశాక నరకానపడి ఘోరాతి ఘోరమైన బాధలనుభవించి చివరి కిక్కడిలా పరిణమించాను. ఆ ద్రావిదునికివలెనే - నాకు కూడా ముక్తి కలిగే దారిని బోధించుము' అని అన్నాడు.*

*🌻. పూజారి కథ*

*అనంతరం మూడవ రాక్షసుడు ముందరకు వచ్చి ఇలా మొఱపెట్టనారంభించాడు. 'ఓ  సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదేశపు బ్రహ్మణుడను.Forwarded by kvg sao

1st day Ganarchana 2019-కార్తీక మాసం /మొదటిరోజు గణార్చన

Tuesday, October 29, 2019

కార్తిక పురాణం -2 వ  భాగం:
కార్తీక పురాణము -- ద్వితీయాధ్యాయం:
అథద్వితీయాధ్యాయ ప్రారంభః
శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యమును వినుము. విన్నంతనే మనోవాక్కాయములవలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసినయెడల అశ్వమేధయాగముల ఫలమును పొందును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్తభోజనము, స్నానము, తిలదానము, ఈఆరున్నూ ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవల ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు చాయానక్తము జేయవలెను. అందు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట చాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించినయెడల యెనిమిది యుగములు నరకమందు కుంభీపాకనరకములోను, రౌరవనరకములోను బాధలనొందుదురు. కార్తీక సోమవారమందు విధవ యధావిధిగా ఉపవాసముచేసి శివుని పూజించినట్లయిన శివలోకమునుబొందును. స్త్రీలుగాని, పురుషులుగాని ఎవరు కార్తీకసోమవారమందు నక్షత్రములను జూచి రాత్రి భోజనము చేయుదురో వారి పాతకములు అగ్నియందుంచబడిన దూదివలె నశించును. కార్తీకసోమవారమందు శివలింగమునకు అభిషేకమును, పూజయుచేసి రాత్రి భుజించువాడు శివునకు ప్రియుడగును. ఈవిషయమునందొక కథగలదు. చెప్పెద వినుము. ఇది వినువారికిని చెప్పువారికిని పాపనాశనమగును.

కాశ్మీరదేశమందొక పురోహితుని కూతురు స్వాతంత్ర్యనిష్ఠురియనునొక స్త్రీగలదు. అతి చక్కని రూపముతో మంచి యౌవనముతో గూడియుండి తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారిణియై యుండెడిది. ఈమె దుర్గుణములను జూచి తల్లిదండ్రులును, అత్తమామలును ఆమెను విడిచిరి. ఆమె భర్త సౌరాష్ట్ర దేశశ్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదవేదాంగ పారంగతుడును, సదాచారవంతుడును, సమస్త భూతములందు దయగలవాడును, అనేక తీర్థముల సేవించినవాడును, అబద్ధమాడనివాడును, నిరంతరము దయగలవాడును భర్త ఇట్టి ఉత్తమగుణములు గలవాడైనప్పటికి ఆదుర్మార్గపు భార్య ఇతనిని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము ఆమెచేత దెబ్బలు తినుచును గృహస్థధర్మమందుండు కోరికచేత భార్యను విడువలేక ఆమెతో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారగుడనబడును. ఈమిత్రశర్మ భార్యకు కర్కశయనియు నామముగలదు. భర్యయైన మిత్రశర్మయు సంభోగవాంఛచేత ఆమెయందు రాగముతోనుండెను. అంతనొకనాడు ఆమె రంకుమొగుడు ద్రవ్యములను నగలను వస్త్రములును తృప్తిగా ఇచ్చి నిరంతరము నీభర్తవల్ల భంగము గలుగుచున్నది గాన నీభర్తను చంపుమని చెప్పగా ఆమె సమ్మతించి రాత్రి భర్త నిద్రించగానే తానులేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతినొందెను. తరువాత కర్కశస్వయముగా తన భత శవము వీపుమీద వేసుకొని తీసుకొనిపోయి పాడునూతిలో పడవేసెను. ఇట్లు భర్తను చంపి తరుణులును పరస్త్రీ సంగమాభిలాషులును, కామశాస్త్ర ప్రవీణులును, వర్ణ సంకరకారకులును, అయిన అనేకజాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగముచేయుచుండెడిది. ఇంతేగాదు. భర్తయందనురాగముతో గూడియున్న భార్యలను దుర్బోధలచేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్నీ వ్రతపరాయణులను భంగపరచి వారితో సంభోగించుచు నిత్యము పరనిందచేయుచు పరద్వేషము కలదై దేవతాద్వేషి అయియుండెను. నిరంతరము దయాశూన్యయై ఆడంబరము చేతగాని, నవ్వుచేతగాని, కపటముచేతగాని, విష్ణు పాదారవిందమును ధ్యానించలేదు. హరికథను విననూలేదు. ఇటుండగానే ఆమెకు యౌవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణ వ్యాధి కలిగినది. ఆ కురుపునకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యెను. తరువాత జారులందరు రూపవంతులు మదయుక్తులైవచ్చి చూచి విగతాశులై వేశ్య ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యముచేత చాలా బాధనొంది ఆవ్రణవ్యాధితోడనే మృతినొందెను. తరువాత భయంకరులయిన యమదూతలు వచ్చి ఆకర్కశను పాశములచేత కట్టి యమునికడకు తీసుకొని పోయి యమునికి అప్పగించిరి. యముడు దానిని చూచి కోపముచేత కళ్ళెర్రజేసి దీనిని భయంకరమగు ముళ్ళతో గూడినదియు, ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్షను విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆకర్కశను చేసిన పాపములను జెప్పుచు ఆవేడి స్తంభమును సంభోగించుమనిరి. ఆమె పాదములు రెండు పట్టుకొని గిరగిర త్రిప్పి రాతిమీద కొట్టిరి. రక్తమును కాచి త్రాగించిరి. సీసమును కాచి రెండుచెవులలోను పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురిచేసిరి. ఆకర్కశ ఇట్లు తన పితృ పతామహులతోను, తన బాంధవులతో తనకు పూర్వము పదితరములు తరువాత పదితరముల వారితో ఘోరములందు నరకములందు మహాబాధలుపొంది తరువాత భూమియందు జన్మించెను. భూమియందు పదిహేనుమార్లు కుక్కగ జన్మించినది. అందులో పదిహేనవ జన్మ కళింగదేశమందు బ్రాహ్మణుని ఇంటివద్ద కుక్కగా పుట్టి యింటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీకమాసమందు సోమవారము దినంబున పగలంతయి ఉపవాసముచేసి గృహమునందు శివలింగాభిషేక పూజాదులను జేసి నక్షత్రమండలమును జూచి గృహమునకు బోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకువచ్చి భూమిమీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి యింటిలోనికి వెళ్ళెను. ఆకుక్క ఆనాడు పగలంతయి ఆహారము కొద్దియైనను దొరకనందున కృశించినదై కార్తీకసోమవారము రాత్రి విప్రుడువేసిన బలిని భక్షించెను. ఆబలిభోజనముచేత కుక్కకు పూర్వజాతిస్మృతిగలిగి బ్రాహ్మణోత్తమా! రక్షింపుము. రక్షింపుమని పలికెను. ఆమాటవిని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో గూడినవాడై ఓ శునకమా! మాఇంటిలో ఏమేమిచేసితివి. రక్షింపుమనుచున్నావు అని యడిగెను. కుక్క ఇట్లనెను. బ్రాహ్మణోత్తమా! వినుము. నేను పూర్వజన్మమందు బ్రాహ్మణస్త్రీని. పాపములను చేయుదానను. వర్ణసంకరము చేసినదానను. అన్యపురుషులను మరగి నిజభర్తను చంపితిని. ఈవిధిపాపములు అనేకములు చేసి చచ్చియమలోకమునకు పోయి అచ్చట అనేక బాధలనొంది తిరిగి భూమికి వచ్చి 15మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతిస్మరణ కలిగినది. ఎట్లు కలిగినదో చెప్పుము. విని తరించెదను. ఆబ్రాహ్మణోత్తముడీమాట విని జ్ఞానదృష్టితో చూచి తెలిసికొని యిట్లనియె. ఓ శునకమా! ఈకార్తీక సోమవారమునాడు ప్రదోషసమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితివి గనుక నీకు జాతిస్మృతి గలిగినది. ఆమాటవిని కుక్క బ్రాహ్మణోత్తమా! ఈకుక్కజాతి నుండి నాకెట్లు మోక్షముగలుగునో చెప్పుమని విప్రుని అడిగెను. ఆకుక్క యిట్లు ప్రార్థించగా పరూపకార బుద్ధితో కార్తీకసోమవారములందు తానుజేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసెను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఈయగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరముగలదై ప్రకాశించెడి వస్త్రములను మాల్యములను, ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతోగూడ కైలాసానికిబోయి అచ్చట పార్వతీదేవివలె శివునితోగూడ ఆనందించుచుండెను. కాబట్టి కార్తీకమాసమందు సోమవారవ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును జేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనకమహారాజా! పుణ్యప్రదమైన కార్తీకవ్రతమును నీవు చేయుము.
ఇతి స్కాందపురాణే కార్తీకమహాత్మ్యే ద్వితీయోsధ్యాయస్సమాప్తః
*ఆకాశదీప మహాత్మ్యం*

         *కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా శమంతకంగా భగవంతుని నామాలు చెపుతూ, భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తిక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురో, వత్తులో ఇస్తూ ఉంటారు. ఆ దీపాన్ని పైకెత్తుతారు ఎందుకని? ఆ దీపం ధ్వజస్తభంం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి ఏదైనా లాగారు అంటే, పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు.*

          *ఇంకా కార్తికమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. మనకి మనం ఉత్సవం. ఉత్‌ అంటే తలపైకెత్తడం, తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. ఏమిటి తల పైకెత్తి చూడ్డం? నాకు ఉన్న గౌరవం ఏమిటి? ఈ శరీరంలో ఉంటూ నేను చేయగలిగిన అధికారం ఏమిటి? సమస్త భూతాలకు నేను మహోపకారం చేయగలను కార్తికపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చేయలేవు. నేనే చేయగలను. ఏమిటి చేయగలను? దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేషఫలితం. అందుకే గుత్తు దీపాలని పెడతారు. ఇంతంత వత్తులు వేసి కట్టకట్టి దీపం వెలిగిస్తారు ఆ రోజున. యథార్థానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున చెత్త కూడా వెలిగించాలి. వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించేసేయమన్నారు.*

         కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తిక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, *దామోదరమావాహయామి అనిగాని,* *త్రయంబకమావాహయామ అనిగాని* అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఒక శ్లోకం చెప్పాలి:

*కీటాఃపతంగాః మశకా శ్చ వృక్షాః*
*జలేస్థలే... ఫలే ఏ నివసంతి*
*జీవా దృష్ట్యా ప్రదీపం నచ జన్మ భాగినః*
*భవతింత్వ స్వపచాహి విప్రాః*

              ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. ఇప్పుడు నువ్వు నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు. ఒరేయ్‌ వీడికి నేను మనుష్య శరీరాన్నిస్తే వీడు ఇన్ని భూతాలలో ఉన్న విభూతులను వాడుకున్నాడు. ఇన్నిటిని వాడుకున్నందుకు ఇవాళ వీడు ప్రత్యుపకారం చేశాడు. ఈ ఉపకార బుద్ధి, కృతజ్ఞత ఉన్నవాడు కాబట్టి నా మాట నమ్మి ఉపకారం చేశాడు. కాబట్టి వీడికి నేను మళ్లీ మనుష్యు శరీరం ఇవ్వవచ్చు. ఈ మాట చెప్పినపుడు *కీటాఃపతంగాః మశకాశ్చ వృక్షాః’* ~  కీటకములుంటాయి. చిన్నచిన్న పురుగులు. అవి ఎందుకు పుడతాయంటే దీపంలో పడి చచ్చిపోవటానికి పుడతాయి. వాటివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే నాకేం ఉండదు. బల్లులకుంటుంది. పురుగులను పట్టి తింటాయి. ఇతర భూతములకు ఆహారమై పోతాయి. అధవా వాటి ఆయుర్ధాయం దేనివల్ల నశించిపోతుంది. ఆ దీపం యొక్క జ్యోతి మీద కొంచెంగా పడిపోతాయి. కింద పడిపోయి వాటి రెక్కలు ఊడిపోతాయి.
అటువంటి దీపపు పురుగులు దీపం మీద పడి కాలిపోవడం చచ్చిపోవడమే తప్ప అభ్యున్నతి పొందినది లేదు. ఆ దీపం వల్లనే అని తెలిస్తే కదూ! పైగా దీపంలో ఎక్కువగా పడిపోతే దీపం నిధనమైన పాపం వస్తుంది వాటికి తప్ప, దీపం వల్ల ప్రయోజనం పొందలేదు. అని ఇవాళ ఈశ్వరా నేను ఒక సంకల్పం చెప్తున్నాను, ఈ దీపం దీపం కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు, కాబట్టి దీనివల్ల మొదటి ఫలితమెవరికి వెళ్లాలంటే *కీటాఃపతంగాః మశకాశ్చ,*~  కీటకములు: పురుగులు, పతంగాలు, మశకాశ్చ: దోమలు, వృక్షాః అవి యెంతో ఉపకారం చేస్తాయి. కాయలిస్తాయి, పళ్లు ఇస్తాయి. ఆకులిస్తాయి, కొమ్మలిస్తాయి, రెమ్మలిస్తాయి, కలపనిస్తాయి, ఇళ్లు కట్టుకుంటాం. ఇన్ని చేస్తాం. కానీ ఎండలో అది నిలబడి మనకు నీడనిస్తుంది తప్ప దాని జన్మాంతరంలో అది మాత్రం ఎక్కడికీ వెళ్లలేదు. అలాగే ఉండాలి. ఒక ఆవు వచ్చి దాని కొమ్మలు కొరుక్కు తినేస్తున్నా, ఒక ధూర్తుడు వచ్చి కొమ్మ విరిచేస్తున్నా, ఏవో ప్రాణులొచ్చి దాని మీద కెక్కి అలజడి చేసేసేసి,  కొమ్మలన్నీ వొంచేస్తున్నా, గొడ్డలి పెట్టి తనను నరికేస్తున్నా, ఒక్క అడుగు ఇలా తీసి, అలా వేయలేని దైన్యం చెట్టుది. అదలాగే నిలబడుతుంది. ఆ చెట్టు ఎలా అభ్యున్నతిని పొందుతుంది. కదలలేనపుడు, కర్మ లేనపుడు, దానికి కర్మాధికారం ఏది? అది సంపాదించుకోలేదు. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టుమీద పడుతోంది. కాబట్టి దామోదరుడి చేయి దానిమీద పడినట్టే! త్రయంబకుని చేయి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి.

            నీటిలో ఉండే చేపలుంటాయి, కప్పలుంటాయి, తాబేళ్లుంటాయి. ఈ దీపపు వెలుతురు నీటిమీద పడినపుడు, నీటి లోపల ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో సరిపోతుందా? ఇది కాదు. జలేస్థలే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం నచజన్మ భాగినః వాటికేం తెలియదు. అవేం పుణ్యం చేయలేదు,. కానీ ఈ వెలుతురు వాటిమీద పడిన కారణం చేత ఇక వాటికి జన్మ లేకుండుగాక! అక్కడితో వాటికున్నటువంటి పాప పుణ్యాలన్నీ కూడా నశించిపోవుగాక! అని భవతింత్వ శపచాపవిప్రాః అసలు వేదం మీద నమ్మకం లేకుండా కేవలం ప్రాపంచిక కర్మాచరణము మాత్రమే చేస్తూ ఈ లోకంలో తిరుగుతూ కేవలం ఉదర పోషణార్థమే బతుకుతున్న భయంకరమైన స్థితిలో ఉండిపోయిన వాడిమీద ఈ దీపం యొక్క కాంతి ప్రసరించిన కారణం చేత వాడుకూడా వచ్చే జన్మలో వేదము యొక్క ప్రమాణం తెలుసుకున్న వాడై స్వరంతో వేదాన్ని చదువుకొని వేదాన్ని ప్రచారం చేసి వేదానికి చేతులడ్డుపెట్టి లోకోద్ధరణ చేయగలిగిన నిస్వార్థతపూరితమైన లోకోపకారియైున బ్రాహ్మణుడిగా జన్మించి అభ్యున్నతిని పొందుగాక! కాబట్టి భవంతిత్వం స్వపచాహివిప్రా: ఈ దీపపు కాంతి అంత గొప్పది. కాబట్టి ఈశ్వరా, నీ యందు త్రయంబకుణ్ణి, దామోదరుణ్ణి అవాహన చేసి ఈ దీపపు వెలుతురు నీయందు ప్రసరించేటట్లు చేస్తున్నాను.

             అందుకే కార్తిక పౌర్ణమి నాడు అన్ని చోట్లా దీపాలెత్తుతారు. ఇక దీపమెత్తని ప్రదేశముండదు. కార్తిక పౌర్ణమి నాడు సాయంకాలం ఉపన్యాసం చెప్తే ఎవరూ ఉండరు. చెప్పకూడదు. ఎందుకంటే కార్తికపౌర్ణమి అంటే ప్రతీ వాళ్లూ ఇళ్లలో చేసుకోవాలి.
(Forwarded as received )
*_గాయత్రి జపించండి..._

*ఒకసారి పరమాచార్య స్వామివారి దర్శనానికి మద్రాసులోని వన్నియ తెయ్ నంపేట్ నుండి నలభై మంది బ్రాహ్మణులు వచ్చారు. స్వామివారికి నమస్కరించి వారందరినీ బాధిస్తున్న ఒక సమస్య గురించి స్వామివారికి విన్నవించారు. వారు ఉంటున్న ప్రాంతంలో బ్రాహ్మణులు ధైర్యంగా తిరగడానికి సిగ్గుపడుతున్నారని, అక్కడ ఉన్న కొంతమంది నాస్తికవాదులు తమని చూసి గేలి చేస్తున్నారని, కనపడిన ప్రతిసారి వారి శిఖలు, యజ్ఞోపవితాలు, వైష్ణవ ప్రతీకలైన ఊర్ధ్వపుడ్రాలు చూసి చాలా హేళనగా మాట్లాడుతున్నారని స్వామివారితో వాపోయారు.*

*అంతా విన్నవెంటనే స్వామివారు వారిని ఇలా అడిగారు, “మీరందరూ రోజూ గాయత్రి జపం చేస్తున్నారు కదా?” అని. అందరూ మౌనంగా ఉన్నారు. వారి మౌనంలోని సమాధానాన్ని స్వామివారు గ్రహించి, “ఇక రోజూ గాయత్రి జపం చెయ్యడం కొనసాగించండి. అంతా సర్దుకుంటుంది” అని ఆదేశించారు.*

*పరమాచార్య స్వామివారి ఆదేశం అనుసరించి వారు రోజూ గాయత్రి జపం చెయ్యడం మొదలుపెట్టారు. రెండు నెలల్లోనే పరిస్థితి మారిపోయింది. వారు చాలా సంతోషించారు. మహాస్వామి వారిని దర్శించి విషయం అంటా చెప్పారు.*

*మహాస్వామి వారందరితో ఇలా అన్నారు, “మీకు కలిగిన కష్టాలకు కారణం అంతా మీరు గాయత్రి జపాన్ని వదిలేయడమే. గాయత్రి మంత్రం యొక్క శక్తిని అంచనా వెయ్యడం, లెక్కగట్టడం సాధ్యమయ్యే పని కాదు”*

*“మీ సమస్యలన్నిటికీ మూలం మీరు గాయత్రిని వదిలెయ్యడమే”*

*ఇది కేవలం అక్కడున్న బ్రాహ్మణులకు మాత్రమే చెప్పిన విషయం కాదు. శాస్త్రం చెప్పినట్టు మన ధర్మాన్ని మనం తప్పక పాటించినట్లయితే ఎవరూ మనల్ని బాధపెట్టారు. అందరూ అందరిని గౌరవిస్తారు.*

*అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం*।।🙏🙏

 *_కంచిపరమాచార్యవైభవం_*forwaded by DVR KOTESWARA RAO 
⚘《《《 బిల్వపత్రాల

విశిష్టత 》》》⚘

                   ☆ ☆ ☆ ☆ ☆

శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం. మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది. సాలగ్రామ దానఫలం,శాత అశ్వమేధయాగాలు చేసిన ఫలం, వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలం. ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని "బిల్వాష్టకం''లో చెప్పబడింది. "ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి..

బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.

ఈశ్వర పూజకు మారేడు దళాలు ఎందుకు?

“ఏకబిల్వం శివార్పణం” అని మారేడు దాళలలతో శివుని పూజిస్తారు.
మూడు దళములు కలసి ఒక్క అండముననే ఉండును కావున, దీనికి బిల్వము అని పేరు వచ్చింది. ఈ మూడు రేకులకు ఆధ్యాత్మికంగా,

“పూజకుడు – పూజ్యము – పూజ”,
“స్తోత్రము – స్తుత్యము – స్తుతి”,
“జ్ఞాత – జ్ఞేయము – జ్ఞానము “

అని అర్థాలు చెప్పు చున్నారు.  ఈ విధంగా  (3×3) మూడు, మూడును వేర్వేరుగా భావించుటయే త్రిపుటిజ్ఞానము, ఇదియే అజ్ఞానము, వేరువేరుగా కనిపించినను, ఆధారకాండము ఒక్కటే అయినట్లు, “ఓ మహాదేవా!” సృష్టి, స్థితి, లయ కారకుడవైన నీవే “మారేడుదళము” నందు మూడు పత్రములుగా వేరువేరుగా వున్నట్లు తోచుచున్నావు. “పూజకుడవు నీవే, పూజింపబడునది నీవే, పూజాక్రియవు నీవే” – అనే భావంతో అభేదబుద్ధితో పూజించుటయే సరియైన పద్ధతి, మరియు పుణ్యఫల ప్రదము.  ఈ విధమైన భావముతో పూజించకుండుటయే అజ్ఞానము మరియు పాపహేతువు. ఈ జ్ఞానరహస్యమును తెలుసుకుని – బిల్వపత్రరూపముతో “త్రిపుటి జ్ఞానమును” నీ పాదములచెంత నేను సమర్పించుచున్నాను.  ‘శివోహం – శివోహం ‘ అను మహావాక్య జ్ఞానమును, స్థిరపర్చునదియే బిల్వార్చనయగును.

పవిత్రమగు ఈశ్వర పూజకు ఈ “బిల్వపత్రము” సర్వశ్రేష్ఠమైనది మరియు అతి పవిత్రమైనది. శివార్చన లకు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళముననే ఉపయోగించవలెను. ఒకసారి కోసిన బిల్వపత్రములు, సుమారు 15 రోజులవరకు పూజార్హత కల్గియుండును. వాడిపోయినను దోషములేదు, కాని మూడురేకులు మాత్రము తప్పనిసరిగా ఉండవలెను.

ఏకబిల్వ పత్రంలోని మూడు రేకులలో ఎడమవైపునది బ్రహ్మ అనియు, కుడీవైపునది విష్ణువనియు, మధ్యనున్నది సదాశివుడనియు, పురాణములలో తెలియుచున్నది.

మరియు బిల్వదళములోని ముందుభాగమునందు అమృతమును, వెనుక భాగమున యక్షులును వుండుటచేత, బిల్వపత్రము యొక్క ముందుభాగమును శివునివైపు వుంచి పూజించాలి.

బిల్వవనము కాశీక్షేత్రముతో సరిసమానమైనది అని శాస్త్రములలో తెలుపుచున్నారు. మారేడుచెట్టు వున్నచోట ఆ చెట్టు క్రింద శివుడు ఉంటాడు.

ఇంటి ఆవరణలో ఈశాన్యభాగమున మారేడు చెట్టు వున్నచో, ఆపదలు తొలగి సర్వైశ్వర్యములు కల్గును. తూర్పున వున్నచో సుఖప్రాప్తి కల్గును, పడమరవైపున వున్నచో సుపుత్రసంతానము కల్గును. దక్షిణవైపున వున్నచో యమబాధలు వుండవు.

శ్లో!!  బిల్వానాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం!
అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం!

బిల్వపత్రము యొక్క దర్శనంవలన పుణ్యము లభించును, వాటిని స్పృశించుట వలన సర్వపాపములు నశించును. ఒక బిల్వపత్రమును శివునికి భక్తిశ్రధ్ధలతో అర్పించుటవలన, ఘోరాతిఘోరమైన పాపములు సైతము నిర్మూలమగును. ఇట్టి త్రిగుణములు గల  బిల్వదళమును నీకు అర్పించుచున్నాను. నన్ను అనుగ్రహింపుము.

బిల్వాష్టకం:

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం

అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం

సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం

దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం

లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం

దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం

కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం

మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం

ఫలశృతి :
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ.  Forwarded by kvg Sarma
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్  ||
కార్తీకమాస స్నాన సంకల్పము
ప్రార్థనం:
"నిర్విఘ్నం కురుమే దేవ దామోదర నమోస్తుతే" (అనుకుంటూ ఆచమనం చేసి)

సంకల్పం:
దేశకాలౌ సంకీర్త్య గంగావాలుకాభి సప్తర్షి మండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్త్యర్థం, ఇహ జన్మని జన్మాంతరేచ బాల్య కౌమార యౌవన వార్థకేషు జాగ్రత్ స్వప్న సుషుప్త్యవస్థాషు జ్ఞానతోజ్ఞానతశ్చ, కామతోకామతః, స్వతః ప్రేరణాయా సంభావితానాం సర్వేషాం పాపానా మపనోదనార్థం, ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం, క్షేమస్థయిర్య విజయాయురారోగ్యైశ్వర్యాదినాం ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం శ్రీ శివకేశవానుగ్రహ సిద్ధ్యర్థం వర్షేవర్షే ప్రయుక్త కార్తీకమాసే.....వాసరయుక్తాయాం........తిధౌ.........శ్రీ........గోత్రాభిజాతం........నామధేయోహం పవిత్ర కార్తీక ప్రాతఃస్నానం కరిష్యే.

మంత్రం:
తులారాశింగతే సూర్యే, గంగా త్రైలోక్యపావనీ |
సర్వత్ర ద్రవరూపేణ సా సంపూర్ణా భవేత్తదా ||

అనే మంత్రంతో ప్రవాహానికి ఎదురుగానూ, వాలుగానూ, తీరానికి పరాంగ్ముఖంగానూ స్నానం ఆచరించి, కుడిచేతి బొటనవ్రేలితో నీటిని ఆచమనంచేసి, 3 దోసిళ్ల నీళ్లు తీరానికి జల్లి, తీరంచేరి, కట్టుబట్టలకొనలను నీరు కారేలా పిండాలి. దీనినే యక్షతర్పణం అంటారు. అనంతరం మడి వస్త్రాలను, నామాలనూ ధరించి ఎవరెవరి కులాచారాల రిత్యా సంధ్యావందన గాయత్ర్యాదులను నెరవేర్చుకుని నదీతీరంలో గాని, ఆలయానికి వెళ్లిగాని శివవిష్ణువులను అర్చించి, ఆవునేతితో దీపారాధనం చేసి, అనంతరం స్త్రీలు తులసి మొక్కనూ, దీపాన్ని - పురుషులు కాయలున్న ఉసిరికొమ్మనూ, దీపాన్ని బ్రాహ్మణులకు దక్షిణయుతంగా దానం చేయాలి.


దానము చేయువారు చెప్పవలసిన మంత్రము

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.


దానము తీసుకొనువారు చెప్పవలసిన మంత్రం

ఓం ఇదం, ఏతద్ ఓమితిచిత్తనిరోధస్స్యాత్ ఏతదితి కర్మణి ఇదమితి కృత్యమిత్యర్ధాత్ అముకం ......గోత్ర, ....నామధేయః దాతృ సర్వపాప అనౌచిత్య ప్రవర్తనాదిక సమస్త దుష్ఫలవినాశార్ధం ఇదం అముకం దానం ఇదమితి దృష్ట్యాన అముకమితి వస్తు నిర్దేశాదిత్యాదయః పరిహృహ్ణామి స్వీగృహ్ణామి దానమును తీసికొనవలయును.Forwarded by kvg Sarma 

*పరోక్షజ్ఞానం.....*

లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన.. ఈ మూడింటి వల్లనే వేదాంత శాస్త్రాల్లో చెప్పిన విధంగా అపరోక్ష జ్ఞానం కలుగదు.

జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం. ఇది పరోక్షజ్ఞానం. ఈ పరోక్షజ్ఞానమే అపరోక్ష జ్ఞానం కావాలి. అనుభవజ్ఞానం కావాలి. అదే మోక్షం. అయితే దీనికి అడ్డుపడేవే వాసనలు. అవే..

1) లోకవాసన
2) దేహవాసన
3) శాస్త్రవాసన.

మోక్షాన్ని పొందాలంటే అపరోక్ష జ్ఞానాన్ని పొందాలంటే ముందు పరోక్ష జ్ఞానాన్ని పొందాలి. అలా పొందాలంటే శాస్త్రాలను అధ్యయనం  చేయాలి. అవి చక్కగా అర్థం కావాలంటే శాస్త్రజ్ఞానం, అనుభవజ్ఞానం కలిగిన ఒక సద్గురువును ఆశ్రయించాలి.

అప్పటిదాకా సాధారణంగా అందరికీ 'నేను ఈ దేహాన్నే' అనే భ్రమ ఉంటుంది. అది పోవాలి. నేను ఈ దేహాన్ని కాదు. దేహమనోబుద్ధులతో కూడిన ఈ క్షేత్రాన్ని కాదు. ఈ క్షేత్రాన్ని తెలుసుకొనే ఈ క్షేత్రానికి చైతన్యానిచ్చి, దాని పని అది చేసుకోవటానికి వీలు కల్పించే నిరాకార, నిర్గుణ, నిర్వికార, చైతన్యాన్ని, చావు పుట్టుకలు లేని, శాశ్వత సర్వవ్యాపక చైతన్యాన్ని అని దృఢంగా భావన కలగాలి. సంశయ రహితంగా ఈ దృఢభావన కలగటమే ఆత్మజ్ఞానం, ఇదే.. పరోక్షజ్ఞానం.

ఇట్టి భావన కలగటానికి శాస్త్రజ్ఞానమూ కావాలి. దేహేంద్రియాల పోషణా జరగాలి. అవసరమైనంత వరకు ఈ లోకాన్ని అనుసరిస్తూ కూడా రావాలి. అయితే ఒకసారి ఈ జ్ఞానం కలిగిన తర్వాత అది అనుభవానికి రావాలంటే అనుభూతి కలగాలంటే, నేను బ్రహ్మమును అనే భావన స్థిరపడి బ్రహ్మముగానే ఉండిపోవాలంటే.. ఈ లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఉండరాదు. ఇవే నిజంగా మనకు అడ్డమౌతాయి.

లోకంలోని జనులంతా పుట్టిన దగ్గర నుండి చచ్చేదాకా ఉండే ఈ జీవితాన్ని గురించి ఆలోచిస్తారే గాని, ఇంతవరకు ఎన్ని జన్మలెత్తాము.. ఇంకా ఎన్ని జన్మలెత్తాలి.. జన్మలెందుకు వస్తున్నాయి? జన్మలొస్తే నష్టం ఏమిటి.. రాకుండా చెయ్యాలంటే ఈ జన్మలో ఏంచేయాలి? అని ఆలోచించరు. నిజంగా జంతువులు ఇలాంటి ఆలోచన చేయలేవు. ఎందుకంటే వాటికసలు బుద్ధే లేదు గనుక. మానవులకు బుద్ధి ఉంది గదా! మరి వారెందుకు చేయరు.. అంటే వారు బుద్ధిని దీనికోసం ఉపయోగించరు.

అలా ఉపయోగించకుండా దానిని దేహపోషణ, భార్యాబిడ్డల పోషణ, ధనసంపాదన, కీర్తిప్రతిష్టలు సంపాదన, భోగాల సంపాదన, వీటిలో పడిపోయి పూర్తిగా వీటికే జీవితాన్ని అంకితం చేస్తారు బుద్ధిని దీనికే ఉపయోగిస్తారు. అంటే భగవంతుడు ఒకందుకు ఇచ్చిన బుద్ధిని దాని కొరకు ఉపయోగించకుండా మరొకందుకు ఉపయోగిస్తున్నారు. అంటే వ్యర్థం చేస్తున్నారు. దుర్వినియోగం చేస్తున్నారు. మరి అట్టివారిని అనుసరించవచ్చునా.. అయ్యో అనుసరించ లేకపోతున్నామే అని బాధపడవచ్చునా... కనుక లోకం ఏమనుకుంటుందో, ఎవరు ఏమనుకుంటారో ...

అయ్యో! ఇది లోకవిరుద్ధం కదా! అందరూ అలా సంపాదించుకుంటుంటే మనమేమిటి అన్ని వ్యవహారాలు వదిలేస్తున్నాం.. అందరూ ఇంకొక ఇల్లు, మరొక ఇల్లు, మా పెద్దోడికొక ఇల్లు, మా బుజ్జిగాడికొక ఇల్లు, మా వృద్ధాప్యంలో విస్రమించి సయనించటానికి తీసుకోవటానికొక ఇల్లు అని ఇలా కట్టించుకొని మురిసిపోతుంటే, ఉన్న ఇల్లునే వదిలేస్తున్నామేంటి.. అనే పిచ్చి ఆలోచనలు చెయ్యకూడదు. భాద్యతలు బరువులు, బంధాలు పెంచుకుంటూ పోయి బంధంలో ఇరుక్కుపోగూడదు...
Forwarded by Surendra pss 

Monday, October 28, 2019

భగినీ  హస్త.
      భోజనం.
--------------------------------------
కార్తీక మాసంలో  శు"" విదియ. నాడు వచ్చే రోజుకు భగినీ హస్త భోజనము  లేక. అన్నా చెల్లెలు  పండుగ అంటారు.  ఇది ఈ సంవత్సరం 29-10-2019 మంగళవారం వచ్చినది.
               కారణం
              .-------------
సూర్య భగవానికి ఒక కుమారుడు  ఒక కుమార్తె.
వారి పేర్లు  "" యమధర్మరాజు & యమున.  యమునకు అన్నగారు అనగా విపరీతమైన. అభిమానం.
అమె అన్నగారు  " యమధర్మరాజు""  గారిని   ఎన్నో సార్లు తన ఇంటికి  భోజనము నకు రమ్మని పిలిచేది. కాని ఆయనకు తీరిక ఉండేది కాదు. యమలోకంలో  పాపులను  శిక్షించే పనిలో రాత్రి వరకు తీరిక ఉండదు. పాపం  చెల్లెలు  కోరిక. తీర్చలేదని భాధపడేవాడు. కాలము  గడచిపోతూఉంది. అనుకోకుండా  ఒకనాడు  ఆయనకు చెల్లెలు  ఇంటికి  వెళదామని అనకున్నాడు. ఆ రోజు  కార్తీక శుద్ద విదియ
"' యమధర్మరాజు "" చెల్లెలి ఇంటి  వచ్చాడు.  రాక రాక వచ్చిన అన్నయ్య ను చూచి
చెల్లెలు  "" యమున"" సంతోషంగా  అన్నయ్య. కు ఇష్టమైన. పదార్థాలు  వండి  దగ్గర కూర్చుని  కొసరి కొసరి వడ్డించింది.  "" యమధర్మరాజు "" త్రుప్తిగా భోజనము  చేసి  చెల్లెలు తో ప్రేమగా  చెల్లీ నాకు ఇషమైన పదార్థములు తో భోజనము పెట్టావు. నీకు ఏదైనా  వరం ఇస్తానని  చెప్పగా " యమున" అన్నయ్యా  లోకకల్యాణము కోసం  నాకు ఒక వరము ఇవ్వు.
ఈ రోజు  న ఎవరైనా  అక్క& చెల్లెలు  ఇంటికి  ఏ అన్నయ్య & తమ్ముడు  భోజనంచేస్తాడో  నీవు ఎట్టి పరిస్థితి లో వారి జోలికి వెళ్ళవద్దు. ఇది నా కోరిక అనగా "" యమధర్మరాజు ""
లోకకల్యాణం కోసం అడిగావు కనుక " తధాస్తు"
అని చెల్లెలు ను దీవించి  వెళ్ళాడు. అనగా రేపటి రోజున. అక్క & చెల్లెలు  చేతివంట ఎవరైతే భోజనం చేస్తారో వారికి అపముృత్యు దోషములను  ఉండవు. 
కనుక అందరు సోదరి చేతి భోజనం చేసి  కనుమరుగై న బంధుత్వాన్ని కలుపుకొని సుఖముగా ఉండాలని కోరుకుంటూ


     .🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻

Sunday, October 27, 2019

*కార్తీక పురాణం*

1వ అధ్యాయం

శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండమునందలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచూ సూతమహాముని కాలం గడుపుచుండెను. ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, ‘ఆర్యా ! తమ వలన అనేక పురాణేతిహాసములను, వేదవేదాంగ రహస్యములను సంగ్రహముగా గ్రహించినారము. కార్తీక మాస మహత్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరుచుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది అని కోరిరి.

అంత నా సూతమహర్షి, ‘ఓ ముని పుంగవులారా ! ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీ దేవికి, సాంబశివుడు పార్వతీ దేవికీ తెలియజేసిన విధముగా నా గాధను వినిపించెను.
అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్ధములు కలుగటయే గాక, వారు యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపుడని యిట్లు చెప్పెను.

పూర్వము ఒకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించుచుండగా పార్వతీ దేవి, ‘ప్రాణేశ్వరా సకలైశ్వర్యములు కలుగజేయునట్టిది, సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది, శాస్త్ర సమ్మతమైనది, సూర్యచంద్రులున్నంత వరకు ఆచరింపబడేది యగు వ్రతమును వివరింపుడని కోరెను.

అంతట మహేశ్వరుడు మందహాస మొనరించి. ‘దేవీ ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దానినిప్పుడు వశిష్ట మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడుమా మిథిలా నగరము వైపూ, అని మిథిలా నగరపు దిశగా చూపించెను .

అట, మిథిలా నగరములో వశిష్టుని రాకకు జనకుడు సంతసించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్ళు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని ‘మహాయోగీ! మునివర్యా ! తమ రాక వల్ల నేను, నా శరీరము, నా దేశము, నా ప్రజలు పవిత్రులమైతిమి. తమ పాద ధూళీ చే నా గేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడూ, అని వేడుకొనెను.

అందులకు వశిష్టుడు ‘జనక మహారాజా! నేనొక మహాయజ్ఞుము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్ధ బలమును, అంగ బలము నిన్నడిగి క్రతువు ప్రారంభించవలెనని నిశ్చయించి యిటువచ్చితినీ, అని పలుకగా, జనకుడు, ‘ముని చంద్రమా!’ అటులనే యిత్తును. స్వీకరింపుడు. కానీ. చిరకాలము నుండి నాకొక సందేహము కలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయమును తీర్చుకోదలిచితిని. నాయదౄష్టము కొలది ఈ అవకాశము దొరికినది. గురు రత్నా! సంవత్సరములో కల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది? ఆ కార్తీక మాస గొప్పతనమేమి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కార్తీక మహత్మ్యము గురించి వివరింపవలసినదీ, అని ప్రార్థించెను.

వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి ‘రాజా! తప్పక నీ సంశయమును తీర్చగలను. నే చెప్పబోయే వ్రత కథ సకల మానవులు ఆచరించదగినది. సకల పాపహరమైనది అయివున్నది. ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము. ఈ మాసమునందాచరించు వ్రతము యొక్క ఫలమింతని చెప్పనలవి కాదు. వినుటకు గూడా ఆనందదాయకమైనది. అంతియే గాక వినినంత మాత్రమునే ఎట్టి నరక బాధలు లేక యిహమందును, పరమందును, సౌఖ్యమును పొందగలరు, నీబోటి సజ్జనులు యీ కథను అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపుమని యిట్లు చెప్పసాగెను.

వశిష్టుడు కార్తీక వ్రత విధానము తెలుపుట

ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను, ఏ వయసు వాడైనను, ఉచ్ఛ, నీఛ అనే భేదము లేక కార్తీక మాసములో, సూర్య భగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యములను తీర్చుకొని, స్నానమాచరించి, దానధర్మములను, దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కార్తీక మాస ప్రారంభము నుండియు యిట్లు చేయుచూ, విష్ణుసహస్ర నామార్చన, శివలింగార్చన, ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు ఆధిదేవతయగు దామోదరునికి నమస్కరించి, ‘ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుమ’, అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలెను.

కార్తీక స్నాన విధానము

‘ఓ రాజా!’ ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకొని, నదికి బోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు, నమస్కరించి, సంకల్పము చెప్పుకొని, మరలా నీట మునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములొనర్చి గట్టుపై మూడు దోసిళ్ళ నీళ్ళు పోయవలెను.

ఈ కార్తీక మాసములో పుణ్య నదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున, మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడి బట్టలు వీడి, మడి బట్టలు కట్టుకొని, శ్రీమహావిష్ణువుకు ప్రీతి కరమైన పుష్పములను తానే కోసితెచ్చి నిత్య ధూప, దీప, నైవేద్యములతో భగవంతునికి పూజ చేసి, గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకొని, పిమ్మట అతిధి అభ్యాగతులను పూజించి, వారికి ప్రసాదమిడి, తన ఇంటి వద్ద కానీ, దేవాలయములో కానీ, లేక రావిచెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనము ఆచరించి. శివాలయమందు కానీ, విష్ణ్వాలయమందు కానీ, లేక తులసి తోట వద్ద కానీ, దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యమును తయారు చేయించి స్వామికి సమర్పించి, అందరికీ పంచిపెట్టి, తర్వాత తాను భుజింపవలెను. మరునాడు మృష్టాన్నముతో భూత తృప్తి చేయవలయును.

ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ, పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేని వారు, వ్రతము చేసిన వారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ప్రథమాధ్యాయం మొదటి రోజు పారాయణము సమాప్తము.Forwarded by PLN CHARLU 
కార్తీక మాసం.                          స్నాన, దాన, జపాలు, పూజలు, ఉపవాస వ్రతాలు, దీపాలు వెలిగించడం, వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం "కార్తీకమాసం'. చాంద్రమానం ప్రకారం కార్తీకమాసం ఎనిమిదవది. శరదృతువులో రెండవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృత్తికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి "కార్తీకమాసం" అని పేరు వచ్చింది.

"న కార్తీక నమో మాసః
న దేవం కేశవాత్పరం!
నచవేద సమం శాస్త్రం
న తీర్థం గంగాయాస్థమమ్"

అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే "కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు." అని అర్ధం.కార్తీకమాసం శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. కార్తీకమాసంలో ప్రతీరోజూ తెల్లవారుఝూముననే స్నానమాచరించవలెను.అప్పుడే అది కార్తీక స్నానమవుతుంది. నిత్యం దీపాన్ని వెలిగించినా, ఆరాధించినా, దీపమును కార్తీకమాసంలో వెలిగించడం, నదిలో దీపాలను వదలడం , ఆకాశ దీపాలను వెలిగించడం, దీపదానం చేయడం వంటి ఆచారాలను పాటించవలేను. కార్తీకమాసమంతా ఇంటి ముందు ద్వారానికి ఇరువైపులా సాయంకాలం దీపాలను వెలిగించవలెను. అట్లే సాయంత్ర సమయంలో శివాలయాల్లో గానీ వైష్ణవాలయాల్లోగానీ గోపురద్వారం వద్దగానీ, దేవుని సన్నిదానంలోగానీ ఆలయప్రాంగణంలోగానీ దీపాలు వెలిగించిన వారికి సర్వపాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్ర వచనం. ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడడం కూడ పుణ్యప్రదమే. కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమినాడుగాని లేక ఇతర దినాల్లో అయినా సాయంసమయాలలో శివాలయంలో ఉసిరికాయపైన వత్తులను ఉంఛి దీపం వెలిగించడం శ్రేష్టం. ఆవునెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం. లేదంటే నువ్వులనూనెతోగానీ, కొబ్బరినూనెతోగానీ, నెయ్యితోగాని, అవిశనూనెతోగానీ, ఇప్పనూనెతోగానీ, లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపమును వెలిగించవలెను. అంతే కాకుండా కార్తీకమాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం. కార్తీకమాసంలొ ముప్పై రోజులలో దీపం పెట్టలేనివారు శుద్ధద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ దినాల్లో తప్పక దీపం పెట్టాలని శాస్త్ర వచనం. ఈ విధంగా కార్తీకమాసంలో దీపాలను వెలిగించడం , దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళూ, రప్పలు, వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం.
కార్తీకమాసంలో ఆచరించాల్సిన విధులు.
కార్తీక స్నానాన్ని ఆశ్వీయుజ బహుళ అమావాస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించవలెను. నెలంతా కార్తీక స్నానం చేయడం మంచిది. వీలుకానివారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణిమరోజుల్లోనైనా తప్పక ఆచరించవలెను.
శుద్ధ ద్వాదశినాడు తులసి పూజ చేయవలెను.
ఈ నెలంతా శ్రీమహావిష్ణువును తులసీదళములు, జాజిపూలతో పూజించవలెను.
ఈ నెలంతా శివుడిని మారేడుదళములతోనూ , జిల్లేడుపువ్వులతోనూ పూజించవలెను.
ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయడం మంచిది.
కార్తీక మాసంలో పండుగలు
శుక్లపక్ష విదియ : భాతృ ద్వితీయ
దీనికే యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం అని పేర్లు, ఈ దినం పురుషులు సొంత ఇంటిలో భోజనం చేయరాదు. ఈ దినం సోదరి ఇంటిలోగాని, లేదంటే సోదరితో సమానమైనవారి ఇంట భోజనం చేయవలెను. ఈ విధంగా చేస్తే అపమృత్యుభయం, నరకలోకభయం తొలగిపోతాయి. అంతే కాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్యస్త్రీగా ఉంటూందని శాస్త్రవచనం.
శుక్లపక్ష చవితి " నాగుల చవితి
కార్తీక శుక్లపక్ష చవితినాడు మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నాగులచవితి పర్వదినం జరుపుకుంటారు.
శుక్లపక్ష ఏకాదశి : ప్రభోదన ఏకాదశి
ఆషాడ శుక్ల పక్ష ఏకాదశి నాడు పాలకడలిలో శేషశయ్యపై శయనించి, యోగనిద్రలో గడిపిన శ్రీమహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కొంటాడు. కాబట్టి దీనికి 'ఉత్థాన ఏకాదశీ లేదా 'ప్రబోధన ఏకాదశి ' అని పేర్లు. ఈ దినం ఉపవాస వ్రతం పాటించి శ్రీమహావిష్ణువును పూజించవలెను. అంతేకాకుండా తొలి ఏకాదశినాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరిరోజు.
శుక్లపక్ష ద్వాదశి: క్షీరాబ్ది ద్వాదశి
పూర్వం కృతయుగంలో దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసింది ఈ రోజే. అందుకే దీనికి క్షీరాబ్ది ద్వాదశి ,చిలుకుద్వాదశి అని పేర్లు. శ్రీమహాలక్ష్మిని శ్రిమహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఈ రోజు ఇంటి యందున్న తులసికోట వద్ద శ్రీమహావిష్ణువును లక్ష్మీసమానురాలైన తులసిని పూజించవలెను.
శుక్లపక్ష చతుర్దశి : వైకుంఠ చతుర్ధశి
వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు ఈ దినం వైకుంఠంను వదిలి వారణాసి వెళ్ళి పరమశివుడిని పూజించినట్లు కథనం. ఈ నాడు శైవాలయాలకు వెళ్ళి దీపం వెలిగించవలెను
శుక్లపక్ష పూర్ణిమ :
ఈ దినం శివాలయాల్లో నిర్వహించే 'జ్వాలాతోరణం ' ను దర్శించడం మంచిది. సాయంత్రం సమయంలో శివాలయంలోగానీ,వైష్ణ్వాలయంలోగానీ దీపాలను వెలిగించవలెను. ఈ దినం శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం, మార్కండేయ పురాణం దానం చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది.
కృష్ణపక్ష చవితి : కరక చతుర్ధి
ఇది వినాయకుడుకి సంబంధించినది. ఈ వ్రతం మహిళలు చేయడం మంచిది.
వృశ్చిక సంక్రమణం
ప్రత్యక్ష భగవానుడైన శ్రీసూర్యభగవానుడు ఈరోజు తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృశ్చికరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు, పూజలు, జపాలు, దానాలు , దేవాలయ సందర్శనలు చేయడం వల్ల సర్వవిధాలా శుభఫలితాలను ఇస్తుంది.
కార్తీకమాసంలో విధులను పాటించడం ద్వారా ఆధ్యాత్మిక పరమైన ఫలాలను పొందడమే కాకుండా మారుతున్న సామాజిక పరిస్థితులు, ఆహారపు అలవాట్ల వల్ల కొత్తగా తలెత్తుతూ ఉన్న ఆరోగ్య సమస్యల నుంచి ఉపసమనం పొందవచ్చుForwarded by PLN Charlu 
*Spiritual Seekers 🙏*

*ఆటంక వాసనలు.....*

శ్లో || లోకానువర్తనం త్యక్త్వా త్యక్త్వా దేహాను వర్తనం |
శాస్త్రాను వర్తనం త్యక్త్వా స్వాధ్యాసాపనయం కురు ||

ప్రతి...

లోకానువర్తనం త్యక్త్వా=జనులు పోవురీతిని వదిలి; దేహాను వర్తనం త్యక్త్వా=దేహం నేననే భావాన్ని విడిచి; శాస్త్రాను వర్తనం త్యక్త్వా= శాస్త్రాలను అనుసరించటం వదిలి; స్వ అధ్యాస అపనయం కురు= నీ అధ్యాసను పోగొట్టుకో;

వ్యాఖ్య...

ఆత్మగా భావిస్తూ జీవించటంలో ముఖ్యమైన ఆటంకాలు.. 3, అనువర్తనం = గ్రుడ్డిగా సదా అనుసరించటం.

1) లోకానువర్తనం త్యక్త్వా...

జనులంతా ఎలా వెళ్తున్నారో చూచి గ్రుడ్డిగా అలాగే ఆధ్యాత్మికరంగంలో ఉన్న మనమూ వ్యవహరించటం కూడదు. సామాన్యంగా ఈ లోకంలో ప్రతివారూ తామున్న స్థితి నుంచి ఉన్నతస్థితికి ఎగబ్రాకటానికి ప్రయత్నిస్తారు. ధన సంపాదన, వస్తు సంపాదన, పదవీ సంపాదన, భోగ సంపాదన, రాజ్య సంపాదన, ఐశ్వర్య సంపాదన, ఇలా అన్నింటిని సంపాదించటమే ధ్యేయంగా పెట్టుకొని దానికి తగిన కర్మలు చేస్తారు. వాటివల్ల ఆ జన్మలో కలిగే ఫలితాలకే ప్రాధాన్యత ఇస్తారు. "ఆ తర్వాత ఏమిటి..? అని ఆలోచించరు. ఇదే లోకానువర్తనం". అలాగే భార్యాబిడ్దల పోషణ, బంధుమిత్రాదులతో సంబంధం - ఇవన్నీ బంధాలని భావించకుండానే బంధంలో పడిపోతుంటారు. ముక్తిని కోరే మనం గ్రుడ్డిగా లోకంలోని జనులను అనుసరిస్తే ఈ జన్మ వృధా అయినట్టే. జన్మరాహిత్యానికి ఏ ప్రయత్నమూ జరగనట్టే.

కనుక ఇలా గ్రుడ్డిగా అనుసరించటం కాకుండా జీవితాన్ని ఉన్నత ఆదర్శం వైపు త్రిప్పాలి. ఇప్పటిదాకా కొనసాగిస్తున్న జీవితాన్ని మార్చుకోవాలి. ఒక బాలుడు యవ్వనంలో ప్రవేశించగానే జీవిత విధానాన్ని మార్చుకుంటాడు. ఒక యువకుడు వృద్ధుడు కావటంతోనే జీవిత విధానం మారిపోతుంది. ఒక యువతి పెళ్ళి చేసుకోగానే పరిసరాలు మారిపోతాయి, జీవనవిధానం మారిపోతుంది. అలాగే మనం ఆధ్యాత్మిక మార్గంలో భగవంతుని వైపు ప్రయాణం సాగించాలంటే ఇందులో నిలదొక్కుకోవాలంటే ఇప్పటి వరకు సాధారణ జనుల మార్గంలో నడిచే నీవు నీ జీవన విధానాన్ని మార్చుకోవాలి.

తల్లిదండ్రులను, భార్యాబిడ్డలను, ఇళ్ళువాకిళ్ళను అందరి లాగా పట్టుకొని ప్రాకులాడరాదు. బరువులు, భాద్యతలు అంటూ అన్నీ నెత్తిన వేసుకొని, తనకు లేని, ఎప్పటికీ రాని సుఖాల కోసం పరుగులు తీస్తూ గ్రుడ్డిగా నీ తోటి వారిని అనుసరిస్తూ జీవించే విధానం పశుజీవనమే. అందుకే దీనిని వదలి తెలివిగా, మెలకువగా జీవించాలి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నతస్థితిలో ఉన్నవారిని ఆశ్రయించి వారు చూపిన మార్గంలో నీ జీవితాన్ని నడిపించాలి. అయ్యో నలుగురు నడిచే బాటను నడవాలి గదా..! అని దిగులు పడరాదు. లోకాన్ని చూచి భయపడరాదు. అందరూ బురదగుంటలో దిగుతున్నారు గదా..! అని మనమూ దిగరాదు.

2) దేహాను వర్తనం త్యక్త్వా...

దేహం మీద విపరీతమైన ప్రేమను పెంచుకొని ఎప్పుడూ దాని పోషణలోనే దాని అలంకరణలోనే మునిగిపోకూడదు. అది కోరే కోర్కెలను తీర్చే బానిసవు కావద్దు. ఇష్టమైన తిండికోసం, ఆకర్షణీయంగా కనపడటం కోసం, దేహానికి వెట్టిచాకిరీ చేయరాదు. అలాగని సాధకుడు దేహాన్ని పట్టించుకోకుండా ఉండరాదు. అది "సిద్ధుల పని". సాధకుడు ఈ దేహంతోనే సాధనలు సాగించాలి. శ్రవణ, మనన, నిధిధ్యాసనలకు ఈ దేహమే ఆధారం కనుక తగినంత సాత్విక ఆహారాన్నిస్తూ తగినంత దేహపోషణ చేసుకుంటూ, అనారోగ్యం రాకుండా కాపాడుకుంటూ ఒకవేళ అనారోగ్యం చేస్తే ఔషధాలు వాడుతూ దానిని చక్కగా పోషించుకోవాల్సిందే. అయితే అతికూడదు.

3) శాస్త్రాను వర్తనం త్యక్త్వా...

శాస్త్రాలన్నీ కీకారణ్యాల వంటివి. వాటిపై విపరీత వ్యామోహాన్ని పెంచుకొని, అన్నీ తెలుసుకోవాలని తపనపడితే జీవితమంతా కృషి చేసినా చాలదు. చతుర్వేదాలు, షడంగాలు, షట్ శాస్త్రాలు, 18 పురాణాలు, ఉపపురాణాలు, భగవద్గీత, చరిత్ర, భూగోళం, భూగర్భశాస్త్రం, వైద్యం, న్యాయశాస్త్రం.. ఎన్నో.. ఇవిగాక నాట్య నృత్య శిల్పం, సంగీతం, లలితకళలు, యోగా ఇలా ఎన్నో శాస్త్రాలను తెలుసుకోవాలని అనుకోరాదు. అన్నీ తెలుసుకోవటం సమయం వృధాచేసుకోవటమే. ఆధ్యాత్మికరంగంలో ఉన్నవారు మోక్ష ప్రదాయక గ్రంధాలనే చదవాలి గాని పాండిత్య ప్రతిభకై ప్రాకులాడరాదు ఉత్తేజాన్ని మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి గదా అని చెత్త నవలలు చదవరాదు. ఈ మూడింటిని లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, వాసనాత్రయం అంటారు. ఈ మూడింటిని వదలాలి. వదలి ఏంచేయాలి..

"స్వ - అధ్యాస - అపనయం - కురు"...

నీ అధ్యాసను తొలగించుకో. ఈ దేహమే నేననే భావనను తొలగించుకో...

1) కనుక మోక్షమార్గంలో నడిచే మహాత్ములను అనుసరించాలి. వారి బోధలను వినాలి. ఆచరించాలి. వారి ఆచరణను జాగ్రత్తగా పరిశీలించాలి.

2) అలాగే దేహాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవాలి.

3) అవసరమైనంత వరకు శాస్త్రాలను అధ్యయనం చెయ్యాలి. వాటి లోతులను గ్రహించాలి. తెలివిగా వాటిని ఆచరించాలి.

ఇలా చేస్తూ గ్రుడ్డిగా అనుసరించటాన్ని వదలి వాసనలను అంతం చేయాలి. నిజంగా ఈ 3 వాసనలను అంతం చేయగలిగితే మిగిలిన వాసనలన్నీ రద్దై పోతాయి. ఎందుకంటే మిగిలిన వాసనలన్నీ దాదాపుగా ఈ మూడింటిలో ఏదో ఒక దానిపై ఆధారపడి ఉన్నాయి.

ఈ 3 వాసనలే ముక్తి మార్గంలో ప్రధాన ఆటంకాలు...

*|| ఓం నమః శివాయ ||forwaded by Surendra pss
లక్ష్మి పూజ

శ్రీ లక్ష్మీదేవి
తిథి
ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్య దినమున జరుపుకుంటారు.



ఇతిహాసము
ఈ రోజున శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి బలి చక్రవర్తి యొక్క కారాగృహములో బంధించబడి వున్న దేవతలందరిని విముక్తి చేశాడు, ఆ తరువాత దేవతలందరు క్షీరసాగరములోకి వెళ్ళి పడుకొన్నారు, అను కథ వున్నది.



పండుగను జరుపుకొనే పద్ధతి
తెల్లవారుజామున మంగళ స్నానాన్ని ఆచరించిన తరువాత దేవుణ్ణి పూజిస్తారు. మధ్యాహ్నం సమయంలో పితృదేవతలకు శ్రాద్ధము మరియు బ్రాహ్మణులకు భోజనం పెడతారు, సాయంత్రము తమ పూజ స్థలాన్ని లతలు, పుష్పాలు మరియు ఆకులతో అలంకరించి లక్ష్మీదేవి, శ్రీ విష్ణు మరియు కుబేరున్ని పూజిస్తారు. ఇలా లక్ష్మీపూజ రోజున ఈ విధిని ఆచరించబడుతుంది.



లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు ఆసనాన్ని సిద్ధం చేయాలి. దానిపైన అష్టదళ పద్మం గాని లేదా స్వస్తిక చిహ్నాన్ని గాని అక్షింతలతో తయారు చేసి దానిపై లక్ష్మీదేవి విగ్రహమును స్థాపించాలి. కొన్ని ప్రాంతాల్లో కలశముపై పూజ పళ్ళెమును ఏర్పాటుచేసి తరువాత లక్ష్మీదేవి విగ్రహమును స్థాపన చేస్తారు.

లక్ష్మీదేవి ప్రక్కనే కుబేరుడి ప్రతిమను ఏర్పాటు చేయాలి. తరువాత లక్ష్మీ దేవితో పాటు దేవతలందరికీ చక్కెర వేసిన ఆవుపాలుతో తయార చేసిన పదార్థమును నైవేద్యంగా పెడతారు. ధనియాలు, బెల్లం, పొట్టుతో వున్న పేలాలు, చక్కెర బిల్లలు మొదలగు పదార్థములను లక్ష్మీదేవికి సమర్పించి ఆ తరువాత వాటిని ప్రసాదంగా బంధువులకు పంచుతారు. ఎండిన గోంగూర పుల్లలకు వొత్తులు చుట్టి వెలిగించి దక్షిణం వైపు చూపించి పితృదేవతలను ప్రార్థ్ధిస్తారు. బ్రాహ్మణులకు మరియు ఆకలితో వున్నవారికి అన్నదానం చేస్తారు. ఈ రోజు రాత్రికి నిద్రపోకుండా జాగరణ చేస్తారు. ఎందుకంటే ఆశ్వయ్యుజ అమావాస్య రోజు రాత్రిపూట లక్ష్మీదేవి ఆదర్శవంతమైన గృహం కోసం వెదుకుతూ తిరుగుతు వుంటుంది. ఎక్కడైతే చారిత్రవంతులు, కర్తవ్యదక్షులు, ఓపిక గలవారు, ధర్మనిష్ఠ గలవారు, భగవత్భక్తి మరియు క్షమాశీలులైన పురుషులు మరియు గుణవంతులైన, పతివ్రతా స్త్రీలు నివసించే గృహంలో మాత్రమే లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడుతుంది.



లక్ష్మి దేవితో కుబేరుడిని పూజించిటకు మహత్యం
లక్ష్మి దేవి సంపదను ప్రసాదించే తల్లి, దేవత కుబేరుడు కోశాధికారి. చాలామందికి ధనాన్ని సంపాదించే కళను కలిగి వుంటారు. కానీ వారికి ఎలా పొదుపు చేయాలో తెలియక వృధా ఖర్చులు చేసి ధనాన్ని అంతా పోగొట్టుకుంటారు . వాస్తవానికి ధనాన్ని సంపాదించడంతోపాటు దానిని ఆదా చేయడం, తగిన చోట ఖర్చు పెట్టడం చాలా ముఖ్యంమైనది. దేవత కుబేరుడు తానే కోశాధికారి కాబట్టి ఈ కళను నేర్పే దేవత. కాబట్టి ఈ పండుగకు లక్ష్మి దేవిని, దేవత కుబేరున్ని పూజించమని చెప్తారు. ప్రజలందరూ, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారు ఈ పండుగను ఎంతో శోభాయమానంగా, ఉత్సాహంగా జరుపుకుంటారు.



లక్ష్మీపూజ యొక్క ప్రాముఖ్యత
సాధారణంగా అమావాస్యను అశుభ దినముగా పరిగణిస్తారు; కానీ ఆశ్వయుజ మాసంలో వచ్చే అమావాస్యకు మాత్రం మినహాయింపు వుంది. ఈ అమావాస్య దినమును శుభముగా భావించడమైనది; అయినప్పటికీ అన్ని సందర్భాలకు శుభ దినముగా పరిగణించరు; అందువల్ల ఈ దినమును శుభదినముగా పిలువడంకన్నా ఆనందమయ దినముగా పరిగణించడము సరియైనది.



లక్ష్మీదేవికి చేయవలసిన కొన్ని ప్రార్ధనలు
లక్ష్మి పూజలో లెక్కల పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ఇలా ప్రార్ధించాలి. ‘ఓ దేవి నీవు అనుగ్రహహించిన సంపదను సత్కార్యానికి మరియు దైవకార్యానికి ఉపయోగించాము. పూర్తి చేసిన లెక్కలను మీ ముందు వుంచుతున్నాము తల్లి. వీటిని అంగీకరించుము. రాబోయే సంవత్సరంలో కూడా మా లక్ష్యం ఎల్లప్పుడు కొనసాగేటట్లు దీవించు తల్లి’.

‘నేను చేపట్టే ప్రతి కార్యంలో నాతోవుండి నా అవసరాలను తీర్చడానికి నాకు చైతన్యాన్ని ఇచ్చే దైవ శక్తి నాలో వుంది. కాబట్టి ఆ దైవశక్తి కూడా నా భాగస్వామియే. ఏడాది పొడవునా నేను సంపాదించిన ధనము యొక్క లెక్క మరియు దానిని ఉపయోగించిన విధానం, ఈ పుస్తకాలలో చివరి పైసా వరకు లెక్క వ్రాయబడింది. నేను ఈ రోజు మీ ముందు పరిశీలన కోసం ఉంచాను. నీవే సాక్షి తల్లి. నేను మీ నుండి ఏమీ దాచలేను. నేను నిన్ను గౌరవించాను మరియు దైవకార్యానికి మాత్రమే ఉపయోగించాను. ఓ నిష్కలంకమైన మరియు శుద్ధమైన లక్ష్మీదేవి నేను నిన్ను ఎలాంటి అన్యాయమైన చర్యకు ఉపయోగించలేదు’.

‘ఇదంతయు సరస్వతి దేవి యొక్క అనుగ్రహం వల్లనే సంభవమైనది. నేను విచక్షణ మరియు నైతిక విలువలు కలిగివున్నాను. ఇందువల్లనే నాలోని ఆత్మబలము తక్కువ కాలేదు. నాకు మరియు నా కుటుంబానికి సుఖము, సమాధానము లభించినది. నేను భగవంతుని సహకారంతో ఆయనను స్మరించుకుంటూ ఖర్చు చేశాను. నేను ధనాన్ని సన్మార్గంలో ఉపయోగించకపోతే నీవు నాతో ఉండవని ఎల్లప్పుడు గుర్తుపెట్టుకున్నాను. అందువల్ల హే లక్ష్మీదేవి, నేను చేసిన ఖర్చును సమ్మతించుటకు మీరు నన్ను దేవునికి శిఫారసు చేయుము; ఎందుకంటే నీ శిఫారసు లేకుండ ఆయన నన్ను మన్నించడు. నా దృష్టికి వచ్చే తప్పులను పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాను. అందువల్ల, హే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి, మీ కృపను నాకు ప్రసాదించుము మరియు నా ద్వారా జీవితమంతా హితము కొరకు వినియోగించుటకు జరుగనిమ్ము.’

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత : పై విధంగా లక్ష్మీదేవి మరియు సరస్వతిదేవికి ప్రార్థించడమువలన జీవునిలో వున్న కర్తుత్వము యొక్క సూక్ష్మతలంపు తగ్గి తన స్వభావము అంతర్ముఖమౌతుంది. ఇందువలన నిర్మాణమయ్యే మోహము దానిలో పడకుండ అతని ప్రవర్తనలో వినయశీలత ఏర్పడుతుంది.



లక్ష్మీపూజ రోజున తీయవలసిన ముగ్గు


లక్ష్మీతత్వమును ఆకర్షింపజేసుకొనే 11 చుక్కలు మరియు 11 వరుసల ముగ్గు



లక్ష్మీపూజ రోజున రాత్రికి ఇల్లును ఎందుకు ఊడ్చుతారు ?
అలక్ష్మీని తొలగించుట
మనలో గుణాలను నిర్మాణము చేసినను, దోషాలను తొలగించుకొనే ప్రక్రియలో ముందడుగు వేసినప్పుడే సద్గుణాలకు గొప్పతనము వస్తుంది. ఇప్పటి వరకు మనము లక్ష్మీని (ధనము) ఎలా సంపాదించాలి, అని తెలుసుకున్నాము. దీనితో పాటు అలక్ష్మీ నాశనము కూడ కావాలి; అందువల్ల ఈ రోజున కొత్త చీపురు కొంటారు. చీపురును లక్ష్మీగా భావిస్తారు.

ఆచరించు విధానము : ఆ చీపురుతో అర్ధరాత్రి ఇల్లు ఊడ్చి ఆ దుమ్మును బయట పడేయాలి అని చెప్తారు. దీనిని అలక్ష్మీని తొలగించడం అంటారు. సాధారణంగా రాత్రికి ఇల్లు ఊడ్చి దుమ్ము బయట పడేయటం ఎప్పుడూ చేయరు. కేవలము ఈ రాత్రికి చేస్తారు. దుమ్మును ఊడ్చుతున్నప్పుడు చాటను చిన్న కర్రతో వాయించి అలక్ష్మీని బయటికి నెట్టేస్తారు.

సందర్భం : సనాతన ప్రచురణ ‘పండుగలు, ఉత్సవాలు మరియు వ్రతాలు’


లక్ష్మీ చంచలమైనదని, చెప్పుటకు కారణములు
ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వము ఉపాసకుని వద్దకు వస్తుంది మరియు దాని అనుసారంగా లక్షణాలు కనబడుతాయి, ఉదా. శ్రీలక్ష్మీయొక్క ఉపాసన చేసినచో, ధనప్రాప్తి అవుతుంది. ఈ ఉపాసన తగ్గినచో, అహం జాగృతమై ఆ దేవత తత్వము ఉపాసకున్ని వదలి వెళ్ళిపోతుంది. అప్పుడు స్వంత తప్పును ఒప్పుకోక మనుష్యులు లక్ష్మీ చంచలమైనదని అంటుంటారు. కాని ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయమేమింటే, లక్ష్మీ చంచలమై వున్నట్లయితే తను శ్రీవిష్ణువు చరణాలను ఎప్పుడో వదిలేసి వుండేది.Forwarded by Jyoti Reddy 
దీపావళి పండుగ విశిష్టత మరియు లాభాలు.!

దీపావళి అమావాస్య రోజున సూర్యచంద్రులిద్దరూ స్వాతి నక్షత్రం లో ఉంటారు, ఈ సమయం లో స్నానం చేయడం ఎంతో మంచిది. కాబట్టి పొద్దున్నే తల స్నానం చేసి ఆ తరువాత తెల్లటి దుస్తులు ధరించడం ద్వారా మంచి జరుగుతుంది.

తెలుగు ప్రజలు ఎంతో ఆనందోత్సాహాల తో చేసుకునే పండుగ దీపావళి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆ రోజు ఆరుబయట చేసే సందడి అంతా ఇంతా కాదు. చిన్న, పెద్దా పటాకులు కాలుస్తూ..దీపాలు పెడుతు ఖుషీ ఖుషీగా గడుపుతారు. దీపావళి అంటే దీపాల క్రమం. దీపం వెలుగును పంచుతుంది. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. కమ్ముకున్న కారుచీకటి చీల్చివేస్తుంది. ఏటా ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని జరుపుకుంటారు. హిందువులు ప్రతి రోజు పూజ చేసేటప్పుడు దీపం వెలిగిస్తారు. పండుగలకూ తప్పనిసరిగా దీపారాధన చేస్తాం.

దీపం పరబ్రహ్మస్వరూపం. అలాంటి దీపాలతో చేసే అపురూపమైన పండుగ దీపావళి. హిందువుల ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఆ రోజు ప్రతి ఇంటి ముందు దీపాలు ప్రకాశిస్తూనే ఉంటాయి. ప్రతి పండుగకు పిండి వంటలు, కొత్త బట్టలు, సరదాలు, దీపారాధనలు ఉంటాయి. మరి దీపావళికి మాత్రమే దీపాల ప్రదర్శన ఎందుకు…? ఆరు బయట దీపాల పెట్టడం వెనుక కారణం ఏంటి..? కార్తీక మాసంలో తులసిని పూజించి.. తులసి ముందు ఒక్క దీపాన్నైనా ఉంచితే మంచి జరుగుతుందని హిందువుల నమ్మకం.

అమావాస్య నాడు చనిపోయిన పితృదేవతలకు తర్పణం విడిచే ఆచారం ఉంది. ఆ ప్రకారం పురుషులు జలతర్పణం విడుస్తుంటారు. ఇక్కడ వినిపించే ఇంకో పురాణ కథ ఏమిటంటే… మహాలయ పక్షంలో స్వర్గం నుంచి భూలోకానకి పితృదేవతలు దిగివచ్చి.. దీపావళి రోజున పితృలోకాలకు తిరిగి పయణమవుతారట. అలా వెళ్లే పితృదేవతలకు వెలుతురు చూపించడం కోసం ఆరు బయట దీపాలు వెలిగించే ఆచారం వచ్చిందట.

ఇంటి గడపకు పూసే పసుపు, వాకిట ముందు వేసే రంగవళ్లులు… ఇలా అనాదిగా వస్తున్న ప్రతి ఆచారం వెనుక ఓ శాస్త్రీయ కారణం ఉంది. దీపావళి వెనకు కూడా అలాంటి కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం దీపావళి పండగను చెడు తొలగిపోయి మంచి మొదలవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధి, అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలని లక్ష్మీకటాక్షం కోసం పూజలు చేస్తారు. దీపావళి నాటి దీపకాంతి సహస్ర సూర్యులకాంతికి మించిందని శాస్త్రం చెబుతోంది. ఆ రోజు ఆవునేతితో లేదా నువ్వుల నూనేతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. ఎందుకంటే దీపంలో లక్ష్మీ దేవి ఉంటుందట. దీని వెనుక కూడా ఓ కథనం ఉంది.

దేవతల అధిపతి ఇంద్రుడు శ్రీమహాలక్ష్మిని పూజిస్తూ…అమ్మా.. సామాన్యులు నీ కృపను పొందాలంటే ఏం చేయాలని అడుగాడట. అప్పుడు లక్ష్మీ దేవి ‘నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ఎన్నడూ, ఏ లోటూ ఉండదు. దీపం వెలిగించి, ప్రార్థించే భక్తులకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదిస్తాను’ అని బదులిస్తుందట. అప్పటి నుంచి దీపంలో లక్ష్మీదేవి రూపాన్ని దర్శించుకోవడం ఆనవాయితీగా మారింది. దీపావళి రోజు దీపాలతోనే పండుగ కాబట్టి… ఆ రోజు లక్ష్మీదేవిని ఆరాధించే ఆచారం ఏర్పడింది. ఇక శాస్త్రీయ కోణంలో చూసినా దీపావళికి చాలా ప్రాధాన్యత ఉంది. వర్షాకాలం తర్వాత వచ్చే పండుగ దీపావళి.

వర్షాల కారణంగా నీళ్లు ఎక్కడ బడితే అక్కడ నిలిచిపోయి.. క్రిమి కీటకాలు బాగా వృద్ధి చెందుతాయి. వాటి వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరుబయట దీపాలు వెలిగించడం వల్ల చాలా కీటకాలు వెలుగుకు ఆకర్షితమై దీపంలో పడి చనిపోతాయి. ఇక దీపావళి నాడు కాల్చే టపాసులు, మతాబులు.. వాటి నుంచి వచ్చే పొగ.. దోమలు మొదలైన వాటిని మట్టుపెడతాయి.forwaded By Jyoti Reddy 
*నరకాసుర వధ - దీపావళి*
         
              నరకాసురుడు ఇంద్రుని తల్లి అదితి కుండలాలను దోచు కుంటాడు. నరకునిమూలంగావరుణుడుగొడుగునూ,మేరువు తనలోనిభాగమైన మణిపర్వతాన్నీ కోల్పోతారు. నరకుని ఆగడాలకు తాళలేక ఇంద్రాదులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేయడానికి బయలు దేరుతాడు.

            ఆ సందర్భాన కృష్ణుని భార్యామణి సత్యభామ భర్తతో ఇలా అంటుంది---*స్వామీ! ప్రాణేశా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుంటే* *నీయుద్ధచాతుర్యాన్ని చూడాలని ఉంది.మన్నించి నన్నుకూడా నీ వెంట రణరంగానికి తీసుకొనివెళ్లు.* ~ అపుడు కృష్ణస్వామి ప్రాణేశ్వరితో ఇలా
అంటాడు--

*సీ.సమదపుష్పంధయ ఝంకారములుగావు,*
                            *భీషణ కుంభీంద్ర బృంహితములు*
    *వాయునిర్గతపద్మ వనరేణువులుగావు,*
                           *తురగ రింఖాముఖోద్ధూత రజము*
    *లాకీర్ణజలతరంగాపాతములుగావు,*
                           *శత్రుధనుర్ముక్త సాయకములు*
     *కలహంస సారస కాసారములుగావు,*
                          *దనుజేంద్ర సైన్యకదంబకములు*

 *తే.కమల కల్హార కుసుమ సంఘములుగావు,*
     *చటులరిపు శూలఖడ్గాది సాధనములు,*
     *కన్య! నీవేడ?రణరంగ గమనమేడ?*
     *వత్తు వేగమ , నిలువుము, వలదు వలదు*
                        ---భాగవతం,౧౦స్కం,ఉ.భా.౧౫౩

*భావం:*

            *సత్యభామా! అక్కడ వినిపించేది మత్తిల్లిన తుమ్మెదల*
*రొదలుకావు,మహామదగజాల ఘీంకారాలు.ఆచోట నిను చుట్టుకునేది గాలికి చెదరిన తామరపుప్పొళ్లుకాదు సుమా, గుర్రాల గిట్టల కొనలవలన* *రేకగిన ధూళి.అక్కడ సరసులోని నీటిఅలలతుంపురుల జడికాదు కురిసేది, శత్రువుల ధనువుల నుంచి వదలిన శరపరంపరలు. అది* *రాయంచలూ  బెగ్గురు పక్షులూ ఉండే సరస్సుకాదు, వైరివర్గం ప్రయోగించే* *కత్తులూ శూలాలూ యుద్ధపరికరాలు ఉంటాయి. నీవేమిటి!*
*యుద్ధ భూమికి రావడమేమిటి? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడే* *అంతఃపురంలో హాయిగా, ఉండు. నా వెంట రానే రావద్దు.*

      కృష్ణుని మాటలకు ఆత్మాభిమానంగల సత్యభామ *నీ‌భుజాలు అనే కోటల* *చాటున ఉన్నపుడు నాకేమీకాదు.నీ వెంట తప్పక వస్తాను." అంటూ కృష్ణునికి గౌరవంగా వలపుతో చేతులు మోడ్చింది.*

       కృష్ణుడు కాదనలేక సత్యభామను వెంటతోడ్కొని
గరుడారూఢులై ఆకాశమార్గాన ప్రాగ్జోతిషపురంవైపు పయనిస్తారు.

         నరకునకూ కృష్ణునకూ యుద్ధం జరుగుతూ ఉంటుంది.అపుడు సత్యభామ తన జడను గట్టిగా చుట్టగా‌ చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకుంది. నగలుసవరించుకుంది. తన ముఖచంద్ర కాంతులు వ్యాపించగా వీరప్రతా పాటోపంతో శ్రీకృష్ణునిముందు వీరవనితలా నిలిచింది.

*క.జన్యంబున దనుజుల దౌ*
   *ర్జన్యము లుడుపంగ గోరి చనుదెంచిన సౌ*
   *జన్యవతి జూచి యదురా*
   *జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్ -భాగ,౧౦స్క ఉ.౧౭౧*
*క.లేమా!  దనుజుల గెలువగ*
   *లేమా?  నీవేల కడగి లేచితి విటు  రా!*
   *లే!  మాను  మానవేనిన్*
   *లే  మా విల్లందికొనుములీలంగేలన్ -భాగ,౧౦స్క.ఉ.౧౭౨*

          కృష్ణుడు తన విల్లును సత్యభామకు ఇచ్చినాడు. ఆమె రణం
మీద ఉండే తహతహతో అల్లెతాడు బిగించింది. శత్రుసైన్యం
తత్తరపాటుపడేలా అల్లెత్రాడును మోగించింది.ఆ ధ్వనికి ఏనుగులు మొదలయినవి మూర్ఛిల్లినవి.

*సీ.సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు*
                            *శింజినీ రవముతో జెలిమిసేయ*
    *దాటంక మణిగణ ధగధగ దీప్తులు*
                            *గండమండల రుచి గప్పికొనగ*
    *ధవళతరాపాంగ ధళధళ రోచులు*
                            *బాణజాలప్రభాపటలి నడప*
     *శరజాత  ఘుమఘుమ శబ్దంబు పరిపంథి*
                           *సైనిక కలకల స్వనము నుడుప*

 *తే. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు*
     *గలసి భామిని యయ్యెనో కాక యనగ*
     *నిషువు దొడువుట దివుచుట యేయుటెల్ల*
     *నెఱుగ రాకుండ నని సేసె నిందువదన*
                                         -భాగవ,౧౦స్కం,ఉ,౧౭౭

*భావం:*

           సత్యభామ యుద్ధంచేస్తుంటే ఆమె బంగారుగాజుల ఝణఝణ ధ్వనీ, అల్లెతాటిధ్వనీ ఏకమయ్యాయి.ఆమె చెవి పోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు,చెక్కిళ్ల. కాంతులనుకప్పివేశాయి.ఆమెకడకన్నుల తళతళకాంతులు బాణాలకాంతులను అణచివేశాయి.ఆమె వదలిన బాణాల
ఘుమఘుమారావం సైనికుల కలకలాన్ని మాన్పింది.వీర, శృంగార, భయానక, రౌద్ర, అద్భుత  రసాలు  కలసి  ఈ *వీరనారిగా* రూపొందిందా అనుకొనేలా ఆమె కనబడుతోంది. ఆమెబాణాలనుఎప్పుడువింటియందు కూర్చుతుందో,ఎప్పుడు
నారిని  లాగుతుందో, ఎప్పుడు  బాణాన్ని   ప్రయోగిస్తుందో తెలియడం లేదు.

*మ.పరుజూచున్ వరుజూచు నొంపనలరింపన్,రోషరాగోదయా*
    *విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్*
 *జరగన్,గన్నులగెంపుసొంపు బరగం జండాస్త్రసందోహమున్*
 *సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్యహేలిగతిన్*
                                         -భాగవ,౧౦స్కం,ఉ.౧౭౮
*భావం :*

                 సత్యభామ వయ్యారపు పోకడలు పోతూ  రోషంతో ఏర్పడిన కనుబొమలతో, వీరరసం అతిశయిల్లగా వాడిఅయిన అస్త్రా లను ప్రయోగిస్తూ  నరకాసురుణ్ణి   పీడించడానికి ప్రయత్నిం చింది.అనురాగంవల్ల జనించిన చిరునవ్వుల్ని చిందిస్తూ,శృంగారరసం ఉద్దీపోంచగా, సొగసయిన కనులతో, రసమయమైన చూపులను ప్రసరింపజేస్తూ భర్త శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి యత్నించింది.ఇలా వీర శృంగారాలను ప్రదర్శించిన వీరశృంగారనారి  సత్యభామ.

*మ.అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో*
    *నలిక స్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స*
    *ల్లలితజ్యానఖ పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో*
    *వలయాకార ధనుర్విముక్త విశికవ్రాతా హతారాతియై.*
                                    -భాగవత,౧౦స్కం,ఉ.౧౭౯

*భావం:*

              సత్యభామ సొగసు ఉట్టిపడేలా దానవులతో యుద్ధం చేసేటపుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి నిలి చింది.ఆమె ముంగురులు నొసలిచెమటలో చెదిరాయి.ఆమె  చెవివరకూ లాగిన అల్లెతాటినిపట్టుకున్న చేతివేళ్ల గోళ్లకాం తులూ,అమ్ములవెనుకభాగపుకాంతులూ అంతటావ్యాపి
స్తున్నాయి.ఆమె చూపు గురితప్పలేదు. ఆమె నారిని లాగడంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలువదలి శతృవులను సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధ వైశారద్యాన్ని ప్రదర్శించింది.

*సీ.'బొమ్మపెండ్లిండ్లకు బోనొల్లాననుబాల*
                              *రణరంగమునకెట్లు రాదలంచె?*
   *మగవారి గనిన దా మఱుగు చేరెడు నింతి*
                            *పగవారి గెల్వనేపగిది జూచె?*
    *పసిడి యుయ్యెలలెక్క భయమందు భీరువు*
                           *ఖగపతి స్కంధమే పగిది నెక్కె?*
    *సఖులకోలాహలస్వనములోర్వని కన్య*
                           *పటహభాంకృతులకెబ్భంగి నోర్చె?*

*ఆ. నీలకంఠములకు నృత్యంబు గఱపుచు*
                           *నలసి తలగిపోవు నలరుబోడి*
     *యే విధముననుండె నెలమి నాలీఢాది*
                           *మానములను రిపంలమాన మడప?*
                                        -భాగవత,౧౦స్కం,ఉ.౧౮౦
*సీ. వీణె జక్కగబట్ట వెరవెరుంగనికొమ్మ*
                           *బాణాసనం బెట్లు పట్ట నేర్చె?*
    *మ్రాకున దీగె గూర్పంగ నేరని లేమ*
                          *గుణము నే క్రియ ధనుఃకోటి గూర్చె?*
    *సరవి ముత్యము గ్రువ్వజాలని యబల యే*
                           *నిపుణత సంధించె నిశిత శరము?*
    *చిలుకకు పద్యంబు సెప్పనేలని తన్వి*
                               *యస్త్రమంత్రము లెన్న డభ్యసించె?*

*ఆ. పలుకు మనిన పెక్కు పలుకని ముగుద యే*
                                *గతి నొనర్చె సింహగర్జనములు?*
     *అనగ మెఱసె త్రిజగదభిరామ,గుణధామ,*
                                  *చారుసత్యభామ,సత్యభామ!*
                                        -భాగవత,౧౦స్కం,ఉ,౧౮౧

                   సత్యభామ అల్లెతాడుమోత ఉరుముగా,దేవతలు చాతక పక్షులుగా,ధనుస్సు ఇంద్రధనుస్సుగా,శ్రీకృష్ణుడు మేఘంగా,  తాను మెఱుపు తీగగా,బాణాలు నీటితుంపురులుగా, రాక్ష సులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్నో సృష్టించింది.

*సీ.రాకేందు బింబమై రవిబింబమైయొప్పు*
                             *నీరజాతేక్షణ నెమ్మొగంబు,*
    *కందర్పకేతువై ఘనధూమకేతువై*
                              *యలరు పూబోడి చేలాంచలంబు,*
     *భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై*
                            *మెఱయు నాకృష్టమై మెలత చాప,*
     *మమృత ప్రవాహమై యనలసందోహమై*
                              *తనరారు నింతి సందర్శనంబు,*

*ఆ.హర్షదాయోయై మహారోషదాయియై,*
                               *పరగు ముద్దరాలి బాణ వృష్టి,*
   *హరికి నరికి జూడ నందంద శృంగార*
                              *వీర రసము లోలి విస్తరిల్ల.*
                                                  -౧౦స్కం,ఉ,౧౮౩

            సత్యభామాదేవి ఇలా హరికి అరికి మధ్య శృంగార వీర  రసాలను విస్తరింప జేసింది.సత్యభామ   ప్రయోగించిన వాడిబాణాలకు తాళలేక, ధైర్యంకోల్పోయిన   రాక్షససేనలు  చెదరిపోయి నరకాసురుని మరుగు జొచ్చాయి. అపుడు కృష్ణుడు సత్యభామ యుద్ధప్రయత్నాలను నివారిస్తూ ఇలా
అన్నాడు--

*క.'కొమ్మా! దానవనాథుని*
   *కొ  మ్మాహవమునకు తొలగె గురువిజయము గై*
   *కొమ్మా! మెచ్చితి నిచ్చెద*
   *కొ  మ్మాభరణములు నీవు కోరినవెల్లన్'     -౧౦,ఉ,౧౮౭*

               శ్రీకృష్ణుడు సరససల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను
బహుమానించి,ఆమె చేతిలో ఉన్న ధనువును తిరిగి తీసు కున్నాడు.అపుడు నరకాసురుడు కృష్ణుడు ఇలా అన్నాడు-

*క.మగువ మగవారి ముందఱ*
   *మగతనములు సూప రణము మానుట నీకున్*
   *మగతనముగాదు; దనుజులు*
   *మగువలదెస జనరు మగలమగ లగుట హరీ!*

(మగల మగలగుట-మగాళ్లకే మగాళ్లం, అంటే వీరులకే వీరులం)

నరకాసురుడు ఇలా అనగా కృష్ణుడు----

*క. నరకా! ఖండించెద మ*
    *త్కరకాండాసన విముక్త ఘన శరముల భీ*
    *కరకాయు నిన్ను సుర కి*
    *న్నరకాంతలు సూచినేడు నందం బొందన్    -౧౦ఉ,౧౯౧*

                శ్రీకృష్ణుడు దివ్యాస్త్రమైన శతఘ్నితో నరకుని భటులను మహా సంక్షోభానికి గురిచేశాడు.కృష్ణుడు బాణాలతో ఖండించిన గుర్రాలూ, గదతో బద్దలు చేసిన ఏనుగులూ,  చక్రంతో ఖండితశిరస్కులైన రాక్షససైన్యం హాహాకారాలు చేస్తూ పారిపోయారు ~ రత్నమయకుండల సమేతమైన నరకాసురుని తలను
శ్రీకృష్ణుడు తన సుదర్శనచక్రంతో ఖండించాడు.నరకుడు రోదిస్తూ యుద్ధ భూమి మీద పడిపోయాడు.

             దేవతలుమింటినుండిపూలవానకురిపించారు. భూలోకంలో
మానవాళి అమావాస్య చీకటి తొలగిందని ఆనందంతో దీపావళిని సంతరించి పండుగ చేసుకున్నారు. నరకుని చెఱలో ఉన్న పదారువేల కన్నియలు బంధవి ముక్తు లయ్యారు, ఈప్సితార్థాన్ని పొందారు. భూదేవి శ్రీకృష్ణుని స్తంతించింది-

            *ఆ.ధాతగన్న మేటితండ్రికి నజునికి*
               *నీకువందనంబునేనొర్తు*
               *నిఖిలభూతరూప!నిరుపమ!ఈశ! ప*
               *రాపరాత్మమహిత!యమిత చరిత!*

దీపావళి శుభాకాంక్షలతో

వైద్యంవేంకటేశ్వరాచార్యులు‌. మీభాగవత శ్రీచరణ రేణువు
                     వైద్యంవేంకటేశ్వరాచార్యులు‌🙏