Monday, October 21, 2019

యమునోత్రి లో యమునా దేవి ఆలయం

చార్ ధామ్ యాత్రలో భాగంగా యమునోత్రి ఆలయాన్ని అక్షయతృతీయ రోజు మే 7 వ తేదీన ఓపెన్ చేసి అక్టోబర్ 27 వ తేదీన మూసివేస్తారు. యమునోత్రి అంటే యమునా నది జన్మస్థలం అని అంటారు. కానీ యమునోత్రి అంటే యమునా జన్మస్థలం కాదు, యమునా ఉత్తర అంటే యమున నేల మీదకు ఉత్తరించిన, అంటే దిగిన స్థలం అని అర్ధం. ఇక్కడ యమునాదేవి ఆలయం ఉంది. ఇది సముద్రమట్టానికి 3293 మీ. ల ఎత్తులో బందర్ పూంచ్ పర్వతం పైన కలదు. ఈ ఆలయ సమీపంలో ఒక ప్రదేశంలో చల్లటి నీరు, సలసల మసిలేనిరు ప్రక్కప్రక్కనే ప్రవహిస్తూ ఉంటాయి. ఇలా ఇక్కడ రెండు ప్రవహించడం అనేది ఇప్పటికి దైవ రహస్యంగానే ఉంది. ఇక ఇక్కడ దివ్యశిల, సూర్యకుండం అనే ప్రదేశాలను తప్పకుండ దర్శిస్తారు.forwaded by Dr. Sudha

No comments:

Post a Comment