*నరకాసుర వధ - దీపావళి*
నరకాసురుడు ఇంద్రుని తల్లి అదితి కుండలాలను దోచు కుంటాడు. నరకునిమూలంగావరుణుడుగొడుగునూ,మేరువు తనలోనిభాగమైన మణిపర్వతాన్నీ కోల్పోతారు. నరకుని ఆగడాలకు తాళలేక ఇంద్రాదులు శ్రీకృష్ణునితో మొరపెట్టుకుంటారు. శ్రీకృష్ణుడు నరకాసుర సంహారం చేయడానికి బయలు దేరుతాడు.
ఆ సందర్భాన కృష్ణుని భార్యామణి సత్యభామ భర్తతో ఇలా అంటుంది---*స్వామీ! ప్రాణేశా! నీవు విజృంభించి రాక్షసగణాలను సంహరిస్తుంటే* *నీయుద్ధచాతుర్యాన్ని చూడాలని ఉంది.మన్నించి నన్నుకూడా నీ వెంట రణరంగానికి తీసుకొనివెళ్లు.* ~ అపుడు కృష్ణస్వామి ప్రాణేశ్వరితో ఇలా
అంటాడు--
*సీ.సమదపుష్పంధయ ఝంకారములుగావు,*
*భీషణ కుంభీంద్ర బృంహితములు*
*వాయునిర్గతపద్మ వనరేణువులుగావు,*
*తురగ రింఖాముఖోద్ధూత రజము*
*లాకీర్ణజలతరంగాపాతములుగావు,*
*శత్రుధనుర్ముక్త సాయకములు*
*కలహంస సారస కాసారములుగావు,*
*దనుజేంద్ర సైన్యకదంబకములు*
*తే.కమల కల్హార కుసుమ సంఘములుగావు,*
*చటులరిపు శూలఖడ్గాది సాధనములు,*
*కన్య! నీవేడ?రణరంగ గమనమేడ?*
*వత్తు వేగమ , నిలువుము, వలదు వలదు*
---భాగవతం,౧౦స్కం,ఉ.భా.౧౫౩
*భావం:*
*సత్యభామా! అక్కడ వినిపించేది మత్తిల్లిన తుమ్మెదల*
*రొదలుకావు,మహామదగజాల ఘీంకారాలు.ఆచోట నిను చుట్టుకునేది గాలికి చెదరిన తామరపుప్పొళ్లుకాదు సుమా, గుర్రాల గిట్టల కొనలవలన* *రేకగిన ధూళి.అక్కడ సరసులోని నీటిఅలలతుంపురుల జడికాదు కురిసేది, శత్రువుల ధనువుల నుంచి వదలిన శరపరంపరలు. అది* *రాయంచలూ బెగ్గురు పక్షులూ ఉండే సరస్సుకాదు, వైరివర్గం ప్రయోగించే* *కత్తులూ శూలాలూ యుద్ధపరికరాలు ఉంటాయి. నీవేమిటి!*
*యుద్ధ భూమికి రావడమేమిటి? నేను తొందరగానే వస్తాను. నీవు ఇక్కడే* *అంతఃపురంలో హాయిగా, ఉండు. నా వెంట రానే రావద్దు.*
కృష్ణుని మాటలకు ఆత్మాభిమానంగల సత్యభామ *నీభుజాలు అనే కోటల* *చాటున ఉన్నపుడు నాకేమీకాదు.నీ వెంట తప్పక వస్తాను." అంటూ కృష్ణునికి గౌరవంగా వలపుతో చేతులు మోడ్చింది.*
కృష్ణుడు కాదనలేక సత్యభామను వెంటతోడ్కొని
గరుడారూఢులై ఆకాశమార్గాన ప్రాగ్జోతిషపురంవైపు పయనిస్తారు.
నరకునకూ కృష్ణునకూ యుద్ధం జరుగుతూ ఉంటుంది.అపుడు సత్యభామ తన జడను గట్టిగా చుట్టగా చుట్టింది. పోకముడిని గట్టిగా బిగించుకుంది. నగలుసవరించుకుంది. తన ముఖచంద్ర కాంతులు వ్యాపించగా వీరప్రతా పాటోపంతో శ్రీకృష్ణునిముందు వీరవనితలా నిలిచింది.
*క.జన్యంబున దనుజుల దౌ*
*ర్జన్యము లుడుపంగ గోరి చనుదెంచిన సౌ*
*జన్యవతి జూచి యదురా*
*జన్యశ్రేష్ఠుండు సరస సల్లాపములన్ -భాగ,౧౦స్క ఉ.౧౭౧*
*క.లేమా! దనుజుల గెలువగ*
*లేమా? నీవేల కడగి లేచితి విటు రా!*
*లే! మాను మానవేనిన్*
*లే మా విల్లందికొనుములీలంగేలన్ -భాగ,౧౦స్క.ఉ.౧౭౨*
కృష్ణుడు తన విల్లును సత్యభామకు ఇచ్చినాడు. ఆమె రణం
మీద ఉండే తహతహతో అల్లెతాడు బిగించింది. శత్రుసైన్యం
తత్తరపాటుపడేలా అల్లెత్రాడును మోగించింది.ఆ ధ్వనికి ఏనుగులు మొదలయినవి మూర్ఛిల్లినవి.
*సీ.సౌవర్ణ కంకణ ఝణఝణ నినదంబు*
*శింజినీ రవముతో జెలిమిసేయ*
*దాటంక మణిగణ ధగధగ దీప్తులు*
*గండమండల రుచి గప్పికొనగ*
*ధవళతరాపాంగ ధళధళ రోచులు*
*బాణజాలప్రభాపటలి నడప*
*శరజాత ఘుమఘుమ శబ్దంబు పరిపంథి*
*సైనిక కలకల స్వనము నుడుప*
*తే. వీర శృంగార భయ రౌద్ర విస్మయములు*
*గలసి భామిని యయ్యెనో కాక యనగ*
*నిషువు దొడువుట దివుచుట యేయుటెల్ల*
*నెఱుగ రాకుండ నని సేసె నిందువదన*
-భాగవ,౧౦స్కం,ఉ,౧౭౭
*భావం:*
సత్యభామ యుద్ధంచేస్తుంటే ఆమె బంగారుగాజుల ఝణఝణ ధ్వనీ, అల్లెతాటిధ్వనీ ఏకమయ్యాయి.ఆమె చెవి పోగులలో పొదిగిన మణుల ధగధగమనే కాంతులు,చెక్కిళ్ల. కాంతులనుకప్పివేశాయి.ఆమెకడకన్నుల తళతళకాంతులు బాణాలకాంతులను అణచివేశాయి.ఆమె వదలిన బాణాల
ఘుమఘుమారావం సైనికుల కలకలాన్ని మాన్పింది.వీర, శృంగార, భయానక, రౌద్ర, అద్భుత రసాలు కలసి ఈ *వీరనారిగా* రూపొందిందా అనుకొనేలా ఆమె కనబడుతోంది. ఆమెబాణాలనుఎప్పుడువింటియందు కూర్చుతుందో,ఎప్పుడు
నారిని లాగుతుందో, ఎప్పుడు బాణాన్ని ప్రయోగిస్తుందో తెలియడం లేదు.
*మ.పరుజూచున్ వరుజూచు నొంపనలరింపన్,రోషరాగోదయా*
*విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్*
*జరగన్,గన్నులగెంపుసొంపు బరగం జండాస్త్రసందోహమున్*
*సరసాలోక సమూహమున్ నెఱపుచుం జంద్రాస్యహేలిగతిన్*
-భాగవ,౧౦స్కం,ఉ.౧౭౮
*భావం :*
సత్యభామ వయ్యారపు పోకడలు పోతూ రోషంతో ఏర్పడిన కనుబొమలతో, వీరరసం అతిశయిల్లగా వాడిఅయిన అస్త్రా లను ప్రయోగిస్తూ నరకాసురుణ్ణి పీడించడానికి ప్రయత్నిం చింది.అనురాగంవల్ల జనించిన చిరునవ్వుల్ని చిందిస్తూ,శృంగారరసం ఉద్దీపోంచగా, సొగసయిన కనులతో, రసమయమైన చూపులను ప్రసరింపజేస్తూ భర్త శ్రీకృష్ణుణ్ణి ఆనందింపజేయడానికి యత్నించింది.ఇలా వీర శృంగారాలను ప్రదర్శించిన వీరశృంగారనారి సత్యభామ.
*మ.అలినీలాలక చూడ నొప్పెసగె ప్రత్యాలీఢ పాదంబుతో*
*నలిక స్వేద వికీర్ణకాలకలతో నాకర్ణికానీత స*
*ల్లలితజ్యానఖ పుంఖ దీధితులతో లక్ష్యావలోకంబుతో*
*వలయాకార ధనుర్విముక్త విశికవ్రాతా హతారాతియై.*
-భాగవత,౧౦స్కం,ఉ.౧౭౯
*భావం:*
సత్యభామ సొగసు ఉట్టిపడేలా దానవులతో యుద్ధం చేసేటపుడు విలుకానివలె ఎడమకాలు ముందుంచి నిలి చింది.ఆమె ముంగురులు నొసలిచెమటలో చెదిరాయి.ఆమె చెవివరకూ లాగిన అల్లెతాటినిపట్టుకున్న చేతివేళ్ల గోళ్లకాం తులూ,అమ్ములవెనుకభాగపుకాంతులూ అంతటావ్యాపి
స్తున్నాయి.ఆమె చూపు గురితప్పలేదు. ఆమె నారిని లాగడంవల్ల గుండ్రంగా అయిన వింటినుండి బాణాలువదలి శతృవులను సంహరించింది. ఇలా సత్యభామ తన యుద్ధ వైశారద్యాన్ని ప్రదర్శించింది.
*సీ.'బొమ్మపెండ్లిండ్లకు బోనొల్లాననుబాల*
*రణరంగమునకెట్లు రాదలంచె?*
*మగవారి గనిన దా మఱుగు చేరెడు నింతి*
*పగవారి గెల్వనేపగిది జూచె?*
*పసిడి యుయ్యెలలెక్క భయమందు భీరువు*
*ఖగపతి స్కంధమే పగిది నెక్కె?*
*సఖులకోలాహలస్వనములోర్వని కన్య*
*పటహభాంకృతులకెబ్భంగి నోర్చె?*
*ఆ. నీలకంఠములకు నృత్యంబు గఱపుచు*
*నలసి తలగిపోవు నలరుబోడి*
*యే విధముననుండె నెలమి నాలీఢాది*
*మానములను రిపంలమాన మడప?*
-భాగవత,౧౦స్కం,ఉ.౧౮౦
*సీ. వీణె జక్కగబట్ట వెరవెరుంగనికొమ్మ*
*బాణాసనం బెట్లు పట్ట నేర్చె?*
*మ్రాకున దీగె గూర్పంగ నేరని లేమ*
*గుణము నే క్రియ ధనుఃకోటి గూర్చె?*
*సరవి ముత్యము గ్రువ్వజాలని యబల యే*
*నిపుణత సంధించె నిశిత శరము?*
*చిలుకకు పద్యంబు సెప్పనేలని తన్వి*
*యస్త్రమంత్రము లెన్న డభ్యసించె?*
*ఆ. పలుకు మనిన పెక్కు పలుకని ముగుద యే*
*గతి నొనర్చె సింహగర్జనములు?*
*అనగ మెఱసె త్రిజగదభిరామ,గుణధామ,*
*చారుసత్యభామ,సత్యభామ!*
-భాగవత,౧౦స్కం,ఉ,౧౮౧
సత్యభామ అల్లెతాడుమోత ఉరుముగా,దేవతలు చాతక పక్షులుగా,ధనుస్సు ఇంద్రధనుస్సుగా,శ్రీకృష్ణుడు మేఘంగా, తాను మెఱుపు తీగగా,బాణాలు నీటితుంపురులుగా, రాక్ష సులు అనే కార్చిచ్చు ఆరిపోగా వర్షాకాలాన్నో సృష్టించింది.
*సీ.రాకేందు బింబమై రవిబింబమైయొప్పు*
*నీరజాతేక్షణ నెమ్మొగంబు,*
*కందర్పకేతువై ఘనధూమకేతువై*
*యలరు పూబోడి చేలాంచలంబు,*
*భావజు పరిధియై ప్రళయార్కు పరిధియై*
*మెఱయు నాకృష్టమై మెలత చాప,*
*మమృత ప్రవాహమై యనలసందోహమై*
*తనరారు నింతి సందర్శనంబు,*
*ఆ.హర్షదాయోయై మహారోషదాయియై,*
*పరగు ముద్దరాలి బాణ వృష్టి,*
*హరికి నరికి జూడ నందంద శృంగార*
*వీర రసము లోలి విస్తరిల్ల.*
-౧౦స్కం,ఉ,౧౮౩
సత్యభామాదేవి ఇలా హరికి అరికి మధ్య శృంగార వీర రసాలను విస్తరింప జేసింది.సత్యభామ ప్రయోగించిన వాడిబాణాలకు తాళలేక, ధైర్యంకోల్పోయిన రాక్షససేనలు చెదరిపోయి నరకాసురుని మరుగు జొచ్చాయి. అపుడు కృష్ణుడు సత్యభామ యుద్ధప్రయత్నాలను నివారిస్తూ ఇలా
అన్నాడు--
*క.'కొమ్మా! దానవనాథుని*
*కొ మ్మాహవమునకు తొలగె గురువిజయము గై*
*కొమ్మా! మెచ్చితి నిచ్చెద*
*కొ మ్మాభరణములు నీవు కోరినవెల్లన్' -౧౦,ఉ,౧౮౭*
శ్రీకృష్ణుడు సరససల్లాపాలతో కళావిశారద అయిన సత్యభామను
బహుమానించి,ఆమె చేతిలో ఉన్న ధనువును తిరిగి తీసు కున్నాడు.అపుడు నరకాసురుడు కృష్ణుడు ఇలా అన్నాడు-
*క.మగువ మగవారి ముందఱ*
*మగతనములు సూప రణము మానుట నీకున్*
*మగతనముగాదు; దనుజులు*
*మగువలదెస జనరు మగలమగ లగుట హరీ!*
(మగల మగలగుట-మగాళ్లకే మగాళ్లం, అంటే వీరులకే వీరులం)
నరకాసురుడు ఇలా అనగా కృష్ణుడు----
*క. నరకా! ఖండించెద మ*
*త్కరకాండాసన విముక్త ఘన శరముల భీ*
*కరకాయు నిన్ను సుర కి*
*న్నరకాంతలు సూచినేడు నందం బొందన్ -౧౦ఉ,౧౯౧*
శ్రీకృష్ణుడు దివ్యాస్త్రమైన శతఘ్నితో నరకుని భటులను మహా సంక్షోభానికి గురిచేశాడు.కృష్ణుడు బాణాలతో ఖండించిన గుర్రాలూ, గదతో బద్దలు చేసిన ఏనుగులూ, చక్రంతో ఖండితశిరస్కులైన రాక్షససైన్యం హాహాకారాలు చేస్తూ పారిపోయారు ~ రత్నమయకుండల సమేతమైన నరకాసురుని తలను
శ్రీకృష్ణుడు తన సుదర్శనచక్రంతో ఖండించాడు.నరకుడు రోదిస్తూ యుద్ధ భూమి మీద పడిపోయాడు.
దేవతలుమింటినుండిపూలవానకురిపించారు. భూలోకంలో
మానవాళి అమావాస్య చీకటి తొలగిందని ఆనందంతో దీపావళిని సంతరించి పండుగ చేసుకున్నారు. నరకుని చెఱలో ఉన్న పదారువేల కన్నియలు బంధవి ముక్తు లయ్యారు, ఈప్సితార్థాన్ని పొందారు. భూదేవి శ్రీకృష్ణుని స్తంతించింది-
*ఆ.ధాతగన్న మేటితండ్రికి నజునికి*
*నీకువందనంబునేనొర్తు*
*నిఖిలభూతరూప!నిరుపమ!ఈశ! ప*
*రాపరాత్మమహిత!యమిత చరిత!*
దీపావళి శుభాకాంక్షలతో
వైద్యంవేంకటేశ్వరాచార్యులు. మీభాగవత శ్రీచరణ రేణువు
వైద్యంవేంకటేశ్వరాచార్యులు🙏

No comments:
Post a Comment