*📖 మన ఇతిహాసాలు 📓*
*కుబేరుడు*
బ్రహ్మ మానసపుత్రులలో ప్రముఖుడు పులస్త్యబ్రహ్మ. పులస్త్యబ్రహ్మ కుమారుడు విశ్రవసువు. అతని భార్య దేవవర్షిణి, భరద్వాజ మహర్షి కుమార్తె. వీరి కుమారుడు వైశ్రవణుడు.
విశ్రవసువుకు కేకశి అనే మరో భార్య కూడా వుంది. ఆమె రాక్షసజాతి స్త్రీ. ఆమె వలన విశ్రవసువుకు నలుగురు సంతానం. వారే రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్ఫణకలు.
ఆ విధంగా, వైశ్రవణుడు, రావణుడు అన్నదమ్ములు. రాక్షసాంశ కలిగిన రావణునికి వైశ్రవణుడంటే అమిత ద్వేషం. తన బలపరాక్రమాలు ప్రదర్శించి రావణుడు ముల్లోకాలను గడగడలాడించాడు. వైశ్రవణుని సకలసంపదలను, అతనివద్దనున్న పుష్పకవిమానాన్ని కూడా దౌర్జన్యంగా లాగుకొని , వైశ్రవణునికి నిలువనీడ లేకుండా తరిమికొట్టాడు రావణాసురుడు. వైశ్రవణుడు తన ముత్తాత అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకోగా , బ్రహ్మ పరమేశ్వరుని వేడుకొనమని ఆదేశిస్తాడు. వైశ్రవణుడు నిద్రాహారాలు విసర్జించి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ ఈశ్వర సాక్షాత్కారం కోసం ఘోరంగా తపస్సు చేస్తాడు. అతని తపస్సును మెచ్చిన శివుడు పార్వతీదేవితో సహా ప్రత్యక్షమవుతాడు. ఆది దంపతుల దివ్యతేజస్సు వైశ్రవణుని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వరాలను కోరుకోమన్న పరమశివుని చూసిన ఆనందంలో ఏం కోరుకోవాలో తోచలేదు. శివసాక్షాత్కారమే తనకు లభించిన గొప్ప వరమని వేరే కోరికలేవీ లేవని వినయంగా చెప్పాడు వైశ్రవణుడు. అతని ఔన్నత్యాన్ని గుర్తించిన మహేశ్వరుడు సర్వలోకాలలో వున్న సంపదలన్నింటినీ సంరక్షించే గురుతర భాధ్యతలను ఒప్పగించాడు. కానీ, ఆ సంపదల వ్యామోహంలో తాను చిక్కకుండా వుండేందుకు పరమశివుడు ఆ సంపదలన్నింటిలో నివసించాలని కోరుకున్నాడు వైశ్రవణుడు.
వైశ్రవణుని గుణగణాలకు సంతసించిన పరమేశ్వరుడు అతనికి చేదోడుగా వుండేలా వరం అనుగ్రహించి , తనకు జరిగే సకల పూజలలో, అర్చనలలో, ఆరాధనలలో వైశ్రవణుని నామం కూడా ఉఛ్ఛరించేలా వరం ప్రసాదించి అతనికి కుబేరుడనే బిరుదాన్ని కూడా ప్రసాదించాడు.
ఆవిధంగా శివానుగ్రహంతో వైశ్రవణుడు కుబేరాధిపత్యాన్ని పొంది కుబేరుడుగా ప్రసిధ్ధి పొందాడు.forwaded Forwaded By KVG SARMA

No comments:
Post a Comment