Thursday, October 3, 2019

*ఇంద్రకృత మహాలక్ష్మీ అష్టకము ~ శ్లోక తాత్పర్యాలు*

*1:     నమస్తేస్థు మహామాయే శ్రీపీఠే సుర పూజితే*
        *శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్థుతే*

       దేవతల చేత పూజింపబడే  లక్ష్మికి తన హస్తమందే శంఖాన్ని, గదనూ ధరించి
శ్రీపీఠము పైన ఆశీనురాలైన ఆ మహాలక్షీదేవికి మా నమస్సులు.

*2:    నమస్తే గరుడారూడే కోలాసుర భయంకరీ*
        *సర్వ పాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్థుతే*

         గరుడుడిని అధిరోహించి కోలాసురునికి భయాన్ని కలిగించి, సర్వపాపాలనూ పోగొట్టుదానవైన శ్రీమహాలక్ష్మీదేవికి మా నమస్కారాలు.

*3:    సర్వజ్ఞే  సర్వ వదదే సర్వ దుష్ట భయంకరీ*
        *సర్వ దుఃఖహరే దేవీ మహాలక్ష్మీ నమోస్థుతే*

         సర్వజ్ఙురాలవు, అడిగిన వరాలను ఇచ్చే దానివి, దుష్టులకు భయం గొల్పేదానవు; అందరి దుఃఖాలనూ పారద్రోలేదానవు అయిన శ్రీ మహాలక్ష్మీ దేవీ నీకు నా నమోవాకాలు.

*4:    సిద్ది బుద్ది ప్రదే దేవీ భుక్తి ముక్తి ప్రదాయి‌నీ*
       *మంత్రమూర్తే సదా దేవీ మహాలక్ష్మీ నమోస్థుతే*

         సిద్దినీ, బుద్దినీ, ముక్తినీ ప్రసాదించే దానవు; ఎల్లప్పుడూ మంత్రమూర్తివైన శ్రీమహాలక్ష్మీ దేవీ నీకు మా వందనాలు‌.

*5:     ఆద్యంత రహితే దేవీ ఆద్య శక్తి మహేశ్వరీ*
         *యోగజ్ఞే  యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్థుతే*

           ఆది అంతాలు లేని దానవు; నీవు ఆద్యాశక్తివి, మహేశ్వరివి, యోగభాగము నుండీ జన్మించిన యోగ సంభూతురాలవైన శ్రీమహాలక్ష్మీ దేవివి
నీవు ~ నీకు దండాలు.

*8:     స్థూల సూక్ష్మ మహారౌద్ర మహా శక్తి మహోదరే*
         *మహా పాపహరే దేవీ మహాలక్ష్మీ నమోస్థుతే*

          సర్వ సామాన్య చర్మ చక్షువులకు కనిపించని  దానవు, స్థూల విరాట్రూపవు, త్రివిక్రమవు, మహారౌద్ర, మహా శక్తి స్వరూపిణివి, శరణాగత భక్తుల
మహాపాపాలను నాశనము చేసి ఆధ్యాత్మిక సిరిని ఇచ్చే శ్రీమహాలక్ష్మివి, నీకు నమస్కారము.

*9:      పద్మాసన స్థితే దేవీ పరబ్రహ్మ స్వరూపిణీ*
          *పరమేశి జగన్మాతః మహాలక్ష్మీ నమోస్థుతే*

            పద్మాసనములో కూర్చున్న పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవైన
శ్రీమహాలక్ష్మివి  ~ నీకు మా కైమోడ్పులు.

*10:    శ్వేతాంబర ధరే దేవీ నానాలంకార భూషితే*
          *జగత్స్థితే జగన్మాతః మహాలక్ష్మీ నమోస్థుతే*

           తెల్లని వస్త్రాలను ధరించి, సర్వాలంకార భూషణాలను కలిగినదానవు;
జగత్తు‌ను పాలించే జగన్మాతవైన శ్రీమహాలక్ష్మివి, నీకు మా నీరజనాలు.

*11:    మహాలక్ష్యష్టక స్థ్రోత్రం యః  పఠేద్బక్తి మాన్నరః*
          *సర్వ సుద్ది మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా*

            ఎవరైతే ఈ అష్టకాన్ని భక్తితో  ఏ నరుడు పఠిస్తాడో, అతనికి ఎల్లప్పుడూ
సర్వ సిద్దులూ, రాజ్యమూ కలుగుతాయి.

*12:     ఏక కాలే పఠేన్నిత్యం మహా పాప వినాశనమ్*
           *ద్వికాలే యః  పఠేన్నిత్యం ధన ధన్య సమన్వితః*

            ఎవరైతే ఒకసారి ఈ మహాలక్ష్మీ అష్టకాన్ని పఠిస్తారో, వారి మహాపాపాలు
నాశనమవుతాయి; రెండు సార్లు పఠిస్తే,  వారు ధనధాన్య సమృద్ది పొందుతారు.

*13.     త్రికాల యః  పఠేన్నిత్యం మహా శత్రు వినాశనమ్*
          *మహాలక్ష్మీ భవేన్నిత్యం ప్రసన్న వరదా శుభాః*

           ఎవరైతే మూడుకాలాలు పఠిస్తారో, వారికి మహా శత్రు వినాశనమవుతుంది; శ్రీమహాలక్ష్మి ఎప్పుడూ వారికి ప్రసన్నురాలై శుభకరమైన
వరాలనూ సర్వాన్నీ అనుగ్రహిస్తుంది.

~~~ ( సేకరణ : పి. యల్. నరసింహాచార్య దాసన్ ) ~~~

No comments:

Post a Comment