_*నారదుడి కొడుకులు ....*_
*ఎవరు ??*
ఆజన్మ బ్రహ్మచారి అయిన నారద మహర్షికి ఒక రోజు విచిత్రమైన కోరిక కలిగింది. సంసారం మాయ అంటారు కదా ! అదేంటో తెలుసుకోవాలనే కుతూహలం కలిగి, తన కోరిక విష్ణుమూర్తికి తెలియజేస్తాడు. భూలోకం లో ఒక కొలను (కాకినాడ దగ్గర, సర్పవరం భావనారాయణ గుడి ఎదురుగా వున్న తటాకము) చూపించి అందులో స్నానం చేసి రమ్మంటాడు విష్ణువు. సరేనంటూ అందులో దిగి స్నానం చేసి వచ్చేసరికి, నారదుడి ఒక స్త్రీ గా మారి, పూర్వ జన్మ జ్ఞానాన్ని కోల్పోతాడు. అంతలో అటుగా వచ్చినె ఒక రాజు, స్త్రీ రూపం లో వున్న నారదుడిని చూసి మోహించి ఆమెను వివాహము చేసికుంటాడు. వీరికి 60 మంది సంతానం కలుగుతారు. కొన్నేళ్ళ తరువాత శతృవులతొ జరిగిన యుధ్ధము లో , రాజు తన 60 మంది సంతానం తొ సహా మరణిస్తారు.
స్త్రీ రూపం లో వున్న నారదుడు అంతులేని దుఃఖానికి గురవుతాడు. మరణించిన వారికి ఉత్తరక్రియలు జరిపించి తరువాత తాను పూర్వం స్నానం చేసిన కొలనులో స్నానం చేయడంతో, అతనికి స్త్రీ రూపం పోతుంది. అయినా పుత్రులు యుధ్ధంలో మరణించిన దుఃఖము నుంచి తేరుకోలేకపోతాడు.
అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై, ఇదంతా తన మాయ వల్ల జరిగిందని చెపుతాడు. నారదుడి సంతానం పేరు శాశ్వతంగా నిలిచి వుండేలా వారు పేర్లే కాలప్రమాణాలుగా మారి, సంవత్సరం పేర్లుగా మారుతాయని వరమిచ్చాడు.
అలా నారదుడి సంతానమైన ప్రభవ, విభవ, శుక్ల తదితర 60 మంది పేర్లే ఇప్పుడు మనం వుపయోగిస్తున్న సంవత్సరం పేర్లుగా వ్యాప్తిలోకి వచ్చాయి.
*ఓం నమోః నారాయణాయ...*
*ఓం నమోః భావ నారాయణాయ*

No comments:
Post a Comment