Friday, December 29, 2017

28/12/17, 11:44:57 AM: Mani-TTE-Tenali: శ్రీ ఆదిశంకర విరచిత బాల కృష్ణాష్టకం


🕉లీలయ  కుచేల  మౌని  పాలితం  కృపాకరం  నీల  నీల  మింద్ర నీల నీలకాంతి మోహనం
బాలనీల  చారు  కొమలాలకం  విలాసగోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉ఇందుకుంద  మందహాస  మిందిరా  ధరధారం  నందగోపనందనం సనందనాది  వందితం  |
నందగోధనం  సురారి  మర్ధనం  సమస్త గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉వారి  హార  హీరా  చారు  కీర్తితం  విరాజితం  ద్వారకా  విహారమంబుజారి  సూర్య  లోచనం  |
భురిమేరు  ధీరమాది  కారణం  సుసేవ్య  గోపాలబాల జార  చోర బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉శేషభోగ  సాయినం విశేష  భూషనొజ్వలమ్  ఘోషమాన కింకిణి  విభీషనాది పోషణం|
శోశనాక్రుథామ్బుధిమ్  విభీషనార్చితం పదం  గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉పండితాఖిలస్తుతం  పుండరీక  భాస్వరం  కుండలప్రభాసమాన తున్డగండమండలం |
పుండరీక  సన్నుతం  జగన్నుతం  మనోగ్న్యకం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉ఆంజనేయ  ముఖ్య  పాల  వానరేంద్ర  కృంతనం  కుంజరారి భంజనమ్  నిరంజనం  శుభాకరం  |
మంజు  కంజ  పత్ర నేత్ర  రాజితం  విరాజితం గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రామనీయ యజ్ఞధామ భామిని  వరప్రదం  మనోహరం  గుణాభిరామ మున్నతోన్నతం  గురుం  |
సామ  గాన  వేణు  నాద లొలమర్చితాశ్టకమ్ గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉రంగ  డింఢి రాంగమంగళాంగ  సౌర్యభాసదా  సంగదాసురోత్తమాంగా భంగక  ప్రదాయకం  |
తుంగవైర  వాభిరమ  మంగళామృతమ్  సదా  - గోపాలబాల జార  చోర  బాలక్రిష్ణమాశ్రయే  ||

🕉బాలకృష్ణ  పుణ్యనామ లాలితం శుభాస్తకం  యే పఠన్తి  సాత్వికోత్తమాసదా  ముధాచ్యుతం  |
రాజమాన  పుత్ర సంపాదాది శోభనానితే సాధయంతి  విష్ణులోకమవ్యయం  నరాష్టతే ||


28/12/17, 10:52:26 PM: ‪+91 94414 31313‬: *భగవద్గీత ని వివిధ భాషల్లోకి అనువాదం చేసినది ఎవరు??*

పోస్ట్ చివరి దాకా చదవండి,  మీకో షాక్ తగులుతుంది.

భగవద్గీత  ని ఉర్దూ లోకి అనువదించిన వ్యక్తి
మొహమ్మద్ మెహరుల్లా (హిందూ ధర్మం స్వీకరించారు)

అరబిక్ లోకి అనువదించిన వ్యక్తి ఈ.ఎల్.ప్యాచ్ కమండో(ఇస్కాన్ లో చేరిపోయారు)

ఇంగ్లీష్ లోకి అనువదించిన వ్యక్తి చార్లెస్ విల్కినోస్
"సనాతన ధర్మం ఒక్కటే ఈ ప్రపంచంలో సర్వైవ్ అవ్వగలదు" అని అన్నారు.

బ్రెజిల్ లోకి అనువాదం చేసిన వ్యక్తులు: (బ్రాకెట్స్ లోవి వాళ్ళ ఒరిజినల్ పేర్లు)

హృదయనంద గోస్వామి ( హోవార్డ్ జె. రేనిస్క్)

అలానే నలుగురు భక్తులతో కలిసి చేసాడు

మహాకాళ దాస( లిమా మరికొ పొమ్బో),
లోకసాక్షి దాస (లుకో వలేర),
ఆరాధ్య దాస(కార్లోస్ ఫెర్నాండెస్ అమరో),
ఈశ్వర దాస(ఎనియస్ గువెర్రియో).

రష్యన్ లోకి అనువదించిన వ్యక్తి నోవికోవ్(కృష్ణ భక్తుడు ఐపోయాడు).

ఇప్పుడు ప్రపంచంలో వేరు వేరు భాషల్లోకి అనువాదం చేసిన వారి పేర్లు తెలుసుకుందాం.

హీబ్రు లోకి అనువాదం చేసినవారు (ఈయన ఇశ్రాయేలీయుడు):
బేజాషుటోన్ లీ ఫనా.

జర్మన్ లోకి అనువాదించిన వ్యక్తి - ఫిడెరిక్ మేయర్.

పర్షియన్ లోకి అనువదించిన వ్యక్తి- దారా షికోహ్.

చైనీస్ లోకి అనువాదం చేసిన వారు- జెన్ కెము,జోవ గువోహ్వ ఇద్దరితో జి బిజూహాంగ్.

అలానే హువాంగ్ బావోషేంగ్ తో మరో నలుగురు
గువో లియాంగన్,లీ నాన్,జి వెయిజన్,డ్యూయన్ కీన్గ్ ఒక కమిటీ లాగా ఏర్పడి అనువాదం చేశారు.

స్పానిష్ లోకి అనువాదం చేసిన వారు హార్మోన్డ్స్ వర్త్, రైడర్&కో.

జనపనీస్ లోకి అనువాదం చేసిన వ్యక్తి- సర్ ఎడ్విన్ ఆర్నాల్డ్. ఒక జపనీస్ మహిళ ని వివాహం చేసుకుని ఆ భాష లోకి అనువాదం చేశారు.

లాటిన్ లోకి అనువాదం చేసిన వ్యక్తి- ఆగస్టు విల్హేమ్.

ఫ్రెంచ్ లోకి అనువాదం చేసినది- పర్రాడ్.

గ్రీకు లోకి అనువాదం చేసినది- జార్జ్ కె. టైపాల్ దాస్.

ఇప్పటి వరకు మన భగవద్గీత ని 230 భాషల్లో మేధావులు అనువదించారు వాళ్ళల్లో
58 బెంగాలీ
44 ఇంగ్లీష్
12 జెర్మన్
4 రష్యన్
4 ఫ్రెంచ్
13 స్పానిష్
5 అరబిక్
3 ఉర్దూ అలానే మరెన్నో భాషల లోకి అనువాదాలు ఉన్నాయి.

చివరి ట్విస్ట్ ఏంటి అంటే, ఖురాన్ ని
బెంగాలీ లోకి అనువదించినది గిరీష్ చంద్రసేన్....కానీ ఆయన ముస్లిం అవ్వలేదు హిందూ గానే కొనసాగుతున్నారు.

- హిందూ ధర్మ చక్రం.

Proud to be Hindu.
29/12/17, 7:07:29 AM: ‪+91 94411 78068‬: _జీవితంలో జరిగిన మంచిని పదే పదే జ్ఞాపకం చేసుకోండి!  ప్రాణశక్తి పెరుగుతుంది!_

_చెడుని అసలు గుర్తుకు తెచ్చుకోవద్దు !  నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది!_

_మంచి ఆలోచనలను మించిన ఆరోగ్యం లేదు_

_*శుభోదయం*_
29/12/17, 7:46:53 AM: ‪+91 79811 59026‬: *భజంతం భక్తమత్యాజ్య మదుష్టం త్యజతః సుఖమ్‌।*
*నేహ నాముత్ర పశ్యామి తస్మాచ్చక్ర దివం వ్రజ॥*
🥀
ఎవరైతే మనపట్ల విశ్వాసంతో ఉన్నారో, ఎవరైతే మనని అమితంగా ప్రేమిస్తున్నారో... అలాంటివారిని వదలిపెట్టకూడదు. అలాంటివారిని కనుక వదలిపెట్టామంటే మనకిక ఇహంలోనూ, పరంలోనూ కూడా సుఖం సాధ్యం కాదు!

29/12/17, 7:06:53 AM: ‪+91 94411 78068‬: *బహుజన ప్రియా బ్రాహ్మణా వందనం*

ఎంతో కష్ట పడి అహో రాత్రాలు తాను కష్ట పడి ఎన్నో సాంప్రదాయ వ్యవహారాల మధ్య
నేర్చుకున్న తన జ్ఞానంతో బోధ గురువుగా మారి,
వెలిగే దీపమే మరియొక దీపాన్ని వెలిగిస్తుందని నిండుగా నమ్మి తన జ్ఞానం ఎందరికో జ్ఞాన
కిరణమవ్వాలని అనే త్యాగ భావనతో బ్రతికే వారే బ్రాహ్మణులు.
తాను ఉన్న ఊరిని,జన్మనిచ్చిన
కన్న వారిని,
రక్త బంధువులను,
ప్రాణ మిత్రులకు దూరంగా జరిగి విశ్వ మంతా తన ఇల్లే,సర్వ జనులు తన వాళ్ళే అనుకునే జ్ఞాన మేఘ దూతలు బ్రాహ్మణులు.

అందరికీ తనకు తెలిసిన విద్యలను పంచాలను కునే లోక బంధువులు బ్రాహ్మణులు.

వేదం పేరుతో,వైదీకం పేరుతో,ఉద్యోగాల పేరుతో,వ్యాపారాల పేరుతో,మన్న జనుల కన్నా తనకు తోచిన విలువలను పది మందికి పంచే గంగా నదిలా ఎక్కడో పుట్టి,ఎక్కడో పెరిగి,ఎక్కడో మట్టిలో కలిసే మహాశయుడే బ్రాహ్మణుడు.

తాను ఉన్న చోట నిత్య కల్యాణం,పచ్చ తోరణం కావాలనుకునే ఏకైన జాతి  వ్యక్తి బ్రాహ్మణుడే.

1 రూపాయి.2తమలపాకులు
3 అరటి పండ్లు
4నమస్కారాలకే
అష్టైశ్వర్యాలు అవి
ఇచ్చిన వారికి కలగాలని
చిత్త శుద్ధితో కోరుకునే అగ్ర మనస్కుడే బ్రాహ్మణుడు.

తన ఇంటి శుభ కార్యం కన్నా,ఎదురింటి మంగళ వాక్యాలకే ఉరకలెత్తే నిష్కల్మషుడే బ్రాహ్మణుడు.

తన విద్యనంతటినీ
ఎదుటి వారికి ధారపోసే
దాన శీలి బ్రాహ్మణుడు.

ఒంటి మీద చొక్కా లేకుండా ప్రపంచ మంటా చుట్టి రాగల నేషనల్ పర్మిట్ ఉన్న సూర్యతేజ సముడు బ్రాహ్మణుడు.

అందరి పాపాలను తాను స్వీకరించి మోసి,భరించే అగ్ని హోత్రుడు బ్రాహ్మణుడు.

తాను ఉపవాసముండి
సరైన తిండి తినకున్నా
తన వద్దకు వచ్చిన వారందరికీ మహా ప్రసాదాలు పెట్టే వర ప్రసాదుడు బ్రాహ్మణుడు.

ఎన్నో యజ్ఞ,
యాగ,జప,
హోమ,పుణ్య
క్రతువుల
తపః ఫలము బ్రాహ్మణుడు.

నేడు ఆ త్యాగానికి విలువ లేదు.ఆ విలువలకు వలువలు లేవు.
బ్రతకలేక ఊరు వదిలి వచ్చిన అనాధ బ్రతుకయ్యాడు బ్రాహ్మణుడు.

బ్రాహ్మణుడు నేడు రెంటికి చెడ్డ రేవడయ్యాడు.
ఎవరికో వెలుగిద్దామని,ఎందరి జీవితాలకో వెలుగిచ్చే బ్రాహ్మణ జీవితం తిరిగే రాయికి నాచు కూడా అంటదు
( రోలింగ్ స్టోన్ గేదర్స్ నో మాస్)అనే మాటకు నిదర్శనమయ్యింది.
పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు వదిలేసాడు
అన్న పాటకు తాళమయ్యింది.

అందరూ బావుండాలనుకునే బ్రాహ్మణుడిని లోకం అంతా అర్ధం చేసుకునే ముందు,
తోటి బ్రాహ్మణుడే అక్కున చేర్చుకోవాలి.
అప్పుడే బ్రాహ్మణ జాతి బ్రతుకుతుంది.
బ్రాహ్మణో మమ దేవతా
29/12/17, 7:09:49 AM: ‪+91 98660 49721‬: వైకుంఠ ఏకాదశి నాడు జరిపే ఉత్తర ద్వారా దర్శనం ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?:
అసుర బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్లి ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించి, స్వామి అనుగ్రహం పొంది, రాక్షస పీడ వదిలించుకున్నారు.
ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనాను గ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. దీన్నే హరివాసరమని, హరిదినమని వైకుంఠ దినమని అంటారు.

ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు "వైకుంఠ ఏకదశీ వ్రతం" ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. పర్వత సలహా మేరకు వైఖానసుడనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి నరక బాధలు అనుభవిస్తున్న పితృదేవతలకు విముక్తి కలిగించాడని పురాణాలు చెబుతున్నాయి.

అలాగే కృత యుగంలో "ముర" అనే రాక్షసుడు దేవతులను, సాధువులను క్రూరంగా హింసించే వాడు. ముర అక్రమాలను భరించలేక దేవతలు నారాయణ స్వామి వద్ద మొరపెట్టుకున్నారు. భగవంతుడు మురాసురుడి మీదికి దండెత్తి, అతని వధించాడు. ముర వెళ్లి సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటే, అతన్ని బైటికి రప్పించేందుకు ఉపాయం పన్ని గోవిందుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తూ పడుకున్నాడు.

అదే అదననుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి, విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తగానే, మహాలక్ష్మి దుర్గ రూపంలో ప్రత్యక్షమై మురను సంహరించగా, ప్రసన్నుడైన పరమాత్మ ఆమెకు ఏకాదశి అన్న బిరుదు ప్రసాదించాడు. నాటి నుంచి ఏకాదశీ వ్రతం పేరుతో అమ్మవారిని అర్చిస్తామని పురోహితులు అంటున్నారు.

వైష్ణవ ఆళ్వారుల్లో శ్రీనమ్మాళ్వారులీ రోజున పరమపదించడం వల్ల శ్రీ వైష్ణవులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశీ వ్రత మాచరిస్తారు. ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా శ్రీ తిరుమల వేంకటేశ్వరుని ఆలయంలోను ప్రాత: కాలం నుంచీ ప్రత్యేక ఉత్తర ద్వార దర్శనం కలుగుతుంది. దీనికి వైకుంఠ ద్వారమని ప్రతీతి. సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోని ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నారు.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

ఉపవసించలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు భుజించి ఉండవచ్చును. ముక్కోటి ఏకాదశి నడు చేసే విష్ణు పూజ, గీతా పారాయణం, గోవింద నామ స్మరణం, పురాణ శ్రవణం మోక్ష ప్రాప్తి కలిగిస్తాయి. ఇంకా ఏకాదశి వ్రతముండే వారికి మరు జన్మంటూ ఉండదని పురోహితులు చెబుతున్నారు.డా. దెందుకూరి విద్యానాథ్


29/12/17, 7:05:47 AM: TATA SUDHARANI: ముక్కోటి ఏకాదశి రోజున ఏమి చేయాలి..? ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు కోటి పుణ్యాలకు సాటి  – ఈ ముక్కోటి ఏకాదశి
హైందవుల పండుగలన్నీ అయితే చంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకొంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి! సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించిన తరువాత (సౌరమానం) వచ్చే శుద్ధ ఏకాదశి (చంద్రమానం) రోజున ముక్కోటి ఏకాదశిని వైభవంగా జరుపుకొంటారు. ఈ పుణ్యతిథి గురించి మరిన్ని విశేషాలు…

ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకున్నారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చిందట. ఇక ఈనాడే మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగించి, వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణుభగవానుడు. తమలాగే ఈరోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారాన్ని నిర్మించి స్వామిని దర్శించుకుంటారో, వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారట వారిరువురూ. అప్పటినుంచీ ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. ఈ ఏకాదశినాడే వైకుంఠంలోని విష్ణుమూర్తివారి ఆంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి ‘వైకుంఠ ఏకాదశి’ అన్న పేరూ స్థిరపడింది.
 
అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైన రోజు. పూర్వం మురాసురుడనే రాక్షసుని సంహరించేందుకు, విష్ణుమూర్తి నుంచి ఒక అంశ వెలువడిందట. ఆమే ఏకాదశి అనే దేవత! ఏకాదశి సేవకు మెచ్చిన విష్ణుమూర్తి, తిథులలోకెల్లా ఏకాదశి గొప్ప తిథిగా ఎంచబడుతుందనీ, ఎవరైతే ఆ రోజు నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేస్తారో వారు వైకుంఠాన్ని చేరుకుంటారనీ వరాన్ని ఒసగాడు. అందుకనే ప్రతి ఏకాదశినాడూ మన పెద్దలు క్రమం తప్పకుండా ఉపవాసం చేసేవారు. దీని వల్ల ఏకాదశి ఫలం అనే పుణ్యమూ, ఆరోగ్యమనే పురుషార్థమూ రెండూ లభించేవి. అయితే సూర్యడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ ధనుర్మాసంలోని ముక్కోటి ఏకాదశినాడు కనుక ఉపవాసం చేస్తే, మిగతా ఏకాదశి రోజులలన్నింటిలోనూ ఉపవాసం ఉన్నంత ఫలం దక్కుతుందని నమ్మకం.
వైకుంఠ ఏకాదశినాడు తప్పకుండా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రత విధానం ప్రకారం దశమినాటి రాత్రి నుంచే ఉపవాసానికి ఉపక్రమించాలి. ఏకాదశినాడు కేవలం తులసితీర్థాన్ని మాత్రమే సేవిస్తూ ఆహారానికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఏకాదశినాడు బియ్యంలో మురాసురుడు నివసిస్తాడని చెబుతారు. బియ్యంతో చేసిన ఆహారం పూర్తిగా నిషిద్ధం అని కరాఖండిగా చెప్పేందుకే ఈ మాట అని ఉంటారు. ఏకాదశినాడు కేవలం ఉపవాసం ఉండటమే కాదు… ధ్యానంతోనూ, జపతపాలతోనూ కాలం గడపమని సూచిస్తారు పెద్దలు. ఇక ఆ రాత్రి కూడా భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు అన్నారు కదా! ఆ ఆకలి, నిద్రలు రెంటినీ తట్టుకుని, వాటిని అదుపులో ఉంచుకోవడమే ఏకాదశి వ్రత విశిష్ఠత. ఇక మరునాడు ద్వాదశినాడు ఎవరికన్నా అన్నదానం చేసి ఆ తరువాత ఉపవాసాన్ని విరమించాలి.
వైకుంఠ ఏకాదశినాడు వైష్ణవాలయాల్లో ప్రత్యేకంగా తెరిచి ఉంచే వైకుంఠ ద్వారంగుండా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఎదురుచూస్తారు. కలియుగ వైకుంఠమైన తిరుమలలో కూడా ఈనాడు, శ్రీవారి గర్భాలయాన్ని ఆనుకుని ఉన్న వైకుంఠప్రదక్షిణ మార్గం ద్వారా భక్తులు నడిచే భాగ్యం లభిస్తుంది. ఏకాదశినాడు తిరుమలలో జరిగే మలయప్ప స్వామివారి ఊరేగింపు, ద్వాదశినాడు స్వామివారి పుష్కరణిలో జరిగే చక్రస్నానాలను దర్శించిన భక్తులు పుణీతులవుతారు.
ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తే కనుక ఆ ఏకాదశిని మోక్షదైకాదశి అని కూడా అంటారు. వైఖానసుడు అనే ఒక రాజు తన తండ్రిని నరకలోకం నుంచి తప్పించేందుకు ఏకాదశి వ్రతాన్ని నిష్ఠాగా ఆచరించాడట. ఆతని వ్రత ఫలితంగా తండ్రి నరకం నుంచి విడుదలై స్వర్గలోకానికి చేరుకున్నాడట. అందుకని ఈ ఏకాదశికి మోక్షదైకాదశి అన్న పేరు వచ్చింది.
29/12/17, 5:52:48 PM: Seetha Prasanna: *నలుగురికి సాయం చేసే గుణమే నీదయితే నువ్వు ఏ గుడికే వెళ్ళవలసిన అవసరం లేదు.*
నువ్వు నమ్మె దైవం నిన్ను వెతుకుంటా నీ ఇంటికి వస్తాడు.

వాడని ఇనుము తుప్పుపడుతుంది.
కదలని నీరు స్వచ్చతని కోల్పోతుంది.
బద్దకం మెదడును నిస్తేజం చేస్తుంది.
                   
పిల్లలకు ఆస్థిని బహుమతిగా ఇవ్వకండి

పిల్లలు మేధావులైతే,
"మీ ఆస్థి మాకెందుకు"
  అంటారు.
పిల్లలు వెధవులైతే
"మీ ఆస్థి తగలెట్టేస్తారు".
        అందుకే
*"చదువును ఆస్థిగా యిద్దాం*
*సంస్కారాన్ని బహుమతి గా ఇద్దాం"*.

2 9/1 2/17, 7:40:37 PM: ‪+91 94414 31313‬శివాయ నమః; రుద్రాయ నమః పశుపతయేనమః; నీలకంఠాయ నమః; మహేశ్వరాయ నమః; హరికేశాయ నమః; విరూపాక్షాయ నమః; పినాకినే నమః; త్రిపురాంతకాయ నమః; శంభవే నమః; శూలినే నమః; మహాదేవాయ నమః : ఈ కింది శివనామాలతో శివారాధన చేయడం పాప సంహారకం. శివాయ నమః; రుద్రాయ నమః పశుపతయేనమః; నీలకంఠాయ నమః; మహేశ్వరాయ నమః; హరికేశాయ నమః; విరూపాక్షాయ నమః; పినాకినే నమః; త్రిపురాంతకాయ నమః; శంభవే నమః; శూలినే నమః; మహాదేవాయ నమః  అశక్తులు ఈ పన్నెండు నామాలు మనసులో అనుకున్నా చాలు.

Wednesday, December 27, 2017

pictures






















26/12/17, 8:35:31 PM: ‪+91 91776 98078‬: కైలాశము    నుండి  ఆదిశంకరులు  తీసుకువచ్చిన  అయిదు  లింగములు 
ఎక్కడున్నాయి 
కైలాశము  నుండి  ఆదిశంకరులు  తీసుకువచ్చిన  అయిదు  లింగములు 
ఎక్కడున్నాయో  చూద్దాం.

1.భోగలింగము – శృంగేరిలో  ఉన్నది

2. వరలింగము – నేపాల్ లో  ఉన్నది

3. ముక్తిలింగము – కేదారేశ్వరంలో  ఉన్నది.

4.యోగలింగము – కాంచీపురంలో  (శ్రీకామకోటి  మఠంలో)  ఉన్నది.

5.మోక్షలింగము- చిదంబంలో  ఉన్నది.

ఆదిశంకరులు  కైలాసము  నుండి  తీసుకువచ్చిన  అయిదు  లింగములు
ఇవే.

        ఓం  నమః  శివాయ

27/12/17, 7:48:21 AM: ‪+91 79811 59026‬: *కారణము లేని కలహంబు కరుణలేమి*
*పరవధూ పరధనవాంఛ బంధుసాధు*
*జనములందున హిష్ణుత్వ మనగ జగతి*
*బ్రకృతిసిద్ధంబులివి దుష్టనికరమునకు!*
🥀
కారణం లేకుండా తగాదాకు పెట్టుకునే ప్రయత్నం చేయడం; జాలి లేకపోవడం; పరస్త్రీలను, పరుల ధనాన్ని పొందాలనుకోవడం; బంధువుల పట్ల, సత్పురుషుల పట్ల అయిష్టతతో మెలగడం... ఇవన్నీ కూడా దుర్మార్గుని సహజస్వభావానికి ప్రతీకలు!

27/12/17, 8:48:57 AM: ‪+91 91603 86447‬: 🔯🌼 🌸 🙏 🌅 🌸 🌼🔯
🙏మంచిమాటతో మరో రోజు 🙏

*మధునా సించయేన్నింబం*
*నింబః కిం మధురాయతే?*

తేనెను చిలకరించిననూ
వేపాకు తియ్యనగునా?

🌺🌷శుభం భూయాత్ 🌷🌺
27/12/17, 10:28:31 AM: ‪+91 94411 78068‬: *"మోక్షాన్ని ఎవరు ఇప్పించగలరు ?*
----------------------

  ఒక రాజు ఉన్నాడు. "భాగవతాన్ని విన్న వెంటనే పరీక్షిత్తుకు పరమపదం ప్రాప్తించిందని ఆయన తెలుసుకుని ఒక పండితుని తన ఆస్థానానికి పిలిపించుకుని భాగవత పారాయణ చెయ్యమని కోరాడు. రాజు ఏడు రోజులు
నియమబద్ధంగా భాగవతకథను ఆలకించి పరిసమాప్తి చేశాడు.

  మరుసటిరోజు పండితుని పిలిపించి
రాజు "స్వామీ! మీరు భాగవతాన్ని ఎంతో
శ్రద్ధగా విన్పించారు. నేను కూడా శ్రద్ధగా
విన్నాను. మరి నాకెందుకు ఉత్తమగతులు కలుగలేదు? అని ప్రశ్నించాడు. దానికి ఆ పండితుడు --
"ప్రభూ! మీ ప్రశ్నకు నావద్ద సమాధానం
లేదు. బహుశా నా గురువు మీ సందేహాన్ని తీర్చగలరు" అనగారాజ
సభకు గురువుగార్ని సాదరంగా రప్పించారు. మహారాజు ఆ గురువుకు
నమస్కరించి అతిధి సత్కారములు చేసి తన సందేహం ఆయన ముందు ఉంచారు. 'గురువర్యా! భాగవతాన్ని విన్నా నాకెందుకు ముక్తి కలుగలేదు?

  గురువు రాజుతో-- "ప్రభూ! కాసేపు మీ
అధికారాన్ని నాకు ఇవ్వండి".అలాగే
నన్నాడు రాజు. ఇప్పుడు ఆ గురువే రాజైనాడు. రాజుగా మారిన గురువు వెంటనే రాజుగారిని మరియు  పండితుణ్ని బంధింపజేసాడు.తర్వాత
పండితునితో " ఓయీ! నీవు రాజును
బంధవిముక్తుని చేయుము "అని ఆజ్ఞాపించాడు. దానికి పండితుడు
"ఆచార్యా! స్వయంగా నేెను బంధితుడనై ఉన్నాను. ఇక నేను మహారాజును ఎలా
విడుదల చేయగలను ?" వెంటనే గురువు
మహారాజుతో "రాజా! మీ ప్రశ్నకు సమా
ధానం లభించినదా? అడుగగా రాజు తనకర్థం కాలేదనగా గురువు తిరిగి ఇలా అన్నారు.

"రాజా! స్వయంగా బంధితుడైన వ్యక్తి
ఎదుటివారిని బంధాలనుండి తప్పించలేడు. అర్థమైనది కదా! అలాగే ముక్తుడు కానివాడు మరొకరికి ముక్తిని
ప్రసాదించలేడు. సిద్ధుడు, ముక్తసంగుడైన
వాడే శ్రద్ధాళువుకు ఉత్తమగతిని కల్పించ
గలడు. " అని వివరించాడు.

  శుకమహర్షి వంటి ముక్తిసంగుడు, పరీక్షత్తు వంటి శ్రద్ధాళువు ఉన్నపుడే
ముక్తి లబించగలదని భావం.

నీతి:  జ్ఞానియైన గురువునకు శ్రద్ధగల  శిష్యుడు సమకూరినప్పుడే మోక్షం లభించగలదు.


27/12/17, 12:32:19 PM: ‪+91 91776 98078‬: 🕉 *మహాదశలు* 🔯
  🙏 *శ్రీ గురుభ్యోనమః* 🙏 🔮 *నమ సభాయైనమః* 🔮
      🌞  *అరుణోదయ సంకాశం* 🌞
*శ్లో" సూర్య చంద్రమసౌ మహిసుతతమో జీవశ్చ విజ్ఞద్వజా శ్శు శ్రుశ్చాపి సమం సబుక్ష ఏయతస్యుః! కృత్తికాది క్రమాత్ షటికై్్మల.పురాణ షోడశ కిలోనా వింశతి స్వేకయా చైషాంసప్త దశా త్రివింశతి రితి  ప్రోక్తా ద్వాదశాః*!!?💐💐💐🙏🙏🙏 *ఇతి శివోహం*
27/12/17, 2:26:38 PM: ‪+91 91776 98078‬: ఆయుర్దాయం
         

శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ  ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి

అనేది వేద  ఆశీర్వచనం.. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది.

"వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం".

అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో
పశ్యేమ శరదశ్శతం,  జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం అని చెప్పబడించి.

నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం.

ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. గుడ్ మార్నింగ్ అని చెప్పడం,
గుడ్ నైట్ చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం.

మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది.

ఇది పూర్వకాలపు విషయమే కాదు,  నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.

“బ్రతికి యుండిన
  శుభములు
  బడయవచ్చు
కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది.

అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే.

కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి?

అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే, ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా?

దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా?

ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః
అని చెప్పబడింది.

అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయని" దాని అర్థం. ఆయుర్దాయం,

మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా
ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న.

లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని,
జరిగి తీరుతుందని మరికొందరి మాట.

ఏది నిజం మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న. ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది.

ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది.

అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.

లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు,
శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం.

అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం.
ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన
వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.

కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది.

కాబట్టే మన పూర్వజులు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం
అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని,

శతమానం భవతి అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.
అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి


27/12/17, 6:28:35 AM: Rajeswararao: 🙏 ఒక తెలుగు అభిమాని కవిత 🙏

పూతరేకులరిసె పూర్ణాలు బొబ్బట్లు
కాకినాడ కాజ కజ్జికాయ
బాదుషాలు జాంగ్రి పాయసమ్ముల కన్న
తీయనైన భాష తెలుగు భాష!

మిసిమి బంగినపల్లి మామిడుల రుచులు
తాటిముంజలు మేటి సీతాఫలాలు
మెరయు చక్కెరకేళి మాధురులకన్న
తీయనైనది నా భాష తెలుగు భాష!

పెసర పిండి  పైన  ప్రియమగు నల్లంబు
దాని పైన మిర్చి దద్దరిల్ల
జీల కర్ర తోడచేర్చిన ఉప్మాకు 
సాటి తెలుగు  భాష మేటి భాష

స్వర్గ మందు దొఱకు చప్పని అమృతంబు
తాగ లెక సురులు ధరణి లొన
ఆంధ్ర దెశమందు ఆవిర్భవింతురు   
ఆవ కాయ కొఱకు నంగలార్చి.

కూర్మి తోడ తెచ్చి గోంగూర యాకులు
రుబ్బి నూనె మిర్చి ఇంపు తోడ
కారమింగువలను  తగిలించి తిను వాడు
ఘనుడు తెలుగు వాడు కాదె భువిని

ఆట వెలది యనిన అభిమానమెక్కువ
తేట గీతి యనిన తియ్య దనము
సీస పద్యమనిన చిత్తమ్ము రంజిల్లు
కంద పద్యమెంత సుందరమ్ము
27/12/17, 3:42:07 PM: ‪+91 94414 31313‬: మామిడి చెట్టు అందంట ఏ భూమి పైన నేనే గొప్ప అని అది విన్న కొబ్బరి చెట్టు, అరటి, రావి, వేప, ఎలా ఒక్కటేంటి, చివరికి లిల్లీ ఫ్లవర్ కాలిఫ్లవర్ తో సహా అన్ని మేమంటే మేమె మిగిలిన వాళ్ళు వేస్ట్ అని దేనికి అవే వర్గాలుగా వేరుపడి పార్టీ లుగా మతలుగా మారిపోయాయి. అపుడు వీళ్ళ గొడవ చూసి నారదుడు వచ్చి ఓసి పిచ్చి నా మొక్కలు అస్సలు మీరంతా బతుకు తున్నది భూమి పైన భూమిని ఆధారం గా చేసుకుని అసలు భూమి అనేది లేకపోతె మీ ఉనికి లేదు అన్నారట. అలాగే సనాతన ధర్మం భూమి లాంటిది దానిపైన ఎన్ని పిచ్చి మొక్కలు వచ్చేనా సనాతన ధర్మాన్ని గెలవలేరు, వాళ్ళ ఉనికిని కొలిపోతారు.


27/12/17, 4:34:00 PM: Mani: 🙏💐శుభోదయం💐🙏

జ్యోతిష్య పాఠం  2

మొదటి పాఠం లో 27 నక్షత్రాలు ఉంటాయని వాటి పేర్లు నేర్చుకున్నాం.
మనం మాట్లాడే ప్రతి అక్షరానికి  ఒక నక్షత్రం ఉంటుంది,ఆ నక్షత్రం లోని భాగము ఉంటుంది.అనగా మనం పలికే అక్షరాలు ఏ నక్షత్రానికి వర్తిస్తాయో తెలుసుకుంటే మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మనం ఏ నక్షత్రానికి చెందుతామో ఈజీగా తెలుసుకోవచ్చు.
ఈ క్రింద ఏ నక్షత్రానికి ఏ యే అక్షరాలు వస్తాయో ఇస్తున్నాను.
ఒక నక్షత్రాన్ని 4 భాగాలుగా మన సౌలభ్యం కోసం విభజించారు.అనగా ఒక నక్షత్రానికి 4 భాగాలు అంటే 27 నక్షత్రాలకి 108 భాగాలు అన్నమాట.
ప్రపంచం లోని ఎవ్వరైనా ఈ 108 భాగాల్లో ఎదో ఒక భాగానికి చెందవలసిందే.ఈ 108 భాగాలకు కొన్ని గుర్తులు పెట్టారు అవి మనకు ఇంకా ఈజీగా ఉండటం కోసం మన అక్షరమాల లోని అక్షరాలు పొందుపరచటం జరిగింది.
అవి ఈ విధంగా ఉంటాయి,కొంచెం కష్టమయినప్పటికి బట్టి పట్టడం వల్ల మీరు తేలికగా పెరు చెప్పగానే వారు ఏ నక్షత్రం,ఏ భాగం కిందకు వస్తారో చెప్పేయవచ్చు.
ఇక నక్షత్రాలు వాటి భాగాలు పేర్లు,ఈ భాగాలనే పాదములు లేదా చరణాలు అంటారు.
చు,చే,చో,ల  ---అశ్విని
లి,లు,లే,లో------భరణి
ఆ,ఈ,ఉ,ఏ  ----కృత్తిక
ఓ,వ,వి,వు    ---రోహిణి
వే,వొ,క,కి    ----మృగశిర
కు,ఘం,జ్ఞ,చ(ఇక్కడ 'చ'అక్షరం వొత్తు ఉంటుంది)---ఆరుద్ర
కె,కో,హ,హి,  ---పునర్వసు
హు,హే,హో,డ  --పుష్యమి
డి,డు,డే,డో    ---ఆశ్లేష
మో,ట,టి,టు  ---మఘ
టి,టు,టే,టో    --పుబ్బ
టే,టో,ప,పి    ---ఉత్తర
పు,షం,ణ,ట(వొత్తు' ట')--హస్త
పే,పో,ర,రి-------చిత్త
రూ,రే,రో,త    ---స్వాతి
తి,తు,తే,తో  ---విశాఖ
న,ని,ను,నే    ----అనురాధ
నో,య,యి,యు ---జ్యేష్ఠ
యే,యో,బా,బి ---మూల
భూ,ధ,భా,డా    ---పూర్వాషాఢ
బే,బో,జ,జి----------ఉత్తరాషాఢ
జూ,జె,జో,ఖ  ---శ్రవణం
గ,గి,గు,గే      -----ధనిష్ఠ
గో,స,సి,సు  ----శతభిషం
సే,సో,దా,ది  ----పూర్వాభాద్ర
దు,శం,ఝ,థ --ఉత్తరాభాద్ర
దే,దో,చ,చి    ---రేవతి

ఏ పేర్లతో ఈ అక్షరాలు మొదలయిన ఆయా నక్షత్రములు ఆయా పడములుగా గుర్తించి ముందు చెప్పబోయే నక్షత్ర ఫలితములు
చెప్పవలెను.
ఇంతే కాకుండా కొన్ని సంయుక్తాక్షరములు అనగా వొత్తులతో కూడుకున్న పేర్లు ఉంటాయి అవి ఏ నక్షత్రాలకు చెందుతాయో 3 వ పాఠం లో తెలుసుకుందాం.
నమస్తే


 మన వివాహపరిచయవేదిక ఫేస్ బుక్ నందు 


Tuesday, December 26, 2017

23/12/17, 8:00:49 AM: ‪+91 91603 86447‬: 🔯🌼 🌸 🙏 🌅 🌸 🌼🔯
🙏మంచిమాటతో మరో రోజు 🙏

*యదృచ్ఛయోపపన్నేన*
*సంతుష్టో వర్తతే సుఖమ్ |*

ఫలాపేక్ష లేక ఉన్నంతలో తృప్తిగా, సంతోషంగా ఉండు మనిషి సుఖంగా బ్రతుకుతాడు.

🌺🌷శుభం భూయాత్ 🌷🌺
23/12/17, 12:50:02 PM: ‪+91 91776 98078‬: పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే ఫలితం

నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి.. పద్ధతి ప్రకారం నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. ఎలా చేయాలి ? ఎన్నిసార్లు చేయాలి ?
నవగ్రహాలు చాలా శక్తివంతమైనవి. కానీ వాటిని పూజించడానికి ప్రజలు జంకుతుంటారు. కారణం ఎప్పుడు, ఎలా ప్రదక్షిణలు చేయాలో తెలియదు. ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలియదు. నవ గ్రహాలకు ప్రదక్షిణ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలో తెలియదు. అయితే నవగ్రహ ప్రదక్షిణలకు ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. మానవ జీవం, మానసిక పరిస్థితి ప్రధానంగా వారి వారి గ్రహాల స్థితిపై ఆధారపడి వుంటుందని జ్యోతిష్క శాస్త్రం చెబుతోంది.
గ్రహస్థితిలో మార్పులు వల్లనే ఎవరి జీవితంలో అయినా ఒడిదుడుకులు ఎదురవ్వడం గానీ, లాభాలు, సంతోషాలు కలిసిరావడం గానీ వస్తుంటాయి. నవగ్రహ ప్రదక్షిణ మనిషి కష్టనష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకుంటుంది. నవగ్రహ ప్రదక్షిణలకు ఒక నిర్దిష్టమైన పద్ధతి వుంది. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణలు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది.

కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణ చేస్తుంటారు. సాధ్యమైనంత వరకూ ఇలా తాకకుండానే ప్రదక్షిణలు చేయాలి.

నవగ్రహ ప్రదక్షిణ చేయడానికి మంటపంలోకి వెళ్ళే ముందు, సూర్యుడిని చూస్తూ లోపలికి ప్రవేశించి ఎడమ వైపు నుండి (చంద్రుని వైపు నుంచి) కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణలు చేయడం ఉత్తమం.
ప్రదక్షిణలు పూర్తయ్యాక కుడివైపు నుంచి ఎడమవైపు (బుధుడి వైపు నుంచి) రాహువు, కేతువులను స్మరిస్తూ రెండు ప్రదక్షిణలు చేయవచ్చు.
చివరగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహం పేరు స్మరించుకుంటూ ఒక ప్రదక్షిణ చేసి, నవగ్రహాలకు వీపు చూపకుండా వెనుకకు రావాలి. ఇలా చేయడం వల్ల కొంత ఫలితం ఉంటుంది.
ఎప్పుడుపడితే అప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు. శుచిగా స్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించినప్పుడు మాత్రమే నవగ్రహ ప్రదక్షిణలు చేయాలి.

శివాలయాల్లో నవగ్రహాలుకు ప్రత్యేకమైన సన్నిధి వుంటుంది. మూలవిరాట్టును దర్శించుకుని బయటికి వచ్చాక నవగ్రహాలను దర్శించుకోవాలి.

“ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమ:” అంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణాలు చేస్తున్నంత సేపూ నవగ్రహ స్తోత్రాలు చదవాలి. 9 గ్రహాలకూ స్తుతిస్తూ శ్లోకాలు చదివి 9 ప్రదక్షిణలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహు, కేతువులకు మరో రెండు ప్రదక్షిణలు (అంటే మొత్తం 11) చేస్తే చాలా మంచిదంటారు. అసురులైన రాహుకేతువులను ఈ విధంగా సంతృప్తిపర్చడం వల్ల వారి కారణంగా ఆటంకాలు వుండవని నమ్మకం.
మొదటి ప్రదక్షిణలో జపాకుసుమాల వర్ణం గలవాడా, కాశ్యపగోత్రుడా, నవగ్రహమండలనాయకుడా, శ్రీసూర్యభగవానుడా, సదా శుభాన్ని అనుగ్రహింతువు గాక!
రెండో ప్రదక్షిణలో కటకరాశికి అధిపతి అయిన ఓ చంద్రుడా, పెరుగు, శంఖాల వంటి ధవళవర్ణం గలవాడా, ఆత్రేయగోత్రోద్భవుడా, శ్రీచంద్రభఘవానుడా, మమ్మల్ని కరుణించు!

మూడో ప్రదక్షిణలో బంగారు రంగుతో మెరిసిపోయేవాడా, వృశ్చిక మేషరాసులకు అధిపతి అయినవాడా, భరద్వాజగోత్రుడా, శ్రీ అంగారకుడా మాకు మంగళాలను ప్రసాదించు అని స్మరించుకోవాలి.

నాలుగో ప్రదక్షిణలో నల్లని వర్ణం గలవాడా, కన్యా మిథునరాసులకు అధిపతి అయినవాడా, ఉత్తరదిశలో బాణరూపమండలంలో వసించేవాడా, శ్రీబుధరాజా మాకు మేలు కలిగింతువు గాక!

ఐదో ప్రదక్షిణలో అంగీరసగోత్రుడా, ధనుస్సు, మీనరాసులకు అధిపుడా, దేవగురువైన బృహస్పతీ, శ్రీగురుభగవానుడా, మాపై కరుణను వర్షించు!

ఆరో ప్రదక్షిణలో భార్గవగోత్రం గలవాడా, దైత్యగురువైన శుక్రాచార్యుడా, స్త్రీభోగాలను ప్రసాదించేవాడా, మా పైన కరుణావృష్టిని కురిపించు అని స్మరించుకోవాలి.

ఏడో ప్రదక్షిణలో కాశ్యపగోత్రుడూ, కుంభ మృగశీర్షాలకు అధిపతి అయినవాడూ, దీర్ఘాయువును ప్రసాదించేవాడూ అయిన శ్రీశనైశ్చరుడా, మాకు మంగళాలు కలిగేలా చూడు!

ఎనిమిదో ప్రదక్షిణలో సింహికాగర్భసంభూతుడా, దక్షిణాన దక్షిణముఖంగా నక్షత్రమండలంలో వుండేవాడా, శ్రీరాహుభగవానుడా మాకు సదా మంగళాలు కలిగిచు!

తొమ్మిదో ప్రదక్షిణలో జైమినిగోత్రికుడా, గంగాయాత్రను సంప్రాప్తింపజేసేవాడా, రౌద్రస్వరూపంతో వుంటూ, రుద్రాత్మకుడుగా పేరు పడినవాడా, శ్రీకేతుభగవానుడా మాకు మేలు కలుగజేయి!అంటూ ప్రార్థించుకుంటూ ప్రదక్షిణలు చేయాలి.


23/12/17, 6:31:35 PM: ‪+91 91776 98078‬: గురువుగారిల్లు గుడితో సమానం
🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌿🌸🌿🌸🌿🌸
బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడికోసమే. అంతగా పరితపించే గురువు శిష్యుడినుండి ఏం కోరతాడు? ఏమీ ఉండదు. అంటే తను అడగ దలుచుకున్నది బలవంతంగా అణచుకోవడం కాదు. కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక. ’నాకిది కావాల్రా’ అని అడగడు. కారణం –ఆయన కోరుకుంటే ఇచ్చేవాడు వేరొకడున్నాడు(పరమేశ్వరుడు). ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుడి ముందు చేయిచాపడు. అయనకా అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడూ తృప్తితో ఉంటాడు.

మరి అటువంటి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం? గురువుగారు శరీరంలో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరం అనిత్యమని గురువుకు తెలుసు. అది పడిపోతుంది. కించిత్‌ బెంగపెట్టుకోడు. ‘నేను ఆత్మ, శాశ్వతం. ఎక్కడికీ వెళ్ళను’ అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటాడు. ఈ శరీరంతో అనుభవించడానికి ఆయనకు భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే... గతజన్మల తాలూకు కర్మఫలం పోతున్నదని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు.

ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతుంటే ఆయువు క్షీణిస్తుంటుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూంటాడు గురువు. ఆయన ఆయువు త్వరగా క్షీణిస్తుంది. ఇలా శిష్యులకోసం తన ఆయువును తాను తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చెయ్యడానికేమీ ఉండదు. మరి ఏం చేయాలి ? కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే – గురువుగారి ఇల్లు సాక్షాత్‌ పరమేశ్వరుడు కొలువైన దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి ఇంటిపక్కనుంచి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణంగా వెడతారు చాలామంది.

విరాటపర్వంలో ఉత్తరకుమారుడితో అర్జునుడు– ‘‘రథం నడపడంలో నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులవారు. వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరబాటున కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపున కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడి చేతివైపునే ఉండాలి. కారణం– నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే...నేను క్షత్రియుడిని కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలకు ప్రదక్షిణచేసి లోపలకు నడుపు’’ అన్నాడు. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువులకు ఒరిగేదేమీ ఉండదు. శిష్యుడి స్థాయి పెరుగుతుంది. అంతే. గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడంవంటివి చేస్తారు.

దేహ శుశ్రూష–దేహము అంటే దహ్యమానమయిపోతుంది. ఆయన శరీరం బడలిపోతుంది. నీరసపడిపోతుంది. వయసు పెద్దదవుతుంది. శరీరంలో బలమూ తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడిపట్ల ప్రేమ ఎక్కువవుతుంటుంది. ఆ గురువు ఉండాలి ఆ శరీరంలో. అందుని గురువుగారు పడుకుంటే ఆయన కాళ్ళు ఒత్తుతారు. మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారు నదీస్నానం చేస్తుంటే ప్రవాహదిశలో దిగువకు శిష్యుడు స్నానం చేస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరు గంగకన్నా గొప్పది.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
24/12/17, 4:06:47 PM: ‪+91 91776 98078‬: *మహాకవి భారవి వ్రాసిన ఈ పద్యాన్ని గట్టిగా చదవండి.నోటికి వ్యాయామాన్ని అందించండి. పద్యాన్ని తప్పులుపోకుండా చదవగలిగినందుకు తెలుగు వాడిగా గర్వించండి.*👍👌👏👏👏
*షడ్జామడ్జ ఖరాడ్జవీడ్జ* *వసుధాడ్జాలాంశ్చ మడ్గాఖరే*
*జడ్జట్కిట్కి ధరాడ్జ రేడ్ఫన* *ఘనఃఖడ్జోత వీడ్యద్భ్రమా*
*వీడ్యాలుడ్భ్రమ* *లుట్ప్రయట్ట్రియపదాట్డ్గ్రడడ్గ్రడ్గ్రహా*
*పాదౌటేట్పర్టటట్ప్రటప్రటట్రస ప్రఖ్యాత సఖ్యోదయా*

*అందరూ ప్రయత్నించగలరు అండి తెలుగు వారిగా ఇలాంటి పద్యాలు మనకు అందించిన మహా కవులకు మా ధన్యవాదాలు*💐💐💐🙏🙏🙏🙏🙏🙏

24/12/17, 9:51:48 AM: ‪+91 91776 98078‬: *షోడశ సంస్కారాలు*





సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును.

సంస్కారములు మొత్తము పదహారు. వీనినే షోడశ సంస్కారములు అని కూడా వ్యవహరించెదరు. ఈ పదహారు సంస్కారములను తిరిగి రెండు విభాగముల క్రింద విభజించారు. అవి జనన పూర్వ సంస్కారములు (పుట్టుకకు ముందు), మరియు జననానంతర సంస్కారములు (పుట్టిన తరువాత). మొదటి మూడు సంస్కారములు జనన పూర్వ సంస్కారములు, ఆపై పదమూడు సంస్కారములు జననానంతర సంస్కారములు.

వ్యక్తి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు:

గర్భాదానం

పుంసవనం

సీమంతం

జాతకర్మ

నామకరణం

నిష్క్రమణ

అన్నప్రాశన

చూడాకరణ

కర్ణవేధ

అక్షరాభ్యాసం

ఉపనయనం

వేదారంభం

కేశాంత

సమావర్తన

వివాహం

అంత్యేష్టి


*పుంసవనం*

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.

ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనముగర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

*సీమంతం*


తల్లి సౌభాగ్యాన్ని, పుట్టబోయే బిడ్డ దీర్ఘాయుష్షును కోరుతూ చేసేది. కడుపులోని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి శారీరక, మానసిక ఉల్లాసం ఎంతో అవసరం. అందుకోసం ఆమె, ఆమె భర్త పాటించవలసిన నియమాలు ఈ సంస్కారంలో భాగంగా ఉన్నాయి. వాటిలో ఒకటి దోహదం (అంటే గర్భిణీ స్త్రీ భర్త ఆమె కోరిక ఏమిటో తెలుసుకుని తీర్చడం). సీమంతం అంటే పాపిడి తీయడమని అర్థం. అంటే ఆ సమయంలో భర్త ఆమెను అంత అపురూపంగా చూసుకోవాలని అర్థం.

*జాతకర్మ*

బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి:

మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.

*నామకరణం*



నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి. పరాశర గృహ్యసూత్రాల ప్రకారం పేరు రెండు లేక నాలుగు అక్షరాల పొడవుండి హ్రస్వ అచ్చుతో కూడిన హల్లుతో మొదలై చివర్లో దీర్ఘం కానీ విసర్గం కానీ ఉండాలి. వేర్వేరు గృహ్యసూత్రాల్లో ఈ నియమాలు వేర్వేరుగా ఉన్నాయి. ఆడపిల్ల పేరు బేసి అక్షరాలుండి పేరు చివర అ ఉండాలి.

పేరు పెట్టడానికి నాలుగు పద్ధతులున్నాయి:

మొదటిది జన్మనక్షత్రాన్ని బట్టి;రెండవది పుట్టిన నెల/రాశ్యధిపతిని బట్టి;మూడవది ఇలవేలుపును బట్టి;నాలుగవది అందరూ పిలిచే పేరును బట్టి.

చివరి పద్ధతి కుటుంబ సంప్రదాయాన్ని బట్టి, విద్యాస్థాయిని బట్టి ఉంటుంది. ఐతే లేకలేక కలిగిన సంతానానికి, కుటుంబంలో చాలామంది పిల్లలు చనిపోయాక పుట్టినవారికి దుష్టశక్తుల్ని దూరంగా ఉంచడం కోసం విడ్డూరంగా ఉందే పేర్లను పెడతారు.

*నిష్క్రమణ*

బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.

*అన్నప్రాశన*

మొదటిసారిగా ఘనాహారం తినిపించడం (సాధారణంగా ఆరో నెలలో) అన్నప్రాశన. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నాడు. ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రోచ్చాటనల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.

*చూడాకరణ*

పుట్టువెండ్రుకలు తీయించడం. దీర్ఘాయుష్షును, అందాన్ని కోరుతూ చేసే సంస్కారం. సుశ్రుతుడు, చరకుడు కూడా గుండు వల్ల దీర్ఘాయుష్షు, అందం చేకూరుతాయని పేర్కొన్నారు. తలనీలాలు దేవునికి లేదా దేవతకు అర్పించడం గురించి గృహ్యసూత్రాల్లో గానీ, స్మృతుల్లో గానీ లేనేలేదు! పూర్వకాలంలో కూడా కొన్ని సార్లు దేవాలయాల్లో తలనీలాలు అర్పించడం ఉన్నప్పటికీ అది కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే జరిగేది (లేకలేక కలిగిన పిల్లలు లేదా ఒకరిద్దరు పిల్లలు చనిపోయిన తర్వాత పుట్టిన పిల్లలకు). గృహ్యసూత్రాల ప్రకారం ఈ సంస్కారం మొదటి సంవత్సరం చివర్లో గానీ, మూడొ ఏటగానీ చెయ్యాలి. తర్వాతి కాలాలోని సూత్రకర్తలు ఈ వయసును ఏడేళ్ళవరకు పొడిగించారు.

*కర్ణవేధ*

చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. చెవులు కుట్టడానికి వాడే సూది:

క్షత్రియులకు బంగారంతో,బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,

దేవలుడనే స్మృతికర్త "చెవిరంధ్రాలగుండా సూర్యకిరణాలు ప్రసరించని బ్రాహ్మణుడిని చూడడం వల్ల అప్పటివరకు చేసుకున్న పుణ్యమంతా పోతుంది." అని పేర్కొ

*అక్షరాభ్యాసం*

బిడ్డ మనసు తగినంతగా పరిపక్వత చెంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మొదటగా చేయవలసినది అక్షరాలు నేర్చుకోవడం. ఈ సంస్కారాన్నే అక్షరారంభమనీ, అక్షరలేఖనమనీ, విద్యారంభమనీ అంటారు. సాధారణంగా ఈ సంస్కారాన్ని ఐదో ఏట చేస్తారు. విశ్వామిత్రుడు దీన్ని ఏడొ ఏటివరకు పొడిగించాడు. కానీ కొందరు స్మృతికర్తలు చూడాకరణ ఐన వెంటనే చేయాలని

* ఉపనయనము*

అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది. ఉదాత్తమైనది కాదు. క్రమశిక్షణ, విద్యార్జనల ద్వారా పొందే రెందవజన్మ పవిత్రమైనది, ఉదాత్తమైనది.

ఐతే ఉపనయన ఉద్దేశాలు, అర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రము, శక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది. తగిన వయస్సు:

బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలు;క్షత్రియుడికి పదకొండు సంవత్సరాలు;వైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు;

గరిష్ఠ వయోపరిమితి:

బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలు;క్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలు;వైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు;

కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షు, పవిత్రత, బలం, తేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజిక-ఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది. ఒక యోగి వలె క్రమశిక్షణతో జీవితం గడపడానికి విద్యార్థికి అజినం (జింక చర్మం), దండం కూడా ఉపనయనమప్పుడు ఇస్తారు.

*వేదారంభం*

అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీ, దీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజిక, వైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది:

రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేది,మూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేది,నాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.

*కేశాంత*

పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

*సమావర్తన*

చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూ, యజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.

సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనా, తాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులని, రెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్తోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.
                                                     
*వివాహం*

హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణి, వరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. హిందూ సమాజంలో వధూవరులుగా ఒకే వర్ణానికి (సవర్ణ), భిన్న గోత్రాలకు, భిన్నపిండాలకు చెందినవారిని ఎంచుకోవడమనే ఆనవాయితీ కొనసాగుతోంది. సపిండకుల (రక్తసంబంధీకుల) మధ్య వివాహాలను అన్నికాలాల్లో నైతికంగానూ, శాస్త్రపరంగానూ పూర్తిగా నిషేధించడం జరిగింది.

వివాహాల్లోని రకాల గురించి తెలుసుకోవడానికి అష్టవిధవివాహాలు చూడండి.

వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:

వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)

వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం

కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం

వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం

పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం

హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం

సప్తపది: సౌభాగ్యానికి, దాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు

అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం

సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం

ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధ్రువనక్షత్రాన్ని చూడడం

త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం

చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం

హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.


*అంత్యేష్టి*

హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతి, సద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.

మరణానికి ముందు: మరణమాసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులను, బంధువులను, ఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకుని, వారికి, ప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికి, మరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీద, వీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.

అంతిమయాత్రకు ముందు: వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థం, గంగాజలం వదులుతారు.

పాడె: శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.

అంతిమయాత్ర: మరణించినవారి బంధువులు, మిత్రులు, ఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.

అనుస్తరణి: జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.

దింపుడుకళ్ళెం: భగవదనుగ్రం వల్లో, చనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతో, బ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేవడం వల్ల ఈ ఆచారం పుట్టి ఉంటుంది.

దహనం: శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.

ఉదకకర్మ: చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.

ఓదార్పుఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలను, జీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.

అశౌచం: చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచం, మృతాశౌచం).

అస్థిసంచయనం: శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.

శాంతికర్మ

స్మారకం

శ్రాద్ధం
25/12/17, 7:09:24 AM: ‪+91 94411 78068‬: Sripada Sharma:
- శంకరాచార్యుల వారు కాబట్టి ఈ శంకరాచార్యుల వారు మరెవరో కాదు పరమశివుడే! ఈ విషయం రుద్రాధ్యాయం ఎప్పుడో రహస్యంగా చెప్పేసింది. ఎప్పుడో రాబోయే శంకరావతారమును రుద్రాధ్యాయం చెప్పింది. ఆయనను మయస్కరాయ చ - ఆ శంకరుల గురుపరంపర ఉన్నదే అది -సదాశివ సమారంభాం వ్యాస శంకర మాధ్యమాం!
అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం!!
ఆనాడు శంకరుడు కపర్ది అని యింత జుట్టుతో ఉన్నవాడి నుంచి ప్రారంభమయిన ఈ గురుపరంపర మధ్యలో శంకరాచార్య స్వామి ఉంటే, ఈనాడు మనందరి ఎదుట శంకరాచార్య స్వరూపమై మనలను నిలబెట్టి ఆశీర్వదించి నడుపుతున్న మన గురువుల వరకు ఆ గురుపరంపరే నడుస్తున్నది.
ఎప్పుడెప్పుడు లోకంలో వేదం ప్రమాణమును చెడగొట్టడానికి అవైదికమైన వాదములు ప్రబలుతాయో అప్పుడప్పుడు పరమేశ్వరుడే బయలుదేరి వచ్చి, అవతార స్వీకారం చేసారు. కృష్ణ భగవానుడు కూడా మహానుభావుడై గీతా ప్రచారమును చేశారు. ఆయన ప్రబోధించిన భగవద్గీత ప్రస్థానత్రయంలో ఒకటిగా భాసిల్లుతున్నది. అంతటి భగవద్గీతను మనకు అందించినటువంటి జగదాచార్యుడు కృష్ణ పరమాత్మ. ఉన్నది ఒక్కటే పరబ్రహ్మ తత్త్వం. అదే ఒకనాడు కృష్ణుడిగా భాసించింది. అటువంటి భగవద్గీతను యిచ్చిన కృష్ణ పరమాత్మ అవతారం, ఎందుకో కలియుగంలో వచ్చే ప్రమాదములనుండి ఉద్ధరించ గలిగినంత జ్ఞానబోధ చెయ్యలేదు? దానికి ఒక్కటే కారణం. ద్వాపరయుగంలో అప్పటికే ధర్మమును నిర్వీర్యం చేసే వాళ్ళ సంఖ్య కోట్లలోకి వెళ్ళిపోయింది.
కృష్ణావతార ప్రారంభం నుండే ఆయన ఎంతో రాక్షస సంహారం చేశాడు. పూతనా సంహారంతో మొదలుపెట్టి ఎంతోమంది రాక్షసులను చంపాడు. జరాసంధాది రాక్షసులనందరిని ముందరే చంపి ఉండకపోతే, కురుక్షేత్రంలో నిజంగా పాండవులు నిలబదగలరా! అవతారంలో వున్నా తక్కువ సమయంలో ఆయన కురుక్షేత్ర యుద్ధంలో సమస్త వాజ్ఞ్మయమును భగవద్గీత రూపంలో బోధ చేశాడు. కానీ అది సరిపోలేదు. కలియుగం అంటే అసలు మనస్సు నిలబడని యుగము. కలిపురుషుని ప్రకోపములు చాలా ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ మీరు ఈశ్వరుని పాదములు గట్టిగా పట్టుకోనడానికి ప్రయత్నించాలి. దానికి ప్రస్థానత్రయభాష్యంతో మొదలుపెట్టి, ఈశ్వరుడిని స్తోత్రం చెయ్యడం వరకు, ఆకాశం నుంచి పాతాళం వరకు సమస్త వాజ్ఞ్మయమును జ్ఞానబోధ తప్ప యింకొక ప్రయత్నమూ కాని, పని కాని పెట్టుకోకుండా, ముప్పది రెండేళ్ళ జీవితంలో షణ్మత స్థాపనాచార్యులై శృతి ప్రమాణమును నిలబెట్టి దేవతలందరి మీద స్తోత్రములు చెప్పి శివానందలహరి, సౌందర్యలహరి, బ్రహ్మసూత్రభాష్యము వంటివి ఎన్నో చేశారు శంకరాచార్యుల వారు. వారి పేరు చెబితే చాలు, మన పాపములు పటాపంచలు అయిపోతాయి.
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం!
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం!!
అటువంటి శంకర భగవత్పాదులై ఈ భూమిమీద నడయాడి మనకి జ్ఞానబోధ చేశారు. శుభం కళ్యాణం శ్రేయం భద్రం శోభనం – యివన్నీ జ్ఞానంలోకి వెళ్ళిపోతాయి. జ్ఞానం కన్నా గొప్ప కళ్యాణం, గొప్ప శుభం, భద్రం, శ్రేయం, శోభనం ఇంక ప్రపంచంలో లేవు. అటువంటి జ్ఞానమును మీకు అందించడానికి పరమేశ్వరుడే శంకరుడిగా ఈ భూమండలం మీద నడయాడినాడు. అంతేకాకుండా ఇప్పుడు కూడా శంకరుడు కరచరణాదులతో మనకు గురురూపంలో నడయాడుతున్నాడు. కాబట్టి మనం గురురూపంలో ఉన్న శంకరునికి నమస్కరిస్తూ ఉండాలి.
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః!
గురుస్సాక్షాత్ పరంబ్రహ్మ తస్మైశ్రీ గురవేనమః!!
అటువంటి గురువు ఇప్పటికీ మీకు శుభములు ఇచ్చేవాడై, శోభనములు ఇచ్చేవాడై, మంగళ ప్రదుడై ఉన్నాడు. ఆ శంకరులు వస్తారని పతంజలి నటరాజస్వామి దర్శనం దగ్గర నుంచి మొదలుపెట్టి పక్కన నిలబడి నటరాజ తాండవం చూసినందుకు, ఒకనాడు తాను ఈ శంకరుడే శంకరాచార్యులుగా వస్తే తత్త్వబోధ చేసే వాడిని తయారుచేయాలని గోవిందపదాచార్యులుగా సిద్ధం చేయించి ఉంచారు. కాబట్టి మన ఆర్షజాతి, సనాతన ధర్మము, పురాణములు ఎంత గొప్పవో, ‘శివ’ అనేమాట ఎంత గొప్పదో, ‘శివం’ అన్నమాట ఎంత భద్రమో ఎంత శ్రేయస్కరమో, దానిని గురించి వినినా, దానిని గురించి తెలుసుకున్నా ఎంత పరవశము పొందుతామో గ్రహించాము.
పవి పుష్పంబగు నగ్ని మంచగు నకూపారంబు భూమీస్థలం
బవు శత్రుం డతిమిత్రుఁడౌ విషము దివ్యాహారమౌ నెన్నఁగా
నవనీమండలిలోపలన్ శివ శివే త్యాభాషణోల్లాసికిన్
శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీ కాళహస్తీశ్వరా!
‘శివా! నీ నామము ఎల్లవేళలా ఆవశ్యకరము’ అంటారు ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో. అటువంటి శివనామం గురించి, అటువంటి శివనామం గురువై నడవటం గురించి, శివనామ మంగళత్వం గురించి, ఆ నామము ఎంతగా భక్తులను ఆదుకునేదో దాని గురించి ఇంతవరకు తెలుసుకున్నాము.


25/12/17, 7:51:44 AM: ‪+91 91776 98078‬: మనం తరుచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాల మూల వాక్యాలు తెలుసుకోవాలని అనిపించడం సహజం కదా. అలాంటి వాటిని కొన్నింటిని మీకోసం సిద్ధం చేశాను చూడండి:

ముందుగా మనం తరుచుగా వినే మూల వాక్యాలు ఇవీ:

👉 *ధర్మో రక్షతి రక్షిత:*

👉 *సత్య మేవ జయతే*

👉 *అహింసా పరమో2ధర్మ:*

👉 *ధనం మూలమిదం జగత్*

👉 *జననీ జన్మ భూమిశ్చ*
*స్వర్గాదపి గరీయసి*

👉 *కృషితో నాస్తి దుర్భిక్షమ్*

👉 *బ్రాహ్మణానా మనేకత్వం*

👉 *యథా రాజా తథా ప్రజా*

👉 *పుస్తకం వనితా విత్తం*
*పర హస్తం గతం గత:*

👉 *శత శ్లోకేన పండిత:*

👉 *శతం విహాయ భోక్తవ్యం*

👉 *అతి సర్వత్ర వర్జయేత్*

👉 *బుద్ధి: కర్మానుసారిణీ*

👉 *వినాశ కాలే విపరీత బుద్ధి:*

👉 *భార్యా రూప వతీ శత్రు:*

👉 *స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:*

👉 *వృద్ధ నారీ పతి వ్రతా*

👉 *అతి వినయం ధూర్త లక్షణమ్*

👉 *ఆలస్యం అమృతం విషమ్*

👉 *దండం దశ గుణం భవేత్*

👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు. కదా?*

*ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూదామా ?*

ధర్మ ఏవో హతో హంతి
ధర్మో రక్షతి రక్షిత:
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !🔥

సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.🔥

అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్

🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన🔥

ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.🔥

అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !🔥

కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.🔥

గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !🔥

రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.🔥

పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)🔥

శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.🔥

విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.🔥

శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.🔥

అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడ్డాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడ్డాడు. అతి కామం చేత రావణుడు నాశన మయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.🔥

సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !🔥

న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా చూసామా ? అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.🔥

ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥. అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.🔥

ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !🔥

అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.🔥

ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా. 🔥

సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.🔥

విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

వీటిలో స్త్రీల విషయమై చెప్పిన వాటి విషయమై నాకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. కాని. పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు కనుక , యథాతథంగా ఇచ్చాను. స్త్రీవాదులు అపార్ధం
చేసుకోకుందురు గాక !
25/12/17, 8:08:25 AM: ‪+91 91776 98078‬: 🙏 🍏 *శుభోదయం*  🍅🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🌻
        -------------------------
" లోపాల ఆధారంగా ఎవరిని అంచనా వేయకూడదు. ఒక వ్యక్తికి గల సుగుణాలు అతనికి మాత్రమే ప్రత్యేకం. అతడికి ఉన్న దోషాలు సర్వ సామాన్యమైన మానవ బలహీనతలు...
అతడి వ్యక్తిత్వ నిర్ధారణలో వాటిని పరిగణించనే కూడదు..

          *-స్వామి వివేకానంద*
      --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" నమ్మించి మోసం చేయడం నీ తప్పు కాదు..!
మోసపోయేంతలా నమ్మడం నా తప్పు..! "

  💐 _*manchi vishayaalu it's true life*_  💐. *~~~ARUN* 🌹🌹🌹
25/12/17, 8:18:46 AM: ‪+91 91603 86447‬: 🔯🌼 🌸 🙏 🌅 🌸 🌼🔯
🙏మంచిమాటతో మరో రోజు 🙏

*న హి సుప్తస్య సింహస్య*
*ప్రవిశంతి ముఖే మృగాః |*

పడుకొన్న సింహం నోటి లోనికి తనంతకు తానే ఏ ప్రాణియూ ప్రవేశించదు.

25/12/17, 9:44:11 AM: ‪+91 79811 59026‬: *తుల్యే ప్రియాప్రియే యస్య సుఖదుఃఖే తథైవ చ।*

*అతీతానాగతే చోభే స వై సర్వధనీ నరః॥*
🥀
మనసుకి ఇష్టమైనదాన్నీ, అయిష్టమైనదాన్నీ ఒకటిగానే చూసేవాడు; సుఖదుఖాలను ఒకటిగానే ఎంచేవాడు; భూతభవిష్యత్తుల పట్ల ఒకేతీరున స్పందించేవాడు... అన్ని ధనము లను కలిగియున్న వాడని చెప్పబడుతున్నాడు.

25/12/17, 12:51:55 PM: ‪+91 91776 98078‬: కర్మ అంటే ఏమిటి? సత్కర్మ అంటే ఏమిటి?. మొదట వీటి గురించి తెలియాలి. కర్మ అంటే మనం చేసే అన్ని పనులను కర్మలు అంటారు.అవి ఏవైన కావచ్చు. కాని చేసే పనులలో ప్రావీణ్యత వుండాలి. అప్పుడు అవి నీకు సత్ఫలితాన్ని ఇస్తాయి. కర్మలలో ప్రావీణ్యత అంటే మనం జ్ఞానాన్ని కలిగి వుండి కర్మలను ఆచరించడాన్ని కర్మలలో ప్రావీణ్యత అని అర్థం. జ్ఞానం అంటే ఆత్మానాత్మ వివేకం. నేను ఎవరు? దేవుడు ఎవరు? ఈ ప్రకృతి ఏంటి? దీని కర్త ఎవరు? ఇలా విచక్షణ జ్ఞానాన్ని కలిగి వుండడమే జ్ఞానం అంటారు. ఇక్కడ మనకు కావలసింది సత్కర్మలే (మంచి పనులే) ఎందుకు చేయాలి. అవును మంచి పనులే చేయాలి ఎందుకంటే ఇక్కడ ప్రకృతికి కొన్ని సహజ గుణాలు వున్నాయి అవి భగవంతుడు సృష్టితో పాటు ఇచ్చాడు. అవి ఏమిటంటే నువ్వు మంచి పని చేస్తే నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అదే విధంగా చెడు చేస్తే ఫలితం కూడ అదేలా వుంటుంది. ఇంకో విషయం ఏమిటంటే ఇక్కడ కర్మ ఫలితాలను అనుభవించడమే కాకుండా నీవు ఈ శరీరాన్ని వదిలిన తరువాత కూడ వాటిని అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే నేను అంటూ నువ్వు అజ్ఞానంతో మరియు అహంకారంతో అన్ని పనులు చేస్తూ వుంటావు కావున. నువ్వు ఈ శరీరం వదిలిన తరువాత కూడా వాటి ఫలితాలను అనుభవిస్తావు. అయితే మంచి పనులు చేసి మంచి చేస్తున్నాను అని అనుకొని ఉంటే స్వర్గానికి వెళ్లి ఆ కర్మ ఫలితాలను దేవతలకు సమానంగా అనుభవిస్తావు అవే చెడు అయితే నరకానికి వెళ్లి అనుభవిస్తావు. ఇక్కడ కర్మ భూమిలో అయితే స్థూల శరీరం వుంటుంది. అదే అక్కడ అయితే నీవు అజ్ఞానంతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలే ఒక సూక్ష్మ శరీరంగా ఏర్పడి ఆ సూక్ష్మ శరీరం వాటిని అనుభవిస్తుంది అంతే తప్ప వీటి అన్నిటితో ఆత్మకు ఎటువంటి సంబంధం ఉండదు. అంటే నువ్వు చేసే రెండు కూడా నీకు (అంటే ఆత్మకు) బందనాలే అవి మంచి అయితే బంగారు జైలు అదే చెడు అయితే ఇనుప జైలు అన్నమాట. రెండును నిన్ను (అంటే ఆత్మను) బందీ చేసేవే. మరి ఈ రెండింటి నుండి తప్పించుకోవడం ఎలా ? ఎలా అంటే ఇక్కడ యోగాన్ని అవలంబించాలి అప్పుడు మనం చేసే కర్మలను యోగం ద్వార చేయాలి దానినే కర్మ యోగం అంటారు. మనకు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత లో కర్మయోగం గురించి చాల విపులంగా తెలియజేసాడు అంటే మనం ఇక్కడ కర్మయోగాన్ని అవలంబించాలి. అది ఎలా అంటే చేసే ప్రతి పనిని భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్షరహితంగా, కర్మలను ఆచరిస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు అంతఃకరణ శుద్ధి అవుతుంది. ఇలా శుద్ధి అయిన అంతఃకరణ భగవంతునిని అన్వేషిస్తుంది అప్పుడు నీలో సత్వ గుణం అధికమవుతుంది. అంతే కాకుండా చేసే కర్మలు నిష్కల్మషంగా కూడ వుండాలి అంటే చేసే పనులలో ఏ కల్మషం లేకుండా చేస్తే నువ్వు అప్పుడు కర్మలలో ప్రావీణ్యత సాధించినట్లు. మరి మంచి పనులే ఎందుకు చేయాలి ? అంటే మంచి పనులు చేస్తూ వుంటే నీకు తెలియకుండానే నీ అంతఃకరణ (నీ మనస్సు) పరిశుద్దమవుతుంది. అప్పడు నీకు భగవంతుని తత్వం బోధపడుతుంది (అర్థం అవుతుంది) లేకపోతె నీకు భగవంతుని తత్వం తెలియదు అప్పుడు నువ్వు ఇట్లే ఈ జనన మరణ చట్రంలో తిరుగుతూనే వుంటావు.ఒకవేళ దుష్కర్మలు ఆచరిస్తే నీకు పతనం తప్పదు. అది ప్రకృతి సహజ గుణం. అందువలన ఈ రోజు నుండే నీవు మంచి పనులు మాత్రమే చేయాలి అని భీష్మించుకొని నీ మనస్సును స్థిరపరచు. అయితే నువ్వు చేసే పని ఎలా వుండాలి అంటే కుడి చేత్తో చేసే పని నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే విధంగా వుండాలి. అప్పుడు మానవుడు మాధవుడు అవుతాడు.

ఇలా అందరూ మంచి పనులు చేసి వారి అంతఃకరణను శుద్ధి పరచుకొని భగవంతుని తత్వాన్ని తెలుసుకొని గ్రహించి ఆ దేవదేవుని గురించి తెలిసికొని జ్ఞానాన్ని సంపూర్ణంగా సముపార్జించి అందరూ మీ మీ  స్వస్వరూపాలను తెలుసుకోవాలని నా మనవి అదే విధంగా సాధన (ధ్యానం) చేసి మహాత్ములుగా మారాలని ఆ విధంగా మీ మనస్సులను ఆ భగవంతుని మీదకు మరల్చాలని నేను ఆ దేవదేవుడైన పరమాత్మునిని ప్రార్ధిస్తున్నాను.