07/12/17,
9:16:46 PM: +91 94414 31313: కొన్నేళ్ళక్రితం, కంచి కామకోటిపీఠం
ఆస్తులపై కన్నేసిన మన్నార్ గుడి మాఫియా, పీఠాధిపతులపై ఆరోపణలు చేసి,
స్వాములను జైల్లో పెట్టించింది...జయలలిత,శశికళల చర్యలు లక్షలాదిమంది
అమ్మవారిభక్తుల ను బాధించాయి..కోట్లాదిమంది హిందువుల మనోభావావలని ఈఇద్దరు
నారీశిఖామణులూ కించపరచి, జగద్గురువులు ఆదిశంకరాచార్యులుస్థాపించిన
కంచికామకోఠి పీఠం పరువును, బజారుకీడ్చి, పీఠాధిపతుల పై హత్యానేరాన్ని మోపి
కంచిపీఠం ఆస్థులను కొట్టేద్దామని దుర్మార్గమైన ఆలోచనలకు తెరతీసారు...ఆరోజు
పీఠాధిపతులు ఒకమాటచెప్పారు...ఆ ఆస్ధులు మా స్వంతంకావు....అమ్మవారి
ఆస్థులు...ఆవిడ ఆస్ధులను ఆవిడే కాపాడుకుంటుంది...ఇక మా సంగతికూడా ఆవిడే
చూసుకుంటుంది....ధర్మం గెలుస్తుంది...
స్వామీజీలమీద
పెట్టిన కేసులు కోర్టులో నిలవలేదు,స్వాములు అమ్మవారి దగ్గరకు
చేరారు....కేసులు పెట్టిన పెరియమ్మ (పెద్దమ్మ)వేలకోట్ల ఆస్ధులండీ,
అయినవాళ్ళు ఉండికూడా, ఓ అనాధలా ఆసుపత్రి లో దిక్కులేనిమరణం
పొందింది...ఆవిడని అడ్డంపెట్టుకుని కంచికామాక్షమ్మ నే కమాండ్
చెయ్యాలనుకున్న చిన్నమ్మ, చెఱసాలపాలైంది....స్వామీజీల మాట నిజమైంది...కంచి
కామాక్షి సాక్షిగా ధర్మమే గెలిచింది.... కంచికామకోటి పీఠం ఎప్పటిలాగే నిత్య
పూజలతో భక్తులతో కళ,కళలాడుతోంది...అమ్మవారి మోము పై చిరునవ్వు కూడా అలాగే
ఉంది...ఆవిడ పై తెగబడినవాళ్ళే...65 ఏళ్ళ జీవితాలకు, ఓ అర్ధం, సార్ధకత
లేకుండా చేసుకుని చెఱసాలపాలయ్యారు...
చిన్నప్పడు..మా స్కూల్లో తెలుగు మాస్టారు చెప్పిన,
సత్యమేవ జయతే, ధర్మో రక్షితి రక్షితః, చెరపకురా చెడేవు అన్న సూక్తులు నిజమేనని ఇప్పుడర్ధమయ్యింది...
పైనున్న
నరకం, స్వర్గం గురించి ఎవడు చూసొచ్చాడూ?...బ్రతికినంత కాలం,దుర్మార్గాలు
చేస్తూ, సాటి మనిషినిని దోచుకు తినేద్దాం, అని ఆలోచించే వాళ్ళకి, ఈ ఇద్దరు
స్త్రీ మూర్తుల జీవితాలే ప్రత్యక్ష నిదర్శనం...పాప పుణ్యాలపై నమ్మకంలేని
మనుషులు చేసిన పాపాలకు, శిక్ష లు ఆ మనిషి పోయినతర్వాత పైన ఎక్కడో,నరకంలో
కాదు...ఇక్కడే..నరకాన్ని చూపించి, తీసుకుపోతున్నాడు ఆ దేవుడు...!!
ఎందుకంటే, దేవుడు కూడా రియలైజ్ అయ్యాడు మరి!!😳😳
No comments:
Post a Comment