Tuesday, December 19, 2017

18/12/17, 10:57:56 PM: MVMRAO: శైవము

భారతదేశము అత్యంత పురాతన దేశము.
ప్రపంచకంలో పురాతన దేశాలలో మన భారత దేశము మొదటిది అన్నా తప్పు కాదు. భారత దేశమునందనేకమతములున్నవివానినన్నింటి లో శైవము అత్యంత పురాతన మైనది.
శివుడే సర్వాధికారి యనివిశ్వాసముతో నున్న
మతము శైవము.బ్రహ్మ.విష్ణువు.ఇంద్రుడు మొదలగుదేవతలందరు శివుని ఆజ్ఞకులోబడి
యుండువారని, వారిఉనికికి శివుడేకారణమని
వారందరూకూడా పరమశివుని భక్తులే యని యు యీమతము యొక్క సిధ్ధాంతము.
శివుడే అధికడు ఆయనకంటే మించిన వాడు లేడని సమానుడు కూడాలేడని వేదాగమ పరాణేతహాములనాధారము నిరూపించుట
ఈసిధ్ధాంత లక్షణము.
విశ్వాధికో రుద్రో మహర్షిః అని
నతత్సమశ్చాప్యధికశ్చ దృశ్యతే అని శ్వేతాశ్వతరోపనిషత్తు
శివుడు పరబ్రహ్మము ప్రణవస్వరూపుడు లింగరూపుడు అనంతకల్యాణగుణ సంప న్నుడు సఛ్ఛితానందస్వరూపుడు సృష్టి స్థితి
లయ తిరోధాన అనుగ్రహమను లక్షణము లున్నవాడు. నిగ్రహానుగ్రహసమర్ధుడు పరిపూర్ణుడు సనాతనుడు సర్వజ్ఞుడు నిరంజనుడు జగత్కారుడు పరమేశ్వరుడు
మహాదేవుడు ఇలా శివపారమ్యమును
వేదములు ఆగమములు ఉపనిషత్తులు పురాణములు ఇతిహాసములు ఘోషించు చున్నవి. (ఇంకావుంది

credit goes to shivasri mulugu vishwanadham sharma  garu

No comments:

Post a Comment