26/12/17, 8:49:08 AM: +91 91776 98078: *మనిషి ఎపుడూ నాలుకలా బ్రతకాలని చెప్పిన తులసీదాస్.*
💐🙏🙏🙏💐
శ్రీ
రామచరితమానస్, సుందరకాండ ఘట్టంలో, లంకలో రామ నామం జపిస్తూ కనపడ్డ
విభీషణుడిని చూసిన హనుమంతుడు *"ఇంతమంది రాక్షసుల మధ్య నీ లాంటి వాడు ఎలా
వుండగాలిగాడు"* అని ఆశ్చర్యపోతూ ప్రశ్నిస్తాడు!!!
సమాధానంగా విభీషణుడు హనుమంతునితో యిలా అంటాడు..
సునహు పవన సుత రహని హమారీ
జిమి దసనన్హి మహు జీభి బిచారీ
తాత కబహు మోహి జాని అనాథా
కరిహపి కృపా భానుకుల నాథా
*"వాయుపుత్రా,
రెండు దంతపు వరుసల మధ్య నాలుక (జీభి అంటే 👅 నాలుక) లాగ నేను ఈ లంకలో
నివసిస్తున్నాను. నేను దిక్కులేనివాడిని, ఆనాథను. భానుకుల నాథుడైన
రఘురాముడు నన్ను అనుగ్రహించునా?"*
_(Hear,
O son of the wind-god, how I am living here: my plight is similar to
that of the poor tongue that lives in the midst of the teeth. Will the
Lord of the Solar Race, dear friend, ever show His grace to me, knowing
me to be masterless?)_
*ముప్ఫై
రెండు దంతాల మధ్య నాలుక* లాగ విభీషణుడు లంకలో ఉన్నాడట. ఎంత మంచి ఉపమానం..
*లంకలో దంతాల వంటి రాక్షసులు వున్నారు. నాలుకలా విభీషణుడు ఒక్కడు
వున్నాడు.* దురాత్ముల మధ్య సాధువులు జీవించడం కష్టం. నోటిలోని నాలుకను
ముందుకు రానీయకుండా దంతాలు నిరోధిస్తుంటాయి. *దంతాలు నిరోధిస్తున్నాయని
నాలుక భయపడి మంచి చేయడం మానదు.* అవకాశం దొరికినపుడల్లా దంతాల మధ్య పడకుండా
ముందుకొచ్చి ఎండిన పెదవుల్ని తడిపి పోతూ వుంటుంది. *దంతాల మధ్య పడకుండా
నాలుక ఎలా మెలుగుతుందో, దురాత్ములకు చిక్కకుండా మహాత్ములు నాలుక లాగ
ముందుకొచ్చి తాపత్రయాలతో ఎండిపోయిన సమాజాన్ని తమ ప్రేమామృతంతో* తడుపుతూ
వుంటారు.
*మనిషి ఎపుడూ
నాలుక లాగే వుండాలి. దంతాల లాగా వుండకూడదు.* గట్టివైన దంతాలు వూడిపోతాయి.
మెత్తని నాలుక వూడదు. *ఒక్క నాలుక ముప్ఫై రెండు దంతాల మధ్య మెల్లగా చరిస్తూ
వుంటుంది*... ప్రతి క్షణం నిన్ను కొరికివేస్తాం అనేటట్లు వుంటాయి దంతాలు.
*కానీ నాలుక ఏ మాత్రం ఎదిరించదు.. అది నాలుక యొక్క బలహీనతగా భావిస్తాయి
దంతాలు.*
కానీ *నాలుకకు
తన బలం* బాగా తెలుసు.. తాను ముందు వెనుకలు చూడకుండా *పరుషంగా* మాట్లాడితే
చాలు.. కోపం వచ్చిన వాడు దవడ మీద కొడితే రాలేది దంతాలే కానీ.. తనకేమీ కాదు
అని.... *నాలుకలాంటి విభీషణుడు రామ నామాన్ని స్మరిస్తూ ఆనందంగా
బ్రతికాడు.. దంతాలలాంటి రావణాదులు శ్రీరాముని బాణపుదెబ్బతో రాలి పడ్డారు.*
No comments:
Post a Comment