Thursday, December 14, 2017

13/12/17, 8:23:04 AM: Yes Pk: *🌻వృద్ధాప్యంలో  జరిపే శాంతులు🍁*

స్త్రీ/పురుషులకి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము.

👉🏼కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలని అంటారు.

*భట్టభాస్కరీయ మతానుసారిణ్యః వయోవస్థా శాంతయః పంచాశత్ వర్షమారభ్య పంచభిః పంచభిః వర్షైర్యుక్తాః*

(అన్యమతేన - షష్టితమ వర్షమారభ్య దశభిర్దశభిర్వర్షైః శాంతిరుక్తాః)

*🎋వైష్ణవీ వారుణీ చైవ తతశ్చోగ్రరథీ తథా మహారథీ భీమరథీ ఐంద్రీచైవ విశేషతః  చాంద్రీదార్శనికీ రౌద్రీ సౌరీ మృత్యుంజయీ తథా🌾*
    *మహామృత్యుంజయీ శాంతిః క్రమశశ్చ ప్రకీర్తితాః అరిష్ట పరిహారార్థం శాంతిం కుర్యాత్ప్రయత్నతః*

వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...

1. వైష్ణవీ శాంతి -- 50 వ సంవత్సరము

2. వారుణీ శాంతి -- 55 వ సంవత్సరము

3. ఉగ్రరథ శాంతి -- 60 వ సంవత్సరము

4. మృత్యుంజయ శాంతి -- 65 వ సంవత్సరము

5. భౌమరథీ శాంతి -- 70 వ సంవత్సరము

6. ఐంద్రీ శాంతి -- 75 వ సంవత్సరము

7.సహస్ర చంద్ర దర్శన శాంతి -- 80 వ సంవత్సరము

8. రౌద్రీ శాంతి -- 85 వ సంవత్సరము

9.కాలస్వరూప శౌరి శాంతి -- 90 వ సంవత్సరము

10. త్ర్యంబక మహారథి శాంతి -- 95 వ సంవత్సరము

11. శతాబ్ది -- మహామృత్యుంజయ శాంతి --- 100 వ సంవత్సరము.

శక్తి యుక్తులు గలవారు పైన తెల్పినవన్నీ కూడా పూర్ణాయుర్దాయముకై జరిపించుకొనగలరు.

*ఆయుష్మాన్🙌🏼భవ💐*

సర్వేజనా శుఖినోభవంతు💐.

No comments:

Post a Comment