19/12/17, 9:15:01 AM: +91 94411 78068: ప్రియమైన
మిత్రులకు
శివానుగ్రహ ప్రాప్తిరస్తు
కనులార నినుగాంచగా లేని కనులున్న
ఫలమేమి పరికించ ఫాల నేత్ర,
చెవులార నీలీల చెవిబెట్ట లేనట్టి
వీనుల యునికేల విశ్వనాథ,
నోరార నొకపరి నుతియింపగా లేని
నోరున్న ఫలమేమి నూర్ధ్వకేశ,
కరువోవ నీ పూజ గావింపగా లేని
కరముల కలిమేల గరళకంఠ,
తే!!గీ!!
ఎట్టి పుణ్యంబు జేయంగ నిట్టి వబ్బు
అట్టి వరమిమ్ము దయతోడ నాకు నిపుడు
అనుచు సాష్టాంగ దండంబు లాచరింతు
భక్త జన మనోసంచార భవ విదూర
No comments:
Post a Comment