Tuesday, December 5, 2017

28/11/17, 10:40:28 PM: ‪+91 94414 31313‬: తూర్పు కెంటకీలో ఓ తాతగారు తన మనవడితో నివసిస్తూండేవాడు. రోజు తన తాతగారు భగవద్గీత చలికాచుకునే వేడిపొయ్యిదగ్గర కూర్చుని చదవటం మనవడు చూచేవాడు. తాతగారిని వెక్కిరించటానికా అన్నట్లు తనుకూడా గీతాపఠనము చేస్తున్నట్లు నటించేవాడు.
ఓరోజు మనవడు "తాతా! తాతా! నేను రోజు గీతాపఠనము చేస్తున్నాను. కాని నాకు అది అసలు అర్ధము కావటము లేదు. గీత పుస్తకము మూసిన తరువాత, ఎం చదివానో నాకు అంతు పట్టటము లేదు. అసలు ఈ గీతాపఠనము నువ్వు ఎందుకు చేస్తావో అర్ధము కావటము లేదు. గీతాపఠనము వలన ఏం వస్తుంది" అని తాతగారిని నిలదీశాడు.
తాతగారు పొయ్యిలో బొగ్గు వెయ్యటము ఆపి " నువ్వు ఈ బొగ్గులు వేసే బుట్ట తీసుకుని నదినుండి నీళ్ళు తీసుకుని రా! చెబుతాను " అన్నాడు.
తాతగారు చెప్పినట్లే మనవడు చేశాడు. కాని, నీళ్ళు తెచ్చేటప్పుడు అన్నీ కారిపోయాయి. " తాతా! నీళ్ళన్నీ కారిపోయాయి చూడు" అన్నాడు మనవడు.
"నువ్వు కాస్త వేగంగా పరిగెత్తాలి" మనవడు మళ్ళీ నదికి పరుగెత్తాడు. ఈసారి వేగంగా కదిలివచ్చాడు. అయినా లాభం లేకపోయింది.
"ఇంకాస్త వేగంగా పరిగెత్తలేవా?" వేడుకోలుగా మనవడిని అడిగాడు తాత. తాతగారి మాటవిని మనవడు మరింత వేగంగా నీటిని పట్టుకొచ్చాడు. అయినా ప్రయోజనం శూన్యం. నీరు అంతా దారిలోనే పోయింది. ఆయసపడుతూ "లాభంలేదు తాతాగారు! ఈబుట్టకి అన్నీ కన్నాలే. నేను లోపలికి వెళ్ళి బకెట్ తెస్తాను" అన్నాడు మనవడు.
" నాకు ఆ బుట్టతోనే నీళ్ళు కావాలి. బకెట్తో కాదు. నువ్వు, బుట్ట కలిసి నాకోసం ఈ పని చెయ్యలేరా?" అన్నాడు తాతగారు.
తాతగారికి కన్నాలు ఉన్న బుట్టతో నీళ్ళు తేవడం అసాధ్యమని చూపెడదామని మనవడు మళ్ళీ నదికి పరుగెత్తాడు.
ఈసారి నీళ్ళు కారిపోయాయి. " చూశారా తాతగారు! మీరు నాచేత పనికిమాలిన పని చేయిస్తున్నారు. నా శ్రమంతా వృధా"
"నీ శ్రమ వృధా అయిందంటావా" ప్రశ్నించాడు తాతగారు.
"వృధాగాక మరేమిటి తాతగారు?" ఎదురు ప్రశ్న వేశాడు మనవడు.
" ఓసారి బుట్టవంక చూచి చెప్పు?" అనడిగాడు మనవడిని తాతగారు
ఈసారి మనవడు బుట్ట వంక పరీక్షగా చూశాడు. లోపల, బయట నల్లగా మసిబట్టిన బుట్ట మసి అంతా పోయి తెల్లగా మెరుస్తోంది.
"నాయనా! భగవద్గీత చదవటము వలన మనకు వచ్చే ప్రయోజనము ఇదే! మసిబారిన మనస్సు శుద్ధమవుతుంది. మనలో మార్పు వస్తుంది. గీతాచార్యుడు చేసే పని ఇదే. " అన్నాడు తాతగారు కళ్ళజోడు తుడుచుకుంటూ.
ఈసారి మనవడు కళ్ళు మెరిసాయి

No comments:

Post a Comment