06/12/17, 10:06:08 PM: Rajeswararao: *తిథుల ప్రకారము జన్మదినము*
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
జరుపుకొనవలెనా
లేదా తారీఖుల ప్రకారము జరుపవలెనా అన్న ప్రశ్నకు సమాధానము ఉదా :--
03-09-2016 దుర్ముఖి నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియా శనివారం ఉదయం 9-32
నిముషాలకు బాలుడు జననం. ఆ సమయమునకు ఆరు బయట ఒక అద్దమునకు మసిరాసి దాని మీద
సూర్యుని కాంతి పడునట్లుగా చేసి అక్కడ సుద్దతో గీతను గీసినాను.తరువాత
అద్దమును అక్కడ పదిలముగా ఉంచినాను. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరము 23-08-2017
హేమలంబ నామ సంవత్సర భాద్రపద శుద్ధ విదియా బుధవారం ఉదయం పరిశీలిస్తే
ఆశ్చర్యం కిరణములు గీత ఉన్న చోటనే ఉన్నాయి. తారీఖుల ప్రకారం కూడా
చూశాను.దరిదాపులలో కూడా లేదు.అద్దానికి ఐదు అడుగుల దూరములో పడుతున్నాయి.
నా
హిందూ ధర్మము ఎంత గొప్పదో తిథులను సూర్యుడు అనుసరిస్తున్నాడో సూర్యుడిని
తిథులు అనుసరిస్తున్నాయో తెలియదు కానీ తారీఖుల సంస్కృతిని ప్రకృతి సైతం
తిరస్కరించడం మహదానందమనిపించింది. ఇప్పుడు చెప్పండి పుట్టిన రోజులు
సూర్యుడు సైతం ఆమోదించిన తిథుల ప్రకారం జరుపుకుంటారా ? లేదా ప్రకృతితో సైతం
తిరస్కరించబడిన తారీఖుల ప్రకారం చేసుకుంటారా ?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment