27/12/17, 4:34:00 PM: Mani: 🙏💐శుభోదయం💐🙏
జ్యోతిష్య పాఠం 2
మొదటి పాఠం లో 27 నక్షత్రాలు ఉంటాయని వాటి పేర్లు నేర్చుకున్నాం.
మనం
మాట్లాడే ప్రతి అక్షరానికి ఒక నక్షత్రం ఉంటుంది,ఆ నక్షత్రం లోని భాగము
ఉంటుంది.అనగా మనం పలికే అక్షరాలు ఏ నక్షత్రానికి వర్తిస్తాయో తెలుసుకుంటే
మన పేరులోని మొదటి అక్షరాన్ని బట్టి మనం ఏ నక్షత్రానికి చెందుతామో ఈజీగా
తెలుసుకోవచ్చు.
ఈ క్రింద ఏ నక్షత్రానికి ఏ యే అక్షరాలు వస్తాయో ఇస్తున్నాను.
ఒక నక్షత్రాన్ని 4 భాగాలుగా మన సౌలభ్యం కోసం విభజించారు.అనగా ఒక నక్షత్రానికి 4 భాగాలు అంటే 27 నక్షత్రాలకి 108 భాగాలు అన్నమాట.
ప్రపంచం
లోని ఎవ్వరైనా ఈ 108 భాగాల్లో ఎదో ఒక భాగానికి చెందవలసిందే.ఈ 108 భాగాలకు
కొన్ని గుర్తులు పెట్టారు అవి మనకు ఇంకా ఈజీగా ఉండటం కోసం మన అక్షరమాల లోని
అక్షరాలు పొందుపరచటం జరిగింది.
అవి ఈ విధంగా
ఉంటాయి,కొంచెం కష్టమయినప్పటికి బట్టి పట్టడం వల్ల మీరు తేలికగా పెరు
చెప్పగానే వారు ఏ నక్షత్రం,ఏ భాగం కిందకు వస్తారో చెప్పేయవచ్చు.
ఇక నక్షత్రాలు వాటి భాగాలు పేర్లు,ఈ భాగాలనే పాదములు లేదా చరణాలు అంటారు.
చు,చే,చో,ల ---అశ్విని
లి,లు,లే,లో------భరణి
ఆ,ఈ,ఉ,ఏ ----కృత్తిక
ఓ,వ,వి,వు ---రోహిణి
వే,వొ,క,కి ----మృగశిర
కు,ఘం,జ్ఞ,చ(ఇక్కడ 'చ'అక్షరం వొత్తు ఉంటుంది)---ఆరుద్ర
కె,కో,హ,హి, ---పునర్వసు
హు,హే,హో,డ --పుష్యమి
డి,డు,డే,డో ---ఆశ్లేష
మో,ట,టి,టు ---మఘ
టి,టు,టే,టో --పుబ్బ
టే,టో,ప,పి ---ఉత్తర
పు,షం,ణ,ట(వొత్తు' ట')--హస్త
పే,పో,ర,రి-------చిత్త
రూ,రే,రో,త ---స్వాతి
తి,తు,తే,తో ---విశాఖ
న,ని,ను,నే ----అనురాధ
నో,య,యి,యు ---జ్యేష్ఠ
యే,యో,బా,బి ---మూల
భూ,ధ,భా,డా ---పూర్వాషాఢ
బే,బో,జ,జి----------ఉత్తరాషాఢ
జూ,జె,జో,ఖ ---శ్రవణం
గ,గి,గు,గే -----ధనిష్ఠ
గో,స,సి,సు ----శతభిషం
సే,సో,దా,ది ----పూర్వాభాద్ర
దు,శం,ఝ,థ --ఉత్తరాభాద్ర
దే,దో,చ,చి ---రేవతి
ఏ పేర్లతో ఈ అక్షరాలు మొదలయిన ఆయా నక్షత్రములు ఆయా పడములుగా గుర్తించి ముందు చెప్పబోయే నక్షత్ర ఫలితములు
చెప్పవలెను.
ఇంతే
కాకుండా కొన్ని సంయుక్తాక్షరములు అనగా వొత్తులతో కూడుకున్న పేర్లు ఉంటాయి
అవి ఏ నక్షత్రాలకు చెందుతాయో 3 వ పాఠం లో తెలుసుకుందాం.
నమస్తే
No comments:
Post a Comment