Tuesday, October 10, 2017

10/10/17, 8:03:35 AM: ‪+91 80088 84529‬: శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం... కొల్హాపూర్ మహరాష్ట్ర

సతీదేవిని ఖండించిన శరీరబాగాల్లొ మరొక్కటి పడిన ప్రాంతమే... ఈ శక్తిపీఠముగా అవతరించింది ... తమోగుణ ప్రాబల్యంతో కూడిన రజొగుణంతో పుట్టిన మహిషాసురుడు దేవతలను ... ముల్లొకాలను పీడించగా ... సత్యగుణ ప్రాబల్యంతో కూడిన రజొగుణంతో అష్టాదశ భుజములతో ...
శ్రీ మహాలక్ష్మిదేవిగా అవతరించి వాడిని సంహరించింది ... అప్పుడు దేవతలు మాకు శత్రుపీడ కల్గినపుడల్లా ... నీవు వచ్చి రక్షించాలని మహాలక్ష్మీదేవిని కోరగా ... అంతట ఆ దేవి పెన్నానదీతీరంలొ పద్మావతం అనే పురంలొ ఒక ఆంశతో స్థిరంగా నిలిచిపొయింది...

ఆలయచరిత్ర :- బ్రహ్మ మానస పుత్రులలొ మూడవవాడు "కోలహడు" కోలహడు అనగా అడవి పందులను చంపేవాడు అని అర్థం ... ఇతడని మహవీరుడు అని కూడా అంటారు ... ఆ పదమే "కోల్హా" అయినది ... ఈ కొల్హుడు పద్మావతి పురంకి చక్రవర్తిగా వుండి రాజ్యపాలన సవ్యంగా చేసేవాడు ... దేవతలపై పగబట్టిన కొల్హుడు ... బ్రహ్మపుత్రుడు కనుక తపస్సుతొనే దేవతలను గెలవాలని నిశ్చయించుకొన్నాడు ..ఇతడు తీవ్రమైన తపస్సులొ వుండగా "సుకేశి" అనే రాక్షసుడు ఇతని రాజ్యాన్నీ ఆక్రమించి ... ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ ... దేవతలను పీడించసాగాడు ...
కొల్హుడు వరాలు పొంది ... స్వపురానికి చేరుకొని సుకేశిని సంహరిస్తాడు ...
రాజ్యపాలనలో ధర్మంగానే వున్న కొల్హుడు దేవతల మీద కొపంతో ధర్మాన్ని ద్వంసం చేయసాగాడు ... విధిలేక దేవతలు మహాలక్ష్మీదేవిని ఆశ్రయించారు ... మహాలక్ష్మీదేవి స్వయంగా యుద్దానికి దిగింది ... ఆమె చేతిలో చావు దెబ్బలు తిన్నాడు కొల్హుడు ... అప్పటికి కళ్లు తిరిగి అతనిలో అంతర్గతంగా వున్న బ్రహ్మపుత్రత్వం బయటకి వచ్చి ... దేవిని స్తుతించాడు ... మరణావస్థలో వున్న కొల్హుణ్ణి అతని స్తుతికి మెచ్చి ... వరం కోరుకొమ్మన్నది... అతడు మూడు వరాలు కోరుకొన్నాడు ...*మొదటి వరం* :- అమ్మా ... నన్ను క్షమించు ... నీవు ఈ స్థానంలో స్థిరంగా సంపూర్ణ కళలతో నివశించమని కొరాడు... *రెండవ వరం* ఈ క్షేత్రాన్ని సిద్ది క్షేత్రం చెయ్యమని కోరుకొన్నాడు ...
*మూడవ వరం*ఈ క్షేత్రానికి నా పేరు కలిగేటట్లు అనుగ్రహించు అని కోరుకొన్నాడు ... మహాలక్ష్మిదేవి అతనికి మూడు వరాలను ప్రసాదించి ...
ఆ తర్వాత బ్రహ్మస్త్రంతో కొల్హాసురుణ్ణి సంహరించింది ... అందుకే ఈ క్షేత్రమున కొల్హాపురి మహాలక్ష్మిగా వెలసినది...

కొల్హాపురంలో వెలసిన అమ్మవారి ప్రాశస్త్యం అందరికీ తెలియడంతో క్షేత్రం అందరికీ దర్శనకేంద్రంగా మారింది.
ప్రళయంలోనూ చెక్కుచెదరదు.. ఈ ప్రాంతాన్ని కర్వీర్‌గా వ్యవహస్తారు. ఆ మహాదంపతులకు ఇష్టమైన ప్రదేశం కావడంతో మహాప్రళయంలోనూ చెక్కుచెదరదు. అందుకనే ఈ క్షేత్రాన్ని అవిముక్తేశ్వర క్షేత్రమని పేర్కొంటారు. లోకమాత జగదాంబ ఈ క్షేత్రాన్ని సృష్టించింది. అందుకనే ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో మహర్షులు, ఋషులు పూజలు చేసినట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. అమ్మవారి తపస్సు అనంతరం ఒక్క రాత్రిలోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది.

అరుదైన శిలపై అమ్మవారి రూపం

శ్రీమహాలక్ష్మీదేవి విగ్రహాన్ని అరుదైన శిలపై చెక్కారు. నాలుగు హస్తాలు కలిగి భక్తులను దీవిస్తున్న రూపం మనల్ని ఆకట్టుకుంటుంది. ఫలం, గద, కవచం, పాత్రను నాలుగుచేతుల్లో కలిగివున్న దివ్యమంగళరూపం భక్తులకు ఎల్లప్పుడూ ఆశీర్వచనాలు ఇస్తుంటుంది. అంబా బాయిగా ఆమెను భక్తులు ఆరాధనతో పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. శక్తిపీఠాల్లో కూడా కొల్హాపూర్‌ ఒకటి కావడం విశేషం.
కిరణోత్సవం.. సూర్యదేవుడు అమ్మవారి కటాక్షం కోసం ఏటా మూడురోజులు గర్భాలయంలోకి సూర్యకిరణాలను ప్రసారిస్తాడు. తొలిరోజు పాదాలకు, రెండో రోజు నడుము భాగానికి మూడోరోజు శిరస్సు భాగానికి కిరణాలు ప్రసారిస్తాయి. ఈ ఉత్సవాలను కిరణ్‌ ఉత్సవ్‌గా వ్యవహరిస్తారు. ఈ దినాల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు వేలాదిమంది భక్తులు కొల్హాపూర్‌కు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో జన్మించిన శ్రీలక్ష్మీదేవిని సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు తన హృదయేశ్వరిగా స్వీకరిస్తారు.
నారాయణిగా ప్రసిద్ధికెక్కిన లక్ష్మీదేవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలకు లోటువుండదు. ఆమె కటాక్షం కోసం యావత్‌ మానవాళి ప్రార్థిస్తుంది. స్వయంగా ఆమె తపస్సు చేసి వెలసిన ప్రాంతమే కొల్హాపురం. అందుకనే ఆ నగరంలో పేదరికం వుండదని సామెత. సహకార ఉద్యమంలో కొల్హాపూర్‌ కీలకమైన భూమిక పోషించింది. చక్కెర మిల్లులు ఎక్కువగా వుండటంతో భారతదేశానికి చక్కెర కేంద్రంగా మారింది. ఈనాడు సౌజన్యంతో...

ఎలా చేరుకోవాలి
* దేశంలోని ప్రధాన నగరాలతో కొల్హాపూర్‌కు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
* హైదరాబాద్‌ నుంచి రోడ్డు మార్గంలో దూరం 540 కి.మీ.
* పుణె, ముంబాయి విమానాశ్రయాల నుంచి కొల్హాపూర్‌కు రోడ్డుమార్గాన చేరుకోవచ్చు.

No comments:

Post a Comment