Friday, October 6, 2017



06/10/17, 10:18:30 AM: ‪+91 98660 49721‬: 🌸🌸వాగ్దేవి🌸🌸


యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ... స్త్రాన్వీతా
యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా
యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా
సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా
 
​​​​తాత్పర్యం:

యా = ఏ స్త్రీ మూర్తి
కుంద = మల్లెల వంటి
ఇందు = చంద్రుని వంటి
తుషార = మంచు బిందువుల వంటి
హార = దండలతో
ధవళ = మరింత తెల్లగా ప్రకాశించుచున్నదో
యా = ఏ స్త్రీ మూర్తి
శుభ్  = పరిశుభ్రమైన (తెల్లనైనా)
వస్త్రంన్వీత = వస్త్రమును ధరించినది
యా = ఏ స్త్రీ మూర్తి
వీణ = వీణ యనెడి
వర = సమున్నతమైన
దండ = కొయ్య సాధనముతో
మండిత = అలంకరింపబడిన
కరా = చేతులు కలదియై
యా = ఏ స్త్రీ మూర్తి
శ్వేత = తెల్లనైన
పద్మ = తామర పువ్వును
ఆసనా = ఆసనముగా చేసుకొనినదో
యా = ఏ స్త్రీ మూర్తి
బ్రహ్మ = బ్రహ్మ దేవుడు
అచ్యుత = శ్రీ మహావిష్ణువు
శంకర = శివుడు
ప్రభృతిభి: = మొదలుగాగల
దేవై: = దేవతల చేత
సదా = ఎల్లప్పుడును
వందితా = నమస్కారింపబడునో
నిశేష = సంపూర్ణముగా
జాఢ్య = బుద్ధిమాంధ్యమును(అజ్ఞానమును)
ఆపహా = తొలగింప జాలిన
భగవతీ = భగవత్ స్వరూపిణియైన
సరస్వతి = సరస్వతి యనెడి
సా = అటువంటి స్త్రీ మూర్తి
మాం = నన్ను
పాతు = రక్షించుగాక
భావము:-
            మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వఛముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.
              ఈ శ్లోకములో సరస్వతి దేవి ధరించినవన్నీ తెలుపులో వున్నాయి. తెలుపు సాత్విక గుణము. జ్ఞానము. తెల్లపువ్వు వలె, చంద్రునివలె,(తూషార)మంచు వలె, హారధవళ - ముత్యాలహారము. తెల్లని వస్త్రములు ధరించినది. తెల్లని పద్మములో ఆసీనురాలయినది, వీణ ధరించినది. సరస్వతి బొమ్మను పిల్లలకు చూపాలి.
సరస్వతి అనగా = చదువుల తల్లి.
సర+స్వ+తి= జ్ఞానము+మనలోని+ఇచ్చునది.
మనలో ఉన్న ఆ జ్ఞాపకశక్తిని అభివృద్ధి చేస్తుంది.

సరస్వతి ధరించే వీణ పేరు - కఛ్ఛపి
చేతిలో జపమాల - ఆధ్యాత్మికతను అభివృద్ధి చేయును
మరొక చేతిలో వేదములు - అనగా జ్ఞానమును ఇచ్చును
వీణ - సంగీత సాహిత్యము నాదము

సరస్వతికి ఇంకా పేర్లు ఉన్నాయి: వాక్కుకు అధిపతి,వాగ్దేవి,బ్రాహ్మారీ,శారదా,వాణి, విద్యావతి
సరస్వతిని ప్రార్థిస్తే మనకు విద్యా,బుద్ధిని,జ్ఞానమును(జ్ఞాపక శక్తిని),ప్రజ్ఞను ఇచ్చును.

        ఆమె కటాక్షము వుంటే మూగవాడు కూడా  గొప్ప పండితుడు అవుతాడు. చాలామంది కవులకు సరస్వతి దేవి ప్రత్యక్షముగా దర్శనమిచ్చి అనుగ్రహించినది.
*మీ*
*శశికాంత్ శర్మ దహగం*

No comments:

Post a Comment