♨ *దీప ఆవళి*♨
మీరు
మీజీవితంలో ఇప్పటివరకు ఎన్నోసార్లు దీపావళి పండుగను పర్యావరణాన్ని నాశనం
చేసే మందుగుండు సామాగ్రితో జరుపుకొని ఉంటారు. కానీ దయచేసి ఈ దీపావళి నుంచి
అయినా సంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకునేందుకు ప్రయత్నించమని మా
విజ్ఞప్తి.
అద్భుతమైన ఈ
ప్రకృతి మనకెంతో సహకరిస్తున్నది. మన భావి తరాలు కూడా ఈ ప్రకృతి ఒడిలో
సంతోషంగా జీవించాలంటే పర్యావరణ పరిరక్షణ పాటించాల్సిన బాధ్యత మనదే. కాబట్టి
భాస్వరం, పొటాషియం తదితర వాయువులను ఉద్భవింపచేసి ప్రకృతిని నాశనం చేసే
మందుగుండు సామాగ్రి కి దూరంగా ఉండండి. మీపిల్లలకు అలాగే మీపరిధిలోని
బంధుమిత్రులకు స్నేహితులకు పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన అవసరాన్ని
తెలియచేయండి.
అసలు దీపావళి అంటే అర్థం ఏంటో తెలుసా...? "దీపాల వరుస" అని.
మన
భారతీయ సంప్రదాయంలో దీపానికి విశేష ప్రాధాన్యం ఉంది. అందుకే ఏ శుభకార్యం
మొదలుపెట్టినా ముందుగా జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనది.
దీపపు
కుందిలో పోసే నెయ్యి లేదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు
సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా
ఆవిరవుతూ, అహం కాలిపోతూ ఉంటుందని అర్థం చేసుకోవాలి.
పనికిమాలిన రసాయనాలతో తయారుచేయబడ్డ మందుగుండు సామాగ్రి స్థానంలో చక్కగా దీపాలు వెలిగించండి.
ఈ క్రింది శ్లోకం చదువుతూ ఆ దీపంచుట్టూ ప్రదక్షిణ చేయండి. ఇదే మన సంప్రదాయమని గుర్తించండి.
*దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం|*
*దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే||*
దీపం
అడుగుభాగంలో పరబ్రహ్మ, దీపం మధ్య భాగంలో వేంకటేశ్వరుడు, నూనె లేదా నెయ్యి
నిండిన భాగంలో రుద్రుడు, వత్తి ఎక్కడైతే కుదురుగా సర్డుకుంటుందో ఆ భాగంలో
మహేశ్వరుడు, వత్తి యొక్క వెలిగే భాగంలో సదాశివుడు నివాసముంటారు. ఈ మొత్తం
కలిపి లక్ష్మి, సరస్వతి, దుర్గ ఈ ముగ్గురూ కలిసిన ఆది శక్తి స్వరూపం. ఒక్క
చిన్న దీపం వెలిగించి ఏకాగ్రచిత్తంతో, భక్తితో వేడుకుంటే కోరిన కోరికలు
నెరవేరుతాయి. అంతులేని పుణ్యం లభిస్తుంది. దీపాన్ని వెలిగించడమంటే బాధలను
తరిమేసి బ్రహ్మానందాన్ని మనసా వాచా కర్మణా ఆహ్వానించడమే. అజ్ఞానాంధకారాన్ని
తరిమేసి జ్ఞానాన్ని సంపాదించాలంటే దీపలక్ష్మిని పూజించాల్సిందే.
దీపారాధన
చేయడం ద్వారా *మాత్రమే* మన కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. అమ్మవారి
అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. జన్మ సాఫల్యం చేకూరుతుంది.
_*🦑ఓం...నమో...వేంకటేశాయ*🦑_
No comments:
Post a Comment