Saturday, February 23, 2019

"సమాధి" ఒక సమున్నత అవస్థ :

 ఆది వ్యాధులు సమమైన, స్థిత ప్రజ్ఞుడైన  సాధకుడికి సమాధి అవస్థ ప్రాప్తిస్తుంది.  ఆది వ్యాధులు సమమగుట  కఠినమైన పని. ప్రయత్నం వల్ల కూడా  దుర్లభము. అటువంటి అవస్థ ఎప్పుడో ఒకప్పుడు పరిణతి చెందిన సాధకుడికి దానంతట అదే లభిస్తుంది. సమాధి ప్రముఖంగా రెండు(2) రకములు. మొదటిది సగుణ లేదా సబీజ సమాధి. రెండవది నిర్బీజ లేదా నిర్గుణ సమాధి. కోట్లలో  ఒక్కరికి అవస్థా రహిత అవస్థ అయిన నిర్బీజ సమాధి ప్రాప్తిస్తుంది.
      సబీజ సమాధి నాలుగు రకములు. 1.సబీజ ,2.సగుణ ,3.సవిచార,4.సవితర్క సమాధులు. అష్టవిధ  ప్రకృతి ప్రకారము సబీజ సమాధి 8 రకములు. కృష్ణభగవానునికి, అందుకే ఈ కారణంగానే ఎనిమిది మంది పత్నులు అని చెప్పబడింది. ఆయన కూడా స్వయంగా అష్టమ గర్భుడు. అష్టమి నాడే జన్మించాడు. ఈ కథలన్నీ యోగ రహస్యముల తో నిండి ఉన్నాయి. ప్రయత్నము చేసినచో నరుడు నారాయణుడిగా మారవచ్చును.  ప్రతి సాధకుడు స్వయంగా శ్రీ కృష్ణభగవానుడు కాగలడు.

      అనేక జన్మల యందలి, అభ్యాసం వలన సమాధి అవస్థ ప్రాప్తిస్తుంది. శుద్ధమైన, ప్రకృతి సహజమైన శరీరము, అత్యంత శుద్ధము, మరియు స్థిరమైన మనో అవస్థలే సమాధి. నిరంతర అభ్యాసం వలన వైరాగ్యము ప్రాప్తించగలదు.

"అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణచ గృహ్యతే" (భగవద్గీత 6వ అధ్యాయం 35వ శ్లోకం)

అని భగవద్గీతలో చెప్పబడింది.

No comments:

Post a Comment