*లక్ష్మణవ్రతం*:
శ్రీ రాముడి ఎడల హనుమంతుని నిస్వార్ధ
భక్తి రామాయణంలో
కీర్తింపబడినది. అదేవిధంగా లక్ష్మణుని భాతృ భక్తి కూడా అసమాన్యం.లక్ష్మణుని భక్తి శ్రధ్ధలను అర్ధం చేసుకోలేకపోతే
రామాయణం చదివామని అనుకోవడంలో అర్ధమేలేదు.
శ్రీ రాముని పట్టాభిషేకానంతరం
అగస్త్య మహర్షి అయోథ్య నగరానికి విచ్చేసి శ్రీరాముడిని దర్శించారు. రావణుని సంహారం, కుంభకర్ణునితో యుధ్ధం మొదలైన సమర విషయాలు గురించి శ్రీరాముడు అగస్త్య మహర్షికి వివరించాడు. మౌనంగా, శ్రధ్ధగా ఆలకిస్తున్న అగస్త్య మహర్షి 'మేఘనాధుని' సంహారం రామ-రావణ యుధ్ధ ముగింపు కారకమైనది." అని వ్యాఖ్యానించారు.
అందరూ ఆయన వంక
ఆశ్చర్యంగా చూశారు.
"అవును, రావణ-కుంభకర్ణులు వీరాధివీరులే. వారి సంహారం
శ్రీరాముని వలనే జరగాలి. సీతాదేవిని తీసుకుని రావాలంటే రావణ వధ ఆవశ్యకం. అయితే, మేఘనాధుని
సంహారం కూడా అతి ముఖ్యమైనది. దేవేంద్రుని జయించి, బంధించి లంకకు తీసుకుని వచ్చిన వీరుడు మేఘనాధుడు. ఇంద్రుని జయించి 'ఇంద్రజిత్' అని పేరు పొందాడు. బ్రహ్మదేవుడే స్వయంగా లంకకు వచ్చి ఇంద్రుని దానంగా స్వీకరించి మరల స్వర్గానికి తీసుకుని వెళ్ళవలసి వచ్చినది.
అటువంటి వీరుని సంహారం అతి ముఖ్యం.
రావణ వధకు శ్రీ రాముడు
అవతరించినట్లే, మేఘనాధుని సంహారం లక్ష్మణుని వల్లనే సాధ్యం. మేఘనాధుడు పొందిన వరం అటువంటిది. అసాధారణ మైనది. మేఘనాధుని సంహరించే వీరుడు మూడు నిబంధనలను పాటించిన వాడైవుండాలి. మొదటిది: పదునాలుగు సంవత్సరాలు నిదురించకుండా వుండాలి. రెండవది: పధ్నాలుగు సంవత్సరాలు స్త్రీ సహచర్యం
వుండకూడదు. మూడవది: పధ్నాలుగు సంవత్సరాలు అన్న ఆహారాలు మాని వుండాలి. ఇటువంటి కఠినమైన నిబంధనలను
లక్ష్మణుడు తన పధ్నాల్గేళ్ళ వనవాసంలో చాలా కఠినంగా పాటించాడు." అన్న అగస్త్య మహర్షినే అందరూ చూస్తూ వుండి పోయారు.
శ్రీ రాముడు...
"మునివర్యా! చిత్రకూటంలో, నేను సీతాదేవి ఒక కుటీరంలో
వున్నాము. ప్రక్కన వున్న
కుటీరంలో లక్ష్మణుడు
వున్నాడు. రాత్రుళ్ళు
లక్ష్మణుడు నిద్రలేకుండా మాకు రక్షణగా కాపలా కాశాడు. నిద్రలేకుండా వుండి వుండవచ్చును ,వదినగారనే గౌరవభావంతో, సీతాదేవి
ముఖం కూడా చూసి
వుండక పోవచ్చును,
నేను గమనించాను. అతని భాగంగా నిత్యం కందమూలాలను ఫలాలను యీస్తూ వచ్చాను. మరి అతను ఆహారం తీసుకోలేదని
యెలా చెపుతారు ? అని అడిగాడు. అగస్త్య మహర్షి నవ్వుతూ, రామచంద్రా! లక్ష్మణుని ఔన్నత్యం అందరికి తెలియాలని యీ ప్రశ్న
అందరి ముందూ వుంచారని నాకు అర్ధమయింది.
తన చెంతనేవున్న తన సోదరుడు సౌమిత్రిని చూసి " ఈవిషయమై నీ సమాధాన మేమిటి లక్ష్మణా!? అని శ్రీరాముడు అడిగాడు.
"అన్నా! మీకు గుర్తు వుండే
వుంటుంది. మనం సీతమ్మవారిని వెదుకుతూ
ఋష్యమూక పర్వతం మీదకు వెళ్ళినపుడు
సుగ్రీవుడు సీతాదేవి ఆభరణాలు చూపించాడు
కదా! అవి రావణాసురుడు
సీతాదేవిని ఎత్తుకు పోతూంటే సీతాదేవి క్రిందికి విసిరిన ఆభరణాలు. వాటిలో కాలి మువ్వల పట్టాలు తప్ప మిగతావాటిని గుర్తించ లేక పోయాను. కారణం, సదా నేను సీతమ్మ వారి పాదాలుమాత్రమే
నిత్యం గమనించే వాడిని.
మీరు రాత్రి నిద్రపోయే వేళలో, విల్లుఅంబులతో
నేను వాకిలి వద్ద కాపలాకాస్తూ వున్నాను. నిద్రాదేవి నన్ను ఆవహించాలని వచ్చింది నా అస్త్రాలతో ఆవిడ
ప్రయత్నాలను తిప్పి కొట్టాను. ఓడి పోయిన నిద్రాదేవి పధ్నాలుగు సంవతరములు నాదగ్గిరకు రానని వరం యిచ్చింది. పధ్నాల్గేళ్ళు ముగిసిన తరువాత రామపట్టాభిషేకం రోజున వస్తానని వెళ్లి పోయింది. మీకు జ్ఞాపకం వుండే వుంటుంది. నేను చామరం వీస్తూండగా నా చేతినుండి అది జారిపోవడం; నేను సద్దుకుని దానిని మరల సర్ది పట్టుకోవడం...శ్రీరాముడు చిరునవ్వు తో సరే, నేను నీకు పంచిన ఫలాలు భుజించకుండా ఏమి చేశావు? కాని పండ్లు నావద్ద నుండి తీసుకొన్నావుగా... మరి పధ్నాలుగు ఏళ్ళు ఆహారం లేకుండా వున్నానని ఎలా చెప్పావని అడిగాడు.
అన్నా! ఆకలి దప్పులు దరిచేరని మంత్రాలను మహర్షి విశ్వామిత్రుడు మనకు ఉపదేశించారు కదా! ఆ ఉపదేశ కారణం
ముందే గ్రహించారు వారు. ఆ మంత్ర ప్రభావంతో నేను ఆకలిని నియంత్రించాను.
మీరు యిచ్చిన ఫలాలు శబరి ఆశ్రమంలో బుట్టలో భద్రపరిచాను అన్నాడు.
శ్రీ రాముడు హనుమంతుని వైపు చూశాడు. ఆయన భావమును అర్థం చేసుకొన్న హనుమంతుడు తన భూత దేహంతో శబరి ఆశ్రమానికి
వెళ్లి కొద్ది క్షణాలలోనే ఎండిపోయిన పళ్ళ బుట్టతో తిరిగి వచ్చాడు.
వాటిని గమనించి లెక్క
చూసిన వారు, కొన్ని పండ్లు తగ్గినట్లుగా శ్రీరామునికి నివేదించారు.
శ్రీ రాముని దృష్టి లక్ష్మణుని మీద పడినది."
అన్నా! సీతాదేవిని రావణాసురుడు ఎత్తుక
పోయిన రోజు ఆకలి దప్పులు లేకుండా యిద్దరం వెతకి వేసారాము.
సముద్రము మీద సేతువు
నిర్మించినప్పుడు వ్రత దీక్ష వలన పండ్లు యివ్వలేదు.
మేఘనాధుని వధించే
ముందు ఇద్దరం వ్రతంలో
వుండడం వలన పండ్లు
తీసుకోలేదు. రావణుని
వధించిన రోజు వ్రతం రోజని పళ్ళు తీసుకోని కారణాన్ని, అవి బుట్టలో లేకపోవడానికి కారాణాన్ని సాహేతుకంగా లక్ష్మణుడు వివరించాడు.
అందరూ జవాబు విని
నిశ్చేష్టులై లక్ష్మణుడినే చూస్తూ వుండి పోయారు.
శ్రీ రాముడు అతిశయించిన
ప్రేమానురాగాలతో లక్ష్మణుని ఆలింగనం చేసుకున్నాడు.
లక్ష్మణుడి వ్రతదీక్ష, ఆయన భాతృభక్తి , ఔన్నత్యం అగస్త్యమహర్షి ద్వారా లోకానికి వెల్లడయింది.

No comments:
Post a Comment