Tuesday, January 23, 2018

20/01/18, 7:38:54 PM: ‪+91 94411 78068‬: ఆంధ్రభాషా మకరందము :

భాషయా తెలుగన్న! భావనాంబోధిలో బంగారువోడలో పయనమౌను!
భావమా తెలుగన్న! భాషావధూటికి పాదార్చనముసేయు పద్మమౌను!
పద్యమా తెలుగన్న! పట్టాభిషిక్తులౌ తెలుగుమారాజుల తేజమౌను!
వచనమా తెలుగన్న! బండఱాళ్ళనునైన చెమ్మ పుట్టించెడి సేద్యమౌను!

అట్టి మీ భాష హృదయమ్ము పట్టుకొనుడు!
వట్టి పరభాషపై మోజు వదలుకొనుడు!
మమ్మి, డాడీ ల మాటలు మానుడింక!
అమ్మ, నాన్న ల యనురాగ మందుడింక!

  (గరికిపాటి నరసింహారావుగారి "సాగరఘోష" కావ్యము నుండి)

No comments:

Post a Comment