23/01/18, 7:00:25 AM: Mouli: _*మాఘపురాణం - ఏడవ అధ్యాయం*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉
మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా
ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు కావేరీ నదిలో దిగి అకాల
మృత్యువు వాతబడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం యమధర్మ రాజును
గురించి తపస్సు చేయ నారంభించినాడు.
నిశ్చల
మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా మృగశృంగుని
కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు,
పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. నా గురించి ఇంత దీక్షతో ఎవ్వరూ
తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం నెరవేర్చెదను”
అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు
కన్నులు తెరచి చూడగా యముడు తన ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి
“మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి సామాన్యునికి
మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు
పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని
ప్రార్థించెను.
మృగశృంగుని పరోపకార బుద్ధికీ,
దయార్ద్ర హృదయమునకు యముడు సంతోషించి అతని కోరిక ప్రకారము ఆ ముగ్గురు
కన్యలకు ప్రాణదానము చేయనేంచి “మృగశృంగా! నీ భక్తికి మెచ్చితిని. నీ పరోపకార
బుద్ధి నన్నాకర్షించింది. నీకు జయమగుగాక” అని యముడు దీవించగా –
మహాపురుషా!
మిమ్ము సంతోషపెట్టుట సామాన్యమైనది కాదు. మిమ్ము సోత్రము చేసిన వారికి,
స్తోత్రము విన్నవారికి జరామరణములు కలుగవు. అట్టివారికి అన్ని విధముల
శుభములు కలుగునటుల అనుగ్రహింపుము అని ప్రార్థించగా –
*“అటులనే నీ కోరిక సఫలమగుగాక”* యని యమధర్మరాజు దీవించి యద్రుశ్యుడయ్యెను.
No comments:
Post a Comment