Tuesday, January 23, 2018

17/01/18, 10:12:03 PM: MVMRAO: శైవము
షట్స్థలవివరణ:---(-ఇదికేదారలింగము)
శివపూజాసమయమున ఉపాసకుడు ఆచరించు పధ్ధతలు 6 విధములు వానినే
షట్ స్థలములు అంటారు.
1.భక్త స్థలము.
2 .మహేశ్వరస్థలము
3.ప్రసాద స్థలము.
4.ప్రాణలింగస్థలము
5.శరణస్థలము.
6.ఐక్య స్థలము.

దీక్షతీసుకొనిన ఉపాసకుడు ఈ ఆరుస్థల నియమములను క్రమంగా ఆచరించు .ఈ చుండవలయును. ఈవిధానమువలన
ఉపాసకునికి యోగముకలుగును యోగగము అనగానేమి? కరచరణాదు కదిలించుటకాదు
ఆక్రియలు పాంచభౌతిక శరీరమునయున్న అనవసరమైన కొవ్వ కరుగుటకు నవీనముగా
యోగా నేర్పెడి నేర్పరుల ఏర్పరిచిన ఒకరక వ్యాయామము. అంతయే కాని యోగమన యదికాదు జీవుడు శివుడిలోఐక్యమగుటకు మార్గమును పొందుట.ఇది యోగము.
యోగశాస్త్రమున చెప్పబడిన షట్చక్రములకు
ఈషట్ స్థలములకు సంబంధమున్నట్లుగోచరిం చను.

యోగశాస్త్రమునందలి
1.ఆధార.
2.స్వాధిష్ఠాన.
3.మణిపూరక
4.అనాహత.
5.విశుధ్ధ.
6.ఆజ్ఞా చక్రంబులకు

ఈషట్ స్థల ఉపాసనకు  సన్నిహత సంబంధమున్నదనిపించును.

ఇందుకారణమేమన నిరంతరము క్రమపధ్ధతి నందున సాగించునీయుపాసనచేత సాధకుని
మానసిక శారీరక మార్పులు గోచరించును

ఈ శివోపాసనాపరులు మంత్రసిధ్ధులు
వారిది వశ్యవాక్కులు .
దివ్యతేజోవిరాజితులు.
యోగులు ఏవిధమయిన శక్తిగలవారో
వీరును అటులే మహిమాన్వితులు.
అష్టావరణములు:-----ఆరాధ్యశైవసంప్రదాయమున ఈఅష్టావరణములు ప్రాణతుల్యములు
అవి వారి నత్య జీవన విధానమునకు
విడదీయరాని సంబంధమున్నది.
1.గురువు.
2.లింగము(లింగధారణము)
3.జంగముడు(జంగమసేవ) అనగా జంగాల సేవకాదు జంగమము అనగా  శివదర్శనము (లింగధారణము అయిన వాడు
శివునితోసమానుడనుభావన)
4.తీర్థము.
5.ప్రసాదము.
6.భస్మము.(భస్మధారణము)
7.రుద్రాక్ష(రుద్రాక్షధారణము)
8.మంత్రము(మంత్రజపము)
అనునవి అష్టావరణములు.ఇవి ఆరాధ్యులకు నిత్యమాచరణీయములు.
సంసార సంబంధములయిన దోషములు ఈఅష్టవరణములాచరణమున నశించి శివైక్యమునకుదారిచూపించునవి.
వీని వివరణము మరల తెలుసుకొందము (ఇంకావుంది).

No comments:

Post a Comment