Thursday, May 16, 2019

*ఆంజనేయ స్వామి అవతారాలు తొమ్మిది*forwaded By Padmaja mudigonda

హనుమంతుడు కూడా దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి తొమ్మిది. హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది.

1. ప్రసన్నాంజనేయస్వామి.
2. వీరాంజనేయస్వామి.
3. వింశతిభుజాంజనేయస్వామి.
4. పంచముఖాంజనేయస్వామి.
5. అష్టాదశ భుజాంజనేయస్వామి.
6. సువర్చలాంజనేయస్వామి.
7. చతుర్భుజాంజనేయస్వామి.
8. ద్వాత్రింశాద్భుజాంజనేయస్వామి.
9. వానరాకార ఆంజనేయస్వామి

ఆంజనేయ స్వామికి పూజచేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం మరియు గురువారం. పురాణకథ ప్రకారం, ఒక సారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతడిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడగా, స్వామి తనను, తన భక్తులను యెప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే ఏడున్నర యేళ్ళ శనిదోషం ఉన్నవారు శనివారం ఆంజనేయ ఉపాశన చేస్తే వారికి మంచి కలిగి, శని దోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శని వారాలలో ఏ రోజైనా స్వామికి పూజ చేసుకోవచ్చు.

*ఓం నమో ఆంజనేయ నమో నమః*

*శుభ శుభోదయo
_*శ్రీరమణీయం* *-(168)*_



_*"దేహంపైఉన్న ధ్యాసను చైతన్యంపై ఎలా నిలపాలి ?"*_

_*అద్దంలో ప్రతిబింబం చూసుకునేప్పుడు మనకు ఆ అద్దంపై ధ్యాస ఉండదు. అద్దాన్నే చూడాలనుకుంటే అందుకు మన ప్రతిబింబం అడ్డేమీ కాదు. ప్రతిబింబంపై ఉంచిన ధ్యాసను అద్దంపైకి తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే ప్రస్తుతం దేహంపై ఉన్న ధ్యాసను చైతన్యంగా ఉన్న 'అసలు నేనెవరు' అనే విచారణలోకి మార్చాలి. కేవలం మంత్రజపం చేస్తూపోతే ఆధ్యాత్మికంగా ప్రయోజనం ఉండదు. మన లోనుండి ఆ జపాన్ని చేసేదెవరో గమనిస్తేనే సత్యం తెలుస్తుంది. అంటే మనసుకు మూలంగా ఉన్న చైతన్యం తెలుస్తుంది. ఇక్కడ గమనించటం అంటే మనసు చేసే మంత్రాన్ని, ఆ మనసే వినేంత శ్రద్ధగా చేయటం అన్నమాట !*_

_*{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}*_
_*'మన ఉనికే దైవం !'*-

🕉*శ్రీ ఆంజనేయ స్వామి మహాత్మ్యం –26*
🕉🌞🌎🌙🌟🚩                                                     *కేశవుని కధ*


  పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు .వేద వేదాoగ పారంగతుడు. బుద్ధిమాన్,
 స్వధర్మా చరణనిష్టుడు.
 పుత్రులు ,పౌత్రులతో, భార్య విశాలాక్షితో సుఖ జీవితం
 గడుపుతున్నాడు. అతిధి పూజలో జన్మ ధన్యం
 చేసుకొంటున్నాడు.


 ఆ గ్రామానికి ఒక ప్రభువులా వెలిగి పోతున్నాడు కేశవుడు. కొంత కాలానికి అతని జీవితం లో, విషాదం అలముకొంది.
 ప్రియ అర్ధాంగి, అకస్మాత్తుగా మరణించింది. అతని దుఖం పట్ట శక్యం కాకుండా ఉంది.
 బాధ తట్టుకోలేక, కాశీ నగరం చేరాడు.
అక్కడ నిత్యం, గంగా స్నానం తో, పవిత్రతను పొందుతూ,
 విశ్వేశ్వరున్ని దర్శిస్తూ, అభిషేకం చేస్తూ, విశాలాక్షీ దేవి దర్శనంతో ఊరట చెందుతున్నాడు . కొంత కాలం కాశీలో గడిపి , తర్వాత, ప్రయాగ , గయా, మొదలైన
 క్షేత్రదర్శనం చేసి, పితృ కార్యాలను, నిర్వహిస్తూ,
 విధ్యుక్త ధర్మాలన్నీ
 నిర్వహిస్తూ, కొన్ని నెలలు గడిపి , మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు . ప్రయాణంలో
ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు.
 ఆ వటవృక్షం, చాలా పురాతనమై, ఊడలతో బాగా విస్తరించి ఉంది .అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని, ఒక పిశాచం, అందంగా ఉన్న కేశవుని తినాలని, ఉబలాటపడింది.


 మనోహర సుందర యువతి గా మారి, అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టటం ప్రారంభించింది.
 అతనికి ఏమీ పాలు పోలేదు.
 ”యువతీ !ఎవరు నువ్వు ?అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయిందా ?నేను భార్య లేని వాడను. నా అండ దండలతో ఉండగలవా ? నువ్వు ఒప్పుకొంటే, నాతో నిన్ను,
మా ఊరు తీసుకొని వెళ్తాను” అని చెప్పాడు . ఆమె అంగీకరించింది . వారిద్దరూ
 ఆ రాత్రి ఆనందంగా గడిపారు .మర్నాడు ఆ ఇద్దరు ఇంటికి చేరారు .
 కొంత కాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద, ధూళి దూసర దేహంతో , రుద్రాక్షమాల ధరించి , వ్యాఘ్ర చర్మాంబర దారి అయిన, ఒక యోగి, శిష్యులతో కనిపించాడు.


కేశవుడు ఆయన్ను చేరి, తన ఇంటికి వచ్చి, ఆతిధ్యం స్వీకరించమని కోరాడు.
 సంతోషంతో ఆ యోగి,
శిష్యులతో, కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలికి  వెళ్లి, భార్యను రమ్మని పిలిచాడు .
 అ యోగి పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, ”కేశవా! ఆమెను తెలుసుకొనే కాపురం చేస్తున్నావా ? పెళ్లి చేసుకోన్నావా ?నిజం చెప్పు" అని అడిగాడు. దానికి కేశవుడు, జరిగిన విశేషాలన్నీ, వివరంగా తెలిపాడు. తనకేమీ తెలీదని, తనను ఉద్ధరించ మని వేడుకొన్నాడు .
కేశ్శవునిపై యోగికి జాలి కలిగి, అతన్ని ఉద్దరించాలని భావించాడు. ”ఈమె విషయం నేను చెప్పను. నువ్వే గ్రహించు .”అని చెప్పి, శ్రీ రామ తారక మంత్రాన్ని ఉపదేశించి, వెంటనే జపిoప చేయించాడు.
 ఒక రుద్రాక్షమాలను ఇచ్చి దానితో జపం చేయమన్నాడు.


 చేతిలోని ఆ మాల వల్ల, సూర్య తేజంతో వెలిగి పోతున్నాడు. ఆమె భయపడి ఆ జపమాలను దూరంగా విసిరేయమని కోరింది . తన దగ్గరకు రావద్దని ప్రార్ధిస్తూ, ఏడుస్తూ దూర దూరంగా జరిగింది . అప్పుడు భక్త
సులభుడైన ఆంజనేయస్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచిని చుట్టి, విసిరేశాడు.
 కేశవుడికి జరిగినదంతా తెలిపి, స్వామి అదృశ్య మైనాడు. కేశవుడు యోగిని దర్శించి, జరిగినదంతా తెలియ జేసి , తన్ను ఉద్ధరించమని వేడాడు . యోగి కృపాళువై, ”రామ, ఆoజనేయులను, నిత్యం జపించు . ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్టించు.
 జీవితాంతం, హనుమ పూజ మానవద్దు ” అని హితవు చెప్పి శిష్యులతో వెళ్లిపోయాడు.


 యోగి ఆదేశించిన విధంగా, కేశవుడు, శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మిచి , స్వామిని ప్రతిష్టించి, యదా విధిగా పూజలు నిర్వహిస్తూ,
 హనుమద్భక్తులను ఆదరిస్తూ,
 హనుమ కధలను వినిపిస్తూ,
 హనుమదనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది , చివరకు ముక్తిని పొందాడు.

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment