10/06/17, 10:19:36 AM: KK: 🦋🦋🦋🦋🦋
🌷🌷🌷🌷🌷
🌹 *"ఆలోచనలు --నియంత్రించే పద్ధతులు"*🌹
✅ *నీ మనసులో సంచరించే మరియు లోనికి ప్రవేశించే చెడ్డ, దుష్ట ఆలోచనలకు
సహాయసహకారాలను ఎట్టి పరిస్థితులలోనూ అందించవద్దు. అలాంటి ఆలోచనలకు ఆహారం
అందించకుండా, దృఢ నిశ్చయంతో సహాయనిరాకరణ ఉధ్యమం చేయాలి. ఎల్లప్పుడూ
ఉన్నతమయిన, అద్భుతమయిన ఆలోచనలను చేయడం ద్వారా దుష్ట ఆలోచనలకు ఆహారం లభించక
కొద్ది కాలంలోనే మరణిస్తాయి.*
✅ *మీరు ఈ చిన్న సాధన ద్వారా దుష్ట ఆలోచనలను రూపుమాపవచ్చు. మీ మనసు
"టి.వి. చూడాలి అంటే మీరు వెంటనే నేను నీకు ఎట్టి పరిస్థితులలోను సహాయం
చేయను. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని నాకు తెలుసు. ఓ మనసా! నువ్వు నన్ను
మోసం చేయలేవు. ఇప్పుడు మంచి పుస్తకాన్ని చదువుతాను". అని దృఢమైన నిర్ణయం
తీసుకుంటే ఆ దుష్ట ఆలోచన బలహీనపడి చనిపోతుంది.*
✅ *మనసు "సిగరెట్ తాగుతాను అంటే నేను ఎట్టి పరిస్థితులలోను సహాయం చేయను
నన్ను మోసం చేసి నా ఆరోగ్యాన్ని పాడుచేయాలనుకుంటున్నావా అది అసాధ్యం. నేను
కాసేపు ధ్యానం చేస్తాను అంటూ దుష్ట, హానికర ఆలోచనలకు ఎలాంటి పరిస్థితులలోనూ
సహాయం అందించకూడదు.*
✅ *దుష్ట ఆలోచనలకు సహాయసహకారాలు అందించక పోవడం అనేది బోటులో అలలకు
వ్యతిరేకంగా ప్రయాణించడంలాంటిది. మొదట్లో అలలు ఎగసి పడి ఇబ్బంది పెట్టినా
వాటిని ధైర్యంగా ఎదుర్కొంంటూ ముందుకు వెళితే ప్రశాంతమయిన సముద్రం ఎలా
దర్శనం ఇస్తుందో అలా సాధన తొలి దశలో మనసు విననంటూ మొండిచేస్తే సహనంతో,
లౌక్యంతో, దృఢమైన సంకల్పంతో మనసుని బానిస చేసుకుని మీరు దానితో అద్భుతాలను
సృష్టించవచ్చు.*
✅ *క్రమశిక్షణతో ఉన్న ఆత్మ గొప్ప సంకల్పశక్తిని కలిగి ఉంటుంది. అప్పుడు మనసు, ఇంద్రియాలు అతడికి విధేయులై పనిచేస్తాయి.*
🦋🦋🦋🦋🦋🦋
No comments:
Post a Comment