07/06/17,
10:47:44 PM: KK: *కాళీ తత్వం:-- కాళికా దేవిని భయంకరంగా ఎందుకు
చిత్రిస్తారు?* *సౌమ్య మూర్తిగా ఉండవచ్చు కదా? అని కొందరు అడుగుతారు. దీని
వెనుక కొన్ని మౌలికమైన మనస్తత్వ అంశాలు దాగి ఉన్నాయి. ఈ ప్రశ్న చాలా సమంజసం
గా ఉంటుంది. ఎందుకంటే మనకు అంతా సవ్యం గా జరగటం ఇష్టం గా ఉంటుంది. ఎక్కడా ఏ
విధమైన నాశనం, ధ్వంసం లేకుండా హాయిగా సాగి పోవాలని ప్రతి మనిషి, జంతువు,
పక్షి, క్రిమి కీటకాలతో సహా సమస్త ప్రకృతి కోరుకుంటుంది.*
*కాని
ప్రకృతి లో ఉన్న నియమం ప్రకారం ఎల్లకాలం అన్నీ హాయిగా సాగిపోవటం కుదరదు.
కొంత భాగం ధ్వంసం అయితే గాని మరికొంత భాగం నిర్మాణం జరుగదు. కనుక ప్రకృతిలో
సృష్టి, స్థితి, లయం ఈ మూడూ ఇమిడి ఉన్నాయి. ఒక్క మన సనాతన ధర్మములోనే
విధ్వంసం కూడా భగవంతుని పనే అని అర్థం చేసుకోవటం జరిగింది. ఇతర మతాలలో
దీనిని గ్రహించలేక, నాశనం చెయ్యటం సైతాను పని అని భావించి సైతాను అనే ఒక
కల్పిత వ్యక్తిని సృష్టించుకొని దానిని సమర్ధించు కోడానికి అనేక కల్పిత
కథలు అల్లుకున్నారు.*
*సృష్టించటం
దేవుని పనైతే మరి నాశనం చెయ్యటం ఎవరి పని? అది కూడా ఆయన పనే. ఎందుకంటే
ఆయన/ఆమె తప్ప ఇంకొకరు దీనికి బాధ్యులు కాలేరు. సైతాను అనే వాడు నిజానికి
లేడు. అతనే ఉంటే దేవుని ఉనికికి, ఈశ్వరత్వానికి సవాలు. అటువంటి సైతానును
దేవుడు తన సృష్టిలో ఎందుకు ఉండనిస్తున్నాడు అన్న ప్రశ్నకు జవాబు దొరకదు.
ఇతర మతాలు దీనిని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో ఉన్నాయి. కనుకనే చావు అనేది
సైతాను కార్యం అని నమ్ముతూ, మరణం అంటే భయం కలిగి ఉంటాయి.(ఇంకా ఉంది)*
No comments:
Post a Comment