09/06/17, 8:23:02 AM: KK: *వటసావిత్రి(వ్రత)పౌర్ణమి" శుభాకాంక్షలు..*
జ్యేష్ఠ
మాసంలో అత్యంత ముఖ్యమైన పర్వదినంగా 'జ్యేష్ఠ పౌర్ణమి' చెప్పబడుతోంది. ఈ
రోజున చేసే దానాల వలన విశేషమైన ఫలితాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు
చెబుతున్నాయి. ఈ రోజున పాదరక్షలు ...
గొడుగులు
దానం చేయడం వలన 'అశ్వమేథ యాగం' చేసినంతటి ఫలితం కలుగుతుంది. అందువలన
చిన్నచిన్న దానాల వలన అనంతమైన ఫలితాలను అందించే పర్వదినంగా జ్యేష్ట పౌర్ణమి
గురించి చెబుతుంటారు.
ఇక ఈ రోజున 'వట సావిత్రి వ్రతం' చేయడం వలన, సౌభాగ్యం స్థిరమవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
అందువలన
ఈ రోజున వివాహిత స్త్రీలు 'మర్రిచెట్టు' ను పూజిస్తూ వుంటారు. ఇక ఇదే
రోజున రైతుల పండుగగా చెప్పబడుతోన్న 'ఏరువాక పున్నమి' కూడా జరుపుతుంటారు.
రైతులు తమకి జీవనాధారమైన నేలతల్లిని ... ఎద్దులను పూజించి ఈ రోజున పొలాన్ని
దున్నడం ప్రారంభిస్తారు.
గ్రామీణ
ప్రాంతాల్లో పంట పొలాలు ఎక్కువగా వుంటాయి కనుక, ఈ పండుగ సంబరాలు అక్కడే
ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి ... కనువిందు చేస్తూవుంటాయి. దానాలు చేయడం వలన
... వట సావిత్రి వ్రతం వలన పుణ్యఫలాలను, ఏరువాక పండుగ వలన ఆనందాలను
అందించేదిగా జ్యేష్ట పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది.
స్త్రీలు వట సావిత్ర వ్రతాన్ని 'జ్యేష్ఠ పౌర్ణమి' రోజున
ఆచరిస్తుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లనే యమధర్మరాజుని ఎదిరించి
సావిత్రి తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగిందని చెప్పబడుతోంది. వట వృక్షం
మూలంలో బ్రహ్మదేవుడు ... మధ్య భాగంలో విష్ణువు ... పై భాగంలో శివుడు
ఉంటాడని పండితులు చెబుతున్నారు.
వట
వృక్షాన్ని పూజిస్తూ సావిత్రి ఈ వ్రతాన్ని ఆచరించినది కాబట్టే, ఈ
వ్రతానికి 'వట సావిత్రి' అనే పేరు వచ్చింది. ఈ వ్రతాన్ని త్రయోదశి రోజున
ఆరంభించి పౌర్ణమి వరకూ, అంటే మూడు రోజులపాటు ఆచరించాలని శాస్త్రం
చెబుతోంది. వివాహిత స్త్రీలు ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, పరిశుభ్రమైన
వస్త్రాలను ధరించాలి. మర్రిచెట్టు దగ్గరికి చేరుకొని అక్కడ శుభ్రంగా అలికి
ముగ్గులు పెట్టాలి.
పసుపు కుంకుమలతో వట వృక్షాన్ని పూజించి, నైవేద్యాలు సమర్పించాలి. పసుపు దారాన్ని వట వృక్షానికి చుడుతూ ...
'నమో
వైవస్వతాయ 'అనే మంత్రాన్ని పఠిస్తూ 108 ప్రదక్షిణలు చేయాలి. ఆ తరువాత
ముత్తయిదువులకు దక్షిణ తాంబూలాలతో పాటు పండ్లను దానంగా ఇవ్వాలి. ఈ విధంగా
చేయడం వలన వైధవ్య దోషాలు తొలగిపోయి సౌభాగ్యం స్థిరంగా నిలిచి ఉంటుందని
చెప్పబడుతోంది
ఈ
జ్యేష్ఠ పౌర్ణమి నాడే “వట సావిత్రి వ్రతము “ ఆచరించాలని వ్రత గ్రంధాలూ
పేర్కొన్నాయి. ఈ ‘ ఏరువాక పున్నమి’ నాడు వివాహిత మహిళలంతా కొత్త దుస్తులు
ధరించి, ఏటి ఒడ్డున ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్లి, ఎర్రని సింధూరంతో ఆ
మర్రి చెట్టును అలంకరించి, రంగురంగుల పుష్పాలతో పూజించి నూలు దారం పోగులను
చెట్టు మొదలు చుట్టూ చుట్టి, ఏడు ప్రదక్షిణలు చేస్తూ, తమ భర్తలు , సంపూర్ణ
ఆరోగ్యంతో, దీర్ఘాయుష్మంతులు కావాలిని. ప్రార్ధిస్తారు.
ఆ
రోజంతా ఉపవాసం చేస్తారు. ఇలా వ్రతం చేయడం వల్ల తమ మాంగల్య సౌభాగ్యం పది
కాలాలు చల్లగా, పచ్చగా, ఉంటుందని స్త్రీలందరి నమ్మకం. మరియు స్త్రీలు ఏ పూజ
చేసినా ... ఏ నోము నోచినా ...
ఏ
వ్రతం చేసినా, తమ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉండాలనేదే దానిలోని ప్రధాన
ఉద్దేశంగా కనిపిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో వాళ్లు తమ సౌభాగ్యాన్ని
స్థిరంగా ఉంచమని కోరుతూ ప్రత్యేకంగా వ్రతాలను కూడా ఆచరిస్తూ వుంటారు.
అలాంటి వ్రతాలలో ముఖ్యమైనదిగా 'వట సావిత్రి' వ్రతం కనిపిస్తూ వుంటుంది.
No comments:
Post a Comment