15/06/17, 6:19:33 PM: KK: *చిన్న ప్రశ్నయే కానీ జవాబు పెద్దది.*
*ప్రాణము:--*
*ప్రతీ
జీవికీ ముఖ్యమైనది ప్రాణము. అది మనకు కనిపించదు. ప్రాణి శ్వాస ఆగగానే మనము
ఆ జీవి ప్రాణము విడచినది అంటాము.* *కాలవిభాగములలో మొదటిది ప్రాణము. దాని
ప్రమాణము కూడా మనిషి శ్వాసకు సరిపడే కాలమే. అనగ ఒక ఆరోగ్యవంతమైన మనిషి
ఒకసారి శ్వాసను తీసుకుని వదులుటకు ఏదైతే సమయము పడుతుందో ఆ సమయమునకు ప్రాణము
అని పేరు.* *ప్రతీ జీవి ఎంతకాలము బతుకుతుందో ముందే నిర్ధారించబడుతుంది అని
మనము నమ్ముతాము. అంటే ప్రతీ ప్రాణి ఎన్ని సార్లు శ్వాసను తీసుకొని
విడువవలెనో నిశ్చయించబడుతుందన్నమాట.* *అన్నిమారులు ఆ ప్రాణి శ్వాసను
తీసుకొని వదలగానే ఆ యంత్రము ఆగిపోతుంది. అందువలననే మహర్షులు ప్రాణాయామము
చేసి శ్వాసను స్తంభింపజేయుటద్వారా వారి ఆయువును పెంచుకొనేవారన్నమాట.*
*ఆ
ప్రాణమునకు ఆధారమయినవి నాడులు. శరీరమునందు అవి ముఖ్యముగా పది ఉంటాయి. ఆ
నాడులయందు ఉపనాడులు లేక వినాడులుంటాయి. ఆ ప్రాణము వానియందే రక్తరూపములో
మరియు వాయురూపములో నలుమూలలా సంచరిస్తూ ఉంటుంది.*
No comments:
Post a Comment