12/06/17, 7:54:34 AM: +91 79811 59026: _*మరణం శోకించటానికి కారణం కారాదు*_
భౌతిక జగత్తు లో ప్రతి యొక్క జీవాత్మ మూడు శరీరాలచే కట్టుబడి ఉంటుంది - స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం.
స్థూల శరీరం: పంచ భూతములతో తయారు చేయబడినది - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశము
సూక్ష్మ
శరీరం: పద్దెనిమిది మూలవస్తువులతో కూడినది - ఐదు ప్రాణవాయువులు, ఐదు
కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, మనస్సు, బుద్ది, మరియు అహంకారం.
కారణ శరీరం: అంతులేని గత జన్మల కర్మల ఖాతా కలిగి, మునుపటి జీవితాల నుండీవున్న సంస్కారముల తో కూడి ఉన్నది.
మరణ
సమయంలో, ఆత్మ, స్థూల శరీరాన్ని విడిచి పెట్టి, తనతో పాటు సూక్ష్మ, కారణ
శరీరములను తీసుకుని వెళుతుంది. భగవంతుడు మరల ఆత్మ కి మరియొక స్థూల
శరీరాన్ని, దాని సూక్ష్మ, కారణ శరీరాల అనుగుణంగా ఇచ్చి దానికి తగిన తల్లి
గర్భం లోనికి ప్రవేశపెడతాడు.
ఆత్మ
ఒక స్థూల శరీరాన్ని వదిలి వేసిన తరువాత, వేరే స్థూల శరీరాన్ని తీసుకునే
మధ్యలో ఒక పరివర్తన దశ (transitional phase) ఉంటుంది. ఈ దశ కొన్ని క్షణాల
నుండి కొన్ని సంవత్సరాల వరకూ ఉండవచ్చు. కాబట్టి పుట్టుక ముందు, ఆత్మ
అవ్యక్తమైన సూక్ష్మ, కారణ శరీరాలతో ఉంటుంది. మరణం తరువాత కూడా అది అవ్యక్త
స్థితి లో ఉంటుంది. ఈ మధ్యలోనే అది వ్యక్తమవుతుంది (ప్రకటితమవుతుంది).
*కాబట్టి శోకించటానికి మరణం కారణం కారాదు.*
No comments:
Post a Comment