09/06/17, 8:24:39 AM: +91 80088 84529: ధర్మాకృతి : మణికుట్టి - 6
సారవంతమయిన
భూమిలో నాటిన సత్తువ గల బీజం వలె తండ్రి ఉపదేశం తనయుని మనస్సులో బలంగా
నాటుకొంది. కావేరీ తీరాన వారి తపస్సు పండిత లోకాన్ని కల్లోల పరచింది.
వారంతా నరసింహశాస్త్రి వద్దకు పోయి సద్గుణాల రాశి అయిన తనయుని దగ్గరకు
తీసుకోవలసినదిగా అర్థించారు. వారునూ సమాధాన పడి తపస్సు చేసి వచ్చిన తన
తపముల పంటను దగ్గరకు తీసుకొన్నారు. అయితే కథ ఇక్కడితో ఆపివేయవచ్చుగానీ, ఆ
విత్తు కాలక్రమంలో ఏ రకంగా మహావృక్షంగా మారిందీ చెప్పాలి కదా! మణికుట్టిని
కుట్టి శాస్త్రిగా పిలిచే తరువాతి తరం వచ్చింది. అంటే వారు నడి
వయస్సులోనికి వచ్చి కుటుంబ భారం వహిస్తున్నప్పుడన్నమాట. వారు బహుకాలం
ఒరతాడులో నివాసం చేస్తూ వచ్చారు. ఆ ఊరికి సర్వోజీ మహారాజు ప్రతిదినం
అశ్వికులను పంపి ఆ ఊరి బ్రాహ్మణోత్తముల నుండి పూజక్షతలు తెప్పించుకొని అవి
ధరించిన పిదప భోజనం చేయడం ఆచారంగా పెట్టుకొన్నారు. కుట్టిశాస్త్రి రాజుగారి
సేవకులు వేచి ఉన్నారని తమ పూజను త్వరితగతిని ముగించక, యధావిధిగా
అనుష్ఠానము ముగించే వారు. అందువలన రాజుగారి భోజనానికి ఆలస్యమయ్యేది. ఈ
విషయమై ఒకనాడు రాజా కుట్టి శాస్త్రిని ప్రశ్నించారు. పలువురి ఎదుట
ఎదిరించడం రాచ మర్యాదకు భంగమని తమను తాము సంబాళించుకొని ‘ఆజ్ఞ’ అని చెప్పి
ఊరుకొన్నారు కుట్టి శాస్త్రి.
అయితే
రాజా వెళ్ళిన పిదప ఆ ఊరిలో ఒక్క క్షణమయిననూ నిలువ బుద్ధి కాలేదు. తంజావూరు
సీమ విడిచిపో నిశ్చయించుకొన్నారు. వెంటనే భార్య సహితులై బయలుదేరి
అర్థరాత్రి ఝాముకు తిరువయ్యార్ ధర్మ సంవర్ధిని అమ్మవారి వద్దకు వచ్చి
మొరబెట్టుకొన్నారు. మహా పండితులు కావడాన మొర శ్లోక రూపంలో వచ్చింది.
కతీంద్రయామ కతి చంద్రయామ
ఛండం పునః పూరయతుం పి చండం
నీ స్తుతి చేయక ఈ ఉదర పోషణకై ఎంతమంది రాజులను ఇంద్రుడు చంద్రుడు అని స్తోత్రం చేస్తాను అని ఈ శ్లోక భావం.
అమ్మవారు
ఆయనకు తెలివిని ధైర్యాన్ని ప్రసాదించింది. భిక్షం ఎత్తుకుంటూనే
మహారాష్ట్రకు పోయినారు. అక్కడ ఆ రోజుల్లో భాజీరావు సీమంతక్ అనే పేష్వా
రాజ్యంలో ఉన్నారు. గదాధరి వ్రాసిన గదాధరుని వంశము వాడయిన సుందర నారాయణ
భట్టాచార్య అక్కడ ఆస్థాన పండితులుగా ఉన్నారు. ఆయన దాక్షిణాత్య పండితులకు
నవ్య న్యాయంలో పరిచయం లేనందున వారు పేష్వా కొలువులో ఉండడానికి అర్హులు
కారని అడ్డు పెడుతూ వచ్చారు. ఇది విని రక్షణ గౌరవము నిలబెట్టడానికి
మణిశాస్త్రి సంకల్పించారు. పూనాలోని ప్రసిద్ధ విద్యాలయమునకు పోయి
నవ్యన్యాయంలో పరీక్ష నీయడానికి అర్జీ పెట్టారు. అక్కడి అధ్యాపకులు
భట్టాచార్య వాక్యముల ననుసరించి ఈ శాస్త్రంలో ప్రవేశంలేని దాక్షిణాత్యులను
పరీక్ష చేసే ఆస్కారం లేదు అని తిరస్కరించినారు. పట్టు వదలని మణికుట్టి
మీమాంస పరీక్షలోనయినా అనుమతినీయండి. ఆ పరీక్షా ఫలితాలు చూసి తర్క పరీక్ష
గురించి ఆలోచించవచ్చు అని అభ్యర్ధించి మీమాంస పరీక్షలో మొదటి వానిగా
ఉత్తీర్ణులయ్యారు. అయితే ఇప్పుడు వారి నడ్డగించడానికి భట్టాచార్య ఇంకొక
సాకు చూపినారు. మీమాంస శాస్త్రంలో పరీక్షాధికారి ‘వళమార్ నేరి’’కి చెందిన
దాక్షిణాత్యుడయినందున పక్షపాత బుద్ధితో వీరిని ప్రథములుగా ఉత్తీర్ణులను
చేశారని వాదించారు.
మనస్సు
చలించని కుట్టి శాస్త్రి మీమాంసా పండితుని సహాయంతో పేష్వాకే నేరుగా ‘నన్ను
పరీక్షించిననే చాలును. ఎంతటి ఉన్నత స్థానములో ఉత్తీర్ణుడనయినా సన్మానము
చేయనవసరం లేదు’ అని తెలియబరచినారు. అది పేష్వా హృదయాన్ని స్పృశించింది.
నిజమైన విద్వత్తు గుర్తించి దాని వలన ప్రయోజనం పొందవలెననెడి ఆసక్తి గల
పేష్వా భట్టాచార్యులను వత్తిడి చేసి పరీక్షకు అనుమతింపజేశారు.
అయినప్పటికీ
వ్యతిరేక భావముతో ఉన్న భట్టాచార్యులు వీరు పరీక్షకు వచ్చే దారిలో కాలు
అడ్డుపెట్టి పడుకొని ఉన్నారు. కుట్టిశాస్త్రి వెంటనే అది సమన్వయ పరుస్తూ
నవ్య న్యాయ వాక్యములనేకం ఉటంకించారు. ఉలిక్కిపడిన భట్టాచార్యులు ‘నీవు
నిజంగా దక్షిణాత్యుడవా” అని సంభ్రమముగా ప్రశ్నించగా, కుట్టి శాస్త్రి
శ్రీనివాసయ్యర్ సమాచారం, తాము వారి వద్ద నవ్య శాస్త్రము నభ్యసించిన విషయం
64తర్క వాదములను ఉటంకిస్తూ చెప్పారు. చదువుకున్న వారే ఇంకొక చదువుకున్న
వానిని గుర్తించగలరు. అందువలన అంతవరకు అకారణ శత్రువుగా ఉన్న తర్క
విద్వాంసులు మణికుట్టిని పేష్వాతో చెప్పి ఆస్థాన విద్వాంసునిగా
నియమింపజేసినారు.
(సశేషం)
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment