*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 84*
*సమస్య*
లోకములో అందరికీ ఒకే రకమైన అర్హతలు, లక్షణాలు ఉండవు కదా! వారందరూ భగవంతుణ్ణి చేరాలంటే వారికి తగినట్లు ఏవైనా మార్గాలున్నాయా? ఎలా భక్తులు భగవంతుణ్ణి చేరాలి?
*ఈ ప్రశ్నకు భగవానుడు ఏమని చెప్పినాడో గీతలో 12/8-9-10-11 శ్లోకాలను చూద్దామా!*
*మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్దిం నివేశయ*
*నివసిష్యసి మయ్యేవ అతి ఊర్ధ్వం న సంశయః*
*మయి మనః ఆధత్స్వ* ~ నాయందే నీ మనస్సును లగ్నము చెయ్యి;
*మయి ఏవ బుద్దిమ్ నివేశయ* ~ నాయందే బుద్దిని నిమగ్నము చెయ్యి;
*అతః ఊర్ధ్వమ్ మయి ఏవ నివసిష్యసి* ~ ఆ పిమ్మట నాయందే నివసిస్తావు
*సంశయః న* ~ ఇందు ఏ మాత్రమూ సంశయము లేదు.
*అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్*
*అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుమ్ ధనంజయ*
*అథ చ్జిత్తమ్ మయి స్థిరమ్ సమాధాతుమ్* ~ ఒకవేళ చిత్తమును నాయందు నిలుపుటకు;
*న శక్నేషి తతః ధనంజయ!* ~ సమర్థుడవు కానిచో అట్టి స్థితిలో అర్జునా!
*అభ్యాస యోగేన మామ్ ఆప్తుమ్ ఇచ్చ* ~ అభ్యాసయోగము ద్వారా నన్ను పొందుటకు ప్రయత్నించుము;
*అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ*
*మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్దిమవాప్స్యసి*
*అభ్యాసే అపి అసమర్థః అసి* ~అభ్యాసమునందును అసమర్థుడవైనచో;
*మత్క ర్మపరమః భవ* ~ మత్పరాయణుడవై కర్మలను ఆచరించుము;
*మదర్థమ్ కర్మాణి కుర్వన్ అపి* ~ నాకొరకై కర్మలను చేయుచునూ;
*సిద్దిమ్ అవాప్స్యసి* ~ నా ప్రాప్తి రూప సిద్దిని పొందుతావు.
*వ్యాఖ్య*
ఏ పనికైనా ఆయా వ్యక్తుల అధికారాలను(అర్హతలు) బట్టి మర్గముంటుంది. అందరికీ ఒకే మార్గమని ఏమీ ఉండదు. వారి అర్హతలను బట్టి మార్గాలుంటాయి. *ఒకటి* ~ ఎప్పుడూ మనస్సును భగవంతునిపై వుంచడము, అన్ని పనులనూ భగవత్పరముగా చెయ్యడము. *రెండవది* ~ మనస్సును నిలకడగా పెట్టుకోలేకపోతే అభ్యాసము చెయ్యి. *మూడవది* ~ మనస్సు చంచ లమైతే ప్రతిపనినీ ఆయనకే అంకితము చెయ్యి. *నాలుగవది* ~ నీవు నిత్యమూ చేసే కర్మల ఫలాన్ని ఆయనకు త్యాగము చెయ్యి. *చివరిది* ~ అందరూ వారి వారి పనులు వారు చేసుకోవచ్చు; ఫలాన్ని ఆయనకే వదిలెయ్యి. ఈ ఐదింటిలో దేన్ని అశ్రయించినా మోక్షము వస్తుంది.
~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~

No comments:
Post a Comment