Thursday, April 11, 2019

🕉🌞🌎🌙🌟🚩

*మహర్షికి గోచీ ఎందుకు?*

      శ్రీ అరుణాచల రమణ మహర్షుల వారిని ఒకాయన  అయ్యా! మీరు వంటి మీద ఎక్కడా గుడ్డ కట్టుకోకుండా ఉన్నారు.మరి గోచీ మాత్రం పెట్టుకున్నా రంటే, మీకింకా సిగ్గూ, అభిమానంపూర్తి గా వదలనట్లున్నదే', అని అడిగాడట.  

         
         మహర్షుల వారు చిరునవ్వు నవ్వుతూ "నీవంటున్నవన్నీ నన్నెప్పుడో వదిలేసాయి, కానీ మీలాంటి వాళ్లు వచ్చి ఇలాంటివన్నీ అంటగడు తున్నారు. దానికి గుర్తుగా యీగోచీ నన్ను పట్టుకొని వదలటం లేదు. ఇంకో విషయం ఏమిటంటే, బయట క్షీరరంద్రాలు లోపలి బ్రహ్మ రంద్రం కాక మానవులకూ జంతువులకూ తొమ్మిది చిల్లులే ఉన్నాయి. జంతువులూ,  పిచ్చి వాళ్ళు అన్ని చిల్లులూ గాలికి వదిలేస్తు న్నారు. మానవులు మాత్రం తలకాయ కున్న ఏడు తొర్రలు గాలికొదిలేసి, కింద రెండు మాత్రం గుట్టుగా గుడ్డలతో దాచుకుంటున్నారు. బైటవి  లోపలికి లాక్కునే  పై ఏడింటిని అదుపు చేసుకోలేక,  లోపలివి బయటకు వెళ్ళ గొట్టే కింద రెండిటిని దాచుకుంటు న్నారు. ...ఇది చిత్రమైన విషయమే, కానీ నాకవసరం లేదు.అందుకే తొలిరోజుల్లో ఈ వంటి మీద గుడ్డ వున్నదీ, లేనిదీ కూడా నాకు తెలియదు. అయితే ఆ తరువాత, వీడు  పిచ్చి వాడు కాదు, పశువూ కాదు,  మనిషే అని తెలియజేయడానికి ఈ గోచి నన్ను పట్టుకున్నది. కానీ నేను మాత్రం ఈ దేహం  కాదు. కాబట్టి మనిషిని కాదు. నాకీ దేహమే ఒక గుడ్డ. మళ్లీ దీనికో గుడ్డ ఎందుకనిపించి, గుడ్డ మీద గుడ్డ కట్టడం లేదు", ఆన్నారు‌‌ శ్రీ రమణ మహర్షులవారు. ( శ్రీ రమణమహర్షుల వారు బాల్యము నందే తపఃసిద్ధులు, ఆత్మసాక్షాత్కారము పొందినహాత్ములు).

🕉🌞🌎🌙🌟🚩

No comments:

Post a Comment