Thursday, April 11, 2019

*మన సమస్యలకు గీత పరిష్కారాలు ~ 83*

*సమస్య*

           *అనన్య భక్తితో భగవంతుణ్ణి నమ్మి  సేవించేవారిని ఈ సంసార బంధాల  నుండీ ఆయన ఉద్దరిస్తాడా?*

*ఈ ప్రశ్నకు భగవంతుడు ఏమని సమాధానమిచ్చాడో గీతలోని‌ 12/7 వ శ్లోకాన్ని ఒకసారి చూద్దామా?*

*తేషామహం  సముద్దర్తా  మృత్యు  సంసార  సాగరాత్*
*భవామి  నచిరాత్  పార్థ  మయ్యావేశిత  చేతసామ్*

*ప్రతిపదార్థాలు:*

*పార్థా! తేషామ్ మయి ఆవేశిత చేతసామ్* ~ ఓ అర్జునా! అట్టి నాయందే లగ్నమైన చిత్తము కలవారికి;
*అహమ్ నచిరాత్* ~ నేను శీఘ్రముగా;
*మృత్యు సంసార సాగరాత్* ~ మృత్యు రూప సంసార సాగరమునుండీ;
*సముద్దర్తా భవామి*~ ఉద్దరించు వాడను.

*వ్యాఖ్య*

              *అటువంటి పరమ భక్తులను నాశ భూయిష్టమైన సంసార సముద్రము నుండీ భగవంతుడు తప్పకుండా సముద్దరిస్తాడు. అయితే వారు సర్వకర్మలను భగవంతుని పాదపద్మాలలో సమర్పించి, ఎల్లప్పుడూ భగవంతుని పైన ఆసక్తి  కలిగిన మనస్సుతో ఆయననే ధ్యానించాలి.*
*తాను ఏ పనిచేస్తున్నా, ఏ మాట మట్లాడుతున్నా, ఏ ఆలోచన చేస్తున్నా,* *దాన్ని దైవకృతముగా భావిస్తూ మూడు రకాల కర్మలలోనూ భగవంతుణ్ణి* *స్మరిస్తూ,మనస్సునుఆయనలోనేఆవేశింపజేస్తే,  ,అటువంటి ,భక్తాగ్రేసరులను భగవంతుడు తనవారిగా భావించి తప్పక కాపాడుతాడు. సంసార* *యాతనలు  అతనికి‌ అంటవు.  సంసార ధుఃఖాంభుధి నుండీ అలాంటి భక్తులను‌ భగవంతుడే ఉద్దరిిస్తాడు తప్పకుండా!*

~~~~(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)~~~~

No comments:

Post a Comment