Saturday, August 3, 2019

⭕శివానందలహరి
శ్లోకం-3

_త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం_
_జటాభారోదారం చలదురగహారం మృగధరం |_
_మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం_
_చిదాలంబం సాంబం శివమతివిడంబం హృదిభజే ||_

*భావం:*

వేదములచేతెలియబడువాడు,మనోహరుడు,త్రిపురాసుర సమ్హారి,ఆది పురుషుడు,
మూడు కన్నులవాడు,గొప్ప జటాజూటము కలవాడు, కదలుచున్న పాము హారముగా ధరించినవాడు,మహాదేవుడు,
నాపై దయకలవాడు, పశుపతి, జ్ఞానమునకు ఆలంబనమైనవాడు, జగదంబతో కలిసినవాడు, అనుకరించుటకు శక్యం కానివాడు అగు దేవుడైన శివుడిని హృదయంలో సేవించుచున్నాను.
■■■Forwaded By MALLIKHARJUN 

No comments:

Post a Comment