⭕ *శివానందలహరి* ⭕
శ్లోకం"7🙏🏻
_శ్లో౹౹ " మనస్తే పాదాబ్జే - నివసతు వచః స్తోత్రఫణితౌ_
_కరశ్చాభ్యర్చాయాం శ్రుతిరపికథాకర్ణనవిధౌ,_
_తవధ్యానే బుద్ధి - ర్నయనయుగళం మూర్తి విభవే_
_పరగ్రంథాన్ కైర్వా - పరమశివ ! జానే పరమతః ౹౹_
🌺తాత్పర్యము:🌺
ఓ పరమశివా ! నామనస్సు నీ పాద పద్మము నందూ, నావాక్కు
నీ స్తోత్రాలు పాఠమునందూ, నా చేయి నీ సేవయందూ , నాచెవి నీ కథలను వినుటయందూ , నా బుద్ధి నిన్ను ధ్యానింౘుటయందూ, నా కన్నులు నీ దివ్య మంగళ విగ్రహాన్ని దర్శింౘుటయందూ, లగ్నమై యుండు గాక. ఈ విధంగా, నామనస్సు, వాక్కు, హస్తము, చెవి, నేత్రము, బుద్ధి అనే ఇంద్రియాలు ఆరూనూ, నీ సేవా కథాకర్ణన ధ్యాన ము లందే లగ్నములై యుండగా,నేను ఇంక వేటితో ఇతర గ్రంథాలను తెలుసుకోడానికి ప్రయత్నిస్తాను ? ఆ ఇతర గ్రంథాలలో సైతం , నీ తత్వమే ప్రతిపాదింపబడి వుంటుంది. కాబట్టి ఇతర గ్రంథాలను చూడవలసిన అవసరమే నాకు ఉండదని భావము.
(సేకరణ:ముత్యంపేట మల్లికార్జున శర్మ)🙏🏻👌By MALLIKHARJUN

No comments:
Post a Comment