20/04/17, 3:23:50 PM: MVMRAO: *👉కాళిదాసు గర్వభంగం👈🏽*
మండు
వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు. మిట్టమధ్యాహ్న
సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. *బాగా దాహం వేయడంతో ఓ గుడిసె
దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.* *ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి
వెళ్తుంటుంది.* ఆమెను చూసి *‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని*
అడిగాడు కాళిదాసు. అప్పుడా బాలిక.. *‘మీరెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా
ఇచ్చేద’ని* బదులిచ్చింది. కాళిదాసు: *‘నేను ఎవరో తెలియకపోవడం ఏంటి? పెద్ద
పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని* అన్నాడు. అహంకార పూరితమైన ఆ మాటలు
విని బాలిక నవ్వి.. *‘మీరు అసత్యమాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు
ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.
అప్పుడు
కాళిదాసు కాసేపు ఆలోచించి.. *‘నాకు తెలియదు. గొంతు ఎండిపోతోంది. ముందు
నీళ్లు ఇవ్వమ’ని* బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు. *‘ఇద్దరు
బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.* ఇప్పుడు చెప్పండి మీరు ఎవరు?’ అని
అడుగుతుంది బాలిక. *‘నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు. *‘మళ్లీ
అసత్యమాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా
వెళ్లాలి. మీరేమో అలిసిపోయారు కదా. ఈ లోకంలో అలా అలసిపోకుండా సంచరించే
బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’*అని చెప్పి గుడిసెలోకి
వెళ్లింది బాలిక.
దాహానికి
తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. *‘మాతా నీళ్లు ఇవ్వండి. దాహంతో
చనిపోయేలా ఉన్నాను..’* అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు. లోపలి నుంచి ఓ
ముసలావిడ బయటకు వచ్చి.. ‘మీరెవరో సెలవివ్వండి.. నీళ్లిస్తాను’ అంది.
కాళిదాసు దీనంగా.. *‘నేను అతిథిని..!’* అని బదులిచ్చాడు. *‘మీరు అసత్యం
చెబుతున్నారు. ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ
రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు’* అంటుంది. కాళిదాసు.. *‘నేను
సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని* వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే
చెబుతున్నారు. *ఈ ప్రపంచంలో ఇద్దరే సహనశీలురు ఉన్నారు. ఒకటి భూమి, రెండోది
వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?’* అని అడిగింది.
ఓపిక
నశించిన కాళిదాసు.. *‘నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని* అడిగాడు.
ఆ అవ్వ నవ్వుతూ.. *‘ఇదీ అసత్యమే. ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ
రాజ్యాన్ని పాలించే _రాజు_. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం
చెలాయిస్తున్నాడు. రెండోవాడు ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే
_పండితుడు’_ అని అంటుంది.* ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది. ఆ
అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు. _*ఆ అవ్వ సరస్వతీదేవిగా
సాక్షాత్కరించింది.*_ *👉‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ,
అహంకారం కాదు నాయనా! కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని
మరల్చడానికే ఈ పరీక్ష’*అని జలమును అనుగ్రహిస్తుంది.
🙏🌹🙏
No comments:
Post a Comment