25/04/17, 1:06:10 PM: +91 80088 84529: కామాక్షి – కన్యక
మనం
శుభ్రత కోసం రోజూ బట్టలకు శరీరానికి పట్టిన మురికిని ఎలా వదిలించుకుంటామో
అలాగే జీవన గమనంలో చడ్డ ఆలోచనలు, చడ్డ ఆశలు, అనవసర కోపం వల్ల మనస్సుకు
పట్టిన మలినాన్ని కూడా వదిలించుకోవాలి. ప్రతిరోజు మన్ బుద్ధిని శుద్ధి
చెయ్యడం చాలా అవసరం. దానివల్ల చెడు భావనలు తొలగి మనకు దుఃఖము, బాధ కష్టాలు
దరిచేరవు. మనస్సును శుద్ధి చెయ్యడానికి వాడే నీరు కేవలం ధ్యానం. కాబట్టి
ప్రతిరోజు మనము కొద్దిసేపు భగవంతుని ధ్యానములో గడపవలెను. అమ్మసన్నిధిలో
ఎంతటి వాడికైనా చెడ్డ ఆలోచనలు పోయి మనసు ప్రశాంతత పొందుతుంది. అలాగే ఆ
పరాశక్తి సమక్షంలో మన మనస్సులోని కల్మశాన్ని కొడుక్కోవాలి.
ఆ
పరాశక్తి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి రూపంలో ఇక్కడ నెలకొని ఉంది.
ఆబ్రహ్మకీట జనని అయిన పరాశక్తిని కన్యకగా కొలవటం మన పూర్వీకులు మేధస్సుకు
అద్దం పడుతుంది. ప్రతొరోజూ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముంది ధ్యానం చేసి
మన మన్సులను శుభ్రపరచుకోవడం అందరి కర్తవ్యం. అలా చేయడం వల్ల మన బాధలన్నీ
సూర్యుని ముందు మంచులాగా కరిగిపోతాయి. మనకు సంతోషం కలిగి మనము మన కుటుంబం
వృద్ధిలోకి వస్తుంది.
శ్రీ
వాసవి కన్యకాపరమేశ్వరిగా అవతరించిన ఆ పరాశక్తి ఆర్యవైశ్యులకు కులదైవం,
అరాధ్యదైవం. ఆ అమ్మయే కాంచీపురంలో కామాక్షిగా వెలసిన తల్లి. శ్రీ శంకర
భగవత్పాదులు లోపల శ్రీచక్రం ప్రతిష్టించి, కామకోటి పీఠాన్ని స్థాపించారు.
అలా వారు అనేక చోట్ల పీఠాలను స్థాపించడంలో ముఖ్య ఉద్ధేశ్యం రాబోవు తరాలకి
మన శాస్త్రాలను తెల్పడం, దాని వల్ల వారు ధర్మమార్గం వదలక పయనించేట్టు
చెయ్యడం.
కాలాంతరంలో మన
సంఘంలో ఎన్నో మార్పులు వచ్చాయి. శాస్త్రాలు నిషేధించిన అహారం తినడం మరియు
నైతిక విలువలు క్షీణించిపోతున్నాయి. మన సమాజాన్ని కులాలుగా వర్గాలుగా
విభజించడం మనలో తారతమ్యాలను తీసుకురావడానికి కాదు. అది అనుకూలమైన సమూహాలుగా
రూపొందించి, వారి క్షేమాన్ని పంచాయితి పెద్దలు పరిరక్షీంచేవారు. అటువంటు
సమూహాలను వారి వారి వృత్తుల ఆధారంగా జరిగేవి. ఆ కులాలోని పెద్దలు వారు
సరిగా పనిచేయునట్టూ, ధర్మమార్గం వదలక బ్రతికేలాగును చూసుకునేవారు. ఏదైనా
సమస్య వచ్చిన ఆ పంచాయితీలలో పరిష్కరించుకుని తప్పు చెసిన వారికి సరిఅయిన
దందనలు విశించేవారు. అలా సంఘంలో ప్రతి సమూహము చక్కగా పనిచేసుకుంటూ వారి
వారి ధర్మాలను ఆచరిస్తూ దేశ సంక్షేమానికి తోడ్పడేవారు.
కామకోటి
పీఠం పీఠాధిపతిగా మన శాస్త్రాలలో మనకు విధించిన ధర్మాలు మనం ఆచరించాలని
మీకు గుర్తు చెయ్యడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. వర్ణాశ్రమ ధర్మాల
ప్రకారం వైశ్యులకి ఉపనయన సంస్కారము, వేదాధ్యన అధికారము నిర్దేశించబడ్డాయి.
12 నుండి 24 ఏళ్ళలోపు ఉపనయనం చేసుకుని సంధ్యావందనం తప్పనిసరిగా చేయాలి.
వేదమును నేర్చుకుని నిరంతరము దాన్ని ఆమ్నాయం చెయ్యాలి. వేదమును,
పురాణాతిహాసాలను చదువుకుని ఋషిఋణం తీర్చుకోవాలి. వైశ్యులకు వర్తకము,
వాణిజ్యముతో పాటు ధర్మాచరణము కూడా ముఖ్యమైనదే. మూడు తరములు సంధ్యావందనము
వదిలేసిన వారిని వైశ్యులు అనికాక వైశ్య బంధువులు అని పిలవబడుదురు. అలాగే
బ్రాహ్మణ క్షత్రియులకు కూడా. అంతేకాక ముందుతరాలకు మన శాస్త్రాలను అందించటం
మన కర్తవ్యం.
ఈ పీఠం
యొక్క శక్తి భక్తుల అవ్యాజమైన ఆప్యాత అభిమానాలే. వాటినే పునాదిగా నేను పని
చేయగలుగుతున్నాను. విదేశీయులను మనదేశం ఆకర్శించునది ఈదేశ సంపద కాదు, ఈ దేశ
ప్రభోదించిన ఆధ్యాత్మిక సందేశాలకు వారు ఆకర్శితులవుతున్నారు. మీరు దీన్ని
మనసులో పదిలముగా గుర్తుపెట్టుకుని భక్తితో శాస్త్రము చెప్పినట్టుగా
బ్రతుకుతూ ఆ పరాశక్తి అనుగ్రహానికి పాత్రులగుదురని, ఆ జగజ్జనని మీకు
ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించుగాక!
--- ‘ఆచార్యాస్ కాల్’ చెన్నై కొత్వాల్ బజార్ శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయంలో స్వామివారి ఉపన్యాసం.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment