12/04/17, 6:48:07 PM: +91 80088 84529: జగద్గురువులు
పరమాచార్య
స్వామి వారు దర్శనానికి వచ్చిన భక్తులతో మాట్లాడుతున్నారు. అలా
మాట్లాడుతుండగానే హఠాత్తుగా మాట్లాడడం ఆపి వెంటనే పైకి లేచి, “నేను
ఒక్కడినే బయటకు వెళ్ళి వస్తాను. మీరు ఎవరూ నాతో రావలసిన అవసరం లేదు” అని
చెప్పి చకచకా ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళిపోయారు.
ఆ
మాటలకు అక్కడున్నవారంతా నిర్ఘాంతపోయారు. అందరి మనస్సులోను భయం
రాజ్యమేలుతోంది. పరమాచార్య స్వామి వారు ఒక్కరే బయటకు వెళ్తున్నారు అని.
స్వామివరు
వచ్చిన తరువాతనే అందరూ హాయిగా ఊపిరి పీల్చుకోగలిగారు. కాని అందరి మదిలోను
మహాస్వామి వారు ఎక్కడికి వెళ్ళారు అనే ప్రశ్న మెదులుతోంది.
”మీరందరూ
నేను ఎక్కడికి వెళ్ళానో అని అలోచిస్తున్నారు. అవును కదూ? ఒక హంతకుడు నన్ను
చూడడానికి వస్తున్నాడు. అతను మఠంలోపలికి వస్తే అతనితోపాటు మాహాపాపం కూడా
లోపలికి వస్తుంది.
కాని
అతను మంచి ఉద్దేశ్యంతోనే నన్ను చూడడానికి వచ్చాడు. అతని ఆవేదనని నేను
తీరుస్తాను అనే నమ్మకంతో వస్తున్నాడు. అతని మనస్సు ఉపశాంతి పొందేట్టు
ఊరడింపు మాటలు చెప్పడం నా కర్తవ్యం.
అతణ్ణి
లోపలికి రానివ్వకూడదు. కాని అతనికి నా సహాయం ఎంతో అవసరం. కాబట్టి అతణ్ణి
పలకరించడానికి నేనే బయటికి వెళ్ళాను. వెళ్ళి అతనితో ఏకాంతంగా అతను ఇబ్బంది
పడకుండునట్లు దయతో మాట్లాడి వచ్చాను” అని చెప్పారు.
భక్తుడు
ఒక అడుగు దేవునివైపు వేస్తే, దేవుడు ఆ భక్తునివైపు పది అడుగులు వేస్తాడు
అన్నది పరమ సత్యం. అలాగే ఒక అపరాధి తన తప్పు తెలుసుకుని ప్రాయశ్చిత్త
బుద్ధితో పరమాచార్య స్వామివారి వద్దకు వస్తే, స్వామివారు అతని కోసం వంద
అడుగులు వెయ్యటమే కాదు వారి అపారమైన కరుణా కటాక్షములతో వాడి పాపాన్ని
కడిగివేస్తారు.
[గజేంద్రమోక్ష
ఘట్టములో వెయ్యి సంవత్సరాలు మొసలితో పోరాడి అలసి సొలసి ఇక నా వల్ల కాదు
తండ్రీ వచ్చి కాపాడు అని పిలవగానే శ్రీమహావిష్ణువు భార్య అయిన లక్ష్మీ దేవి
పమిట కొంగు కూడా వదలకుండా పరుగు పరుగున వచ్చి రక్షించాడు. ఈ వెయ్యేళ్ళు
నేను నీకు గుర్తు రాలేదు. ఇప్పుడు పిలవగానే వస్తానా? నేను రాను అని అనలేదు.
పరమాత్మ పరమ దయాళువు. ఒక్క బిల్వ దళానికే నీకు అనంత ఐశ్వర్యములు
ప్రసాదించేస్తాడు. పరమాచార్య స్వామివారి దయ, కరుణ కూడా అటువంటిదే. అది
ఆద్యంతాలు లేనిది.]
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment