.417, 8:20:51 AM: +91 91603 86447: శివా
.............................
ఓం నమశ్సివాయ :
............................
' ఆత్మ స్వరూపా !
బ్రహ్మ , విష్ణు , రుద్రులు జీవులకు ముఖాముఖిగా, నిత్యసుఖాన్ని ప్రసాదించ
లేరు. కాని , జీవులు శివసాక్షాత్కారము పొందడానికి సహాయం మాత్రమే చేస్తారు . బ్రహ్మ ,
విష్ణు , రుద్రులైనా , సిధ్ధగురువులైనా చేసే సహాయం ఇంతవరకే ! ఎప్పుడయితే జీవులు
శివ సాక్షాత్కారం పొందుతారో , ఆ క్షణమే నిత్యసుఖాన్ని అనుభూతిగా పొందుతారు. శివ
సాక్షాత్కార నిష్ఠవలన సకల శక్తులను సాధిస్తారు. ఇది అసలు రహస్యం. అందుకే శివుడు
దేవాదిదేవుడు , శ్రేష్ఠదేవుడయ్యాడు .
శివ సాక్షాత్కారం పొందే శక్తి , అర్హత లేకపోయినా, ఏవరైతే ......
' శివ ' అనే రెండు అక్షరాలను ఎవరైతే స్మరిస్తారో , వారి మనస్సు అ తర్ముఖం
అవుతుంది . సర్వపాపాలు దహించబడతాయి . అపారపుణ్యం కలుగుతుంది . మాయా
మోహాలు దూరమవుతాయి . వివేక వైరాగ్యాలు సిధ్ధిస్తాయి . బ్రహ్మగ్నానం , పరమ సుఖం
లభిస్తాయి. అంతేగాక ఎవరైతే ........
" శివ అనే రెండు అక్షరాలను స్మరిస్తారో , వారి కష్ట నష్టాలు తొలగిపోతాయి . సర్వ
అశుభాలూ నాశనమవుతాయి . కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయి . ఇహ పర సుఖాలు కలుగుతాయి . "
అందుకే శాస్త్రం --
" ఆస్పదత్వాత్ అశేషాణాం. మంగళానాం విశేషత : |
శివ శబ్దాభి ధేయో హి దేవ దేవస్స. త్ర్యంబక : || "
' సర్వ మంగళాలకు నిలయమైన కారణముగా , దేవాదిదేవుడైన త్రినేత్రు
డికి శివుడనే పేరు కలిగినదని తెలిపినది '
ఆత్మ స్వరూపా !
"శివ అంటే శాంతం -- శివ అంటే చైతన్యం
శివ అంటే ధ్యానం -- శివ అంటే పరమసుఖం
శివ అంటే విశ్రాంతి -- శివ అంటే పరంధామం
శివ అంటే శుధ్ధం -- శివ అంటే పూర్ణత్వం
శివ అంటే భద్రం -- శివ అంటే అధిష్ఠానం
శివ అంటే మంగళం -శివ అంటే మూలం
శివ అంటే శుభం -- శివ అంటే మోక్షం "
అందుకే సన్యాసోపనిషత్ :
" సా సత్యతా సా శివతా సావస్ఠా పారమార్ఠికీ |
సర్వగ్నతా సా సంతృప్తిర్నను యత్ర మన: క్షతం || "
మనస్సు ఎక్కడ నశించునో అదియే సత్యం , అదియే శివం , అదియే పరమార్ఠావస్ఠ , అదియే సర్వగ్నత్వం , అదియే పరమ సంతృప్తియని తెలిపినది.
ఆత్మస్వరూపా !
' శివ , శివ 'అని పదే పదే స్మరిస్తే , ' వశి , వశి ' అని వినబడుతుంది . ఈ
యావత్తు జగత్తు , సకల దేవతలు ఏ దైవం వశంలో వున్నాయో , ఆ దైవం నీ వశ మవు
తాడు.
అందుకే శివ మహాపురాణం ,
" సర్వం వశీకృతం యస్మాత్ , తస్మాత్ శివ ఇతి స్మ్రుత: "
ఈ యావత్ జగత్తు ఏ దైవానికి వశమై వున్నదో , ఆదైవమే శివుడని తెలిపినది .
ఇహ పర సుఖాలను , అలౌకిక పరమ సుఖాన్ని ,సకల శక్తులను ప్రసాదించే శివ నామాన్ని
సదా జపించు . శివనామాన్ని ఎంతగా నీవు స్మరిస్తే అంతగా నీలో దైవత్వం కలుగుతుంది
బ్రహ్మగ్నానం సిధ్ధిస్తుంది. కాబట్టి శివనామ జపమనే తపస్సును నిరంతరము చేయుము,
తరించుము ."
" ఓం నమశ్శివాయ :
" శివోహం "
" సర్వే జనా సుఖినో భవంతు "
......................................................నీ దయ ....
No comments:
Post a Comment