10/04/17, 8:23:24 AM: +91 80088 84529: ఎవరి విగ్రహం అది?
నా
కుమారుడు బాలాజి పుట్టినప్పుడు, జాతకాన్ని గణించమని జ్యోతిష్కులకు చెప్తే
వారు, “పదహారు సంవత్సరముల వరకు ఈ అబ్బాయి యోగం సరిగ్గా లేనందున జాతకం
ఇప్పుడు గణించడం కంటే ఆ తరువాత చెయ్యడం మేలు” అని చెప్పారు.
నా
భార్య సరస్వతి చాలా కంగారు పడింది. తను మొక్కని దేవుడు లేడు, దర్శించని
దేవాలయం లేదు, నోచని నోము లేదు. తను తిరుచెంగొట్టు అర్ధనారీశ్వరుని
ఎక్కువగా ఆరాధించేది. మాకు ఇద్దరు కుమార్తెలున్నా, అబ్బాయి వీడొక్కడే కావున
ఏ తల్లి మాత్రం తన ఒక్కగానొక్క కొడుకు నిండు నూరేళ్ళు బ్రతకాలని కోరుకోదు?
మా ఆవిడకూడా అంతే. నెలలో చాలా రోజులు ఏదో ఒక వ్రతం పేరుతో ఉపావసం ఉండేది.
కేవలం తన కుమారుని కోసం ఎంతటి కష్టాన్నైనా భరించేది సహించేది.
ఆరోజు
గురువారం కాబట్టి ఉపవాసం ఉంటుంది. సాయింత్రం పూజ తరువాతనే అహారం
సేవించేది. ఆ సాయింత్రం నా చిన్న కూతురు రాజం పాఠశాల నుండి వచ్చి, పాఠాలు
చదువుకుంటూ హఠాత్తుగా తన తల్లి వంక తిరిగి, “అమ్మా అందరూ కంచి పరమాస్వామి
వారి గురించి గొప్పగా చెప్తుంటారు. నువ్వెందుకమ్మా బాలాజి కోసం తనని
ప్రార్థించకూడదు?” అని అడిగింది.
ఆ
చిన్నపిల్ల నోటి నుండి వచ్చిన మాటలే దేవి పలికించిన మాటలుగా భావించి ఆ
రోజునుండి నా భార్య పరమాచార్య స్వామి వారిని ప్రార్థించడం ప్రారంభించింది.
మరొక ప్రత్యేకత ఏమంటే మా ఆవిడ ఏమి ప్రారంభించినా దాని గురించి చాలా
శ్రద్ధగా తీవ్రంగా చేస్తుంది. కాబట్టి తను పిచ్చి దానిలా మహాస్వామి వారి
ఆరాధన చెయ్యడం మొదలుపెట్టింది. తన ధ్యాస అంతా కంచి పరమాచార్యులవారే.
ఒక
రోజు రాత్రి తనకు ఒక కల వచ్చింది. నేను వ్రాసుకోవడానికి ఉపయోగించే
కుర్చీలో మహాస్వామి వారు కూర్చున్నారు. వారికి తనకు మధ్యలో శబ్ధం చేస్తూ
నీరు ప్రవహిస్తోంది. ఇవతలివైపు నా భార్య కుమారుని కోసం ప్రార్థిస్తోంది.
మహాస్వామి వారు ప్రశాంత వదనంతో “నీ ఖాతాలో పుణ్యాన్ని చాలా జమ
చేసుకున్నావు. అందులో నుండి కొంత తీసుకుంటే అదేమి తగ్గదులే”
అంతలోనే
కల చదిరిపోయింది. అది తెల్లవారుఝాము సమయం. అప్పటినుండి తనకు మహాస్వామివారే
లోకం. తన స్నేహితులు తను కలిసి ప్రతి పౌర్ణమికి కంచికి వెళ్ళి కామాక్షి
అమ్మవారిని మహాస్వామి వారిని దర్శించుకోవడం మొదలుపెట్టారు.
దీని గురించి నా ఆలోచన కొంచం వేరు. నా ఉద్దేశం పీఠాధిపతులను గౌరవిస్తే చాలు. వారిని దేవతలులాగా పూజించవలసిన పని లేదు.
ఇటువంటి
సమయంలో నా స్నేహితుడొకరు పూంపుహార్ ఆర్ట్ శాప్ నుండి ఒక చిన్న దేవి
విగ్రహాన్ని బహూకరించాడు. దీంతో కొత్త వాదనకు బీజం పడింది. ఇంట్లో ‘విగ్రహ
ఆరాధన’ చెయ్యవచ్చా? చెయ్యకూడదా? అని.
దానికంటే ముందు అసలు ఆ విగ్రం ఏ దేవతది? నిశ్చయంగా ఏ దేవతా మూర్తియో చెప్పడానికి కుదరని అవస్థ.
నేను
మా ఆవిడతో “కంచి మహాస్వామి వారిని చూడడానికి వెళ్తావు కదా, ఈ విగ్రహ శిల
దేవతా మూర్తి గురించి ఆయన్ను అడుగు. వారు సరిగ్గా చెబితే నేను వారు
మనుష్యులలో ఉన్న డేవుడని నమ్ముతాను” అని చెప్పాను.
”ఈసారి
మీరూ మాతోపాటు రండి” అని అన్నది. ఏదో శక్తి నాచేత “సరేలే వెళ్దాం” అని
పలికించింది. అందరమూ వెళ్ళాము. చలా మంది భక్తులు వారి దర్శనార్థమై వచ్చారు.
ఒకరితరువాత ఒకరు స్వామి వారిని దర్శించుకొని ముందుకు వెళ్తున్నారు.
కొంతమంది తరువాత మా ఆవిడ వెనకాతల నేను నిలబడి ఉన్నాము. స్వామి వారు తమ
చేతితో నా భార్యను రమ్మని పిలిచారు. తను దగ్గరకు వెళ్ళగానే రెండు చేతులని
పైకెత్తి ఆశీర్వదించారు. వెంటనే తనను “మీ ఇంటికి అఖిలాండేశ్వరి వచ్చింది
కదా?” అని అడిగారు.
కళ్ళ నీరు కారుతుండగా నా భార్య అవునన్నట్టు తల ఊపి, స్వామి వారికి నమస్కారం చేసి నిలబడింది. స్వామివారు తనని ఆపాదమస్తకం చూసారు.
వారి
మాటలు వింటున్న నేను వారి ముందు పడిపోయి, నా ఎనిమిది అంగములు నేలకు
తగిలేట్టు సాష్టాంగం చేసాను. వారిని చూస్తూ నమ్స్కార ముద్రలోకి పోయిన నా
చేతులు చాలా సేపు అలాగే ఉన్నాయి.
మహాస్వామి వారు మళ్ళా మా ఆవిడను పిలిచి ఆశీర్వదించి పంపారు. ఆనాటినుండి నేను పరమాచార్య స్వామి వారికి బానిసను.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment