అమోఘ స్పందన
శ్రీ శైవమహాపీఠం జంటనగరశాఖ ఆధ్వర్యంలో కవాడిగూడా ముదిగొండ
శంకరారాధ్య మఠంలో ఈనెల 16 వ తారరీకున జరిగిన
బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక కార్యక్రమానికి
విషేష స్పందన లభించింది 90మందికి పైగా వధూవరులు వారి వివరాలు నమోదు చేసుకొన్నారు శైవమహాపీఠం జంటనగరశాఖ అధ్యక్షులు శివశ్రీ ఎమ్ వీ ఎమ్
రావుగారు, ఆస్దాన పండితులు అమరనాధ శర్మగారు, శశిభూషన్ గారు, ముదిగొండ
సేనాపతి గారు, శ్రీమతి అనితా కృష్ణ ప్రసాద్ గారు మరియు జంటనగరశాఖ కార్యవర్గ
సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమం ఆద్యంతం ఒక పండుగ వాతావరణంలా జరిగింది
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఆధ్యాత్మిక సలహాదారు
శ్రీయుత ఇష్టకాల రామ్మోహన శర్మగారు కార్యక్రమంలో పాల్గొని ఇటువంటి
కార్యక్రమం జరిపిన జంటనగరశాఖ కార్యవర్గాన్ని అభినందించారు బ్రాహ్మణ సమాఖ్య
తరఫున వారికి వీలైనంత సహాయ సహకారాన్ని అందిస్తామని ప్రకటించారు ఇటువంటి
కార్యక్రమానికి వచ్చిన వధూవరుల తల్లితండ్రులు కూడా ఇంత మంచి ఆలోచనతో
ఇటువంటి కార్యక్రమం జరిపినందుకు చాలా సంతోషం వ్వక్తపరిచారు ఇక్కడ నమోదు
చేసుకొన్న వధూవరుల వివరాలు శైవమహాపీఠం బ్లాగ్ లో ఆన్ లైన్లో లభ్యమయ్యే
ఏర్పాటు చేసినట్లు ఎమ్ వి ఎమ్ రావు గారు తెలిపారు.
https://saivamahapeethammatrimonial.blogspot.in/
No comments:
Post a Comment