20/04/17, 3:31:40 PM: +91 91105 71420/04/17, 3:31:40 PM: +91 91105 71415: దేవాలయం
దేవాలయం అనే వ్యవస్థ ఏర్పడడానికి ప్రధానమైన కారణం మనం ఇంట్లోనూ పూజ చేయవచ్చు, అదే మూర్తిని దేవాలయంలోనూ చూడవచ్చు. ఇంట్లో తీరని కోర్కెలు కొన్ని ఉంటాయి. అవి దేవాలయంలో మాత్రమే తీరతాయి. ఉదాహరణకి గండభేరుండం అంచు పంచె పరమేశ్వరుడు కట్టుకుంటే నిలువెత్తు మూర్తి అంత అంచు పంచెతో దర్శనం ఇస్తే ఒక్కసారి చూడాలని ఉంది. నా ఇంట్లో మూర్తికి కట్టగలనా? నా ఇంట పూజకి ఒక నియమం ఉంటుంది. అంగుష్ఠమాత్రమైన మూర్తియే ఉండాలి ఇంట్లో. ఎలా కడతాను అంచు పంచె? ఎలా తీరుతుంది ఆ కోరిక? పెద్ద వడ్డాణం చిరు గంటలతో అమ్మవారు పెట్టుకుంటే చూడాలని ఉంది. కానీ ఎలా? పెద్ద పల్లకీలో భగవంతుడు వెళ్తుంటే దానిని పట్టుకుని వెళ్లాలని కోరిక. ఎలా తీరుతుంది? నీకు ఇంట తీరని కోర్కెలు తీరడానికి సాధనం దేవాలయం. డబ్బు ఉంటే ఈశ్వరుడికి ఒక పంచెలచాపు, వడ్డాణం, కిరీటం, చేయించవచ్చు. డబ్బు లేనివాడు? ఆ వడ్డాణం పెట్టుకొని ఉండగా అందరూ చూసి మురిసిపోతారు. ఈశ్వరుడికి చేయించి ఈశ్వర సేవ కాదు. అలా చూసి ఎంతమంది మురిసిపోయి అబ్బా నా తండ్రి ఎంత గొప్పగా ఉన్నాడో అని ఇంతమంది పొంగిపోవడానికి కారణం అయ్యావు. అందుకే దేవాలయ వ్యవస్థలో నీయందు ఏ ప్రగాఢమైన విభూతి ఉందో దానిని అక్కడ ఇచ్చి ప్రసాదంగా పంచాలి. గుడిలోపలికి పట్టుకు వెళ్ళేటప్పుడు పులిహోర, చూపించి పట్టుకు వస్తుంటే ప్రసాదం. నీకు నాలుగు పద్యాలు వచ్చు, మంచి విషయాలు చదువుకున్నావు. వాక్య నిర్మాణం చేసే ప్రజ్ఞ ఉంది. పదిమందికి అర్థం అయ్యేటట్లు చెప్పగలిగే శక్తి ఉంది. అప్పుడు దేవాలయంలో కూర్చుని మాట్లాడాలి. పదిమంది యొక్క బుద్ధి వికసనానికి ఈశ్వరుడు ఇచ్చిన వాగ్వైభవం ఆ విభూతిని ఈశ్వరుడికే నైవేద్యం పెట్టి ప్రసాదంగా పంచి పెట్టి తరిస్తున్నావు. నీకు పాట వస్తే రాజోపచారంలో ఈశ్వరుడి దగ్గర పాడాలి. నృత్యం వస్తే ఈశ్వరుడి ముందు రాజోపచారంలో నర్తించాలి. వాయిద్యం మ్రోగించడం వస్తే ఈశ్వరుడి ముందు వాయించాలి. కోలాటం ఆడడం వచ్చు. ఈశ్వరుడు పల్లకీలో వెళ్తుంటే కోలాటం ఆడాలి. నామం చెప్పడం వస్తే ఈశ్వరుడి ముందు నామం చెప్పాలి. ప్రక్కవాడికి అంటుకోకుండా కాగడా పట్టుకోవడం వచ్చు. ఈశ్వరుడి ముందు కాగడా పట్టుకోవాలి. పెద్ద గొడుగును ఈశ్వరుడి మీదనుంచి తొలగకుండా పట్టుకుని నడవడం వచ్చు. ఆ గొడుగు పట్టుకోవాలి. ఇంత ఓపిక లేదు. దేవాలయంలో కూర్చుని చక్కగా భగవన్నామం చెప్పుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆవలిస్తూ నిద్రపోతూ కూర్చోకుండా ఉంటే చాలు. ఆయనయందు మనస్సు పెట్టి జరుగుతున్నటువంటి విషయం మీద దృష్టి పెట్టగలిగితే చాలు. దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చెయ్యి. నమస్కారం చెయ్యి, ప్రసాదాన్ని స్వీకరించు. నీకు ఓపిక ఉంది భక్తులను ఒక క్రమంలో పంపించు. ఓపిక ఉంటే దేవాలయాన్ని తుడు. భగవత్ సేవ చేయాలని ఉంది చక్కగా దేవాలయానికి వెళ్ళి తుడు. అందుకు కదూ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఏడాదికి ఒకసారి మనగుడి అని ఒకసారో రెండుసార్లో చేయించి అలవాటు చేస్తోంది. ఓపిక ఉంటే రెండురోజులకు ఒకసారి వస్తాను ఈశ్వర దేవస్థానంలో వాడిన పాత్ర సామాను అంతా బయట పెట్టి వెళ్ళండి శుభ్రంగా తోమి కడిగి బోర్లించి పెట్టి వెళ్తాను ధగధగలాడుతున్న పాత్ర సామాను మళ్ళీ ఈశ్వరుడికి వాడండి. ఓపిక ఉంటే ఈశ్వరుడికి కట్టిన బట్టలు ఉతికి తెచ్చి ఇస్తాను. ఒక్కొక్క దేవాలయాన్ని నమ్ముకొని ఆ దేవాలయానికి అవసరమైనటువంటి సేవ ఏదో ఒకటి చేస్తారు. అందుకే మన ఇంట మనం పండుగ చేసుకునేటప్పుడు ఇల్లు తుడుచుకొని కడుక్కునే ముందు దగ్గర ఉన్న దేవాలయంలో చేసి మన ఇంట్లో చేసుకోవాలి. అలా చేస్తే తరిస్తాడు. ఏ చిన్న విభూతి ఉండనివ్వండి దేవాలయానికి అర్పణ చేసి తరిస్తారు. రోజూ వెళ్ళి దేవాలయంలో కూర్చుని ఏమైనా చదువుకో. దేవాలయంలో ఉన్న మొక్కలకు నీళ్ళు పోసి పెద్ద చెయ్యి. వాటికి కుదుర్లు కట్టు. అక్కడ గోవులు ఉంటే గోవులకు సేవ చెయ్యి. గోశాల కడుగు, తుడు. గోశాలలో ముగ్గులు వెయ్యి. ఆవులను తుడు, ఆవులకు పసుపు వ్రాయి. ఆవుకు కాస్త బొట్టు పెట్టు. గ్రాసం కనపడితే కోసి పట్టుకు వచ్చి ఆవుకు వెయ్యి. పితృదేవతలు కూడా సంతోషిస్తారు. ఖాళీ సమయం ఉంటే దేవాలయంతో అనుబంధం పెట్టుకో. ఇంటితో ఎలా అనుబంధమో గుడితో అలా అనుబంధం. సాయంకాలం అయింది దేవాలయానికి వెళ్ళి ఏదో ఒక సేవ. బూజులు దులపడం, దీపపు సమ్మెలు సిద్ధం చేయడం, ఒక్కొక్కచో ఆలయం ఐశ్వర్యప్రదమైతే ఉత్సవాలు జరుగుతున్నప్పుడు ఆలయంలో నిద్ర చేస్తారు. అనేకమైన సామానులు బయట పెడతారు. ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. అందుకే రాత్రి ఆలయంలో నిద్ర అన్నా చేస్తారు, లేకపోతే ఆలయానికి కాపు కాస్తారు. అయ్యా పాడ్యమినాడు నేను, నా మిత్రుడు కాపలా ఉంటాం. ఆరోజు రాత్రి పడుకోరు. అది జాగరణ. ఆలయంలో కాపు కాసి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఉన్నా ఇబ్బంది రాకుండా ఆలయ ప్రాంగణం అంతా తిరుగుతూ ఉంటారు. ఆలయాన్ని రక్షించడానికి ఒక నిద్ర వదిలేశావు. ఈశ్వరుడు గుర్తు పెట్టుకుని కాపాడతాడు. సేవ చేయాలి అన్న తాపత్రయం ఉండాలి కానీ అవకాశం లేకపోవడం మాత్రం ఉండదు. అలా రాత్రింబవళ్ళు ఏ సేవ చేద్దాం అంటే నీ ఓపికకు తగినట్లుగా సేవ చేయడానికి అవకాశం ఉన్న కేంద్రం దేవాలయం ఒక్కటే. నీకు డప్పు కొట్టడం వస్తే ఈశ్వరుడు పల్లకీలో వెళ్తుంటే డప్పు కొట్టు. సన్నాయి ఊదడం వస్తే సన్నాయి ఊదు. చెక్క భజన చేయడం వస్తే అది చెయ్యి. చిడతలు వాయించడం వస్తే వాయించు. నువ్వు ఏం చేయగలవో అది చెయ్యి. నేనేం చేస్తానండీ అన్నమాట అనకు. ఏదైనా చేయవచ్చు దేవాలయంలో. కానీ దేవలాయంతో ఒక అనుబంధం ఉండాలి. నా యింటికి వెళ్ళకుండా నేను ఎలా ఉండలేనో అలా ఏదో ఒక దేవాలయంతో నాకు ఆ అనుబంధం ఉండాలి. అది నాది అన్నప్పుడు గోడమీద బూజు కనపడితే గబగబా వెళ్ళి తెచ్చి తీసేస్తావు. దేవాలయంలో ఎవరికో డబ్బు ఇచ్చి చేయించడం కాదు. మన శ్రమదానంతో దేవాలయాన్ని రక్షించుకోవాలి. దేవాలయంలో చేయవలసిన పనులు అంటే ఇవి అని ఉండవు. మన ఓపికను బట్టి ఏమైనా చేయవచ్చు. ఎందుకంటే అది మనం తరించడానికి కేంద్రం గనుక.
15: దేవాలయం
No comments:
Post a Comment