26/03/17,
10:13:51 AM: MVMRAO: 12 రాశుల్లో జన్మించిన జాతకులు ఏ దేవుళ్లకు తాంబూలం
సమర్పించి ప్రార్థించాలో తెలుసా? అయితే ఈ స్టోరీ చదవండి. 12 రాశుల్లో
పుట్టిన జాతకులు రాశి ప్రకారం ఏ దేవునికి తాంబూలం సమర్పించి వేడుకుంటే..
ఈతిబాధలు తొలగిపోతాయనేది తెలుసుకుందాం.. 1. మేషం - తాంబూలంలో మామిడి పండును
ఉంచి మంగళవారంలో కుమారస్వామిని ప్రార్థిస్తే ఈతిబాధలుండవు. 2. వృషభం -
తమలపాకులో మిరియాలు ఉంచి మంగళవారం పూట రాహువును స్తుతిస్తే.. కష్టాలుండవు.
సుఖసంతోషాలు చేకూరుతాయి.
3. మిథునం - తమలపాకులో అరటిపండును ఉంచి బుధవారం ఇష్టదేవతా పూజ చేస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
4. కర్కాటకం- తమలపాకులో దానిమ్మను ఉంచి శుక్రవారం పూట కాళిమాతను ప్రార్థిస్తే కష్టాలు తీరిపోతాయి.
5.
సింహం - తమలపాకులో అరటిపండును ఉంచి గురువారం ఇష్టదేవతా పూజను చేయాలి. 6.
కన్యారాశి - తమలపాకులో మిరియాలు ఉంచి గురువారం ఇష్టదేవతా పూజ చేస్తే..
దుఃఖం దూరమవుతుంది. 7. తులాం రాశి- తమలపాకులో లవంగంను ఉంచి శుక్రవారం పూట
ఇష్టదేవతను స్తుతిస్తే.. అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి.
8. వృశ్చికం- తమలపాకులో ఖర్జూర పండును ఉంచి మంగళవారం పూట ఇష్టదేవతను పూజిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి.
9. ధనుస్సు - తమలపాకులో కలకండను ఉంచి గురువారం పూట ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.
10.
మకరం - తమలపాకులో బెల్లంను ఉంచి శనివారాల్లో కాళిమాతను పూజిస్తే.. కష్టాలు
తీరిపోతాయి. 11. కుంభం - తమలపాకులో నెయ్యిని ఉంచి శనివారం పూట కాళిమాతను
పూజించినట్లైతే.. దుఃఖాలు తొలగిపోతాయి. 12. మీనం - తమలపాకులో పంచదారను ఉంచి
ఆదివారం ఇష్టదేవతను పూజించినట్లైతే సుఖసంతోషాలు చేకూరుతాయి.... శ్రీరమ్యం
శివ శర్మ...
No comments:
Post a Comment