12/04/17, 9:09:10 PM: Prasad: ఆవకేశ్వరుడి నోము:
సూతుడు
సౌనకాది మహామునులతో ముచ్చ్చటిస్తూ ఉండగా, అచటికి నారదమహాముని ఏతెంచారు.
ఋషులందరు నారదమహాముని వినమ్రంగా ప్రణామాలు అర్పించారు. కుసలా
ప్రశ్నలడిగారు. అంత నారదమహాముని సంతసించి ఋషులందరిని ఏమైనా కోరుకొనమనెను.
అంత ఋషివర్యులందరు, ఈవిధముగా కోరుకొనిరి.
బ్రహ్మ
మానస పుత్రా నారద మునీంద్రా, వేసవి కాలమునందు ఆచరించదగిన ఒక గొప్ప
వ్రతమును ఉపదేశించవలసిందిగా కోరుకొనియుంటిరి. అంత నారద మునీంద్రులు ఈ
విధముగా వ్రతవిధానమును విశదీకరించియున్నారు.
వేసవినందు
మానవాళియందఱు విధి తప్పక ఆచరించవలసిన వ్రతముయొకటి ఉన్నది. అదియే ఆవకేశ్వర
వ్రతము. దీనిని ఆచరించినవారికి సంవత్సరపర్యంతము ఉదరసంబంధ వ్యాధులు
ఉండవనియు, శ్వాసకోశ సంబంధవ్యాధులు రావనియు మరియు అతిశీతలము రాదనీ
చెప్పిరి.
వ్రాత విధానము:
ఒకానొక
ఆదివారం పెందలకడనే లేచి కాలకృత్యములు తీర్చుకొని, సంధ్యావందనాదులు
ముగించుకొని, అల్పాహారం గావించి, మీరాలం మందిగాని, మోండా మార్కెట్ గాని,
అదీగాకపోతే ఎర్రగడ్డ రైతు బజారుకి గాని వెళ్లి, ప్రశస్తమైన పుల్లని మరియు
పీచుతో కూడి టెంక కట్టిన మామిడికాయలు కొనవలెను. అదేవిధముగా నల్లకుంటలో
మాత్రమే ఆవపిండి, కారము, నూనె, ఇంగువ, మెంతులు, ఉప్పు మరియు ఇతర
సంబారాములను పైకమునిచ్చ్చి కొని తీసుకురావలెను.
ఇంటికి
వచ్చిన తరువాత, శుభ్రమైన పొడి వస్త్రములు ధరించి మొదటగా మామిడికాయలు ఖండ
ఖండములుగా ఖండించవలెను. ఆ తరువాత కారము, ఆవపిండి, నూనె, ఇంగువ, మెంతులు
కలిపినా మిశ్రమములో మామిడి ఖండాలని కలిపి జాడీలో ఎత్త్తుకొనవలెను.
పూజావిధానం: తయారైన ఆవకాయజాదీను చేతితో పట్టుకొని, ఈ క్రింది స్తోత్ర పథాన చెయ్యాలి.
ఆవాయనమః
కాయాయనమః
ఆవకాయాయనమః
కాయ కాయాయనమః
లవణాసహితాయనమః
జిహ్వానందకరయనమః
నయనానందకరాయనమః
ఉదరానందకరయనమః
ప్రతిదిన ఉదారప్రక్షాళకాయనమః
మిర్చిలవణావసహిత అవకాయాయ నమో నమః
పైమంత్రాలను చదువుకోవాలి.
ముఖ్య
సూచనలు: గుంటూరు ప్రాంతమువారు కారము ఎక్కువగాను, కోనసీమ బ్రాహ్మణులూ ఆవ
ఎక్కువగాను, రాయలసీమవారి నూనె ఎక్కువగాను, శ్రీకాకుళం విశాఖపట్నంవారు అన్నీ
తక్కువగాను వేసుకోవాలి. శ్రీకాకులంవారు బెల్లంకూడా వేసుకోవచ్చును.
సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు
No comments:
Post a Comment