18/04/17, 6:26:05 AM: +91 79811 59026: అమ్మా !
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అంటాం కదా ప్రవర చెప్పేటప్పుడు - ఆ చతుస్సాగరాలు ఏవి? అలా ఎందుకంటాము ?
ఈ ప్రశ్న ఒకరు అడిగారు. దానికి చెప్పిన సమాధానాన్ని మన సభ్యులకోసం పంపుతున్నాను. 🙏🌹
మీరడిగిన
- ప్రవరలోని - చతుస్సాగర పర్యంతాం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అన్న దానిని
కాస్త పరిశీలించాలి. ఒకప్పుడు భూభాగం మొత్తం భారతదేశమే ! అంబరీష చక్రవర్తి
ని కానీ ఏ రాజులను తీసుకున్నా వారందరూ నాలుగు వైపులా సముద్రాల తో
పరివేష్టించబడి ఉన్న యావద్భూమండలాన్నీ పరిపాలించిన చక్రవర్తులుగా
శాస్త్రాలలో, కావ్యాలలో వర్ణించబడి ఉంది. నాలుగు వైపులా సముద్రాలు
వడ్డాణ్ణంగా కలిగిన భూభాగానికి చక్రవర్తులు ఆ నాటి రాజులు.
కానీ
ఆ తరువాత భూమిలో ఎన్నో మార్పులొచ్చాయి. ఒకప్పుడు ఉన్న నాలుగు సముద్రాలు
తరువాత సప్త సాగరాలయ్యాయి. సప్త ద్వీపాలు ఏర్పడ్డాయి. అవే తరువాత 13
ద్వీపాలయ్యాయి, తరువాత 18 ద్వీపాలయ్యాయి. సగర చక్రవర్తి కుమారులు 60 వేల
మంది తవ్వితే ఏర్పడిన సాగరమొకటి వచ్చింది. ఇప్పటి మన భారతదేశానికి ఉత్తరం
వైపున ఉన్న సముద్రం లోంచి ఎన్నో లక్షల ఏళ్ళ క్రితమే హిమాలయ పర్వతాలు
పైకొచ్చాయి. ఈ ప్రపంచంలో భూభాగం తక్కువ, జలభాగమే ఎక్కువ.
ఇప్పుడు
నాలుగు సముద్రాలే లేకపోయినా, మన పూర్వీకులు సర్వమానవ సంక్షేమం కోసం చెప్పే
ప్రవరను మాత్రం ఇప్పటికీ అలాగే చెప్తూ భూమండలంలోని సర్వ మానవులకూ శుభం
కలగాలని, చతుస్సాగర పర్యంతం - అంటే నాలుగు వైపులా సముద్రాలతో
పరివేష్టించబడిన భూమి లో ఉన్న సర్వ మానవులకూ శుభం కలగాలని, గోవులకు,
బ్రాహ్మణులకు శుభం కలగాలని కాంక్షించి పరమాత్మ ని ప్రార్థిస్తున్నారు.
గోవులు శుభంగా ఉంటేనే, గోవుల వల్ల లభించే పంచగవ్యాలతో యజ్ఞయాగాది
క్రతువులుచేసి, గో క్షీరము, గోఘృతము, గోదధి, మొదలైన ద్రవ్యాలతో
ఈశ్వరాభిషేకం చేసి, దేవతలని తృప్తి పరచి, ప్రకృతి ని, పరిసరాలను రక్షించి,
ప్రాణికోటి కి శుభం కలిగిస్తున్నారు. బుధ్ధిబలానికి, జ్ఞానానికి,
నియమబధ్ధమైన జీవితానికి ప్రతీకలు బ్రాహ్మణులు. వారు క్షేమం గా ఉంటే, వారు
సర్వ మానవాళీ క్షేమం గా ఉండేలా చేస్తారు. కనుకే ఉపనయనం జరిగిన ప్రతి
వ్యక్తీ ఇలా సంకల్పం చెప్పుకుని, ప్రవర చెప్పుకునీ సంధ్యావందనం చేస్తారు;
బ్రాహ్మణులు ఈ ప్రవరతో, సంకల్పం తో ఆశీర్వదిస్తారు, మందిరాలలో -
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాస్సమస్తాస్సుఖినో భవంతు అని సంకల్పం
చెప్తారు.
🙏🌹
No comments:
Post a Comment