18/04/17, 8:37:24 AM: +91 80088 84529: కుంకుమ – కుంకుమపువ్వు
ఒకసారి
పరమాచార్యస్వామి వారి దేహం వేడేక్కిపోయింది. ఎక్కువగా ఉన్న కఫం వల్ల
వారికి ఊపిరి సరిగ్గా అందటంలేదు. ఎప్పుడూ వారిని పరీక్షించే వెంగుడి
వైద్యులు మొందులు వాడమని చెప్పారు. కాని స్వామి వారు వాటిని తీసుకోవడానికి
నిరాకరించారు. వారి జ్వరం ఎంతకూ తగ్గడం లేదు. కఫం కూడా చాలా ఎక్కువ
అవుతూఉంది.
ఎప్పుడూ
దర్శనానికి వక్చే ఒక మహిళ స్వామి వారి దర్శనానికి వచ్చింది. మహాస్వామి వారి
పరిస్థితిని చూసి, గంధం తీసే పలక పైన కుంకుమపువ్వును అరగదీసి సన్నని మంటపై
కాచి స్వామివారికి ఇచ్చింది. అప్పుడు మాహాస్వామి వారు మేనాలో కూర్చుని
ఉన్నారు. మహాస్వామి వారిపై అమిత భక్తితో ఆ భక్తురాలు ఆ ఖరీదైన ఔషధం
సమర్పించింది.
అది చాలా
సామాన్య వస్తువుగా పరిగణిస్తూ, ఆకుదొప్పలో ఉన్న ఆ చూర్ణాన్ని తీసుకుని
మేనాలో ఒక మూలన పెట్టారు. కామాక్షి అమ్మవారు శ్రీమఠం వైపు ఏదో ఉత్సవ
సందర్భంగా ఊరెరిగింపుగా వస్తున్నారు.
ఆ
భక్తురాలితో స్వామి వారు, “మఠం ముందుకు కామాక్షి వచ్చింది. వెళ్ళి
దర్శించుకోరాదా?” అని చెప్పారు. స్వామి వారి అనుమతితో ఆ భక్తురాలు అమ్మవారి
దర్శనానికి బయటకు వెళ్ళింది. ఆవిడ అలా వెళ్ళగానే ఒక పేద యువతి వచ్చింది.
ఆమే చేతుల్లో ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఛాతీలో ఏర్పడిన రక్త చలన
దోషము వలన ఊపిరి అందక ఆరాటపడుతున్నాడు. “పిలాడికి చాలా రొంపి చేసింది. నాకు
మందులు కొనే స్థోమత లేదు. సామి కొద్దిగా వీభూతి ఇవ్వండి” అని ఏడుస్తూ
ప్రార్థించింది.
మరుక్షణమే
మహాస్వామివారు మేనాలో ఉన్న కుంకుమపువ్వు మిశ్రమాన్ని ఆమెకు ఇచ్చి ఇంటికి
వెళ్ళిన తరువాత రోజుమొత్తంలో బాబు నుదురుపై రెండు మూడు సార్లు పూయమని
చెప్పారు. వెళ్ళేటప్పుడు వీధులలో ఉన్న ధూళి అందులో పడవచ్చు, కనుక దానిపై
కొంగు మూసుకుని వెళ్ళమన్నారు. వెంటనే ఆ యువతి వెళ్ళిపోయింది.
వెంటనే
వారు మేనాలో ఉన్న కొంచం కుంకుమ తీసుకుని దాన్ని నీళ్ళలో ముద్దగా చేసి
నుదురుపై రాసుకున్నారు. అది చూడదానికి కుంకుమపువ్వు చూర్ణం రాసినట్టుగా
ఉంది.
కామాక్షి
దర్శనానికి వెళ్ళిన ఆ మహిళ తిరిగి వచ్చి మేనా వద్ద నిలుచుంది. పరమాచార్య
స్వామి వారి నుదురుపై ఎర్రటి చారికలు చూసి, “ఈశ్వరా! నేను తెచ్చిన
కుంకుమపువ్వు మిశ్రమాన్ని పరమాచార్య స్వామి వారు నుదురుపై రాసుకున్నారు”
అనుకొని చాలా సంతోషించి మరుసటి రోజు స్వామి వారి దర్శనానికి వచ్చింది.
మహాస్వామి వారు “నువ్వు ఇచ్చిన కుంకుమపువ్వు మిశ్రమం వల్ల కఫం తగ్గింది జ్వరం కూడా లేదు” అని అన్నారు.
ఆ
భక్తురాలు చాలా ఆనందపడింది. పరమాచార్య స్వామి వారు అబద్దమాడలేదు. వారు “నా
కఫం జ్వరం తగ్గింది” అని అనలేదు. పిల్లాడికి తగ్గిందన్న విషయం చెప్పారు.
మొత్తనికి ఆవిడ ఇచ్చిన ఔషదం ఉపయోగపడింది. ఆ భక్తురాలి విశ్వాసాన్ని, అనన్య
భక్తిని పొగడడానికి ఇక వేరే సందర్భం ఏముంటుంది?
కాని
ఈ లీలను చూసిన పరిచారకులకు మాత్రమే తెలుసు ఖరీదైన కుంకుమపువ్వు చూర్ణం ఒక
పేద పిల్లవాడి బాధను పోగొట్టిందని. ఈ దైవరహస్యాలు తెలుసు కాబట్టే వాటిని
అనుభవాలుగా చెప్పుకుంటున్నారు వారు.
--- శ్రీమఠం బాలు మామ, మహాపెరియవళ్ దరిశన అనుభవంగళ్
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment