23/04/17, 3:47:23 PM: +91 91603 86447: *ధర్మ సూక్ష్మాలు*
84 లక్షల జీవరాసులలో మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది. ఎన్నో జన్మల పుణ్య ఫలం వలన ఈ జన్మ లభించినది. దీన్ని సార్ధకం చేసుకోండి.
ఉదయం నిద్రలేవగానే కుడి అరచేతిని చూసి నమస్కారం చేసుకోండి.
ఏ
మానవుడు కూడా జనసంచారం లేని పాడుపడ్డ ఇళ్ళలో, స్మశానానికి దగ్గరలో,
నాలుగువీధుల నడుమ, చీకటి ప్రదేశంలో, పాము పుట్టల దగ్గర , తల్లిదగ్గర, అక్క
చెల్లెలు దగ్గర, పరస్త్రీల దగ్గర నిద్రించకూడదు.
ఇద్దరు
బ్రాహ్మణుల మధ్య ,బ్రాహ్మణునికి అగ్నికి మధ్య ,భార్య భర్తల మధ్య,
గురుశిష్యుల మధ్య , నందిశంకరుల మధ్య, ఆవు దూడ ల మధ్య దాటుట వలన,నడవడం వలన
పూర్వపుణ్యం నశించును.
సహపంక్తి భోజనం చేయుచుండగా మధ్యలో లేచి వెళ్ళినచో బ్రహ్మ హత్యాపాతకం సంభవించును.
*భోజనం చేయుటకు ముందుగా, భోజనం అయిన తర్వాత* పాదప్రక్షాళన చేయనిచో దరిద్రం సంభవించును.
దీపం లేకుండా రాత్రిపూట భుజిన్చరాదు.
సంధ్యాకాలంలో భోజనం, నిద్ర, చదువు ,దానము, భార్యా సంగమము, ప్రయాణం చేయరాదు. ఒకవేళ చేసినచో దరిద్రం, వ్యాధి, మరణం సంభవిస్తాయి.
భోజనమునకు తూర్పు , పశ్చిమ , దక్షిణ దిక్కులు ఉత్తమమైనవి. భోజనము చేయునపుడు నేయి అభిఘారించకుండా భుజించరాదు.
భోజనమునకు ముందు ఉప్పు వడ్డించినచో కీర్తి ,తేజస్సు హరించును.
ప్రతి మానవుడు త్రిపుండములు(విభూతి) ధరించవలెను. దానివలన భూత ,ప్రేత,పిశాచ భాదలు వుండవు.
దేవాలయాలలో , పడవలలో , తీర్ధములలో, పెళ్ళిళ్ళలో , సభలలో , యగ్జ్న యాగాదులలో ఇతరులును తగిలినా దోషములేదు,.
భార్య
గర్భవతి అయినపుడు భర్త *సముద్ర స్నానము , క్షవరము, ౬పర్వతారోహణము ,
కుమారునికి ఉపనయనము , చావులుకు వెళ్ళుట, నూతులు తవ్వుట, చెట్లు కొట్టుట ,
ఇల్లు కట్టుట , కొబ్బరికాయ కొట్టుట* పనికిరాదు.
సూర్యోదయమునకు ఏ తిధి వుండునో ఆ రోజు చేయు స్నాన , దాన, జప, వ్రత , పూజా కార్యక్రమములన్నిటికి సంకల్పములో ఆ తిధే చెప్పవలెను.
సంక్రమణ కాలమందు , శ్రాద్ధదినములందు , జన్మదినములందు, అశ్ర్పుస్య స్పర్శ లందు , వేడినీటి స్నానం చేయరాదు.
భోజనము చేయు కంచము పట్టుకుని, ఒళ్ళోపెట్టుకుని , కంచము పట్టుకుని తిరుగుతూ, మంచములమీద కూర్చుని భుజించరాదు.
నీటిని త్రాగునప్పుడు చిన్న పాత్రలోనికి తీసుకుని *కూర్చుని మాత్రమే* త్రాగవలెను.
జపము పూజాది కార్యక్రమములలో నోటిలో ఏ పదార్దములు నములుతూ క్రతువు చేయరాదు. అలా చేసినచో అది ఉచ్చిస్టము అగును.
అనుష్ఠానపరులు మంచినీరు నోటిలో ఎత్తి పోసుకుని తాగరాదు, పెదవులకి తగిలించుకొని (కరుచుకుని) త్రాగవలెను.
No comments:
Post a Comment