*🌹 రుద్ర నమకము - చమకము - భావము మీకు తెలుసా? 🌹*
*భాగము 2*
*🌴రుద్రము - నమకము🌴*
*🌻 అనువాకము 1 - 1🌻*
*దీనిలో మొత్తం 15 మంత్రములు కలవు.*
*1వ మంత్రము.*
*నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః.*
*నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తేనమః.*
*ఓ రుద్రుఁడా! నీ కోపమునకు నమస్కారము. నీ కోపము నా బాహ్యాంతశ్శత్రువులపైన ప్రవర్తించును గాక. (నన్ను బాహ్యాంతశ్సత్రుహీనునిగా చేయుదువు గాక అని భావము) అంతే కాదు. నీ బాణమునకు, ధనుస్సునకు ధనుర్బాణ సహితములైన నీ బాహువులకు ఇదే నా నమస్కారము.*
*2వ మంత్రము.*
*యాత ఇషుశ్శివతమా శివం బభూవ తే ధనుః.*
*శివాశరవ్యా యాతవతయానో రుద్ర మృడయ.*
*ఓ రుద్రుఁడా! నీ యీ శరము చాలా శాంతమైనదాయెను. నీ ధనుస్సు శాంతమైనదాయెను. నీ యమ్ములపొది శాంతమైనదాయెను. కావున శాంతించిన శరీరము తోడను, అమ్ములపొది తోడను మమ్ములను సుఖపరచుము.*
*3వ మంత్రము.*
*యాతే రుద్ర శివా తనూర ఘోరాపాపకాశినీ.*
*తయాన స్తనువా శంతమయా గిరిశంతాభిచా కశీహి.*
*ఓ రుద్రుఁడా! మమ్ములను అనుగ్రహించు నీ శివ యను శరీరము మా పట్ల అఘోరమై యుండును గాక. ఆ నీశరీరము మా పట్ల హింసారూపమైన అనిష్టమును ప్రకాశింప జేయకుండును గాక.(ఇట పాపమనగా హింసా రూపమగు అనిష్టము) ఓ పరమ శివా నీ శరీరము మమ్ములను స్వయముగా హింసింప కుండుటయే కాదు. పరుల వలన యే అనిష్టము కలుగ నీయక కాపాడ వలయును. మమ్ములనెవరును హింసింపకుండ కాపాడవలెను. మాకేపాపములు అంటనీయక కాపాడవలెను. మాలోనేవేని పాపములు, లోపములు ఉన్నచో తొలగింపుము. వానిని బహిర్గతములు కానీయకుము, అని మేము నిన్ను ప్రార్థించు చున్నాము.*
*4వ మంత్రము.*
*యామిషుం గిరిశంతహస్తే బిభర్ష్యస్తవే*
*శివాం గిరిత్ర తాం కురు మాహిగ్ ంసీః పురుషం జగత్.*
*ఓ గిరిశంత! రుద్ర! వైరులపై చిమ్ముటకు నీవు చేత బాణములను దాల్చితివి. కైలాస గిరిని పాలించు ఓ రుద్రుఁడా! శత్రువులను శిక్షించుటకు చేత దాల్చిన నీ యా బాణమును మాపై చిమ్మక, దానిని శాంతము కలదిగ నుంచుము. పురుషులమగు మమ్ములను, మనుష్య వ్యతిరిక్తమై స్థావర జంగమములతో నిండిన యే జగత్తును హింసింపకుము తండ్రీ! అని ప్రార్థించెను.*
*5వ మంత్రము.*
*శివేనవచసాత్వా గిరిశాచ్ఛావదామసి.*
*యధానస్సర్వమి జ్జగదయక్ష్మగ్ ంసుమనా అసత్.*
*మహా శివా! నీవు కైలాసమున నివసించు చున్నావు. నిన్ను జేరుటకు మంగళకరమైన స్తుతు లొనర్చుచు ప్రార్థించుచున్నాను. మాదగు ఈ సర్వ జగత్తు మనుష్య పశ్వాది జంగమములతో నిండి యున్నది. ఈ జంగమ ప్రపంచము నిరోగమై సౌమనస్య సంపన్నమగులట్లు గావింపుము తండ్రీ!*
*6వ మంత్రము.*
*అధ్యవోచ దధివక్తా ప్రథమోదైవ్యోభిషక్.*
*అహీగ్ శ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చ యాతు ధాన్యః*
*మహాదేవా! మాయందరిలో నీతడే యధికుఁడని నిన్నుద్దేశించి చెప్పుటచే నీవే అధివక్తవైతివి. దేవతలలో నీవే ప్రథముఁడవు, ముఖ్యుఁడవు కదా! నీవు దైవ్యుఁడవు(దేవతలనెల్లస్వయముగా పాలింప సమర్థుఁడవు) నిన్ను దలంచి నంతనే సర్వ రోగములును ఉపశమించును. కాన నీవు చికిత్సకుఁడవు. సర్వ సర్పములను, వ్యాఘ్రాదులను, సర్వ రాక్షసులను నశింపజేయువాఁడవు కదా! కావున మమ్ములను కాపాడుము తండ్రీ!*
*7వ మంత్రము.*
*అసౌయస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సుమంగళః.*
*యేచేమాగ్ం రుద్రా అభితో దిక్షు శ్రితాస్సహస్రశోవైషాగ్ ంహేడఈమహే.*
*ఏ రుద్రుఁడు ఈ మండలస్థాదిత్య రూపుఁడో అతఁడు ఉదయ కాలమున అత్యంత రక్త వర్ణుఁడాయెను. ఉదయాత్పూర్వము ఇంచుకంత రక్త వర్ణుఁడాయెను. అంతే కాదు ఉదయానంతర కాలమున పింగళ వర్ణుఁడాయెను.ఆయా కాలములందు అతనిలో మిగిలిన వర్ణములు కలవు. అంధకారాదులను నివారించుటచే అత్యంత మంగళ స్వరూపుఁడాయెను. కిరణ రూపులైన ఏ యితర రుద్రులు ఈ భూమిపై నంతటను, తూర్పు మున్నగు దిక్కులందును, వ్యాపించి యున్నారో వారునూ సహస్ర సంఖ్యాకులై కలరు. సూర్య రూపులును, సూర్య రశ్మి రూపులును అగు ఈ రుద్రులకు అందఱకును ఏ క్రోధ సదృశమైన తీక్షణత్వము కలదో దానిని భక్తి నమస్కారాదులతో నివారించు చున్నారము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🙏 ప్రసాద్* Forwarded by Mallaiah

No comments:
Post a Comment